ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటాం
చౌటుప్పల్ రూరల్ : అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని లక్కారం మోడల్ స్కూల్‌ను సోమవారం ఆయన సందర్శించారు. రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం అధ్వానంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు అందిస్తున్న భోజనం బాగా లేదని, భోజన ఏజెన్సీపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మందోళ్లగూడెం పంచాయతీ పరిధిలోని సింగరాయిచెర్వు సబ్‌స్టేషన్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.
రైతులు పిలాయిపల్లి కాలువ, సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్‌స్టేషన్ పనులు నత్తనడకన సాగుతున్నాయని అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌తో మాట్లాడి సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చే యిస్తానన్నారు. పిలాయిపల్లి కాలువ నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వల్లే నీళ్లు సరిగ్గా రావడం లేదన్నారు. 6నెలల్లోగా అసంపూర్తి పనులను పూర్తి చేయిస్తానన్నారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీటీసీ సభ్యుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, సర్పంచ్‌లు రిక్కల సుధాకర్‌రెడ్డి, ముటుకుల్లోజు దయాకరాచారి, కానుగు యాదమ్మ, బక్క శంకరయ్య, ఎంపీటీసీ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి, బొబ్బిళ్ల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.