సాక్షి, హైదారాబాద్: తెలంగాణ అసెంబ్లీలో సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని.. మంత్రి తలసాని కాంట్రాక్టర్‌తో పోల్చారు. ఆయన కాంట్రాక్టర్ కాబట్టే కాంట్రాక్టర్లపై మాట్లాడాతారని అన్నారు. దీనిపై స్పందించిన రాజగోపాల్‌రెడ్డి.. పేకాటాడిన వాళ్లు మంత్రులు కావొచ్చని అన్నారు. కాంట్రాక్లర్లు ఎమ్మెల్యేలు కావొద్దా అని ప్రశ్నించారు.
దీంతో అసెంబ్లీ గందరగోళంగా మారింది. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజగోపాల్‌రెడ్డి వెంటనే క్షమాపణలు చేప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. అనంతరం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.
దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సభ లోపల ఎమ్మెల్యేలు.. సభ బయట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీనే అవినీతి పార్టీ అని.. టీఆర్‌ఎస్ పార్టీ కాదని అన్నారు. అవినీతిపై ఆధారాలు ఉంటే ఫిర్యాదు చేయాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment