మమ్మీ.. నన్ను క్షమించు..
♦ అమెరికాలో స్థిరపడిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య?
♦ భువనగిరిలో విషాదఛాయలు
నల్లగొండ : కుటుంబ కలహాలో.. మరో సమస్యో కారణాలైతే తెలియవు కానీ అమెరికాలో స్థిరపడిన ఓ సాఫ్ట్ ఉద్యోగి అమెరికాలో బలవన్మరణానికి ఒడిగట్టి తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చాడు. దీంతో యాదాద్రిభువనగిరి జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాం గ్రామానికి చెందిన గూడూరు బాల్‌రెడ్డి, సుగుణ దంపతులు చాలా ఏళ్ల క్రితం భువనగిరికి వచ్చి స్థిరపడ్డారు.
స్వగ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ ప్రతిరోజు భువనగిరి నుంచి సొంత వాహనంపై వెళ్లి వస్తుండేవారు. బాల్‌రెడ్డికి ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు మధుకర్‌రెడ్డి(37) 14 ఏళ్ల క్రితం ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికా వెళ్లాడు. తదనంతరం అక్కడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఉండిపోయాడు. ఏడేళ్ల క్రితం భువనగిరికి వచ్చి స్వాతిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయనకు నాలుగు సంవత్సరాల కుమార్తె ఉంది. ఈయన కుటుంబ సభ్యులతో కాలిఫోర్నియా రాష్ట్రంలో నివాసం ఉంటున్నాడు.
ఉదయం ఎనిమిది గంటలకు..
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో టిక్కీ ప్రాంతంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న మధుకర్‌రెడ్డి భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8గంటలకు మృతిచెందినట్లు తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం అం దించారు. దీంతో కుటుంబ సభ్యులు మృతికి గల వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా ఫలితం లేదు. మృతిచెందిన సమాచారం అందిన వెం టనే తల్లి సుగుణ మొబైల్‌కు మధుకర్‌రె డ్డి పెట్టిన మమ్మీ నన్ను క్షమించు మే సే జ్‌ను చూసుకున్నారు. అమెరికా కాలమా నం ప్రకారం పగలు సమయంలో పె ట్టి న మేసేజ్ తల్లికి భారత కాలమాన ప్రకా రం అర్ధరాత్రి సమయంలో వచ్చింది.
వారం రోజుల క్రితమే..
మధుకర్‌రెడ్డి ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలో సొంత ఇల్లు కొనుగోలు చేశాడు. విషయం తెలిసిన తండ్రి బాల్‌రెడ్డి వారంరోజుల క్రితమే తన కుమారుడితో ఫోన్‌లో మాట్లాడి డబ్బులు కూడా పంపించాడు. తమ కుమారుడికి ఆర్థిక ఇబ్బందులు లేవని రోదిస్తూ తం డ్రి బాల్‌రెడ్డి చెప్పాడు. తల్లి కి రాత్రి మమ్మీ తనను క్షమించమని రెం డుసార్లు మేసేజ్ పెట్టాడని ఆ మేసేజ్‌ను ఉదయం చూసుకున్నామని చెప్పాడు.
కుటుంబ కలహాతోనేనా?
భువనగిరి మండలం మద్దెలగూడేనికి చెందిన స్వాతిని వివాహం చేసుకున్న అనంతరం మధుకర్‌రెడ్డి కాలిఫోర్నియాకు వెళ్లిపోయాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న వీరి దాంపత్య జీవితం కొంతకాలం పాటు సాఫీగా సాగింది. అనంతరం వీరికి శర్మిష్ట జన్మించింది. ప్రస్తుతం పాపకు నాలుగు సంవత్సరాలు. కొంత కాలంగా దంపతుల మధ్య కలహాలు ఏర్పడినట్లు సమాచారం. కుటుంబ కలహాలతోనే మధుకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
మిన్నంటిన రోదనలు
అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న మధుకర్‌రెడ్డి తల్లిదండ్రులు ఉన్న భువనగిరి పట్టణంలోని నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చి పరామర్శిస్తున్నారు. తల్లిదండ్రులు ఏడుస్తున్న తీరును చూసి బంధుమిత్రులు కంటతడిపెట్టారు. కాలిఫోర్నియాలో ఆత్మహత్య చేసుకున్న మధుకర్‌రెడ్డి మృతదేహం గురువారం భువనగిరికి చేరుకునే అవకాశం ఉంది.