హిందూపురం రూరల్ : మండలంలోని మిట్టమీదపల్లి గ్రామానికి చెందిన అజయ్ అనే పేద విద్యార్థికి కిరికెర సహకార సంఘం అధ్యక్షుడు బేవనహళ్లి ఆనంద్ శుక్రవారం రూ.5 వేలు ఆర్థికసాయం చేశారు. ఇంటర్మీడియట్‌లో 947 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన అజయ్ హిందూపురంలోని బిట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
కాగా విద్యాభ్యాసం కోసం విద్యార్థి తండ్రి ఆర్థికసాయం కోరగా ఆనంద్ స్పందించి రూ.5 వేల నగదు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు మల్లేష్, బాబు, మనోజ్ తదితరులు ఉన్నారు.
పేద విద్యార్థికి ఆర్థిక సాయం
Published Fri, Aug 26 2016 11:59 PM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
Advertisement
Advertisement