
భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన జేఈఈ పరీక్షలో 100 శాతం మార్కులు సాధించిన గుత్తికొండ మనోజ్ఞను ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అభినందించింది. అత్యంత కఠినమైన ఈ పరీక్షలో ఒత్తిడి తట్టుకుని నూటికి నూరు శాతం సాధించిన మనోజ్ఞ తెలుగు విద్యార్ధులందరికి ఆదర్శంగా నిలిచారని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. పట్టుదల.. ఏకాగ్రత ఉంటే ఎంతటి కష్టమైన పరీక్షలనైనా గట్టెక్కవచ్చనేది మనోజ్ఞ నిరూపించిందని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. మనోజ్ఞ సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
జేఈఈ మెయిన్ ఫలితాలలో గుంటూరుకు చెందిన గుత్తికొండ సాయి మనోజ్ఞ ఆలిండియా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. సాయి మనోజ్ఞ 100 పర్సంటైల్ సాధించిన ఏకైక తెలుగు విద్యార్థినిగా నిలిచింది. 14 మందికి మాత్రమే 100 పర్సంటైల్ సాధించారు. గుంటూరులోని భాష్యం జూనియర్ కళాశాలలో మనోజ్ఞ చదువుతోంది.
Comments
Please login to add a commentAdd a comment