వడాయిగూడెం(భువనగిరి అర్బన్) : నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం వడాయిగూడెం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలను తీసుకోవాలన్నారు. త్వరలోనే వడాయిగూడెం గ్రామానికి బీటీరోడ్డును వేస్తామన్నారు. మండలంలోని సూరేపల్లి గ్రామంలో మిషన్‌కాకతీయ రెండవ విడుత పనులను ప్రారంభించారు. అలాగే బొల్లేపల్లి గ్రామంలో ఉన్న శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చేరాలని ఆడ్మిషన్లు పొందే కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు కోట పెద్దస్వామి, అబ్బగాని వెంకట్‌గౌడ్, గోద శ్రీనివాస్‌గౌడ్, సతీష్‌పవన్, రఘురామయ్య, సింగిల్‌విండో చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, నాయకులు డాక్టర్ జడల అమరేందర్, పట్టణ, మండలశాఖ మారగోని రాముగౌడ్, కొల్పుల అమరేందర్, నోముల పరమేశ్వర్‌రెడ్డి, చిందం మల్లికార్జున్, జనగాం పాండు, మొలుగు లక్ష్మయ్య, పుట్ట వీరేష్, బబ్బూరి శంకర్‌గౌడ్ , తదితరులు ఉన్నారు.
సర్పంచ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే
పగిడిపల్లి గ్రామ సర్పంచ్ కట్కూరి భాగ్యమ్మ నివాసానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి బుధవారం వెళ్లారు. ఈ నెల 8న జరిగిన దాడి విషయంపై సర్పంచ్‌ను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన ఆమె కుటుంబ సభ్యులను పరమర్శించారు. అనంతరం భువనగిరి పట్టణంలోని శృతినగర్‌లో జరుగుతున్న ప్రముఖ న్యాయవాది నాగారం అంజయ్య తండ్రి అంత్యక్రియలకు హాజరై మృతదేహంపై పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జడల అమరేందర్‌గౌడ్, రావి సురేందర్‌రెడ్డి, మారగోని రాముగౌడ్, కొల్పుల అమరేందర్, మొలుగు లక్ష్మయ్య, అంజనేయులు, నాగయ్యగౌడ్ తదితరులు ఉన్నారు.
గ్రామాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే
Published Thu, May 12 2016 3:02 AM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM
Advertisement