‘పీజీ మెట్’ పాత్రధారి రాజగోపాల్‌రెడ్డి అరెస్టు | Rajagopal reddy arrested as Lead of PG MET | Sakshi
Sakshi News home page

‘పీజీ మెట్’ పాత్రధారి రాజగోపాల్‌రెడ్డి అరెస్టు

Published Tue, Apr 29 2014 4:39 AM | Last Updated on Sat, Sep 2 2017 6:39 AM

Rajagopal reddy arrested as Lead of PG MET

సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో 2007-2013 మధ్య నాలుగు లీకేజీ కుంభకోణాలకు పాల్పడిన అనంతపురం వాసి రాజగోపాల్‌రెడ్డికి... తాజాగా ఎన్టీఆర్ వర్సిటీ నిర్వహించిన పీజీ మెట్-2014 ప్రశ్నపత్రం లీకేజీలోనూ పాత్ర ఉన్నట్లు సీఐడీ అధికారులు నిర్ధారించారు. దీంతో సోమవారం ఆయనతో పాటు దళారి మాధవరావు, పీజీమెట్‌లో 40వ ర్యాంక్ వచ్చిన చందూమోహన్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. దీంతో ఇప్పటివరకు ఈ స్కామ్‌లో 20 మంది సూత్రధారులు, దళారులతో పాటు 24 మంది ర్యాంకర్లతో కలిపి 44 మందిని అరెస్టు చేసినట్లయిందని సీఐడీ చీఫ్ టి.కృష్ణప్రసాద్ వెల్లడించారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని.. ఈ స్కామ్‌లో మణిపాల్ ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యం, ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారుల పాత్రపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement