నిరాశపరిచిన కేఎల్‌ రాహుల్‌.. మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేని వైనం | KL Rahul Disappoints In Ranji Match Against Haryana, Out For 26 | Sakshi
Sakshi News home page

నిరాశపరిచిన కేఎల్‌ రాహుల్‌.. మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేని వైనం

Published Thu, Jan 30 2025 1:40 PM | Last Updated on Thu, Jan 30 2025 3:01 PM

KL Rahul Disappoints In Ranji Match Against Haryana, Out For 26

చాలాకాలం తర్వాత రంజీ (Ranji Trophy) బరిలోకి దిగిన కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) తొలి ఇన్నింగ్స్‌లోనే నిరాశపరిచాడు. హర్యానాతో ఇవాళ (జనవరి 30) మొదలైన మ్యాచ్‌లో రాహుల్‌ 26 పరుగులకే ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో రాహుల్‌కు మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రాహుల్‌ 37 బంతుల్లో 4 సొగసైన బౌండరీలు బాది మాంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. అయితే అన్షుల్‌ కంబోజ్‌ ఓ సాధారణ బంతితో రాహుల్‌ను బోల్తా కొట్టించాడు. వికెట్‌కీపర్‌ రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి రాహుల్‌ నిరాశగా పెవిలియన్‌ బాట పట్టాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో రాహుల్‌ బరిలోకి దిగే సమయంలో అభిమానుల కేరింతలతో స్టేడియం దద్దరిల్లింది. ఈ మ్యాచ్‌ రాహుల్‌ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో (బెంగళూరు) జరుగుతుంది. సొంత మైదానంలో రాహుల్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. రాహుల్‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌ ఆశించి వచ్చిన అభిమానులకు నిరాశే ఎదురైంది.  

ఈ ఇన్నింగ్స్‌లో తొలుత రాహుల్‌ను చూసి అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. వరుస పెట్టి బౌండరీలు బాదడంతో భారీ స్కోర్‌ చేయడం ఖాయమని అనుకున్నారు. అయితే వారి ఆశలు అడియాశలయ్యాయి. సూపర్‌ టచ్‌లో కనిపించిన రాహుల్‌ కనీసం హాఫ్‌ సెంచరీ కూడా చేయకుండానే నిష్క్రమించాడు.

ఈ మ్యాచ్‌లో హర్యానా టాస్‌ గెలిచి కర్ణాటకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 17 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద కేవీ అవనీశ్‌ ఔట్‌ కావడంతో కర్ణాటక 45 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం బరిలోకి దిగిన రాహుల్‌.. మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించాడు. 

రాహుల్‌ ఔటయ్యాక దేవ్‌దత్‌ పడిక్కల్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. ఈ లోగా మయాంక్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 40 ఓవర్ల అనంతరం కర్ణాటక స్కోర్‌ 121/2గా ఉంది. మయాంక్‌ 63, పడిక్కల్‌ 9 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రాహుల్‌ను ఔట్‌ చేసిన కంబోజ్‌ అనీశ్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు.

బీజీటీలోనూ నిరాశపరిచిన రాహుల్‌
రాహుల్‌ ఇటీవలికాలంలో వరుసగా విఫలమవుతున్నాడు. తాజాగా ముగిసిన బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో రాహుల్‌ 5 టెస్ట్‌ల్లో కేవలం 2 హాఫ్‌ సెంచరీలు మాత్రమే చేశాడు. గాయాలు, ఫామ్‌ లేమి కారణంగా రాహుల్‌ ఇటీవలికాలంలో తరుచూ జట్టులోకి వస్తూ పోతున్నాడు. 

రాహుల్‌ టీ20 జట్టులో చోటు కోల్పోయి చాలాకాలమైంది. వన్డేల్లోనూ రాహుల్‌ అడపాదడపా ప్రదర్శనలే చేస్తున్నాడు. రాహుల్‌కు బీజీటీ 2024-25లో ఐదు టెస్ట్‌లు ఆడే అవకాశం దక్కినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తొలి టెస్ట్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో (77).. మూడో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో (84) మాత్రమే రాహుల్‌ రాణించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement