Private institution
-
‘హోదా’గళాలపై అసహనం
‘యువభేరి’కి బస్సులిచ్చారని 3 విద్యాసంస్థలకు నోటీసులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ప్రత్యేక హోదా గురించి మాట్లాడేవారిపై ప్రభుత్వం అణచివేత ధోరణితో వ్యవహరిస్తోంది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించే సభలు, సమావేశాలకు సహకరిస్తున్నారంటూ సంస్థలు, వ్యక్తులపై వేధింపు చర్యలకు దిగుతోంది. ఈనెల 19న విజయనగరంలో జగన్ నిర్వహించిన యువభేరి సదస్సుకు ప్రజలను తరలించేందుకు బస్సులు సమకూర్చారంటూ మూడు స్కూళ్లకు ప్రభుత్వం నోటీసులిచ్చింది. విజయనగరంలోని భాష్యం స్కూల్, శ్రీచైతన్య ఇంగ్లీషు మీడియం స్కూలు, ద సన్ స్కూళ్లకు జిల్లా విద్యాధికారి షోకాజ్ నోటీసులు జారీచేశారు. ప్రయివేటు విద్యాసంస్థలకు సంబంధించి విద్యాశాఖ జారీచేసిన జీవో నెంబర్ 1కి ఇది వ్యతిరేకమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించినందున ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపును ఎందుకు వెనక్కు తీసుకోరాదో తెలపాలంటూ ఆయా సంస్థలకు ఈనెల 20వ తేదీన నోటీసు జారీచేశారు. మూడు రోజుల్లో సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో తమ దగ్గరున్న ఆధారాలతో చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి ఆ నోటీసుల్లో హెచ్చరించారు. -
బాల్యానికి సంకెళ్లు
పొద్దు పోయే వేళకు సీతాకోక చిలుకల్లా రివ్వున వీధిలో దూసుకుపోతూ వెళ్లే చిన్నారులు ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నారు? రాత్రి పూట చందమామను, నక్షత్రాలను అంతులేని ఆశ్చర్యంతో చూసే బాలలు ఎక్కడున్నారు? ఇంటిలోని పూజలు, పండుగల సమయంలో అమ్మానాన్నల వెంటే ఉంటూ వారికి సాయం చేసే కుర్రాళ్లు అరుదైపోయారు కదా..! హోం వర్కులు, క్లాస్వర్కులు, ట్యూషన్లు, కోచింగ్‌లు, క్రికెట్, టీవీ, సినిమాలు, మొబైల్ ఫోన్ల మధ్య అందమైన బాల్యం కనుమరుగైపోతోంది. రాయలేనంత హోం వర్కులు చేయమంటూ, మోయలేనన్ని పుస్తకాలను మోయండంటూ బాల్యాన్ని ఇంటివారే చిదిమేస్తున్నారని చాలా మంది నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచం అంతమైపోతున్నా పట్టించుకోకుండా ఫోన్లో గేములాడే యువత.. అలా మారడానికి కారణం తల్లిదండ్రులు, విద్యా సంస్థలేనని వారి నిశ్చిత అభిప్రాయం. అందమైన బాల్యాన్ని ప్రైవేటు విద్యాసంస్థకు తాకట్టు పెట్టి, చదువు పేరుతో మెదడు నిండా ఒత్తిడి నింపుతున్న వైనంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. - పాలకొండ పాలకొండకు చెందిన ఓ ఉపాధ్యాయుడు తన కొడుకుని పదో తరగతి పరీక్షలు పూర్తి కాగానే విశాఖలోని ఫలితాలు కూడా రాకుండా ఓ కార్పొరేట్ కాలేజీలో చేర్పించడానికి తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లిన నెల రోజుల్లో ఆ కుర్రాడు రెండు సార్లు చనిపోవడానికి ప్రయత్నించాడు. అప్పటికి ఇంకా పది ఫలితాలు విడుదల కాకపోవడం విశేషం. నేటి తరం విద్యార్థులు ఎంతగా ఒత్తిడికి గురవుతున్నారో చె ప్పడానికి ఈ ఉదాహరణ చాలదా. తల్లిదండ్రుల కోణంలో వారు చేస్తున్నది మంచిగానే తోస్తున్నా... విద్యార్థుల కోణంలో మాత్రం అది భరించలేనంత బాధ. ఏటా జిల్లాలో పెరుగుతున్న యువకుల ఆత్మహత్యలే ఈ బాధకు ఉదాహరణలు. రెండేళ్లుగా అయితే ఈ సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం. ఓ అధికారిక నమోదు వివరాల ప్రకారం గత విద్యా సంవత్సరంలో 53 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే అందరూ కార్పొరేట్ కాలేజీ వారే కావడం విశేషం. సర్కారు బడైతే అవమానమా..? ‘పిల్లాడిని పెద్ద స్కూలులో చదివించాలి. ఫీజు ఎంతైనా ప ర్లేదు. అందరూ గొప్పగా మాట్లాడాలి...’ చాలా మంది తల్లిదండ్రుల తీరు ఇలాగే ఉంది. బడాయికి పోయి పిల్లాడిని ఏదో ఒక ప్రైవేటు స్కూలు యాజమాన్యానికి అప్పగిస్తున్నారు. ఆ బడి బాధలు తట్టుకోలేక పిల్లలు నరకం చూస్తున్నారు. స్కూలు చదువుతున్న పిల్లల నోటి వెంట కూడా ఆత్మహత్య వంటి పదాలు వినిపిస్తున్నాయంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బీవీ పట్టాబి రామ్ మాటల్లో చెప్పాలంటే... తల్లిదండ్రులు తాము పనిలో ఉండి పిల్లల్ని ఆశ్రద్ధ చేస్తున్నామేమో అనుకుంటూ చదువు చదువు ఉంటూ అధిక ఒత్తిడి తీసుకొచ్చి పిల్లలకు టెన్షన్ కలిగిస్తున్నారు. కొంచెం చదువుకున్న తల్లిదండ్రులైతే అది మరీ ఎక్కువగా ఉంటోంది. ఇందుకు సంబంధించిన ఆసక్తికరమైన సర్వేలు పరిశీలిస్తే మంచి ర్యాంకులు సాధించిన పిల్లల తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడం గమనార్హం. కూలీలు నయం కదా.. ఒకప్పుడు బాల్యం అంటే అదో మధుర జ్ఞాపకం. ఇప్పుడు బాల్యం ఒత్తిడితో సతమతమవుతోంది. ఉదయం 7 గం టలకు మోయలేనంత బ్యాగ్‌ను వీపు మీద వేసుకుని రాత్రి 8 గంటలకు ఇంటికి చేరడం నిత్యకృత్యమైంది. పిల్లలకు రెండేళ్లు దాటిన మరుక్షణమే బల వంతంగానైనా పాఠశాలలో చేర్పించటం అలవాటుగా మారింది. ఇది మొదలు జీవితంలో స్థిరపడినంత వరకు తీవ్రమైన ఒత్తిడిలోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఈ ధోరణే విపత్కర పరిణామాలకు దారి తీస్తోంది. నాలుగైదేళ్ల కిందటి వరకు మార్కుల పేరుతో ఒత్తిడికి గురి చేసే వారు. ఇప్పుడు గ్రేడింగ్‌లు వచ్చినా తల్లిదండ్రుల తీరు మాత్రం మారడం లేదు. డిప్రెషన్లో కనిపిస్తున్నారు... ప్రస్తుతం పిల్లలు అనారోగ్యంతో వస్తున్నారు. వీరిని పరి శీలిస్తే డిప్రెషన్లో ఉన్నట్టు ఇ ట్టే అర్థమవుతుంది. దీనికి కార ణం ఒత్తిడే. చదువులో ముం దంజలో ఉండడం కోసం విపరీతమైన ఒత్తిడిని పిల్లలపై తీసుకొస్తున్నారు. వంద మంది పిల్లలను పరిశీలిస్తే 80 శాతం పిల్లలు డిప్రెషన్లో కనిపిస్తున్నారు. ఇదే విధానం కొనసాగితే అనర్థాలకు దారితీస్తుంది. చదువును మార్కులతో జత చేయకుండా విజ్ఞానం కోసం ఉపయోగించేలా మార్చాల్సి ఉంది. - జె.రవీంద్ర కుమార్, చిన్న పిల్లల వైద్య నిపుణులు తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఒత్తిడి.. విద్యా సంస్థల్లో పిల్లలను చే ర్పించిన తల్లిదండ్రులు మా ర్కులు కోసం తీవ్రంగా ఒత్తి డి తీసుకొస్తున్నారు. పిల్లల కంటే ముందు వారి మా ర్కులను తెలుసుకొనేది తల్లిదండ్రులే. తమ పిల్లాడికి పక్క అబ్బాయి కంటే ఎందుకు మార్కులు తక్కువ వస్తున్నాయని నిల దీస్తున్నారు. మార్కులు ఎప్పటికప్పుడు తెలియజేయకపోతే ఇతర పాఠశాలలకు మార్చేస్తున్నారు. దీంతో పిల్లలపై సహజంగా ఒత్తిడి పెంచాల్సి వస్తుంది. - టి.జగన్నాధంనాయుడు, కరస్పాండెంట్, నవోదయ ప్రైవేట్ పాఠశాల అధిక సిలబస్‌తోనే... సాధారణంగా విద్యాసంవత్సరానికి విద్యార్థులు స్థాయికి సరిపోయిన స్థాయిలో ప్రభుత్వం సిలబస్‌ను త యారు చేస్తుంది. ఇది చాలదని విద్యా సంస్థల్లో అదనపు సిలబస్‌ను రుద్దుతున్నారు. అలా అదనపు సిలబస్ ఉన్న పాఠశాలలకే తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పిల్లాడి జ్ఞాపిక శక్తి కంటే అదనపు సమాచారాన్ని వారికిస్తున్నారు. దీంతో పిల్లలు తీ వ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అదనపు సిలబస్ బోధనను నిరోధించాలి. - ఐ.వెంకటరావు, ఉపవిద్యాశాఖాధికారి. -
మా పొట్ట మీద కొట్టకండి
సర్కారు వైఖరిపై ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ ఆవేదన ఆత్మగౌరవం దెబ్బతినేలా పోలీసులతో తనిఖీలా? తనిఖీలు ఆపకుంటే కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి హైదరాబాద్: ప్రైవేటు విద్యాసంస్థలపై పోలీసులతో తనిఖీలు చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల తెలంగాణ ప్రైవేటు విద్యాసంస్థల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) తీవ్రంగా మండిపడింది. రాష్ట్రంలో 85 శాతం విద్యావ్యాప్తికి దోహదపడుతున్న ప్రైవేటు విద్యాసంస్థలపై ఏకపక్షంగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొంది. కనీసం తమను చర్చలకు పిలవకుండా, సంప్రదించకుండా తనిఖీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమేంటని ప్రశ్నించింది. తనిఖీల పేరుతో తమ పొట్టల మీద కొట్టొద్దని అభ్యర్థించింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో తనిఖీలు చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల యాజమాన్యాలు తెలంగాణ ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీగా ఆవిర్భవించాయి. జేఏసీ కన్వీనర్ గింజల రమణారెడ్డి, ప్రతినిధులు శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. విద్యాసంస్థల్లో పోలీస్, ఇంటెలిజెన్స్, ఏసీబీ, విజిలెన్స్ తదితర శాఖాధికారులతో ప్రభుత్వం తనిఖీలు నిర్వహిస్తామన డం అన్యాయమన్నారు. అది రాష్ట్రానికే అవమానకరం తెలంగాణలోని విద్యాసంస్థలు బోగస్ అని ప్రకటించడం రాష్ట్రానికే అవమానకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని ధ్వజమెత్తారు. తనిఖీలకు తాము వ్యతిరేకం కాదని, అయితే సంబంధిత విద్యాశాఖ అధికారులతోనే తనిఖీలు చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన విద్యాసంస్థల యాజమాన్యాలనే దోపిడీదారులుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన చెందారు. లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటున్న కార్పొరేట్ విద్యాసంస్థల జోలికి ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. ఆదివారంలోగా తనిఖీల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే.. తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ నెలాఖరులోగా రూ. 3,500 ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్లు భాస్కర్ రెడ్డి, కె. సిద్ధేశ్వర్, కో ఆర్డినేటర్ ఎస్ఎన్ రెడ్డి, అధికార ప్రతినిధి గౌరీ సతీశ్, రాంచందర్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటాం
చౌటుప్పల్ రూరల్ : అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని లక్కారం మోడల్ స్కూల్‌ను సోమవారం ఆయన సందర్శించారు. రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం అధ్వానంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడల్ స్కూల్లో విద్యార్థులకు అందిస్తున్న భోజనం బాగా లేదని, భోజన ఏజెన్సీపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మందోళ్లగూడెం పంచాయతీ పరిధిలోని సింగరాయిచెర్వు సబ్‌స్టేషన్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. రైతులు పిలాయిపల్లి కాలువ, సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్‌స్టేషన్ పనులు నత్తనడకన సాగుతున్నాయని అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌తో మాట్లాడి సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చే యిస్తానన్నారు. పిలాయిపల్లి కాలువ నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వల్లే నీళ్లు సరిగ్గా రావడం లేదన్నారు. 6నెలల్లోగా అసంపూర్తి పనులను పూర్తి చేయిస్తానన్నారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీటీసీ సభ్యుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, సర్పంచ్‌లు రిక్కల సుధాకర్‌రెడ్డి, ముటుకుల్లోజు దయాకరాచారి, కానుగు యాదమ్మ, బక్క శంకరయ్య, ఎంపీటీసీ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి, బొబ్బిళ్ల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త కోర్సులతో మెరుగైన ఉపాధి అవకాశాలు
ప్రైవేట్ సంస్థల సహకారంతో సరికొత్తగా.. జేఎన్ఏఎఫ్ఏయూ వీసీ పద్మావతి యూనివర్సిటీలో ఎడ్యుకేషనల్ ఫెయిర్ ప్రారంభం మెహిదీపట్నం, న్యూస్‌లైన్: మారుతున్న కాలానికి అనుగుణంగా అందుబాటులోకి వస్తున్న కోర్సులను అభ్యసిస్తే విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పేర్వారం పద్మావతి అన్నారు. యూనివర్సిటీ ఆధ్వర్యంలో శనివారం ఫైన్ఆర్ట్స్ కళాశాలలోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్ ఫెయిర్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ యానిమేషన్, ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, టెలివిజన్, ప్రింట్ మీడియా, అడ్వర్టైజ్మెంట్స్ వంటి కోర్సులు యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఫిలిం మేకింగ్ కోర్సు కూడా ఉన్నట్టు ఆమె పేర్కొన్నారు. ఆధునిక హంగులతో పలు కోర్సులకు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. తమతోపాటు కొన్ని ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ అవగాహన ఒప్పందం కుదుర్చుకొని సరికొత్త కోర్సులను అందిస్తున్నాయన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్లు మరిన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర విద్యార్థులతోపాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్.కవితాదరియానిరావు, ప్రొఫెసర్ ఎస్.ప్రదీప్‌కుమార్, ప్రొఫెసర్ ఎస్.కుమార్, ప్రొఫెసర్ ఎస్ఎన్ వికాస్ పాల్గొన్నారు. -
గుర్తింపు లేని పాఠశాలలపై కొరడా
- డీఈఓ విజయభాస్కర్ ఒంగోలు వన్‌టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై కొరడా ఝుళిపించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ తెలిపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం నుంచి ప్రారంభ అనుమతి లేకుండా కొత్తగా పాఠశాలలను ప్రారంభించరాదు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా ప్రైవేట్ పాఠశాలలను నిర్వహించరాదని చట్టం చెబుతోంది. అయితే ఈ నిబంధనలన్నింటినీ తోసిరాజని కొందరు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎటువంటి గుర్తింపు, అనుమతులు లేకుండా పాఠశాలలను నిర్వహిస్తుండటంపై డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత విద్యాసంవత్సరంలోనే అన్ని ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలకు భారీగా జరిమానాలు కూడా విధించారు. విద్యాహక్కు చట్టం అమలుల్లోకి వచ్చి ఇప్పటికి నాలుగు సంవత్సరాలైంది. ఇప్పటికీ ఇంకా ఈ చట్టం నిర్దేశించిన అంశాలను తోసిరాజని కొత్త ప్రైవేట్ పాఠశాలలు పుట్టుకొస్తున్నాయి. పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు పత్రికల్లో ప్రకటనలు ఇస్తూ తల్లిదండ్రులను తప్పుదారి పట్టిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు. గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పించొద్దు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పిండొద్దని డీఈఓ విజయభాస్కర్ విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించేటప్పుడు ఆ పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో తెలుసుకుని గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో చదివే విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాసేందుకు ప్రస్తుత విద్యాసంవత్సరం (2014-15)లో అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. గుర్తింపు లేని పాఠశాలల్లో చదివి విద్యార్థులు నష్టపోతే దానికి తల్లిదండ్రులే బాధ్యత వహించాలన్నారు. గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పించవద్దని తాము ముందుగానే హెచ్చరిస్తున్నందున విద్యార్థులు నష్టపోతే తమకేమీ బాధ్యత లేదన్నారు. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలు జారీ చేసే స్టడీ సర్టిఫికెట్లు, టీసీలు చెల్లవని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 100కుపైగా ఒక్క ఒంగోలులోనే 27 ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్నారని, ఆ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించవద్దన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అనుమతులు, గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు.