విధుల్లో అలసత్వం వద్దు
విధుల్లో అలసత్వం వద్దు
Published Wed, Aug 10 2016 6:18 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
జిల్లా పంచాయతీ అధికారి శ్రీదేవి
గుంటూరు వెస్ట్: పుష్కర విధుల్లో అలసత్వం పనికి రాదని, తమకు అప్పగించిన పనులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి కె.శ్రీదేవి సిబ్బందికి సూచించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లాలోని పంచాయతీ సెక్రటరీలు, ఈఓపీఆర్‌డీలు, వైద్యసిబ్బందికి సంయుక్తంగా మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల సందర్భంగా తమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పారిశుధ్య పనులను సక్రమంగా నిర్వహించి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు. ఇతర శాఖల అధికారులతో ముఖ్యంగా వైద్య ఆరోగ్య సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సూచించారు. పుష్కర ఘాట్లు, నగర్‌లలో ఏర్పాటు చేసిన ప్రదేశాలలో ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కోరారు. ఫాగింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు వహించాలని అన్నారు. యాత్రికులతో మర్యాదగా వ్యవహరించి వారికి అవసరమైన సేవలను అందించాలన్నారు. వైద్యాధికారి సుధీర్ క్లోరినేషన్ చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మలేరియా విభాగం అధికారి రవీంద్రబాబు, డీఎల్‌పీఓ సత్యనారాయణ, జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 200 మంది పంచాయతీ సెక్రటరీలు, ఈఓపీఆర్‌డీలు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement