![Candidate Of Group4 Exam Caught Writing With Cellphone - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/1/Candidate%20Of%20Group4%20Exam%20Caught%20Writing%20With%20Cellphone.jpg.webp?itok=4Av2v7Qx)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా శనివారం జరిగిన గ్రూప్-4 ఎగ్జామ్ సందర్భంగా ఓ అభ్యర్థి హైటెక్ కాపీయింగ్‌కు తెరలేపాడు. సెల్‌ఫోన్‌ను వెంట తెచ్చుకుని దాని సాయంతో ఎగ్జామ్ రాసేందుకు యత్నించి పట్టుబడ్డాడు.
రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మారుతినగర్‌లోని సక్సెస్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో పరీక్ష ప్రారంభమైన అరగంట అనంతరం ఒక అభ్యర్థి సెల్ ఫోన్తో హాజరైనట్లు గమనించిన ఇన్విజిలేటర్, అతని వద్ద గల సెల్ ఫోన్ సీజ్ చేసి మాల్ ప్రాక్టీస్ కేసు బుక్ చేశారని జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు.
సదరు అభ్యర్థిని సమగ్ర విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించడం జరిగిందన్నారు. ఈ సంఘటన మినహా జిల్లా వ్యాప్తంగా ఉదయం సెషన్ లో జరిగిన గ్రూప్-4 పేపర్-1 పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment