Poor student
-
పేద విద్యార్థులకు అండగా నాట్స్ అధ్యక్షుడు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి జన్మభూమి రుణం కొంత తీర్చుకోవడానికి ముందుడుగు వేశారు. తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా పెదనందిపాడులో ప్రతిభగల పేద విద్యార్ధులకు అండగా నిలిచారు. తాను చదువుకున్న కళశాలలో ప్రస్తుతం అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి మెరిట్ స్కాలర్షిప్లు అందించారు. పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళశాలలో ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్ధుల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్ధులకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున స్కాలర్షిప్లను అందించారు. కళాశాల పూర్వ విద్యార్థి బాపయ్య చౌదరి నాట్స్ అధ్యక్షునిగా ఎన్నికై తాను చదువుకున్న కళాశాలలోనే పేద విద్యార్థులకు సహాయ,సహకారాలు అందించడం మరెందరో పూర్వ విద్యార్థులకు స్ఫూర్తిదాయకం అని పలువురు అభినందించారు. మెరిట్ స్కాలర్షిప్లు అందుకున్న విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిభ గల విద్యార్ధులను మెరిట్ స్కాలర్‌షిప్‌లతో ప్రోత్సాహిస్తున్న నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి నూతిని నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ బోర్డు సభ్యులు ప్రత్యేకంగా ప్రశంసించారు. (చదవండి: వైట్‌హౌస్‌లో అడుగడుగున మోదీకి ఘన స్వాగతం) -
పేద విద్యార్థికి సాయం.. కేఎల్ రాహుల్ మంచి మనసు
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఒక పేద విద్యార్థికి సహాయం చేసి తన పెద్ద మనసు చాటుకున్నాడు. విషయంలోకి వెళితే.. హుబ్బళ్లి పరిధిలోని మహాలింగపురకు చెందిన అమృత్ మావినకట్టి అనే విద్యార్థి పీయూసీలో 600కు గాను 571 మార్కులు సాధించాడు. పై చదువులకు డబ్బులు లేక, దాతల కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో హుబ్బళ్లికి చెందిన నితిన్ అనే వ్యక్తి అమృత్‌ను ఓ ప్రైవేట్ కాలేజీలో చేర్చేందుకు ప్రయత్నించారు. బీకాంతో పాటు సీఏ కోర్సులో చేరేందుకు ఏడాదికి రూ.85 వేలు చెల్లించాల్సి ఉంది. దీంతో నితిన్ తన స్నేహితుడు అక్షయ్ సాయం కోరాడు. కేఎల్ రాహుల్‌కు మిత్రుడైన అక్షయ్ విద్యార్థి సమస్యను ఆయనకు వివరించారు. వెంటనే స్పందించిన రాహుల్.. ఫీజులతో పాటు పుస్తకాల కొనుగోలు, ఇతర అవసరాలకు సరిపడా డబ్బులను నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. కేఎల్ రాహుల్ సాయం తనకు అందిందని.. అతని అండతో ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానంలో నిలవడానికి ప్రయత్నిస్తానని విద్యార్థి అమృత్ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2023లో ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో రాహుల్ సీజన్ మధ్యలోనే వైదొలిగాడు. అదే నెలలో బీసీసీఐ అనుమతితో భార్య అతియా శెట్టితో కలిసి జర్మనీకి వెళ్లిన కేఎల్ రాహుల్ మోకాలి సర్జరీ చేయించుకున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో రీహాబిటేషన్‌లో ఉన్న అతను ఎప్పుడు మళ్లీ క్రికెట్లోకి అడుగుపెడతాడనేది క్లారిటీ లేదు. అయితే అక్టోబర్ -నవంబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. KL Rahul has financially helped a deserving (95%) student named Amrut Mavinkatti, who lost his mother from Mahalingapura to study B. Com at Hubballi’s KLE College through Akshay Sir. Man With Golden Heart @KLRahul 🥺❤ pic.twitter.com/6xcT9pEsx6 — KLRAHUL TRENDS™ (@KLRahulTrends_) June 11, 2023 చదవండి: కోహ్లి అలా చేస్తాడని అస్సలు ఊహించలేదు.. అది అతడికే తెలియాలి: గంగూలీ -
పనికొద్దు.. ఆ డబ్బులు నేనే ఇస్తా..
తగరపువలస (భీమిలి)/విశాఖపట్నం: ఇంటిలో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో స్కూల్‌కు వెళ్లకుండా వెల్డింగ్ పనికి వెళ్లిన ఓ విద్యార్థికి డీఈవో చంద్రకళ అండగా నిలిచారు. పనికెళ్తే వచ్చే డబ్బులు తానే ఇస్తానని, చక్కగా చదువుకోవాలని హితవు పలికారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆనందపురం జెడ్పీ హైస్కూల్‌ను డీఈవో చంద్రకళ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో వసతులు, సిలబస్ బోధనపై అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం, నాణ్యత, రుచిపై ఆరా తీశారు. చదవండి: కిరాతక దుశ్చర్య.. కూరతో భోజనం పెట్టలేదని.. అనంతరం పదో తరగతి విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. హాజరుకాని వారి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా గొంప లోకేశ్వరరావు అనే విద్యార్థి ఆర్థిక ఇబ్బందులతో వెల్డింగ్ షాపులో పనికి వెళ్తున్నట్టు తెలుసుకున్నారు. వెంటనే ఆనందపురం కూడలిలో లోకేశ్వరరావు పనిచేస్తున్న వెల్డింగ్‌షాపు వద్దకు ఉపాధ్యాయులు సాయంతో వెళ్లి మాట్లాడారు. చదువు కోసం ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను వివరించారు. మధ్యలో చదువు ఆపేయవద్దని కోరారు. పదో తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు వెల్డింగ్ పనులకు వెళ్తే ఎంత వేతనం వస్తుందో ఆ మొత్తం తాను సమకూరుస్తానని ఆమె భరోసా కల్పించారు. అలాగే హాస్టల్లో ఉండి చదువుకునేలా చర్యలు తీసుకుంటానని లోకేశ్వరరావుకు హామీ ఇచ్చారు. ఆమె వెంట ప్రధానోపాధ్యాయుడు బి.శ్రీనివాసరావు ఉన్నారు. -
ఎంపీ ఎంవీవీ ఉదారత.. పేద విద్యార్థి చదువుకు రూ.2 లక్షల సాయం
సాక్షి, దొండపర్తి(విశాఖ దక్షిణ): పేద విద్యార్థి ఉన్నత చదువు కోసం రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేసి ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ తన గొప్ప మనసును చాటుకున్నారు. చెన్నై ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నిర్వహించిన బీటెక్(ఈసీఈ) ప్రవేశ పరీక్షలో నగరానికి చెందిన జి.శ్రీకాంత్ మెరిట్లో అడ్మిషన్ సాధించాడు. ప్రవేశానికి రూ.3 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉంది. జర్నలిస్టుగా ఉన్న తన తండ్రికి అంత స్తోమత లేకపోవడంతో శ్రీకాంత్ యూనివర్సిటీలో చేరలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ ఎంవీవీ రూ.2 లక్షలు సాయం చేశారు. అంతేకాకుండా యూనివర్సిటీ వీసీతోపాటు పెరంబదూర్ ఎంపీతో మాట్లాడి ఫీజులో రూ. లక్ష రాయితీ ఇప్పించి శ్రీకాంత్ బీటెక్ చదువుకు మార్గం సుగమం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎప్పుడూ అండగా ఉంటానని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. -
రెండు కిడ్నీలు ఫెయిల్.. ఆదుకుంటే చదువుకుంటా
చండూరు: నిరుపేద కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. పెద్ద చదువులు చదివి ఉన్నత ఉ ద్యోగం చేయాలన్న ఆ విద్యార్థిని కోరికకు అనారోగ్య సమస్యలు అడ్డంకిగా మారాయి. వివరాలు.. నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని కస్తాల గ్రామానికి చెందిన దోనాల భూపాల్‌రెడ్డి, ప్రేమలత దంపతులు 15 ఏళ్ల కిందట బతుకుదెరువు నిమిత్తం చండూరు పట్టణానికి వలస వచ్చారు. బ్యాంక్ రుణం సహాయంతో ఇక్కడే ఓ చిన్న ఇల్లు తీసుకున్నారు. చదవండి: మరుగుదొడ్డిలో నివాసం.. ‘సాక్షి’ చొరవతో సుజాతకు పక్కా ఇల్లు రైతుల నుంచి పాలు కొనుగోలు చేసి పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ పాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. ఇటీవల పెద్ద కుమార్తె పెళ్లి చేయగా, కుమారుడు చదువుకుంటున్నాడు. కాగా రెండో కుమార్తె గాయత్రి 8 ఏళ్ల క్రితం అనారోగ్యంపాలైంది. హైదరాబాద్‌లోని అనేక కార్పొరేట్ ఆస్పత్రుల్లో చూపించారు. రూ.18 లక్షలకు పైగా ఖర్చు చేసిన తర్వాత గాయత్రి రెండు కిడ్నీలు చెడిపోయినట్లు వైద్యులు చెప్పారు. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’ దీంతో మందులు వాడుతూ కాలం వెళ్లదీస్తోంది. ప్రతినెలా రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు మందులకు ఖర్చవుతుందని, పాల వ్యాపారంలో వచ్చే ఆదాయం ఇల్లు గడవడానికే సరిపోతోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. మందులు తెచ్చేందుకు అప్పు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు లేక రెండు నెలలుగా మందులు వాడడం లేదని, దీంతో గాయత్రి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుందని, దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కిడ్నీల మార్పిడికి లక్షలు ఖర్చువుతుందని వైద్యులు చెబుతుండడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. అనారోగ్యంతోనే డిగ్రీ పూర్తి నడవలేని స్థితిలో ఉండి కూడా గాయత్రి నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో డిగ్రీ మైక్రో బయాలజీ పూర్తి చేసింది. వారంలో రెండు, మూడు రోజులు బస్సులో కళాశాలకు వెళ్లి వచ్చేది. తీవ్ర జ్వరం ఉన్నా సరే పరీక్షలు రాసి మొదటి ర్యాంకులో పాస్ అయ్యింది. ఉన్నత చదువులు చదువుతా నాకు ఉన్నత చదువులు చదువుకోవాలనే కోరిక ఉంది. కానీ ఆరోగ్యం బాగోలేక ఇబ్బంది పడుతున్నా. డబ్బులు లేక ఇటీవల మందులు కూడా వాడడం మానేశా. అక్క పెళ్లికి చేసిన అప్పు అలానే ఉండటంతో అమ్మానాన్న ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేక తమ్ముడు చదువు మానేసి కొన్ని రోజులు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఎవరైనా దాతలు స్పందించి ఆర్థికసాయం చేస్తే మా కుటుంబ కష్టాల నుంచి బయటపడుతుంది. - గాయత్రి -
మంచి గవర్నర్... భోజనం పెట్టి; ల్యాప్‌టాప్ ఇచ్చి
నందిగామ: ఓ పేద విద్యార్థికి గవర్నర్ తమిళిసై చేయూతనిచ్చారు. అతడి ఆర్థిక దుస్థితికి చలించి కడుపునిండా భోజనం పెట్టి ఓ ల్యాప్‌టాప్ అందజేశారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన బియ్యని ప్రమోద్ మొయినాబాద్ సమీపంలోని జోగినపల్లి బీఆర్ ఫార్మసీ కళాశాలలో ఫార్మ్ డి తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిం చే ‘మై గవర్నమెంట్ యాప్’లో క్విజ్ పోటీలలో పాల్గొంటుంటాడు. అతడికి ల్యాప్‌టాప్ కొనే ఆరి్థక స్థోమత లేకపోవడంతో తన సమస్యను వివరిస్తూ రాజ్‌భవన్‌కు మెయిల్ చేశాడు. దీంతో ఆదివారం గవర్నర్ కార్యాలయం నుంచి అతడికి పిలుపు వచ్చింది. సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ చేతుల మీదుగా ల్యాప్‌ట్యాప్‌ను అందుకున్నాడు. చదవండి: విమర్శించిన వారి నోళ్లు మూతపడ్డాయి: గవర్నర్ -
పేద విద్యార్థికి రాహుల్ లేఖ
భోపాల్ : ప్రతిభను అడ్డుకునే శక్తి పేదరికానికి, కుటుంబ ఆర్థిక పరిస్థితులకు లేదని నిరూపించాడు ఓ విద్యార్థి. పీలికలు ఏరుకుని జీవనాన్ని సాగిస్తున్న ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన పేద విద్యార్థి ఆశారాం చౌదరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జోద్‌పూర్‌కు ఎంపికై ఔరా అనిపించాడు. విద్యార్థి ప్రతిభను మెచ్చుకుంటూ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభినందనలు తెలుపుతూ ఓ లేఖను రాశారు. ‘ఉన్నత విద్యాసంస్థలో ప్రవేశం పొందినందుకు ఆశారాంకు అభినందనలు. మహాత్మ గాంధీ చెప్పినట్లు.. శక్తి అనేది శారీరక చర్య నుంచి రాదు. చరగని సంకల్పం నుంచి వస్తుంది. అన్ని సవాళ్లు ఎదుర్కొని మంచి ర్యాంక్ సాధించారు. భవిష్యత్తు తరాలకు నువ్వు మర్గదర్శకుడివి కాగలవని నాకు నమ్మకం ఉంది’ అంటూ రాహుల్ లేఖలో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ కూడా ఆశారాంకు అభినందనలు తెలిపారు. తన చదువుకు అవసరైన ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అందిస్తామని సీఎం ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని దీవాస్ జిల్లా మారుమూల గ్రామానికి చెందిన ఆశారాం ఆల్ ఇండియా స్థాయిలో 707 ర్యాంక్, ఓబీసీ కేటగిరిలో 141 ర్యాంకు సాధించారు. గ్రామంలో కనీసం కరెంట్ సౌకర్యం కూడా లేకున్నా, దీపం సహాయంతో చదువుకున్ని జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచాడు. తనకు చదువుకోడానికి డబ్బులు లేకున్న తండ్రి పీలికలు ఏరి ఆ డబ్బుతో తనను చదివించాడని ఆశారం తెలిపారు. మొదటి ప్రయత్నంలో ఈ ర్యాంకును సాధించినట్లు ఇరవైఏళ్ల ఆశారాం వెల్లడించారు. -
నీకు చదువెందుకురా..పెళ్లి చేసుకో!
సత్తుపల్లి రూరల్: ‘ప్రైవేట్ పాఠశాలలు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలు ముద్దు..’ అని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తోంది.. అయితే, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం జిల్లా పరిషత్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న వికలాంగ విద్యార్థి సంపంగి చిలకల ముత్యాలరాజుకు ఎదురైన అనుభవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. సోమవారం ఆ విద్యార్థి పాఠశాలకు వెళ్లగా.. కొందరు ఉపాధ్యాయులు నీవు వికలాంగుడివి.. నీకు చదువెందుకురా? నిన్ను స్కూల్లో నుంచి తీసివేశాం.. నీవు ఇంటికి వెళ్లు.. అని పంపించారని విలేకరులకు తెలిపాడు. అంతేకాకుండా నీ వయసుకు పెళ్లి చేసుకుని ఇంట్లో ఉండు.. నీకు వచ్చే వికలాంగ పింఛన్లతో నీవు, నీ భార్య బతకండి.. అని హేళనగా మాట్లాడారని వాపోయాడు. విషయాన్ని మంగళవారం తన తండ్రి వాసుకు చెప్పాడు. తండ్రి వాసు విలేకరులతో మాట్లాడుతూ.. తన సోదరుడి కొడుకును కూడా ఇలాగే ఇబ్బంది పెట్టారని, అతడు ఇప్పుడు పాఠశాలకు వెళ్లకుండా మామిడి తోటలు నరికే పనికి వెళ్తున్నాడని.. ఇలా ఉపాధ్యాయులు పేద పిల్లలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించాడు. తమ పిల్లలను అవమానపరిచేలా మాట్లాడిన ఆ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. సత్తుపల్లి ఎంఈవో, డీఈవో, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు. ఈ విషయమై ఎంఈవో బి.రాములును వివరణ కోరగా.. విద్యార్థి తండ్రి వాసు ఎంఈవో కార్యాలయంలో ఫిర్యాదు చేశాడని.. ఈ విషయాన్ని డీఈవో దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. -
పేద విద్యార్థికి ఆర్థిక సాయం
హిందూపురం రూరల్ : మండలంలోని మిట్టమీదపల్లి గ్రామానికి చెందిన అజయ్ అనే పేద విద్యార్థికి కిరికెర సహకార సంఘం అధ్యక్షుడు బేవనహళ్లి ఆనంద్ శుక్రవారం రూ.5 వేలు ఆర్థికసాయం చేశారు. ఇంటర్మీడియట్లో 947 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన అజయ్ హిందూపురంలోని బిట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాగా విద్యాభ్యాసం కోసం విద్యార్థి తండ్రి ఆర్థికసాయం కోరగా ఆనంద్ స్పందించి రూ.5 వేల నగదు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు మల్లేష్, బాబు, మనోజ్ తదితరులు ఉన్నారు. -
పేదింట్లో వెన్నెల వెలుగు
♦ కష్టాలు దాటి.. కన్నీళ్లు దిగమింగి.. ♦ అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం ♦ సంపాదించిన నిరుపేద విద్యార్థిని ♦ గూడూరు నుంచి విదేశాలకు పయనం ♦ పేదరికాన్ని జరుుంచిన దళిత బిడ్డ ♦ నేటితరం యువతకు ఆదర్శం తండ్రి సంపాదనతోనే ఇల్లు గడవాలి.. తల్లి కూలీ పనులకు వెళ్తేనే పిల్లల చదువు సాగుతుంది.. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఆమెను కదిలించారుు.. నిరుపేద కుటుంబంలో పుట్టినా ‘పట్టుదలే’ పెట్టుబడిగా ముందుకు సాగింది.. ఆత్మ విశ్వాసాన్ని ఆయుధంగా మలుచుకుని తనకు ఇష్టమైన సాంకేతిక రంగంలో ఆరు అంకె ల జీతంతో ఉద్యోగం సంపాదించింది.. కష్టపడితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని నేటి తరానికి చాటి చెప్పింది. మారుమూల గ్రామం నుంచి విదేశాలకు వెళ్లి సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తున్న దళిత విద్యార్థిని ఓరుగంటి వెన్నెల సక్సెస్ స్టోరీ ఈ వారం ప్రత్యేకం. - పాలకుర్తి పాలకుర్తి : పాలకుర్తి మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన ఓరుగంటి వెంకటయ్య-అయిలమ్మ దంపతులకు నలుగురు సంతానం. ఇందులో ముగ్గురు ఆడ పిల్లలు, ఒక అబ్బాయి ఉన్నారు. అరుుతే వెంకటయ్యకు తగినంత ఆస్తిపాస్తులు లేకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన వ్యవసాయ బావులపై క్రేన్ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన భార్య అరుులమ్మ కూడా భర్తతోపాటు పనులకు వెళ్లి కుటుంబపోషణకు సహకరించేది. కాగా, వెంకటయ్య పెద్ద కూతురు వెన్నెలకు చిన్నప్పటి నుంచే కంప్యూటర్ రంగంపై ఎక్కువ ఆసక్తి ఉండేది. ఉన్నత చదువులు చదివి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించాలని ఎన్నో కలలు గని ఆ దిశగా విద్యనభ్యసించింది. ఆదుకున్న ‘పుల్లారెడ్డి’.. భోజనం సమస్య తీవ్రతరం కావడంతో వెన్నెల తాను చదివే ఇంజినీరింగ్ కళాశాల యజమాని పుల్లారెడ్డి (పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత) ఇంటికి వె ళ్లి బాధను వివరించింది. దీంతో ఆయన హాస్టల్లో ఫీజు కట్టి చ దువుకోమని సూచించారు. వాస్తవంగా హాస్టల్లో 6 నెలలకు రూ.45,000 ఫీజు ఉంటుం ది. తన దగ్గర అంత స్థోమత లేకపోవడంతో ఒక్కసారిగా ఆమె మానసిక ఆందోళనకు గురైంది. దీంతో వెన్నెల మరోసారి పుల్లారెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా ఆయన హాస్టల్లో సగం ఫీజు అరుునా చెల్లించమన్నారు. అరుుతే తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేదని ఆమె చెప్పింది. చివరగా మరోసారి ఉదయం పూట వెళ్లి పుల్లారెడ్డి ఇంటి గేటు ఎదు ట కూర్చుంది. ఈ సందర్భంగా మార్నింగ్ వాక్కు బయలు దేరిన ఆయన వెన్నెలను చూసి ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగారు. దీంతో ఆమె హాస్టల్ సమస్యను వివరించి తనను ఎలాగైనా ఆదుకోవాలని.. చదువు పూర్తరుున తర్వాత ఉద్యోగంలో చేరి ఫీజు చెల్లిస్తానని చెప్పడంతో పుల్లారెడ్డి కనికరిం చారు. ఈ మేరకు ఆయన ఇంట్లోకి తీసుకెళ్లి స్వీట్లు ఇచ్చి హాస్టల్లో చదువుకోమని భరోసా ఇచ్చి పంపారు. పదో తరగతి వరకు సోషల్ వెల్ఫేర్ స్కూల్లో.. గూడూరు గ్రామంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో వెన్నెల 1వ తరగతి నుంచి 7 వరకు చదివింది. అనంతరం 8 నుంచి 10వ తరగతి వరకు వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివి మంచి మార్కులు సాధించింది. తర్వాత మెదక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కంప్యూటర్ డిప్లొమా కోర్సులో సీటు సంపాదించింది. సీనియర్ల సహకారంతో డిప్లొమా పూర్తి.. చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదివిన వెన్నెలకు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు ఇంగ్లిష్ మీడియంలో ఉండడంతో కొంత ఇబ్బంది ఎదురైంది. దీంతో తాను కోర్సు చదవలేనని తండ్రి వీరయ్యకు లేఖ రాసింది. దీంతో ఆయన కళాశాలకు వచ్చి కూతురుకు ధైర్యం చెప్పి ప్రోత్సహించారు. ఇటు తండ్రి.. అటు సీనియర్ల సహకారంతో వెన్నెల రెండేళ్ల కోర్సును విజయవంతంగా పూర్తి చేసింది. ఎన్జేసీపీలో బీటెక్‌లో చేరిక.. పాలిటెక్నిక్ కోర్సు పూర్తరుున తర్వాత వెన్నెల.. ఉస్మానియూ యూనివర్సిటీ పరిధిలోని హైదరాబాద్ ఎన్జేసీపీ కళాశాలలో బీటెక్ కంప్యూటర్స్‌లో చేరింది. అరుుతే జేఎన్టీయూకి సంబంధించిన కళాశాలలో చదివితే మంచి భవిష్యత్ ఉంటుందని తోటి స్నేహితులు ఇచ్చిన సలహా మేరకు ఆమె వెంటనే నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలకు మారింది. అరుుతే ఈ సమయంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ భోజనంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ప్రైవేట్ హాస్టల్లో ఉండి చదువుకుంటానని ఆమె తండ్రికి చెప్పింది. క్రమశిక్షణతో చదువుకోవాలి.. పేదరికంలో పుట్టినప్పటికీ చిన్నప్పటి నుంచి నేను క్రమశిక్షణతో చదువుకున్నా. తల్లిదండ్రులు, స్నేహితులతోపాటు చుక్కా రామయ్య, పుల్లారెడ్డి సార్లు అందించిన సహకారంతో బీటెక్‌ను విజయవంతంగా పూర్తి చేశాను. దళిత కుటుంబంలో పుట్టిన నేను విదేశాల్లో ఉద్యోగం చేయడం ఆనందంగా ఉంది. క్రమశిక్షణతో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి మంచి భవిష్యత్ ఉంటుంది. - వెన్నెల వెన్నెల పెద్ద కొడుకుగా తోడుంటుంది.. నేను, నా భార్య గ్రామాల్లో వ్యవసాయ బావుల పూడిక తీసే వృత్తి చేస్తూనే నలుగురు పిల్లలను చదివించాం. మేము ఊహించిన దాని కంటే పిల్లలు మంచిగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. వెన్నెలకు ఉద్యోగం రాగానే చెల్లెళ్లు, తమ్ముడి చదువుతోపాటు కుటుంబ పోషణ భారం తన భుజాలపై వేసుకుంది. వెన్నెల ఇంటికి పెద్ద కొడుకుగా మాకు తోడుంటుంది. తమిళనాడుకు చెందిన వ్యక్తితో ఇటీవలనే ఆమెకు పెళ్లి జరిపించాం. మా పిల్లల భవిష్యత్‌కు దోహదపడిన క్రేన్ నడుపుకునే వృత్తిని ఎన్నటికీ మరిచిపోం. ఇప్పటికీ పరిసర గ్రామాల్లో బావుల పూడిక తీసే పనులు చేస్తున్నాం. - ఓరుగంటి వెంకటయ్య తొలుత కిరిటీ సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగం.. హాస్టల్లో ఉండి చదువుకుంటూనే వెన్నెల లీడ్ ఇండియా 20-20 ఫౌండేషన్ బాలభారతి కార్యక్రమంలో వలంటీర్‌గా పనిచేసింది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఎదిగితేనే దేశం అభివృద్ధి చెందుతుందనే నినాదంతో పనిచేస్తున్న సంస్థ కాన్సెప్ట్‌నకు ఆమె ఆకర్షితురాలై అందులో చేరింది. అలా అందులో పనిచేస్తూనే బీటెక్ పూర్తి చేసింది. తొలుత కిరీటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. చుక్కా రామయ్య సార్ సహకారం.. హాస్టల్ సమస్యను వెన్నెల.. తండ్రికి వివరించడంతో ఆయన గ్రామంలోని గాండ్ల విశ్వనాథం అనే వ్యక్తి వద్దకు వెళ్లి చెప్పా రు. దీంతో ఆయన ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యకు ఉత్తరం రాసి ఇచ్చి కలువమని వెన్నెలకు చెప్పారు. ఈ మేరకు ఆమె చుక్కా రామయ్యను కలిసి తనకు అకామిడేషన్, మంచి భోజన సౌకర్యం ఉండే హాస్టల్ కావాలని విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో ఆయన లీడ్ ఇండియా ఫౌండేషన్ నిర్వాహకుడు డాక్టర్ ఎన్బీ సుదర్శన్ ఆచార్యను కలవమని సూచించారు. దీంతో వెన్నెల అక్కడికి వెళ్లగా లీడ్ ఇండియూ ఫౌండేషన్ స్కూల్ నిర్వాహకులు ఆమెకు అకామిడేషన్‌తో పాటు ఉచిత భోజనం సౌకర్యం కల్పించారు. అరుుతే ఏడాది తర్వాత స్కూల్‌ను కళాశాలకు అనుసంధానం చేయడంతో నిర్వహణ బాధ్యతలు మారాయి. దీంతో వెన్నెలకు మళ్లీ అకామిడేషన్, భోజనం సమస్య ఎదురైంది. అమెరికాలో 4 వేల డాలర్ల వేతనం.. కిరీటిలో పనిచేసిన కొద్దికాలం తర్వాత వెన్నెల.. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేరింది. అనంతరం హెచ్ వన్ బీ వీసా ప్రాసెస్‌లో టాటా కన్సల్టెన్సీ తరపున అమెరికాలోని డలవేర్ కంపెనీలో 16 నెలల క్రితం ఉద్యోగంలో చేరింది. ప్రస్తుతం ఆమె నెలకు 4 వేల డాలర్ల (సుమారు రూ. 2 లక్షల) వేతనం పొందుతోంది. వెన్నెల ఒక చెల్లెలు రజిత ఐసీఐసీఐ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తుంది. మరో చెల్లెలు డిగ్రీ, తమ్ముడు బీటెక్ చదువుతున్నారు. -
వీడు సామాన్యుడు కాదు..
వీడు తొమ్మిదేళ్ల బుడతడు. పనికిరాని చెక్క ముక్కలతో చేసిన బల్లపై నోటు పుస్తకాలను పెట్టుకొని తదేక దృష్టితో హోం వర్క్ చేసుకుంటున్నాడు. పక్కనున్న మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్ కిటికీ గుండా పడుతున్న వెలుతురే వీటికి లైట్. ఆ లైట్ ఆరిపోక ముందే వీడు హోంవర్క్ పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే వీడి ఇంట్లో లైట్ లేదు. అసలు కరెంటే లేదు. వీడుంటున్నది అసలు ఇల్లే కాదు. ఫొటోలో వెనకాల కనిపిస్తున్న పాల్తిన్ కవర్‌తో చుట్టిన షెడ్డులాంటి ప్రాంతమే వీడిల్లు. చదువుకోవడం, రాసుకోవడం పూర్తయ్యాక.. హోంవర్క్‌కు ఉపయోగించుకున్న బల్లనే తీసుకెళ్లి తన ఇల్లు కాని ఇంట్లో వేసుకొని పడుకొంటాడు. పొద్దున్నేలేచి ఎనిమిది గంటలకల్లా స్కూల్లో ఉంటాడు. వర్షం, చలి, ఎండ దేన్ని లెక్కచేయకుండా అదే ఇంట్లో ఉంటాడు. రాత్రిపూట అదే రెస్టారెంట్ వెలుతురులో చదువుకుంటాడు. వీడి తల్లి ఓ చిన్న రెస్టారెంట్ యజమాని ఇంట్లో పాచి పని చేస్తుంది. ఆ వచ్చిన కాస్త డబ్బులతో ఆమె వీడితోపాటు మరో ఇద్దరి పిల్లలను పోషించాలి. ముగ్గురి పిల్లల్లో వీడికే చదువంటే ప్రాణం. ఉదయం స్కూల్‌కు వెళితే మళ్లీ స్కూల్ అయిపోయాక సాయంత్రమే ఇంటికి రావడం. మధ్యాహ్న భోజనాన్ని పట్టించుకోడు. ఏదో నేరం చేసి జైలుకెళ్లిన వీడి తండ్రి మూడేళ్ల క్రితం జైల్లో అతిసారా వ్యాధితో మరణించాడు. అంతకుముందు వీడి కుటుంబానికి ఓ చిన్నపాటి ఇల్లు ఉండేది. ఐదేళ్ల క్రితం అది అగ్నిప్రమాదంలో ఖాళీపోయింది. అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ చిన్నప్పుడు వీధి దీపాల కిందనే చదువుకొని అంతపైకి వచ్చాడనే విషయాన్ని వీడి స్కూల్లో బోధించారో, లేదో తెలియదుగానీ, తప్పనిసరి పరిస్థితుల్లో వీడు అలాంటి పరిస్థితుల్లోనే చదువుకుంటున్నాడు. అబ్రహాం లింకన్ అంత పెద్దవాడు కావాలని వీడికి లేదుగానీ ఓ డాక్టరో, పోలీసు ఆఫీసరో కావాలన్నది వీడి కోరిక. వీడి పేరు డేనియల్ క్యాబ్రెరా. తల్లిపేరు క్రిస్టినా ఎస్పినోజా. ఉంటున్న ప్రాంతం ఫిలిప్పీన్స్‌లోని మాండవ్ సిటీ. ఇప్పుడు వీడి చదువుకు ప్రపంచం నలుమూలల నుంచి విరాళాలు వస్తున్నాయి. అది ఎలా జరిగిందంటే..! మెడికల్ టెక్నాలజీ చదువుతున్న 20 ఏళ్ల జాయిస్ టొర్రెఫ్రాంకా అనే యువతి ఓ రోజు వీడి ఇంటి ముందుగా వెళ్తూ రెస్టారెంట్ వెలుతురులో చదువుకోవడాన్ని చూసి చలించిపోయింది. వెంటనే తన సెల్ఫోన్లో ఫొటోలు తీసి సామాజిక వెబ్సైట్లలో అప్లోడ్ చేసింది. ఈ పిల్లాడి నుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందానని, దాంతో ఇప్పుడు తానూ బాగా చదుకుంటున్నానని కామెంట్ పెట్టింది. అంతే.. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫొటో సర్కులేట్ అవుతూ వస్తూనే ఉంది. వీడి ఫొటోతో తాము ఎంతో స్ఫూర్తి పొందామంటూ వెబ్సైట్లలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. వీడి ఫొటో ఇంత సంచలనం సృష్టిస్తుందని తాను భావించలేదని.. తన పేజీ బుక్‌లో అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే ఏడువేల కాపీలు పోస్ట్ అయ్యాయని, వారందరికి థ్యాంక్స్ అని జాయస్ తెలిపారు. వీడి చదువుకు సహాయపడాల్సిందిగా కోరింది. అంతే ప్రపంచవ్యాప్తంగా స్పందనలు వస్తున్నాయి. 'ఈ బుడతడు చేస్తున్న పనిని మనమెందుకు చేయలేం. ఏ సౌకర్యంలేని వీడికి ఇంత శ్రద్ధ ఉంటే అన్ని సౌకర్యాలు కలిగిన మనకెంత శ్రద్ధ ఉండాలి. కాఫీ హౌస్లకెళ్లి, ట్యుటోరియల్స్కెళ్లి టైం వేస్ట్ చేయడం ఇక అనవసరం. వీడిలాగా చిత్తశుద్ధి ఉంటే ఏమైనా సాధించగలం' అని ఈ బుడతడిని స్వయంగా కలుసుకున్న జియోమన్ ప్రాబర్ట్ లాడ్రా అలయాన్ అనే విద్యార్థి సోషల్ వెబ్సైట్లో వ్యాఖ్యానించారు. -
పేద విద్యార్థి చదువుకు సీఎం భరోసా
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఓ నిరుపేద విద్యార్థిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఔదార్యం చూపించారు. నగరంలోని మాదన్నపేటకు చెందిన రేణుక కూరగాయాల వ్యాపారి. ఆమె కుమారుడు రాకేశ్‌కుమార్ బీఫార్మసీలో 59.3 శాతం మార్కులు సాధించాడు. విదేశాల్లో చదివేందుకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నిబంధనల ప్రకారం 60 శాతం మార్కులుంటేనే స్కాలర్షిప్ వస్తుంది. నిరుపేద విద్యార్థి రాకేశ్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీఎం ప్రత్యేక అనుమతితో స్కాలర్షిప్ మంజూరు చేశారు. -
పేద విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ సిటీ క్రైం: హైదరాబాద్ మోతీనగర్ ప్రాంతానికి చెందిన హరీశ్(14) అనే విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మోతీనగర్‌లోని బొబ్బుగూడకు చెందిన రాజేశ్ నిరుపేద కూలీ. ప్రైవేటు స్కూల్ లో చదివించే అవకాశం లేకపోవటంతో కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాడు. కానీ, ప్రైవేటు ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదువుకోవాలన్న కోరిక తీరకపోవటంతో ఆవేదనకు గురై హరీశ్ ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫుడ్ ఫర్ చేంజ్
మీరు తినే తిండి ఓ పేద విద్యార్థి జీవితాన్ని మార్చేస్తుంది. ఎలాగంటారా..! ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు ఆర్థిక భరోసానిచ్చేందుకు ‘ప్రాజెక్ట్ 511’ సంస్థ శ్రీకారం చుట్టింది. దానోత్సవ్లో భాగంగా ప్రముఖ హోటళ్ల సహకారంతో జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం ‘ఫుడ్ ఫర్ చేంజ్’ నిర్వహిస్తుంది. ఇందుకోసం నోవాటెల్, ఐటీసీ, ఆవాస, రాడిసన్, మారియట్ హోటళ్ల చెఫ్‌లందరూ కలిసి 16 రకాల భోజనాలు రెడీ చేస్తున్నారు. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, మెడిటరేనియన్, ఏషియన్... ఇలా డిఫరెంట్ వంటకాల రుచులు వేడివేడిగా వడ్డించేందుకు సిద్ధమవుతున్నారు. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే విందులో ఈ ఐదు హోటళ్లు తమ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. నటి సమంత, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ సహా ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన వెయ్యి మందికి ఆహ్వానం పంపామని ఫుడ్ ఫర్ చేంజ్ కన్వీనర్ సుజిత్ తెలిపారు. దీనికి అందరూ ఆహ్వానితులేనని చెప్పారు. ఒకరికి చార్జి రూ.4,000. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన సొమ్మును ఏడాది పాటు పేద పిల్లల చదువుకు ఖర్చు చేస్తామన్నారు. టికెట్ కావల్సినవారు 9491100000 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. - సాక్షి, సిటీ ప్లస్ -
అమ్మఒడితో భరోసా
జననేత తొలి సంతకం అందరికీ విద్య జిల్లాలో 8 లక్షలమంది విద్యార్థులకు వరం సాక్షి, విజయవాడ : పేదరికం చదువుకి శాపం కాకూడదు. ప్రతి పేదవిద్యార్థి చదువుకోవాలి. చదువుతోనే కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని ప్రగాఢంగా విశ్వసించారు పెద్దాయన. అందుకే ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టగానే విద్యార్థుల భవిత కోసం ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని రూపొందించి ప్రాణం పోశారు. దీంతో లక్షలాది మంది విద్యార్థులు ఇంజినీర్లుగా, డాక్టర్లుగా దేశవిదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలకు ఆలంబనగా నిలిచారు...నిలుస్తున్నారు. కానీ ఆయన మరణానంతరం రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి పాలనలో పథకానికి తూట్లు పోడిచి పూర్తి నిర్వీర్యం చేశారు. మళ్లీ ఆయన తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహనరెడ్డి అధికారంలోకి రాగానే తొలి సంకతకం అమ్మ ఒడి పథకంపైనే అని ప్రకటించారు. తద్వారా ఒకటో తరగతి మొదలుకుని పిజీ వరకు చదువుకునే విద్యార్థుల పాలిట ఈ పథకం వరంలా మారనుంది. ఎన్నికలు ముగిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జిల్లాలో 8లక్షల మంది విద్యార్థులకు పూర్తిగా మేలు జరుగుతుంది. జిల్లాలో 1 నుంచి 10 వతరగతి వరకు 5.89 లక్షల మంది, ఇంటర్ 90వేల మంది ,డిగ్రీ, పీజీ ఇతర కోర్సులు చదివే విద్యార్థులు 1.50 లక్షలు మంది ఉన్నారు. వీరిలో 80శాతం మంది భారీ ఫీజులు చెల్లించే ఆర్థిక స్తోమత లేని వారే. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు దివంగత వైఎస్ రాజశఖరరెడ్డి 2008లో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంబిఎ, ఎంసీఏ తదితర కోర్సులు చదివే విద్యార్థులకు ఫీజులు ప్రభుత్వమే చెల్లించాలని దీనిని రూపొందించి అమలు చేశారు. కానీ గత కిరణ్ సర్కారు మాత్రం దీనిని 70 శాతం మేరకు కుదించి అరకొరగా కొద్ది మందికే దీనిని అమలు చేయడంతో ఫీజులు చెల్లించే స్థోమత లేని అనేక మంది పేద విద్యార్థులు మధ్యలోనే చదువును ఆపివేసిన సంఘటనలు జిల్లాలో అనేకం ఉన్నాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్మెంట్ తదితర అవసరాల కోసం రూ. 6 వేలకోట్లు ఖర్చు పెడతామని వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. అమ్మ ఒడితో 8లక్షల మందికి మేలు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో మేధోమదనం చేసి అచరణకు సాధ్యంగా ఉండేలా అమ్మఒడి అనే బృహత్తర పథకానికి రూపకల్పన చేసింది. పథకం ద్వారా విద్యార్థులను చదివించే బాధ్యతను పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంటుంది. అంతే కాకుండా పిల్లల్ని చదివించినందుకు గానూ తల్లిదండ్రుల్ని ప్రొత్సహించడానికి నెలనెల వారి బ్యాంకు ఖాతాలో నేరుగా కొంత నగదు జమ చేసేలా పథకాన్ని రూపొందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్.జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కాగానే మొదటి సంతకం అమ్మఒడి పథకంపైనే చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. 1నుంచి 10 వతరగతికి ప్రతి నెలా రూ.500 ఇంటర్ రూ.700 డిగ్రీ రూ.1000 చొప్పున విద్యార్థుల తల్లి అకౌంట్లో నేరుగా జమ చేస్తామని ప్రకటించారు. దీంతో జిల్లాలో ప్రస్తుతం 8లక్షల మంది విద్యార్థులకు తక్షణమే మేలు జరగనుంది. దీంతో పాటు జిల్లాలో చదవుకునే విద్యార్థుల సంఖ్య మరింత పెరగనుంది.