టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఒక పేద విద్యార్థికి సహాయం చేసి తన పెద్ద మనసు చాటుకున్నాడు. విషయంలోకి వెళితే.. హుబ్బళ్లి పరిధిలోని మహాలింగపురకు చెందిన అమృత్ మావినకట్టి అనే విద్యార్థి పీయూసీలో 600కు గాను 571 మార్కులు సాధించాడు. పై చదువులకు డబ్బులు లేక, దాతల కోసం ప్రయత్నించాడు.
ఈ క్రమంలో హుబ్బళ్లికి చెందిన నితిన్ అనే వ్యక్తి అమృత్‌ను ఓ ప్రైవేట్ కాలేజీలో చేర్చేందుకు ప్రయత్నించారు. బీకాంతో పాటు సీఏ కోర్సులో చేరేందుకు ఏడాదికి రూ.85 వేలు చెల్లించాల్సి ఉంది. దీంతో నితిన్ తన స్నేహితుడు అక్షయ్ సాయం కోరాడు. కేఎల్ రాహుల్‌కు మిత్రుడైన అక్షయ్ విద్యార్థి సమస్యను ఆయనకు వివరించారు.
వెంటనే స్పందించిన రాహుల్.. ఫీజులతో పాటు పుస్తకాల కొనుగోలు, ఇతర అవసరాలకు సరిపడా డబ్బులను నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. కేఎల్ రాహుల్ సాయం తనకు అందిందని.. అతని అండతో ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానంలో నిలవడానికి ప్రయత్నిస్తానని విద్యార్థి అమృత్ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2023లో ఆర్‌సీబీతో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో రాహుల్ సీజన్ మధ్యలోనే వైదొలిగాడు. అదే నెలలో బీసీసీఐ అనుమతితో భార్య అతియా శెట్టితో కలిసి జర్మనీకి వెళ్లిన కేఎల్ రాహుల్ మోకాలి సర్జరీ చేయించుకున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో రీహాబిటేషన్‌లో ఉన్న అతను ఎప్పుడు మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెడతాడనేది క్లారిటీ లేదు. అయితే అక్టోబర్ -నవంబర్‌లో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
KL Rahul has financially helped a deserving (95%) student named Amrut Mavinkatti, who lost his mother from Mahalingapura to study B. Com at Hubballi’s KLE College through Akshay Sir.
— KLRAHUL TRENDS™ (@KLRahulTrends_) June 11, 2023
Man With Golden Heart @KLRahul 🥺❤ pic.twitter.com/6xcT9pEsx6
చదవండి: కోహ్లి అలా చేస్తాడని అస్సలు ఊహించలేదు.. అది అతడికే తెలియాలి: గంగూలీ
Comments
Please login to add a commentAdd a comment