21వ తేదీ రాత్రి 10.54 నిమిషాల నుంచి 22న ఉదయం 3.42 నిమిషాల వరకు అద్భుత దృశ్యం కన్పించే అవకాశం
భువనగిరి : చంద్రుడు అంతరిక్షంలో పింక్ మూన్‌గా కన్పించే అరుదైన సంఘటన జరగనుందని బహ్రశ్రీ దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాంతి చెబుతున్నారు . వివరాలు ఆయన మాటల్లోనే.. భారత దేశం మొత్తంలో ఈనెల 21వతేదీ పున్నమి రోజు రాత్రి 10.54 నిమిషాల నుంచి 22 వ తేదీ ఉదయం 3.42 నిమిషాల వరకు ఈ అద్భుత దృశ్యం కన్పించనుంది.
రాత్రి 1.24 గంటల నుంచి 12 నిముషాల పాటు చంద్రుడు పూర్తిగా గులాబీరంగులోకి మారుతాడు. సూర్యుడు 0 డిగ్రీల నుంచి 15 డిగ్రీలలోపు మేష రాశిలో అశ్విని నక్షత్రంలో సంచరిస్తున్న సమయంలో దానికి వ్యతిరేక దిశలో 180 డిగ్రీల్లో చిత్ర నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ఈ విధమైన పింక్ మూన్ వస్తుంది. ఇది ఏఫ్రిల్ మాసంలోనే వస్తుంది. అలాగని ప్రతీ ఏప్రిల్ నెలలో మాత్రం రాదు. రెండు మూడు సంవత్సరాలకోసారి వస్తుంది.
విదేశీయులు దీన్ని గ్రహణంగా భావిస్తారు. పౌర్ణమి చంద్రుడి కిరణాలు సోకగానే ప్రతి జీవిలో కొత్త చైతన్యం కలుగుతుంది. మానసిక ఉత్సాహం కలుగుతుంది. సముద్రంలో ఉండే జీవజాలం కూడా ఉత్సాహంగా ఉంటుంది. పింక్ కలర్‌లో చంద్రుడు రావడం శుభసూచకం. గతంలో 2009, 2014 సంవత్సరాల్లో ఏప్రిల్‌లో వచ్చింది. ఇక 2016 ఏప్రిల్ మాసంలో వస్తుంది. మళ్లీ 2018 లో పింక్ మూన్ వస్తుంది. ఈ శుభ సమయంలో ఏ చిన్న పుణ్య కార్యం సంకల్పించినా వెరుు్యరెట్లు అధికంగా లాభం చేకూరుతుందని బృహత్ సంహితలో చెప్పారు.
చంద్రుడు ఆహ్లాదకరమైన మనస్సుకు సంకేతమైన వాడు కాబట్టి పింక్‌మూన్ దర్శనమిస్తున్నసమయం మేషంలో సూర్యుడు, తులలో చంద్రుడు కన్పిస్తున్నాడు. కాబటి చంద్రుడు నీటికి, వృక్షాలకు, ఔషధాలకు నెలరాజు. అందువల్ల పాలకులు వరుణ యాగాలు చేయడం, సామాన్యులు నీటిని దానం చేయడం అంటే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇది పూర్తి శుభ సూచకం ఎలాంటి పనులు చేపట్టినా అతిశీఘ్రంగా ఫలిస్తాయి. ఎలాంటి చెడు ప్రభావాలు ఉండవు. అందరు పింక్ మూన్ ను దర్శించుకోవచ్చని అని సిద్ధాంతి సూచిస్తున్నారు.
పున్నమి రోజున పింక్‌మూన్
Published Wed, Apr 20 2016 1:56 AM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM
Advertisement