Pink Moon
-
పింక్ సూపర్ మూన్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలోనే ఆకాశవీధిలో ఓ అందాల దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ నెల 7న చంద్రుడిలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 7 రాత్రి 8.30 గంటలకు చంద్రుడు భూమి కక్ష్యలోకి మరింత దగ్గరగా వచ్చి, భారీ సైజులో కాంతులీనుతూ కనువిందు చేయనున్నాడు. దీనినే పింక్ సూపర్ మూన్ అని పిలుస్తారు. 2020 సంవత్సరంలో చంద్రుడు అత్యంత పెద్దగా కనిపించే రోజు ఇదే. భారత్లో 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ఈ దృశ్యాన్ని చూడవచ్చునని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్తో ఇంటిపట్టునే ఉన్న ప్రజలు ఈ సూపర్ మూన్ అందాలను పూర్తిగా ఆస్వాదించే పరిస్థితి లేదు. ఎందుకంటే భారత్లో ఉదయం సమయం కాబట్టి సూపర్ మూన్ పూర్తి స్థాయిలో కనిపించే అవకాశాలు తక్కువ ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏమిటీ పింక్ సూపర్ మూన్ పున్నమి రోజుల్లో కనిపించే చంద్రుడు కంటే అత్యంత ప్రకాశవంతంగా, ఇంకా పెద్దగా ఆకాశ వీధిలో అందాల జాబిలి కనువిందు చేయడాన్నే సూపర్ మూన్ అంటారు. భూ కక్ష్యలో చంద్రుడు దగ్గరగా ఉండే స్థానాన్ని పెరోజి అంటారు. ఈ పెరోజీలోకి వచ్చినప్పడు చంద్రుడు మరింత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించి అందరినీ అలరిస్తాడు. సాధారణంగా భూమికి, చంద్రుడికి మధ్య దూరం 3,84,000 కి.మీ. ఉంటుంది. కానీ ఏప్రిల్ 7, 8వ తేదీల్లో ఆ దూరం 3,56,000 కి.మీ. తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితంగా పౌర్ణమి నాడు కనిపించే చంద్రుడి కంటే 14 శాతం పెద్దగా, 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా సూపర్ పింక్ మూన్ దర్శనమిస్తాడు. 20 ఏళ్లలో ఇప్పటివరకు 79 సూపర్ మూన్లు వచ్చాయి. సగటున మూడు నెలలకో సూపర్ మూన్ కనిపిస్తుంది. ఈ ఏడాది నెలకో సూపర్ మూన్ వస్తూనే ఉంది. -
పున్నమి రోజున పింక్మూన్
21వ తేదీ రాత్రి 10.54 నిమిషాల నుంచి 22న ఉదయం 3.42 నిమిషాల వరకు అద్భుత దృశ్యం కన్పించే అవకాశం భువనగిరి : చంద్రుడు అంతరిక్షంలో పింక్ మూన్గా కన్పించే అరుదైన సంఘటన జరగనుందని బహ్రశ్రీ దైవజ్ఞ సుబ్రహ్మణ్య సిద్ధాంతి చెబుతున్నారు . వివరాలు ఆయన మాటల్లోనే.. భారత దేశం మొత్తంలో ఈనెల 21వతేదీ పున్నమి రోజు రాత్రి 10.54 నిమిషాల నుంచి 22 వ తేదీ ఉదయం 3.42 నిమిషాల వరకు ఈ అద్భుత దృశ్యం కన్పించనుంది. రాత్రి 1.24 గంటల నుంచి 12 నిముషాల పాటు చంద్రుడు పూర్తిగా గులాబీరంగులోకి మారుతాడు. సూర్యుడు 0 డిగ్రీల నుంచి 15 డిగ్రీలలోపు మేష రాశిలో అశ్విని నక్షత్రంలో సంచరిస్తున్న సమయంలో దానికి వ్యతిరేక దిశలో 180 డిగ్రీల్లో చిత్ర నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ఈ విధమైన పింక్ మూన్ వస్తుంది. ఇది ఏఫ్రిల్ మాసంలోనే వస్తుంది. అలాగని ప్రతీ ఏప్రిల్ నెలలో మాత్రం రాదు. రెండు మూడు సంవత్సరాలకోసారి వస్తుంది. విదేశీయులు దీన్ని గ్రహణంగా భావిస్తారు. పౌర్ణమి చంద్రుడి కిరణాలు సోకగానే ప్రతి జీవిలో కొత్త చైతన్యం కలుగుతుంది. మానసిక ఉత్సాహం కలుగుతుంది. సముద్రంలో ఉండే జీవజాలం కూడా ఉత్సాహంగా ఉంటుంది. పింక్ కలర్లో చంద్రుడు రావడం శుభసూచకం. గతంలో 2009, 2014 సంవత్సరాల్లో ఏప్రిల్లో వచ్చింది. ఇక 2016 ఏప్రిల్ మాసంలో వస్తుంది. మళ్లీ 2018 లో పింక్ మూన్ వస్తుంది. ఈ శుభ సమయంలో ఏ చిన్న పుణ్య కార్యం సంకల్పించినా వెరుు్యరెట్లు అధికంగా లాభం చేకూరుతుందని బృహత్ సంహితలో చెప్పారు. చంద్రుడు ఆహ్లాదకరమైన మనస్సుకు సంకేతమైన వాడు కాబట్టి పింక్మూన్ దర్శనమిస్తున్నసమయం మేషంలో సూర్యుడు, తులలో చంద్రుడు కన్పిస్తున్నాడు. కాబటి చంద్రుడు నీటికి, వృక్షాలకు, ఔషధాలకు నెలరాజు. అందువల్ల పాలకులు వరుణ యాగాలు చేయడం, సామాన్యులు నీటిని దానం చేయడం అంటే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇది పూర్తి శుభ సూచకం ఎలాంటి పనులు చేపట్టినా అతిశీఘ్రంగా ఫలిస్తాయి. ఎలాంటి చెడు ప్రభావాలు ఉండవు. అందరు పింక్ మూన్ ను దర్శించుకోవచ్చని అని సిద్ధాంతి సూచిస్తున్నారు.