ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి జన్మభూమి రుణం కొంత తీర్చుకోవడానికి ముందుడుగు వేశారు. తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా పెదనందిపాడులో ప్రతిభగల పేద విద్యార్ధులకు అండగా నిలిచారు. తాను చదువుకున్న కళశాలలో ప్రస్తుతం అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందించారు.
పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళశాలలో ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్ధుల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్ధులకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున స్కాలర్‌షిప్‌లను అందించారు. కళాశాల పూర్వ విద్యార్థి బాపయ్య చౌదరి నాట్స్ అధ్యక్షునిగా ఎన్నికై తాను చదువుకున్న కళాశాలలోనే పేద విద్యార్థులకు సహాయ,సహకారాలు అందించడం మరెందరో పూర్వ విద్యార్థులకు స్ఫూర్తిదాయకం అని పలువురు అభినందించారు.
మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందుకున్న విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిభ గల విద్యార్ధులను మెరిట్ స్కాలర్‌షిప్‌లతో ప్రోత్సాహిస్తున్న నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి నూతిని నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ బోర్డు సభ్యులు ప్రత్యేకంగా ప్రశంసించారు.
(చదవండి: వైట్‌హౌస్‌లో అడుగడుగున మోదీకి ఘన స్వాగతం)
Comments
Please login to add a commentAdd a comment