పేదింట్లో వెన్నెల వెలుగు | poor student software job got in us | Sakshi
Sakshi News home page

పేదింట్లో వెన్నెల వెలుగు

Published Sun, Mar 13 2016 3:48 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

పేదింట్లో వెన్నెల వెలుగు - Sakshi

పేదింట్లో వెన్నెల వెలుగు

కష్టాలు దాటి.. కన్నీళ్లు దిగమింగి..
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం
సంపాదించిన  నిరుపేద  విద్యార్థిని
గూడూరు నుంచి విదేశాలకు పయనం
పేదరికాన్ని జరుుంచిన దళిత బిడ్డ
నేటితరం యువతకు ఆదర్శం


తండ్రి సంపాదనతోనే ఇల్లు గడవాలి.. తల్లి కూలీ పనులకు వెళ్తేనే పిల్లల చదువు సాగుతుంది.. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఆమెను కదిలించారుు.. నిరుపేద కుటుంబంలో పుట్టినా ‘పట్టుదలే’ పెట్టుబడిగా ముందుకు సాగింది.. ఆత్మ విశ్వాసాన్ని ఆయుధంగా మలుచుకుని తనకు ఇష్టమైన సాంకేతిక రంగంలో ఆరు అంకె ల జీతంతో ఉద్యోగం సంపాదించింది.. కష్టపడితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని నేటి తరానికి చాటి చెప్పింది. మారుమూల గ్రామం నుంచి విదేశాలకు వెళ్లి సాఫ్ట్‌వేర్ రంగంలో రాణిస్తున్న దళిత విద్యార్థిని ఓరుగంటి వెన్నెల సక్సెస్ స్టోరీ ఈ వారం ప్రత్యేకం.   - పాలకుర్తి

 పాలకుర్తి : పాలకుర్తి మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన ఓరుగంటి వెంకటయ్య-అయిలమ్మ దంపతులకు నలుగురు సంతానం. ఇందులో ముగ్గురు ఆడ పిల్లలు, ఒక అబ్బాయి ఉన్నారు. అరుుతే  వెంకటయ్యకు తగినంత ఆస్తిపాస్తులు లేకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన వ్యవసాయ బావులపై క్రేన్ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన భార్య అరుులమ్మ కూడా భర్తతోపాటు పనులకు వెళ్లి కుటుంబపోషణకు సహకరించేది. కాగా, వెంకటయ్య పెద్ద కూతురు వెన్నెలకు చిన్నప్పటి నుంచే కంప్యూటర్ రంగంపై ఎక్కువ ఆసక్తి ఉండేది. ఉన్నత చదువులు చదివి సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించాలని ఎన్నో కలలు గని ఆ దిశగా విద్యనభ్యసించింది.

ఆదుకున్న ‘పుల్లారెడ్డి’..
భోజనం సమస్య తీవ్రతరం కావడంతో వెన్నెల తాను చదివే ఇంజినీరింగ్ కళాశాల యజమాని పుల్లారెడ్డి (పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత) ఇంటికి వె ళ్లి బాధను వివరించింది. దీంతో ఆయన హాస్టల్‌లో ఫీజు కట్టి చ దువుకోమని సూచించారు. వాస్తవంగా హాస్టల్‌లో 6 నెలలకు రూ.45,000 ఫీజు ఉంటుం ది. తన దగ్గర అంత స్థోమత లేకపోవడంతో ఒక్కసారిగా ఆమె మానసిక ఆందోళనకు గురైంది. దీంతో వెన్నెల మరోసారి పుల్లారెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా ఆయన హాస్టల్‌లో సగం ఫీజు అరుునా చెల్లించమన్నారు. అరుుతే  తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేదని ఆమె చెప్పింది.

చివరగా మరోసారి ఉదయం పూట వెళ్లి పుల్లారెడ్డి ఇంటి గేటు ఎదు ట కూర్చుంది. ఈ సందర్భంగా మార్నింగ్ వాక్‌కు బయలు దేరిన ఆయన వెన్నెలను చూసి ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగారు. దీంతో ఆమె హాస్టల్ సమస్యను వివరించి తనను ఎలాగైనా ఆదుకోవాలని.. చదువు పూర్తరుున తర్వాత ఉద్యోగంలో చేరి ఫీజు చెల్లిస్తానని చెప్పడంతో పుల్లారెడ్డి కనికరిం చారు. ఈ మేరకు ఆయన ఇంట్లోకి తీసుకెళ్లి స్వీట్లు ఇచ్చి హాస్టల్‌లో చదువుకోమని భరోసా ఇచ్చి పంపారు.

పదో తరగతి వరకు  సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో..
గూడూరు గ్రామంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో వెన్నెల 1వ తరగతి నుంచి 7 వరకు చదివింది. అనంతరం 8 నుంచి 10వ తరగతి వరకు వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివి మంచి మార్కులు సాధించింది. తర్వాత మెదక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కంప్యూటర్ డిప్లొమా కోర్సులో సీటు సంపాదించింది.

 సీనియర్ల సహకారంతో డిప్లొమా పూర్తి..
చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదివిన వెన్నెలకు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు ఇంగ్లిష్ మీడియంలో ఉండడంతో కొంత ఇబ్బంది ఎదురైంది. దీంతో తాను కోర్సు చదవలేనని తండ్రి వీరయ్యకు లేఖ రాసింది. దీంతో ఆయన కళాశాలకు వచ్చి కూతురుకు ధైర్యం చెప్పి ప్రోత్సహించారు. ఇటు తండ్రి.. అటు సీనియర్ల సహకారంతో వెన్నెల రెండేళ్ల కోర్సును విజయవంతంగా పూర్తి చేసింది.

 ఎన్‌జేసీపీలో బీటెక్‌లో చేరిక..
పాలిటెక్నిక్ కోర్సు పూర్తరుున తర్వాత వెన్నెల.. ఉస్మానియూ యూనివర్సిటీ పరిధిలోని హైదరాబాద్ ఎన్‌జేసీపీ కళాశాలలో బీటెక్  కంప్యూటర్స్‌లో చేరింది. అరుుతే జేఎన్‌టీయూకి సంబంధించిన కళాశాలలో చదివితే మంచి భవిష్యత్ ఉంటుందని తోటి స్నేహితులు ఇచ్చిన సలహా మేరకు ఆమె వెంటనే నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలకు మారింది. అరుుతే ఈ సమయంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ భోజనంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ప్రైవేట్ హాస్టల్‌లో ఉండి చదువుకుంటానని ఆమె తండ్రికి చెప్పింది.

క్రమశిక్షణతో చదువుకోవాలి..
పేదరికంలో పుట్టినప్పటికీ చిన్నప్పటి నుంచి నేను క్రమశిక్షణతో చదువుకున్నా. తల్లిదండ్రులు, స్నేహితులతోపాటు చుక్కా రామయ్య, పుల్లారెడ్డి సార్‌లు అందించిన సహకారంతో బీటెక్‌ను విజయవంతంగా పూర్తి చేశాను. దళిత కుటుంబంలో పుట్టిన నేను విదేశాల్లో ఉద్యోగం చేయడం ఆనందంగా ఉంది. క్రమశిక్షణతో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి మంచి భవిష్యత్ ఉంటుంది.  - వెన్నెల

 వెన్నెల పెద్ద కొడుకుగా తోడుంటుంది..
నేను, నా భార్య గ్రామాల్లో వ్యవసాయ బావుల పూడిక తీసే వృత్తి చేస్తూనే నలుగురు పిల్లలను చదివించాం. మేము ఊహించిన దాని కంటే పిల్లలు మంచిగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. వెన్నెలకు ఉద్యోగం రాగానే చెల్లెళ్లు, తమ్ముడి చదువుతోపాటు కుటుంబ పోషణ భారం తన భుజాలపై వేసుకుంది. వెన్నెల ఇంటికి పెద్ద కొడుకుగా మాకు తోడుంటుంది. తమిళనాడుకు చెందిన వ్యక్తితో ఇటీవలనే ఆమెకు పెళ్లి జరిపించాం. మా పిల్లల భవిష్యత్‌కు దోహదపడిన క్రేన్ నడుపుకునే వృత్తిని ఎన్నటికీ మరిచిపోం. ఇప్పటికీ పరిసర గ్రామాల్లో బావుల పూడిక తీసే పనులు చేస్తున్నాం.  - ఓరుగంటి వెంకటయ్య

తొలుత కిరిటీ సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగం..
హాస్టల్‌లో ఉండి చదువుకుంటూనే వెన్నెల లీడ్ ఇండియా 20-20 ఫౌండేషన్ బాలభారతి కార్యక్రమంలో వలంటీర్‌గా  పనిచేసింది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఎదిగితేనే దేశం అభివృద్ధి చెందుతుందనే నినాదంతో పనిచేస్తున్న సంస్థ కాన్సెప్ట్‌నకు ఆమె ఆకర్షితురాలై అందులో చేరింది. అలా అందులో పనిచేస్తూనే బీటెక్ పూర్తి చేసింది. తొలుత కిరీటి సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది.

చుక్కా రామయ్య సార్ సహకారం..
హాస్టల్ సమస్యను వెన్నెల.. తండ్రికి వివరించడంతో ఆయన గ్రామంలోని గాండ్ల విశ్వనాథం అనే వ్యక్తి వద్దకు వెళ్లి చెప్పా రు. దీంతో ఆయన ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యకు ఉత్తరం రాసి ఇచ్చి కలువమని వెన్నెలకు చెప్పారు. ఈ మేరకు ఆమె చుక్కా రామయ్యను కలిసి తనకు అకామిడేషన్, మంచి భోజన సౌకర్యం ఉండే హాస్టల్ కావాలని విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో ఆయన లీడ్ ఇండియా ఫౌండేషన్ నిర్వాహకుడు డాక్టర్ ఎన్‌బీ సుదర్శన్ ఆచార్యను కలవమని సూచించారు. దీంతో వెన్నెల అక్కడికి వెళ్లగా లీడ్ ఇండియూ ఫౌండేషన్ స్కూల్ నిర్వాహకులు ఆమెకు అకామిడేషన్‌తో పాటు ఉచిత భోజనం సౌకర్యం కల్పించారు. అరుుతే ఏడాది తర్వాత స్కూల్‌ను కళాశాలకు అనుసంధానం చేయడంతో నిర్వహణ బాధ్యతలు మారాయి. దీంతో వెన్నెలకు మళ్లీ అకామిడేషన్, భోజనం సమస్య ఎదురైంది.

 అమెరికాలో 4 వేల డాలర్ల వేతనం..
కిరీటిలో పనిచేసిన కొద్దికాలం తర్వాత వెన్నెల.. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లిమిటెడ్  కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేరింది. అనంతరం హెచ్ వన్ బీ వీసా ప్రాసెస్‌లో టాటా కన్సల్టెన్సీ తరపున అమెరికాలోని డలవేర్ కంపెనీలో 16 నెలల క్రితం ఉద్యోగంలో చేరింది. ప్రస్తుతం ఆమె నెలకు 4 వేల డాలర్ల (సుమారు రూ. 2 లక్షల) వేతనం పొందుతోంది. వెన్నెల ఒక చెల్లెలు రజిత ఐసీఐసీఐ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తుంది. మరో చెల్లెలు డిగ్రీ, తమ్ముడు బీటెక్ చదువుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement