వేర్వేరు చోట్ల ఇద్దరి బలవన్మరణం | two people in different places | Sakshi
Sakshi News home page

వేర్వేరు చోట్ల ఇద్దరి బలవన్మరణం

Published Wed, Dec 17 2014 2:07 AM | Last Updated on Sat, Aug 25 2018 5:33 PM

two people in  different places

భువనగిరి అర్బన్  : వేర్వేరు చోట్ల ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. జిల్లాలోని భువనగిరి, పెద్ద అడిశర్లపల్లి మండలాల పరి ధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు.. బీబీనగర్ మండలం మగ్దుంపల్లి గ్రామానికి చెందిన మట్ట వెంకటేష్(25)కు ఏడాదిన్నర క్రితం వివాహం జరి గిం ది. అప్పటి నుంచి అతడు ఏ పని చేయ డం లేదు. దీంతో కుటుంబలో తగాదా లు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన వెంకటేష్ మంగళవారం గ్రామ సమీపంలో గల నాగిరెడ్డిపల్లి- బొమ్మాయిపల్లి మధ్య ఉన్న 9/1 రైలు పట్టాలపై  గుర్తు తెలియని రైలు కింద పడడంతో అక్కడికక్కడే మృతిచెందా డు. స్థానికులు గమనించి రైల్వేపోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటన స్థలాన్ని  రైల్వే ఎస్‌ఐ జానకిరాములు పరిశీలించా రు. మృతుడి జేబులో లభించిన సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలిం చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
 
 పురుగులమందు తాగి...
 పెద్ద అడిశర్లపల్లి: పీఏపల్లి గ్రామ పంచాయతీ పరిధి బాలాజీనగర్‌కు చెందిన మెగావత్ శ్రీరామ్‌కు మిర్యాలగూడ మండలం ఐలాపురం గ్రామానికి చెం దిన బాణోతు జాను, నారమ్మ దంపతుల కూతురు సుజాత(26)తో ఎనిమిదేళ్ల  క్రితం వివాహం జరిగింది. శ్రీరామ్ కొండమల్లెపల్లిలోని చికెన్ సెంటర్‌లో పనిచేస్తుండగా, సుజాత గ్రామంలోనే వ్యవసాయపనులు చూసుకుంటోంది. వీరికి ఆరేళ్లలోపు ఇద్దరు కుమారులు. ఈ ఏడాది ఉన్న ఎకరం పొలంలో పత్తిసాగు చేయగా దిగుబడిరాలేదు. ఆర్థికంగా నష్టపోయి తీవ్ర మనోవేదనకు గురైన సుజాత సోమవారం సాయంత్రం పొ లం వద్దనే పురుగులమందు తాగి ఇంటి కి నడుచుకుంటూ వచ్చింది. ఇంట్లో పడిపోయి నురగలు కక్కుతుండగా ఇరుగుపొరుగు గమనించి భర్తకు సమాచారం ఇచ్చారు. ఆమెను ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా చిల్కమర్రి స్టేజీ సమీపంలో మృతిచెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ కె.కొండల్ రెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement