Google map
-
గూగుల్ మ్యాప్‌తో పోలీసులు కాస్త దొంగలయ్యారు!
గూగుల్ మ్యాప్ మరోసారి హ్యాండిచ్చిన ఘటన ఇది. ఓ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గూగుల్ మ్యాప్‌ను నమ్ముకున్నారు. అయితే అది కాస్త దారుణ పరాభవానికి దారి తీసింది. పోలీసులను దొంగలుగా భావించి చితకబాదిన జనం.. రాత్రంతా కట్టేసి బందీలుగా ఉంచుకున్నారు. చివరకు అసలు విషయం తెలిసి సారీ చెప్పి వదిలేశారు. అసోంలోని జోరాత్ జిల్లాకు చెందిన 16 మందితో కూడిన పోలీసు బృందం నిందితుడిని పట్టుకునేందుకు బయలుదేరింది. ఈ క్రమంలో ఈ బృందం గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుంది. మ్యాప్ అసోంలోని ఓ తేయాకు తోటను చూపించింది. నిజానికి అది నాగాలాండ్‌లోని నాగాలాండ్‌లోని మోకోక్చుంగ్ జిల్లా ప్రాంతం. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం లోపలికి వెళ్లారు. అయితే.. వారి వద్దనున్న అధునాతన ఆయుధాలు చూసిన స్థానికులు వారిని దుండగులుగా పొరబడి చుట్టుముట్టి దాడి చేశారు. ఆపై వారిని బంధించారు. ఈ ఘటనలో ఒక పోలీసు గాయపడ్డారు. అయితే.. ఈ విషయం తెలుసుకున్న జోరాత్ పోలీసులు వెంటనే మోకోక్‌చంగ్ ఎస్పీతో మాట్లాడారు. దీంతో ఆయన స్థానికుల చేతుల్లో బందీలుగా ఉన్న పోలీసులను విడిపించేందుకు మరో బృందాన్ని పంపించారు. స్థానికులకు అసలు విషయం తెలియడంతో గాయపడిన పోలీసు సహా ఐదుగురిని విడిచిపెట్టారు. మిగిలిన 11 మందిని రాతంత్రా బందీలుగా ఉంచుకుని నిన్న ఉదయం విడిచిపెట్టడంతో కథ సుఖాంతమైంది. -
గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్ముకుని.. ముగ్గురి మృతి
బరేలీ: గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్ముకున్న ముగ్గురు మృత్యువాత పడ్డారు. యూపీలోని బరేలీలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. జీపీఎస్ ఫాలోచేస్తూ నిర్మాణంలో ఉన్న వంతెనపైకి వెళ్లిన ఓ కారు అమాంతం అక్కడి నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.వివరాల్లోకి వెళితే బరేలీలో నిర్మాణంలో ఉన్న ఒక వంతెనపై నుంచి వచ్చిన ఒక కారు రాంగంగా నదిలో పడిపోయింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందారు. వారు గూగుల్ మ్యాప్ ఉపయోగించి నావిగేట్ అవుతూవచ్చారు. అయితే వంతెనలోని కొంత భాగం దెబ్బతిన్నట్లు సూచించడంలో గూగుల్ మ్యాప్ విఫలమైందని పీటీఐ పేర్కొంది.బరేలీ నుంచి కారులో ముగ్గురు వ్యక్తులు బదౌన్ జిల్లాలోని డాటాగంజ్ వెళ్తుండగా ఖల్పూర్-దతాగంజ్ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఫరీద్ పూర్, బరేలీ, దాతాగంజ్ పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గతంలో వచ్చిన వరదల కారణంగా వంతెన ముందు భాగం కూలిపోయి నదిలో పడిపోయింది. అయితే ఇది జీపీఎస్‌లో అప్డేట్ కాలేదు. ఫలితంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 3 men in a car used Google Maps, which directed them to an under-construction bridge in Bareilly, UP. Their car fell off, and all 3 died.1) Why were there no barricades at the bridge?2) Why does Google Maps direct users to incomplete routes? Is the GPS data not updated? This… pic.twitter.com/8t8qQp0FQg— Anshul Saxena (@AskAnshul) November 24, 2024కారు బ్రిడ్జిపై అప్పటికే అతివేగంతో ఉండటానికి తోడు చివరి నిమిషంలో డ్రైవర్ కూడా ఏం చేయలేకపోయాడని, దట్టమైన పొగమంచు కారణంగా డ్రైవర్ ప్రమాదాన్ని గుర్తించలేకపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుల్లో ఇద్దరిని అమిత్, వివేక్లుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఫరూకాబాద్‌లోని ఇమాద్‌పూర్ వాసులని, మూడో వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. ఈ ప్రమాదంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: Jharkhand: ఇలా గెలిచి.. అలా రాజీనామాకు సిద్ధమై.. ఏజేఎస్‌యూలో విచిత్ర పరిణామం -
రీజనల్ రింగ్.. మరింత లాంగ్!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం నిడివి 200 కిలోమీటర్లను మించిపోనుంది. జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) చేపట్టిన పరిశీలనను కాదని రాష్ట్ర ప్రభుత్వం విడిగా రూపొందించిన అలైన్మెంట్, దానిలో మార్పులు చేయాల్సిన పరిస్థితులే దీనికి కారణం. గతంలో ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ పరిశీలన చేపట్టి మూడు వేర్వేరు అలైన్మెంట్లను రూపొందించగా.. అందులో 189.425 కిలోమీటర్ల నిడివి ఉన్న మూడో అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. దాన్ని ఎన్హెచ్ఏఐ ఆమోదించేలోగా లోక్‌సభ ఎన్నికలు రావడంతో పెండింగ్‌లో పడింది. తర్వాత రోడ్డు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం మనసు మార్చుకుంది. సొంతంగా దక్షిణ భాగం రింగ్‌రోడ్డును చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇటీవల ముఖ్యమంత్రితో జరిగిన సమావేశాల్లో అలైన్‌మెంట్‌పై చర్చలు జరిగాయి. కొన్ని కన్సల్టెన్సీ సంస్థల సాయంతో గూగుల్ మ్యాప్‌ల ఆధారంగా ప్రాథమికంగా ఓ అలైన్‌మెంట్‌ను అధికారులు సిద్ధం చేశారు. గతంలో ఢిల్లీ కన్సల్టెన్సీ రూపొందించిన అలైన్మెంట్లో చాలా మార్పులు చేస్తూ, కొత్త ప్రాంతాల మీదుగా రింగ్‌రోడ్డు కొనసాగేలా రూపొందించారు. దానితో దక్షిణభాగం నిడివి 194 కిలోమీటర్లకు చేరింది. అయితే అది క్షేత్రస్థాయి పరిశీలనతో రూపొందించినది కాకపోవటంతో పలు లోపాలు ఉండిపోయాయి. ఆ అలైన్‌మెంట్‌ను ఉన్నది ఉన్నట్టుగా ఖరారు చేసే పరిస్థితి లేదు. జలాశయాలు, రిజర్వాయర్లు, గుట్టలు, వాగులు, వంకల మీదుగా దాన్ని రూపొందించడమే కారణం. ఇప్పుడు ఇలాంటి వాటన్నింటినీ తప్పిస్తూ.. తుది అలైన్‌మెంట్‌ను ఖరారు చేయాల్సి ఉంటుంది. దీనితో నిడివి మరో 12 కిలోమీటర్లకుపైగా పెరుగుతుందని అంచనా. ఈ లెక్కన రీజనల్ రింగ్‌రోడ్డు దక్షిణ భాగం నిడివి 200 కిలోమీటర్లను దాటిపోతుందని అంటున్నారు. రూ.1,200 కోట్లు అదనపు వ్యయం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొత్త అలైన్‌మెంట్‌ను ఖరారు చేసే పనిలో ఉంది. ఇటీవలే 12 మంది అధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 194 కిలోమీటర్ల ప్రాథమిక అలైన్‌మెంట్‌ను ఆధారంగా చేసుకుని.. క్షేత్రస్థాయిలో పర్యటించి తుది అలైన్‌మెంట్‌ను సిద్ధం చేయనున్నారు. ఈ క్రమంలో ప్రాథమిక అలైన్‌మెంట్‌లోని లోపాలను సరిదిద్దితే.. రోడ్డు నిడివి పెరగనుంది. దీనితో రోడ్డు నిర్మాణ వ్యయం రూ.1,200 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల మేర పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఆమన్‌గల్ ఆవలి నుంచి.. ఎన్హెచ్ఏఐ రూపొందించిన అలైన్మెంట్ ఆమన్‌గల్ పట్టణం ఇవతలి నుంచి ఖరారైంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మార్చి ఆమన్‌గల్ పట్టణం అవతలి నుంచి అలైన్‌మెంట్‌ను రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఆ పట్టణం పూర్తిగా రీజనల్ రింగురోడ్డు లోపలికి రానుంది. ఇక చేవెళ్ల మండలం పరిధిలోని ఆలూరు –కిష్టాపూర్ గ్రామాల సమీపంలో హైదరాబాద్–బీజాపూర్ హైవేను క్రాస్ చేసేలా ఎన్హెచ్ఏఐ అలైన్మెంట్ ఉండగా.. ఇప్పుడు మన్నెగూడ వద్ద క్రాస్ చేసేలా మార్పు చేస్తున్నట్టు సమాచారం. ఇలా మరెన్నో మార్పులు జరుగుతున్నట్టు తెలిసింది. ఇందుకోసం ప్రాథమిక అలైన్మెంట్ స్థానంలో.. మరో తాత్కాలిక అలైన్‌మెంట్‌ను కొత్తగా రూపొందించినట్టు సమాచారం. గతంలోనూ ఇలాగే.. ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ అలైన్‌మెంట్‌ను రూపొందించకముందు, రాష్ట్ర ప్రభుత్వం అ«దీనంలో ఎన్‌హెచ్ విభాగం ఓ ప్రాథమిక అలైన్‌మెంట్‌ను రూపొందించింది. అప్పట్లో కూడా అధికారులు గూగుల్ మ్యాపుల ఆధారంగా దాదాపు 182 కిలోమీటర్ల నిడివితో దాన్ని రూపొందించారు. మర్రిగూడ మండలం శివన్నగూడలో ఉన్న రిజర్వాయర్ మధ్యలోంచి రోడ్డును నిర్మించేలా సిద్ధం చేశారు. దీనితో ఆ రిజర్వాయర్ సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రిజర్వాయర్‌ను ఆసరా చేసుకుని సాగు భూముల్లోంచి అలైన్మెంట్ మార్కింగ్ చేసిన అంశాన్ని.. ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు క్షేత్రస్థాయిలో సర్వే చేసి.. అక్కడికి రెండు కిలోమీటర్ల దూరం నుంచి కొత్త అలైన్మెంట్ రూపొందించారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే మళ్లీ ఎదురవుతోంది.ప్రస్తుతం జలాశయాల మీదుగా..ఇది దక్షిణ రింగురోడ్డు ప్రారంభ ప్రాంతం. ఉత్తర రింగ్ ప్రారంభయ్యే సంగారెడ్డి పట్టణం చేరువలోని గిర్మాపూర్ వద్ద దక్షిణ భాగం రింగురోడ్డు అనుసంధానమయ్యే చోటు ఇది. ఇక్కడ ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన అలైన్మెంట్ ప్రారంభంలోనే ఓ లూప్ తరహాలో అర్ధచంద్రాకారంలో వంపు తిరిగి (లేత నీలిరంగు గీత) మొదలవుతుంది. దీన్ని లోపంగా భావించారో, మరేమో గానీ.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రాథమిక అలైన్మెంట్లో దాన్ని (ముదురు నీలిరంగు) స్ట్రెయిట్ లైన్‌గా మార్చారు. నిజానికి అక్కడ పెద్ద చెరువు ఉంది. కొండాపూర్ మండలం తొగర్పల్లి పెద్దచెరువు పరీవాహక ప్రాంతాన్ని తప్పించేందుకు ఢిల్లీ కన్సల్టెన్సీ లూప్‌లో అలైన్మెంట్ రూపొందించింది. ప్రభుత్వ అలైన్మెంట్లో దాన్ని నేరుగా ఉండేలా మార్చటం వల్ల చెరువు పరీవాహక ప్రాంతం మీదుగా రోడ్డు వస్తుంది, అలాగే నిర్మించాలంటే ఎలివేటెడ్ విధానాన్ని అనుసరించాలి. అది భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇక మర్రిగూడ మండలం కిష్టరాయునిపల్లి వద్ద ఓ రిజర్వాయర్ నిర్మాణ ప్రతిపాదన ఉంది. దాన్ని తప్పించేందుకు ఢిల్లీ సంస్థ ఆ ప్రాంతంలో వంపు తిరుగుతూ అలైన్‌మెంట్‌ను రూపొందించింది. ప్రభుత్వ అలైన్మెంట్లో దాన్ని కూడా నేరుగా మార్చటం వల్ల.. ప్రతిపాదిత రిజర్వాయర్ భూముల్లోంచి రోడ్డు నిర్మించాల్సి వస్తుంది. అది కుదిరే పనికాదు. లేదా అతి భారీ ఫ్లైఓవర్లు కట్టాల్సి వస్తుంది. దక్షిణభాగం పొడవునా పలుచోట్ల ఇదే పరిస్థితి ఉండటంతో.. ప్రాథమిక అలైన్‌మెంట్‌కు మార్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. -
గూగుల్ మ్యాప్స్‌లో ఏఐ.. ఎలా పనిచేస్తుందంటే..?
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో న్యావిగేషన్ చాలా సులభమైపోయింది. ఇది (న్యావిగేషన్) కేవలం స్మార్ట్ఫోన్లలో మాత్రమే కాకుండా బైకులు, కార్లలో కూడా అందుబాటులోకి వచ్చేసింది. దీంతో కొత్త ప్రాంతాలకులు వెళ్లాలన్నా గూగుల్ మ్యాప్ ఆన్ చేసి ఎంచక్కా వెళ్లిపోతున్నారు. దీనికి ఏఐ తోడైతే.. యూజర్ మరింత గొప్ప అనుభూతిని పొందవచ్చు. ఈ కథనంలో ఏఐ బేస్డ్ గూగుల్ మ్యాప్స్ గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.మరింత వివరంగా సెర్చ్ చేసేలా..సాధారణంగా గూగుల్ మ్యాప్ అనగానే ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి దారి చూపిస్తుందని తెలుసు. కానీ కొత్త ఏఐ ఆధారిత కన్వర్జేషనల్ సెర్చ్ ద్వారా మరింత వివరణాత్మకమైన శోధన సాధ్యమవుతుంది. మనం వెళ్లాల్సిన ప్రాంత్రాలను టెక్ట్స్, వాయిస్ రూపంలో అందిస్తే ఏఐ సహాయంతో లోకేషన్‌ను చూపిస్తుంది. పిల్లలకు ఇష్టమైన ప్రదేశాలు ఎక్కడున్నాయి, సమీపంలోని క్రీడా ప్రదేశాలు ఏవి అనే వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇందులో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు.3డీ వ్యూఈ రకమైన గూగుల్ మ్యాప్ సాయంతో 3డీ నమూనాలతో ఏదైనా స్థానాన్ని (ప్లేస్) కనుక్కోవచ్చు. ఇందులో లైవ్ ట్రాకింగ్, వాతావరణ అప్డేట్స్, ట్రాఫిక్ వంటి వాటిని తెలుసుకోవచ్చు. కొత్త ప్రదేశాలకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ 3డీ వ్యూ అనేది చాలా ఉపయోగపడుతుంది.లైవ్ వ్యూగూగుల్ మ్యాప్ లైవ్ వ్యూ ఫీచర్ ద్వారా ఏటీఎమ్, రెస్టారెంట్లు, పార్కులు, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ వంటివి కూడా కనుగొనవచ్చు. కెమెరా ఆన్ చేసిన తరువాత సమీపంలో ఉన్న ఈ స్థలాలను తెలుసుకోవచ్చు. అంతే కాకుండా అవి ఎంతసేపు అందుబాటులో ఉంటాయి (పని గంటలు), రేటింగ్ ఏంటి అనే వివరాలు కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు.ఫోటోల ద్వారా సెర్చ్ఇప్పటి వరకు గూగుల్ మ్యాప్ ద్వారా ప్రదేశాలను సెర్చ్ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు సెర్చ్ విత్ ఫోటోస్ ద్వారా ప్రదేశాలను తెలుసుకోవచ్చు. ఇందులో మీరు ఎక్కువ ఫోటోలను ఉపయోగించి ప్రదేశాలను కనుగొనవచ్చు. అయితే ఒక ల్యాండ్‌మార్క్ కనుక్కోవడానికి ఈ ఫీచర్ చాలా మంచి అనుభవాన్ని ఇస్తుంది.మ్యాప్స్‌లో లెన్స్ ఉపయోగించడంసమీపంలోని ఏటీఎమ్, రెస్టారెంట్లు, కాఫీ షాపులు, స్టోర్ల వద్ద మీ కెమెరాను చూపడం ద్వారా లొకేషన్ గురించి వివరణాత్మక సమాచారాన్ని కనుగొనవచ్చు. ఈ ఫీచర్ కొత్త ప్రాంతాలను అన్వేషించడానికి.. వాటి గురించి తెలుసుకోవడానికి చాలా ఉపయోకరంగా ఉంటుంది. -
నట్టేట ముంచిన గూగుల్ మ్యాప్
అక్కన్నపేట (హుస్నాబాద్): ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తున్నామా?.. జస్ట్ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయడం, అందులో సూచించిన దారిని అనుసరిస్తూ ముందుకు వెళ్లిపోవడం మామూలైపోయింది. కానీ అన్నిసార్లు గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మి ముందుకెళ్తే నట్టేట మునగడం ఖాయం. తాజాగా ఓ డీసీఎం వ్యాన్ డ్రైవర్ గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వాహనం నడిపి ఏకంగా ప్రాజెక్టులోకి వెళ్లిపోయాడు. సిద్దిపేట అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామంలో నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద ఈ ఘటన జరిగింది. పాల ప్యాకెట్లు తీసుకెళ్తూ.. హైదరాబాద్‌కు చెందిన ఓ డీసీఎం డ్రైవర్ శనివారం రాత్రి హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో వృధా అయిన పాల ప్యాకెట్లను వ్యాన్‌లో లోడ్ చేసుకున్నారు. తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి హుస్నాబాద్ మీదుగా రామవరం వైపు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్‌కు రోడ్డుపై సరైన అవగాహన లేక గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో బంగారు లొద్దితండా దాటాక రామవరం వైపు వెళ్లాల్సిన ఉన్నా.. గుడాటిపల్లి వైపు మళ్లారు. మ్యాప్‌లో చూపించినట్టుగా ముందుకువెళ్లారు. కొంతదూరం వెళ్లాక నీరు ఎక్కువగా కనిపించింది. వాన వల్ల నీళ్లు నిలిచాయేమో అనుకుని ముందుకెళ్లాడు. క్యాబిన్ వరకూ నీళ్లు వచ్చాయి. డీసీఎం ఆగిపోయింది. దీంతో డ్రైవర్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఈదుకుంటూ బయటకు వచ్చాడు. చుట్టుపక్కల ఉన్న వారి వద్దకు వెళ్లి ఈ విషయం చెప్పాడు. ఆదివారం ఉదయం స్థానికులు జేసీబీ సాయంతో డీసీఎంను బయటకు లాగారు. రోడ్డుకు అడ్డుగా గోడ నిర్మించాలి నందారం స్టేజీ దాటాక రోడ్డుకు అవతలి వైపు గౌరవెల్లి ప్రాజెక్టు కట్టడంతో వెళ్లడానికి దారి లేదని స్థానికులు తెలిపారు. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ మేర నీరు నిలిచి ఉంటుందని వివరించారు. రోడ్డుకు అడ్డుగా పెద్ద గోడ నిర్మించాలని.. లేకుంటే గూగుల్ మ్యాప్ నుంచి ఈ రోడ్డును తొలగించాలని సూచించారు. ఇంతకుముందు సెప్టెంబర్ 7న ఓ లారీ డ్రైవర్ ఇలాగే గూగుల్ మ్యాప్ చూస్తూ.. ప్రాజెక్టులోకి దూసుకెళ్లారని.. ఇప్పుడు డీసీఎం వ్యాన్ వెళ్లిందని తెలిపారు. -
వీలైనంత దగ్గరగా జేఈఈ పరీక్ష కేంద్రం
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రా లను ఈసారి శాస్త్రీయంగా ఏర్పాటు చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయించింది. సాధ్యమైనంత వరకూ అభ్యర్థి నివాసానికి సమీపంలో ఉండే కేంద్రాన్ని కేటాయించేందుకు వీలుగా కసరత్తు చేపట్టింది. దరఖాస్తులో పేర్కొన్న స్థానికతను ఇందుకు కొలమానంగా తీసుకుంటున్నారు. గూగుల్ మ్యాప్ ఆధారంగా అక్కడికి సమీపంలోని పరీక్ష కేంద్రాన్ని గుర్తిస్తున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి పరీక్షా కేంద్రాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు. ఒక కేంద్రంలోనే ఎక్కువ మందికి అవకాశం జేఈఈ మెయిన్స్ పరీక్ష జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య ఉంటుంది. తొలి విడత పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 30తో ముగుస్తుంది. తుది గడువు నాటికి ఎన్ని దరఖాస్తు లు అందు తాయి? ఎన్ని పరీక్ష కేంద్రాలుంటాయి? ఎన్ని సెషన్లుగా పరీక్ష పెట్టాలనేదానిపై డిసెంబర్ మొదటి వారంలో ఓ స్పష్టత వస్తుంది. అయితే ఈసారి ఒక్కో పరీక్ష కేంద్రంలో ఎక్కువ మంది పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు అదనపు గదుల ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఎన్టీఏ వర్గాలు తెలిపాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో 18 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసే వీలుంది. హైదరాబాద్‌లో ఎక్కువ కేంద్రాలు ఉంటాయి. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ముందుగా దరఖాస్తు చేసే వారికి పరీక్ష కేంద్రం కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్టీఏ భావిస్తోంది. సాధారణంగా హైదరాబాద్‌లోని పలు పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో వీరిని రంగారెడ్డి, హైదరాబాద్‌లోని కేంద్రాలకు కేటాయించి, ఇంకా మిగిలితే సమీపంలోని జిల్లా కేంద్రాల్లో సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం మారుమూల జిల్లా కేంద్రంలోని అభ్యర్థులకు కూడా హైదరాబాద్ వంటి దూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించే వాళ్ళు. దీనివల్ల అసౌకర్యంగా ఉంటోందని అన్ని జిల్లాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇబ్బందుల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం జేఈఈ పరీక్ష సమయంలో ఎదురయ్యే ఇబ్బందులపై ఈసారి దృష్టి పెట్టబోతున్నారు. పలు కేంద్రా ల్లో కంప్యూటర్లు ఆగిపోవడం, లేదా ఇతర సాంకేతిక సమస్యలు ఎదురవుతున్న ఉదంతాలున్నాయి. దీనివల్ల గంటల తరబడి పరీక్ష ఆలస్యమవుతోంది. అప్పటికే ఇతర కేంద్రాల్లో పరీక్ష పూర్తవుతుంది. దీనిపై పరీక్ష కేంద్రం అధికారులు నిర్ణయం తీసుకో లేని పరిస్థితి ఉంటోంది. గత ఏడాది మూడు చోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తాయి. విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అధికారులు ఎన్టీఏను సంప్రదించి, నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈ టెన్షన్ కారణంగా విద్యార్థులు సరిగా పరీక్ష రాయలేదనే విమర్శలున్నాయి. దీన్ని దూరం చేసేందుకు ఈసారి జిల్లా స్థాయిలో యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పాటు అవసరమైతే పరీక్ష వాయిదా వేసే అధికారం జిల్లా అధికారులకే ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. -
‘రేటింగ్’ పేరుతో చీటింగ్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెరతీశారని, గూగుల్ మ్యాప్‌లోని ప్రాంతాలకు రేటింగ్ ఇవ్వాలంటూ మోసాలకు పాల్పడుతున్నట్టు సైబర్ క్రైం పోలీసులు హెచ్చరించారు. ఇందుకోసం ఏకంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్టాన్రిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఈఐటీ) నుంచి పంపుతున్నట్టుగా నకిలీ ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. వారు పంపే లింక్‌లపై క్లిక్ చేసి అందులో వచ్చే గూగుల్ మ్యాప్‌లో వారు చెప్పిన ప్రాంతానికి రేటింగ్ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఒక్కో రేటింగ్‌కు రూ.150 ఇస్తామని, ఇలా రోజుకు కనీసం రూ.5 వేల వరకు సంపాదించవచ్చని ఊదరగొడుతున్నారు. ఎవరైనా ఇది నిజమని నమ్మితే ఒకటి, రెండుసార్లు డబ్బులు పంపి..ఎదుటి వ్యక్తికి నమ్మకం కుదిరిన తర్వాత అసలు మోసానికి తెరతీస్తున్నా రు. బ్యాంకు ఖాతాల వివరాలు..ఆధార్, పాన్‌కార్డు వివరాలు సేకరించడం..లింక్‌లో ఓటీపీ నమోదు చేయాలని చెబుతూ ఆన్లైన్లో డబ్బులు కొల్లగొడుతున్నట్టు పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదే తరహాలో కొన్ని నెలల క్రితం సోమాజిగూడకు చెందిన ఒక యువకుడు గూగుల్ మ్యాపింగ్ రేటింగ్ స్కాంలో చిక్కి రూ.74 వేలు పోగొట్టుకున్నాడని తెలిపారు. -
గ్రూప్-4 ఎగ్జామ్: అభ్యర్థి కొంపముంచిన గూగుల్ మ్యాప్
సాక్షి, యాదాద్రి: తెలంగాణలో టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్-4 పరీక్షా ప్రశాంతంగా కొనసాగుతోంది. తొమ్మిదిన్నర లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంతో పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్ -1 పరీక్ష మొదలవగా పరీక్ష ప్రారంభానికి 15 నిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ల గేట్లు మూసేశారు.. 9.45 తర్వాత అభ్యర్థులు ఎవరిని లోపలికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆలస్యంగా వచ్చిన పలువురిని లోపలికి అనుతించకపోవడంతో అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ అభ్యర్థిని గూగుల్ మ్యాప్ కొంపముంచింది. జిల్లాకు చెందిన శశిధర్ అనే అభ్యర్థికి చౌటుప్పల్‌లోని కృష్ణవేణి స్కూల్లో సెంటర్ పడింది. గూగుల్ మ్యాప్ ద్వారా కృష్ణవేణి స్కూల్ లొకేషన్ సెట్ చేసుకోగా.. అది పాత స్కూల్ అడ్రస్ వద్దకు తీసుకెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాకా పాఠశాలను మరోచోటుకు మర్చారని తెలియండంతో హుటాహుటిన అసలు కేంద్రం వద్దకు వెళ్లాడు. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో అధికారులు ఎగ్జామ్ రాసేందుకు అనుమతించలేదు. చదవండి: Balagam Ts Group 4 Question: బలగం సినిమాపై గ్రూప్-4 పరీక్షలో అడిగిన ప్రశ్న ఇదే -
కొంప ముంచిన గూగుల్ మ్యాప్.. నేరుగా సముద్రంలోకి - వీడియో
ఆధునిక కాలంలో టెక్నాలజీ వేగంగా పరుగులు పెడుతోంది. కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే చేతిలో స్మార్ట్‌ఫోన్ లేదా జిపిఎస్ నావిగేషన్‌కి సపోర్ట్ చేసే ఏదైనా పరికరం ఉండే చాలు. అయితే ఈ టెక్నాలజీ కొన్ని సార్లు ప్రమాదంలోకి నెట్టి వేస్తుంది. అలాంటి సంఘటన ఇటీవల ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఇటీవల వెల్లడైన ఒక వీడియో హవాయిలోని హోనోకోహౌ హార్బర్లో జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక కారు ఏకంగా సముద్రపు నీటిలోకి దూసుకెళ్లడం, అందులో ఒక మహిళ ఉండటం చూడవచ్చు. అయితే చివరికి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, కానీ కారు నీటిలోకి వెళ్లడం వల్ల అందులో ఏదైనా సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఇందులో కనిపించే కారుని డ్రైవ్ చేస్తున్న మహిళ జిపిఎస్ నమ్ముకుని కారుని డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే అక్కడ సమీపంలో ఉన్న కొంత మంది ఈ సంఘటన గమనించి ఆమెను రక్షించారు. కాబట్టి ఎవరికీ ఎటువంటి హాని జరగకుండా ప్రాణాలతో బయటపడగలిగారు. ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటి సారి కాదు. (ఇదీ చదవండి: రూ. 2.5 కోట్ల ఉద్యోగం వద్దనుకున్నాడు.. ఇప్పుడు కోట్లలో టర్నోవర్ - ఎవరీ కన్హయ శర్మ?) గతంలో ఒక వ్యక్తి జిపిఎస్ నమ్ముకుని అడవిలో చిక్కుకుని నానా అగచాట్లు పడ్డాడు. ఇంకో సంఘటనలో కొంత మంది ప్రాణాలే కోల్పోయారు. కావున జిపిఎస్ అన్ని వేళలా గమ్యాన్ని చేరుస్తాయని నమ్ముకోకూడదు, కావున కొత్త ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మీకు అందుబాటులో ఉన్న వ్యక్తుల సలహాలు కూడా తీసుకోవడం మంచిది. ఆలా కాకుండా సొంత తెలివితేటలు నమ్ముకుంటే అనుకోని ప్రమాదాలను ఆహ్వానించినవారవుతారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని ఎగ్జామ్ రాయలేకపోయిన ఇంటర్ విద్యార్థి
సాక్షి, ఖమ్మం : గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని ఓ ఇంటర్ విద్యార్థి మోసపోయాడు. గూగుల్ మ్యాప్‌లో తాను వెళ్లాల్సిన ఎగ్జామ్ సెంటర్ కాకుండా వేరే లొకేషన్ చూపించడంతో తప్పుడు అడ్రస్‌కు వెళ్లాడు. గూగుల్ తప్పిదాన్ని గ్రహించిన విద్యార్థి.. మళ్లీ సరైన పరీక్షా కేంద్రానికి వచ్చినా.. అప్పటికే ఆలస్యం కావడంతో తొలిరోజు పరీక్ష రాయలేకపోయాడు. దీంతో చేసేదేం లేక బాధతో తిరిగి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో బుధవారం చోటుసుకుంది. ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామానికి చెందిన విద్యార్థి వినయ్ ఇంటర్ చదువుతున్నాడు. బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో ఎగ్జామ్ హాలుకు వెళ్లేందుకు గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్నాడు. అందులో చూపించిన డైరెక్షన్లో వెళ్లాడు. అయితే తాను వెళ్లాల్సిన లొకేషన్‌కు కాకుండా మరో ప్లేస్‌కు గూగుల్ మ్యాప్స్ తీసుకెళ్లింది. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత అది తాను పరీక్ష రాయాల్సిన సెంటర్ కాదని తెలిసింది. దీంతో హడావుడిగా వేరేవాళ్లను అడ్రస్ అడుక్కుంటూ పరీక్షా కేంద్రానికి వచ్చాడు. కానీ వినయ్ అప్పటికే 27 నిమిషాలు ఆలస్యంగా ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకున్నాడు. నిమిషం నిబంధన కఠినంగా ఉండటంతో విద్యార్థినిపరీక్షా కేంద్రంలోకి అనుమతించేందుకు సిబ్బంది నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక బాధతో వినయ్ ఇంటికి చేరుకున్నాడు. -
గూగుల్ మ్యాప్స్.. ఇక అడ్రస్ కోసం ఇబ్బంది పడక్కర్లేదు
కొత్త ప్రదేశాల్లో.. కొత్త ప్రాంతాలకు వెళ్లడానికి చాలామందికి గూగుల్ మ్యాప్స్ ఒక మార్గదర్శి. అయితే కచ్చితమైన అడ్రస్సుల విషయంలోనే ఒక్కోసారి గందరగోళం ఏర్పడవచ్చు. ఇప్పుడు ఈ సమస్యను కూడా తీర్చడానికి ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది గూగుల్ మ్యాప్స్. చాలామంది తమ హోం అడ్రస్సులను అవసరం ఉన్నప్పుడు కరెంట్ లేదంటే అడ్రస్‌ను టైప్ చేయడం ద్వారా వివరాల్ని షేర్ చేస్తుంటారు. ఇకపై ఆ అవసరం లేకుండా ఫ్లస్ కోడ్‌ని షేర్ చేస్తే సరిపోతుంది. ఫ్లస్ కోడ్‌లో హోం అడ్రస్ బదులు.. నెంబర్లు, లెటర్ల ఆధారంగా ఉదాహరణకు.. ‘CCMM+64G’ ఇలా నెంబర్లు, లెటర్ల ఆధారంగా కోడ్ రూపంలో కనిపిస్తుంది. మాటి మాటికి అడ్రస్‌ను టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఇది షేర్(ఆల్రెడీ హోం అడ్రస్‌గా సేవ్ చేసి ఉంటారు కాబట్టి) చేస్తే సరిపోతుంది. గూగుల్ ఫ్లస్ కోడ్‌ను చాలా కాలం కిందటే(2018) తీసుకొచ్చింది. చాలాకాలం పాటు ఇది ఎన్జీవోలకు, ప్రభుత్వ కార్యాలయాలకు కేరాఫ్‌గా నిలిచి.. ప్రజలకు ఉపయోగపడ్డాయి. ఇక ఇప్పుడు ఈ ఫీచర్‌ను యూజర్లందరికీ అందించనుంది. ఇది అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా గ్రిడ్ తరహాలో ప్రాంతాలను విభజించుకుంటూ పోతుంది. విశేషం ఏంటంటే.. రోడ్డు మార్గం, సరైన ల్యాండ్ మార్క్‌లు లేనిచోట్ల కూడా అదీ ఆఫ్‌లైన్‌లోనే(ఒక్కసారి సేవ్ చేస్తే సరిపోతుంది) ఫ్లస్ కోడ్ సరైన అడ్రస్‌ను లొకేట్ చేస్తుంది. కరెక్ట్‌గా అడ్రస్ పెడితేనే రావట్లేదు.. ఇంక ఫ్లస్ కోడ్ వర్కవుట్అవుతుందా? అంటారా? కచ్చితంగా అవుతుంది. ఎందుకంటే.. గూగుల్ మ్యాప్ తీసుకుచ్చిన ఫ్లస్ కోడ్ అనేది యూనివర్సల్. భూమ్మీద ప్రతీ లొకేషన్, అడ్రస్‌కు ఒక్కో ఫ్లస్ కోడ్ ఉంటుంది. పైగా ఎగ్జాట్‌గా హోం లొకేషన్‌గా సేవ్ అవుతుంది కాబట్టి. ఇది జనరేట్ చేయాలంటే.. యూజ్ యువర్ కరెంట్ లొకేషన్ ద్వారా చేయొచ్చు. సేవ్డ్ ట్యాబ్‌ను కూడా హోం అడ్రస్ కాపీ చేయడానికి, షేర్ చేయడానికి ఉపయోగించొచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కేవలం ఆండ్రాయిడ్ వెర్షన్లలో మాత్రమే ఉంది. కింద వీడియోలో మరింత స్పష్టత రావొచ్చు. -
గూగుల్ కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 30 నుంచి ఆ సేవలు బంద్
పాత సేవలను, పెద్దగా వాడని సర్వీసుల్ని గూగుల్ గత కొంతకాలంగా మూసేస్తూ వస్తుంది. తాజాగా గూగుల్ తన ‘బుక్‌మార్క్స్’ సేవలను కూడా మూసేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబరు 30 నుంచి గూగుల్ బుక్‌మార్క్స్ నిలిపివేస్తున్నట్లు తెలిపింది. గూగుల్ బుక్ మార్క్స్ వెబ్ సైట్ లో దీనికి సంబంధించిన ఒక బ్యానర్ విడుదల చేసింది. ఆ పోర్టల్ లో సెప్టెంబర్ 30 తేదీ తర్వాత ఈ సేవలకు గూగుల్ ఇకపై సపోర్ట్ ఇవ్వదని పేర్కొంది. ఈ సేవలను 2005లో ప్రవేశపెట్టినప్పటి నుంచి సరైన ప్రజధారణ రాకపోవడంతో నిలిపివేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా, గూగుల్ మ్యాప్స్ లో వినియోగదారుల స్టార్ మార్క్ చేసిన ప్రదేశాలు బుక్‌మార్క్స్ షట్ డౌన్ వల్ల ప్రభావితం కాదని గూగుల్ పేర్కొంది. అవసరమైతే ఈ బుక్‌మార్క్స్ ఎక్స్ పోర్ట్ చేసుకోవచ్చు అని తెలిపింది. గూగుల్ బుక్‌మార్క్స్ సర్వీస్ నిలిపివేయడాన్ని తన ట్విటర్ ఖాతా షేర్ చేసింది. గూగుల్ "సెప్టెంబర్ 30, 2021 తర్వాత గూగుల్ బుక్ మార్క్‌లకు ఇకపై సపోర్ట్ ఇవ్వదు" అనే సందేశాన్ని ప్రదర్శించింది. "ఎక్స్ పోర్ట్ బుక్‌మార్క్స్" మీద క్లిక్ చేయడం ద్వారా యూజర్లు తమ బుక్ మార్క్ లను సేవ్ చేసుకోవచ్చు అని కూడా పేర్కొంది. మీకు ఏవైనా బుక్ మార్క్ లు సేవ్ చేయబడ్డాయని చూడటానికి ఇక్కడకు వెళ్లండి. గూగుల్ బుక్ మార్క్స్ సేవ 2005లో ప్రారంభించినప్పుడు ఇది సరికొత్తగా అనిపించింది. వెబ్ సైట్ లో సేవ్ చేయబడ్డ డేటాను సర్చ్ చేయడానికి చాలా ఉపయోగపడింది. యానోటేటింగ్ ఫీచర్లతో పాటు వినియోగదారులు తమ బుక్‌మార్క్స్ ను సేవ్ చేయడానికి ఇది క్లౌడ్ స్టోరేజీ సేవను అందించింది. This September, say goodbye to Google Bookmarks: pic.twitter.com/FUFHre7ydG — Killed by Google 🔪 (@killedbygoogle) July 20, 2021 -
ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్స్..!
సాక్షి, ముంబై: ప్రస్తుత కాలంలో తెలియని ప్రదేశాలకు వెళ్లాలంటే మనం సాధారణంగా గూగుల్ మ్యాప్‌నే నమ్ముకుంటాం..గూగుల్ మ్యాప్స్ వచ్చిన తర్వాత, తక్కువ ట్రాఫిక్ ఉన్న మార్గాలను ఎంచుకోవడం, షార్ట్ కట్స్‌ను తెలుసుకోవడంమే కాదు గూగుల్ మాత ఉందిగా ఎందుకు బెంగ అనేంతగా పరిస్థితి మారిపోయింది. అయితే గ్యూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని తప్పులో కాలేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతూ వెళ్లి ఓ కారు ఏకంగా డ్యామ్‌లోనే పడిపోయిన ఘటన విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, ఒక ప్రైవేట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, పుణెకు చెందిన గురు శేఖర్ (42) మిత్రులతో కలిసి ఫార్చ్యూనర్ కారులో సరదాగా ట్రెక్కింగ్‌కు వెళ్లాలనుకున్నారు. డ్రైవర్ సతీష్, మిత్రుడు సమీర్, మరో వ్యక్తితో కలిసి మహారాష్ట్రలో అత్యంత ఎత్తైన ప్రదేశం కల్సుబాయ్ మీదకు ట్రెక్కింగ్ కోసం వెళ్లారు. మధ్యాహ్నం వేళ అక్కడకు బయలుదేరిన వీళ్లు మధ్యలో దారి తప్పిపోవడంతో గూగుల్ మ్యాప్స్‌ను ఆశ్రయించారు. కానీ దురదృష్టవశాత్తూ అది కూడా రాంగ్ రూట్ చూపించింది గూగుల్. కానీ అది తెలియని వీరు గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతూ పోయారు. చీకటిపడినా గూగుల్ మ్యాప్ చూపిస్తుందన్న ధైర్యంతో ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ఒక డ్యామ్ దగ్గరకు చేరుకున్నారు. చీకట్లో అక్కడ బ్రిడ్జి ఉందనుకుని కారును పోనిచ్చాడు..అంతే కారు క్షణాల్లో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన శేఖర్, సమీర్, మరో వ్యక్తి కారు డోర్లను తీసుకుని ఈదుతూ ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడ్డారు.. కానీ, సతీష్‌కు ఈత రాకపోవడంతో బయటకురాలేక, కారులోనే ప్రాణాలొదిలాడు. మరునాడు సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడికి కొంతదూరంలో కారును పోలీసులు గుర్తించారు. అందులో సతీష్ మృతదేహాన్ని గుర్తించి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. అయితే, అక్కడ బ్రిడ్జి ఉన్న మాట వాస్తవమేనని.. కానీ, అది ఏడాదిలో 8 నెలలు మాత్రమే తెరచి ఉంటుందనిడిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ రాహుల్ మాధ్నే తెలిపారు. మిగతా 4 నెలలు ఆ బ్రిడ్జి పై నుంచి నీటి ప్రవాహం ఉంటుందని చెప్పారు. ఈ బ్రిడ్జికిపైనే పెద్ద డ్యామ్ ఉన్న కారణంగా, నీటిని విడుదల చేసినప్పుడు బ్రిడ్జిమునిగిపోతుందని వెల్లడించారు. ఈ విషయం స్థానికులకు తెలుసు కనుక వారు జాగ్రత్తగా ఉంటారు. కానీ రాత్రి పూట, గూగుల్ డైరెక్షన్ ఆధారంగా వెళ్లి డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారన్నారు. గూగుల్ మ్యాప్‌లను గుడ్డిగా నమ్మితే, కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చని ఈ సంఘటన నిరూపిస్తోంది. సో...తస్మాత్ జాగ్రత్త! -
జీహెచ్ఎంసీ: గ్రేటర్ ఓటర్ల కోసం కొత్త యాప్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఓటర్లకు శుభవార్త. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ ఓటు ఓటు హక్కు వినియోగించుకునే వారు తమ ఓటరు స్లీప్‌తో పాటు పోలీంగ్ బూత్‌ను అరచేతిలోనే తెలుసుకునేందుకు జీహెచ్ఎంసీ కొత్త యాప్‌ను రూపొందించింది. దీంతో మీ స్మార్ట్‌ఫోన్‌లోనే ఒటరు స్లీప్‌తో పాటు, పోలింగ్ కేంద్రం ఎక్కడుందో గూగుల్ మ్యాప్‌తో తెలుసుకునేందుకు జీహెచ్ఎంసీ ఓటర్ల కోసం మైజీహెచ్ఎంసీ యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. ఇప్పటికే నగరంలోని ఓటర్లకు ఓటరు స్లీప్ల పంపిణిని జీహెచ్ఎంసీ చేపట్టింది. అయితే, నగర ఓటర్లలో అధిక శాతం మందికి మొబైల్ ఫోన్లు ఉండడంతో అర చేతిలోనే ఓటరు పోలింగ్ బూత్, ఓటర్ స్లిప్‌ను డౌన్లోడ్ చేసుకునే విధంగా ఈ మొబైల్ యాప్‌ను రూపొందించింది. అయితే అది తెలుసుకోవాలంటే మీ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌లో మైజీహెచ్ఎంసీ యాప్‌ను లౌన్‌లోడ్ చేసుకోవాలి. (చదవండి: ఓటరు కార్డు లేదా.. అయితే ఇవి తెచ్చుకోండి) యాప్‌లోకి వెళ్లి నో-యువర్ పోలింగ్ స్టేషన్ అప్షన్‌పై క్లిక్ చేసి ఓటరు పేరు, వార్డు పేరు ఎంటర్ చేస్తే ఓటరు స్లిప్‌తో పాటు పోలింగ్ బూత్ ఎక్కడుందో గూగుల్ మ్యాప్ లొకేషన్ వస్తుంది. పేరుకు బదులుగా ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్, వార్డు పేర్లు ఎంటర్ చేసినా ఓటర్ స్లిప్, పోలింగ్ కేంద్రం గూగుల్ మ్యాప్‌లో చూపిస్తుంది. ఈ నో-యువర్ పోలింగ్ స్టేషన్ యాప్‌పై చైతన్యం కలిగించేందుకు జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. బస్ షెల్టర్లపైనా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం, ఎఫ్ఎం రేడియోలలో జింగిల్స్ ప్రసారం, టెలివిజన్ చానెళ్లలో స్క్రోలింగ్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే, ఈ యాప్‌పై స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలకు వాట్సాప్ ద్వారా సమాచారం అందిస్తున్నారు. (చదవండి: కేసీఆర్ ‘గ్రేటర్’ సభ : ఎల్బీ స్టేడియం గులాబీమయం) -
కాపురంలో కలతలు.. గూగుల్ మ్యాప్స్పై ఫిర్యాదు
చెన్నై: తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి గూగుల్ మ్యాప్స్ యాప్ కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను వెళ్లని ప్రదేశాలకు వెళ్లినట్లు చూపించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వివరాలు.. మయిలదుత్తురాయిలోని లాల్‌బహదూర్ నగర్‌కు చెందిన ఆర్ చంద్ర శేఖరన్ అనే వ్యక్తి ప్రతి రోజు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే తన భార్య చేతికి ఫోన్ ఇచ్చేవాడు. ఆమె గూగుల్ మ్యాప్స్‌లోని ‘యువర్ టైమ్‌లైన్’ సెక్షన్లోకి వెళ్లి అతడు రోజంతా ఎక్కడ తిరిగింది చెక్ చేసేది. ఈ క్రమంలో ఓ రోజు గూగుల్ మ్యాప్స్ టైమ్‌లైన్‌లో అతడు సందర్శించిన ప్రదేశాలకు బదులు వేరే ప్రాంతాలను చూపించింది. దాంతో భార్యాభర్తల మధ్య గొడవ ప్రారంభమయ్యింది. విసుగు చెందిన చంద్రశేఖరన్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘మే 20 గూగుల్ మ్యాప్ టైమ్‌లైన్‌లో చూపించిన ప్రాంతాలకు నేను ఇంతవరకు వెళ్లలేదు. ఇలాంటి తప్పుడు సమాచారం వల్ల మా కాపురంలో గొడవలు మొదలయ్యాయి. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అని తెలిపాడు. -
వెరైటీ ప్రపోజల్: వెంటనే పెళ్లి కూడా ఖరారు
బెర్లిన్: ప్రేమికుల వారోత్సవం ముగింపు ఘట్టానికి చేరుకుంటోంది. ఇప్పటిదాకా ఒకెత్తు, రేపటి దినం మరో ఎత్తు. ఎన్ని ఇచ్చి పుచ్చుకున్నా, ఒకరి దగ్గర మరొకరు ఎంత గారాలు పోయినా రేపు అసలు పరీక్ష. ఎన్నో రోజుల ఎదురుచూపులకు తెర పడేది అప్పుడే. కాబట్టి ఆ ఒక్కరోజు ప్రేమించేవారి మనసు గెలిచామంటే చాలు.. జీవితాంతం వారితోనే బతికేస్తామంటూ ఊహల్లో బతికేస్తారు చాలామంది. కొందరు ఊహలు నిజమైతే మరికొందరివి మాత్రం పగటి కలల్లాగే మిగిలిపోతాయనుకోండి.. అది వేరే విషయం. అయితే ప్రేమను వ్యక్తపరిచే కళ అందరికీ ఉండదు. ఎన్నెన్నో అనుకున్నా ఎదురుగా ప్రేయసి/ ప్రేమికుడు తారసపడేసరికి మాత్రం నోరు మూగబోతుంది. అందుకే కొందరు నేరుగా కాకుండా మెసేజ్‌లోనో, కాల్ చేసో, ఉత్తరం రాసో, ఫ్రెండ్ ద్వారానో ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు తమ మనసులోని మాటను ఇష్టసఖికి చేరవేస్తారు. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం తను ప్రేమించిన అమ్మాయికి కనీవినీ ఎరుగని రీతిలో ప్రపోజ్ చేసి వార్తల్లో నిలిచాడు.(ప్రేమకు అసలైన నిర్వచనం ప్రేమలేఖలే) జర్మన్‌కు చెందిన స్టీఫెన్ స్క్వార్జ్ తన ప్రేమను గెలిపించుకోడానికి పొలాన్నిమార్గంగా ఎంచుకున్నాడు. పొలంలో మొక్కజొన్న పంటను యంత్రసహాయంతో ఒక క్రమపద్ధతిలో నాటాడు. అది ఏరియల్ వ్యూ ద్వారా చూస్తే ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని జెర్మన్ భాషలో కనిపిస్తుంది. ఇది అక్కడి జనాలను ఎంతగానో అబ్బుపరిచింది. ఈ ప్రపోజల్ సరాసరి గూగుల్ మ్యాప్‌లో ప్రత్యక్షం కావడమే ఈ ఆశ్యర్యానుభూతులకు ప్రధాన కారణం. ఇక అనతికాలంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతమందికి నచ్చాక ప్రేయసి పడిపోకుండా ఉంటుందా.. ఈ స్పెషల్ ప్రపోజల్‌తో అతని ఒళ్లో వాలిపోవడమే కాదు.. ఏకంగా జూన్‌లో పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసేసుకున్నారీ జంట. (కోటి మాటలు ఓ కౌగిలింతకు సరికావు!) చదవండి: గర్భిణీకి కరోనా, మరి శిశువుకు? -
పోల్ చిట్టీయే.. ఓ గూగుల్ మ్యాప్
నల్లగొండ : పోల్ చిట్టీ.. ఓ గూగుల్ మ్యాప్‌లా ఉపయోగపడనుంది. ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల సంఘం ఈసారి వీటి విషయంలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. గతంలో అభ్యర్థులే తమ ఏజెంట్ల ద్వారా పోలింగ్ బూత్‌కు వచ్చే ఓటర్లకు జాబితాలో వారి సంఖ్య చూసి పోల్‌చిట్టీ రాసి ఇచ్చేవారు. దాన్ని తీసుకొని పోలింగ్‌కేంద్రంలోకి వెళ్లి ఓటు వేసేవారు. కానీ ఈసారి ఎన్నికల సం ఘం పోల్ చిట్టీలను ముద్రించి నేరుగా ఓటర్ ఇంటికి వెళ్లి అందజేసే కార్యక్రమాన్ని చేపట్టింది. శుక్రవారం జిల్లావ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం మొదలైంది. చిట్టీమీద ఫొటోతోపాటు ఓటరు జాబితాలో ఉన్న ఐడీ నంబర్, వెనకాల తన ఓటు ఏ పోలింగ్ కేం ద్రంలో ఉంది.. ఆ కేంద్రం ఎక్కడ ఉంది.. ఏ దారిగుండా, ఏ దిక్కు కు వెళ్లాలి అనేది సవివరంగా ముద్రించింది. ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయంతో ఓటర్లకు ఓటు వేయడం సులభమవుతుంది. చిట్టీల పంపిణీ ప్రారంభం.. జిల్లాలోని 6 నియోజకవర్గాల పరిధిలో 12,87,370 మంది ఓటర్లు ఉండగా, 1,629 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ప్రతి ఓటరుకు పోల్ చిట్టీలను పంపిణీ చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి బీఎల్ఓలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆరు నియోజకవర్గాల పరిధిలో గురువారం పోల్ చిట్టీల పంపిణీని ప్రారంభించారు. గుర్తింపు కార్డులా పోల్ చిట్టీ. గతంలో పోల్ చిట్టీ తెల్లకాగితంమీద రాసిచ్చేవారు. ఇప్పుడు అలా కాదు. ఓటరు ఫొటోతో పాటుపేరు, ఎపిక్ నంబర్, పోలింగ్ కేంద్రం నంబర్ కూడా ఉంటుండడంతో ఇదో గుర్తింపు కార్డు మాదిరిగా అయ్యింది. గతంలో ఓటు వేసేందుకు ఓటర్ ఐడీకార్డు లేనివారు రేషన్ కార్డో.. డ్రైవింగ్ లైసెన్సో, బ్యాంక్ పాస్‌బుక్కో తీసుకొనివెళ్లి చూపించాల్సి ఉండేది. ప్రస్తుతం అవేవీ అవసరం లేదు. ఒక్క పోటీ చిట్టీ ఉంటే సరిపోతుంది. సమయం ఆదా.... అన్ని గుర్తింపులు ఉన్న పోల్ చిట్టీ ముద్రించడం వల్ల పోలింగ్ త్వరితగతిన పూర్తి కావడంతోపాటు ఓటరు ఓటు వేసే సమయం ఆదా అవుతుంది. చిట్టీ పట్టుకుని నేరుగా వెళ్లి పోలింగ్ అధికారికి చూపిస్తే దానిపై ఉన్న నంబర్ ఆధారంగా ఓటర్ల జాబితాలోని నంబర్‌తో సరిచూస్తారు. ఫొటో కూడా చెక్చేస్తారు. ఆ ఓటరు నిజమైన ఓటరా... కాదా అనేది తేలిపోతుంది. ఓటరును గుర్తించడం అక్కడున్న పార్టీ ఏజెంట్లకు కూడా సులభతరం అవుతుంది. బోగస్ ఓట్లకు తావుండదు .. పోల్ చిట్టీపై అన్ని వివరాలు ఉంటుండడంతో బోగస్ ఓట్లు వేసేందుకు తావుండదు. గతంలో ఇలాంటి పోల్‌చిట్టీలు లేకపోవడం వల్ల ఎవరైనా ఓటు వేయకపోతే ఇతనే ఆ ఓటరు అంటూ వేరేవారితో ఓటు వేయించిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. ఏజెంట్లు గుర్తుపట్టిన సందర్భాల్లో గొడవలు జరిగేవి. ఇలాంటి సంఘటనలకు చెక్‌పెట్టేందుకే ఎన్నికల కమిషన్ ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. పార్టీ ఏజెంట్లకు తప్పినతిప్పలు.. ఓటర్లను గుర్తు పట్టేందుకు ఆయా పార్టీల ఏజెంట్లు ఎన్నో తిప్పలు పడేవారు. ఏజెంట్లు ఆయా పోలింగ్ బూత్‌ల పరిధిలో ఉండే అందరి ఓటర్లను గుర్తు పట్టాలని ఏమీ ఉండదు. ఇప్పుడు పోల్‌చిట్టీమీద ఓటరు ఫొటోతోపాటు అతని పేరు, తండ్రిపేరు ఉండడం వల్ల పార్టీనేతలు కూడా ఫలానా ప్రాంతానికి చెందిన వ్యక్తి అని గుర్తించడం ఈజీగా మారింది. దీంతో ఏజెంట్లకు కూడా తిప్పలు తప్పాయి. -
ఉబెర్‌కు షాకిచ్చిన గూగుల్
శాన్ ఫ్రాన్సిస్కో: ఆన్లైన్ క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్‌కు గూగుల్మాప్స్ ద్వారా అనూహ్య పరిణామం ఎదురైంది. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకునే సదుపాయాన్ని రద్దు చేసింది. ఎలాంటి ముందస్తు హెచ్చరిక, కారణం చెప్పకుండానే ఉబెర్ రైడ్ బుకింగ్ సేవలను తొలగించింది. డైరెక్ట్‌గా గూగుల్ మ్యాప్ ద్వారా క్యాబ్‌ను బుక్ చేసుకోలేరని సోమవారం గూగుల్ ప్రకటించినట్టు తెలుస్తోంది. గూగుల్ తన హెల్ప్‌లైన్ పేజీలో ఈ మేరకు సూచించిందని ఆండ్రాయిడ్ పోలీస్ నివేదించింది. అయితే ఉబెర్ యాప్‌లో రూటు చూడడం, రైడ్ రిక్వెస్ట్ లాంటివి చేసుకోవచ్చని తెలిపింది. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకునే సదుపాయాన్ని గత ఏడాది జనవరిలో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఉబెర్ అఫీషియల్ యాప్‌తో సంబంధం లేకుండా.. నేరుగా గూగుల్ మ్యాప్స్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కస్టమర్లకు అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై అటు గూగుల్ కానీ, ఇటు ఉబెర్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
‘అడ్రస్’ మెట్రోనే చెబుతుంది!
పిల్లర్లకు ప్రత్యేక సంఖ్యల కేటాయింపు - దీంతో చిరునామా గుర్తింపు సులభతరం - గూగుల్ మ్యాప్, జీపీఎస్‌లతో అనుసంధానం సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు రాకతో ప్రయాణం సులభమవడమే కాదు... నగరంలోని చిరునామాలు కూడా సులువుగా గుర్తించేలా అడుగులు పడుతున్నాయి. మెట్రో రైలు పిల్లర్లకు ఆల్ఫాన్యూమరిక్‌తో పాటు ప్రత్యేక సంఖ్యలు కేటాయించి.. గూగుల్ మ్యాప్, గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ (జీపీఎస్)లతో అనుసం«ధానించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో నగరవాసులతో పాటు కొత్తగా వచ్చిన వారు ఎవరైనా మెట్రో పిల్లర్పైనున్న నంబర్ ఆధారంగా అడ్రస్సు సులువుగా కనుగొనే అవకాశం కలుగుతుంది. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయానికి మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ వరకు నిర్మించిన 11.6 కిలోమీటర్ల పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేలో పిల్లర్లకు నంబర్లు కేటాయించారు. దీంతో ఆ మార్గంలో చాలా మంది చిరునామాలు చెప్పాలంటే పిల్లర్ల సంఖ్య చెబుతుంటారు. దీనివల్ల అడ్రస్ పట్టుకోవడం సులువైంది. ఇదే విధానం మెట్రో రైలు మార్గంలోని పిల్లర్లకూ అన్వయించనున్నారు. ఆదివారం మెట్రో రైలు భవన్లో హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. వివిధ రోడ్లు, ప్రాంతా లు, సమీపంలోని కాలనీలకు వెళ్లే మార్గాలను సూచించేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. అలాగే... కారిడార్–1 (మియాపూర్–ఎల్బీనగర్ మార్గం)ను ‘ఏ’గా... కారిడార్–2 (జేబీఎస్–ఫలక్‌నుమా)ని ‘బీ’గా... కారిడార్–3 (నాగోల్–రాయదుర్గం)ని ‘సీ’గా పేర్కొంటూ మెట్రో పిల్లర్లకు ప్రత్యేక సంఖ్యలు కేటాయించనున్నారు. ఉదాహరణకు మియాపూర్–ఎల్బీనగర్ మార్గంలో కారిడార్ ప్రారంభమయ్యే మియాపూర్ స్టేషన్ వద్ద పిల్లర్‌కు ‘ఏ1’నంబర్‌ను కేటాయిస్తారు. అదే మార్గంలో అమీర్‌పేట స్టేషన్ వద్ద పిల్లర్‌ను ఏ450గా పేర్కొంటారు. ఎంజీబీఎస్–ఫలక్నుమాను కలుపుకుని ఉన్న మూడు కారిడార్లలో 2,748 పిల్లర్లున్నాయి. స్టేషన్ల వద్ద గేట్ నంబరింగ్... ప్రతి మెట్రో స్టేషన్లో నాలుగు ఎంట్రీలు, ఎగ్జిట్లు ఉంటాయి. ఉదాహరణకు అమీర్‌పేట స్టేషన్లో అమీర్‌పేట గేట్ 1, అమీర్‌పేట గేట్ 2 అని ఉంటుంది. జపాన్‌లోని టోక్యో లాంటి నగరాల్లో అంకెలతో ఉన్న గేట్లు వివిధ వేదికలు, ప్రాంతాలు, కార్యాలయాలకు మార్గాలు చూపెడతాయి. ఈ నంబరింగ్ వల్ల ప్రతి ఒక్కరూ సరైన ప్రాంతానికి చేరుకోగలుగుతారు. మెట్రో స్టేషన్లకు వచ్చే మార్గాలు, సమీప ప్రాంతాలకు వెళ్లే మార్గాల వివరాలు తెలిసేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శిస్తారు. సూచనలుంటే పంపించండి.. ‘విజిటర్ ఫ్రెండ్లీ సిటీ’గా హైదరాబాద్‌ను మార్చేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వాగతిస్తున్నామని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రజల సూచనలను హెచ్ఎంఆర్ఎల్ వెబ్సైట్లో పోస్టు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎంఆర్ఎల్, ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్ ఉన్నతాధికారులు శివానంద్ నింబర్గి, అలని కుమార్ సైనీ, రాజీవ్ అయ్యర్, డీవీఎస్ రాజు, వినోద్ కుమార్, విష్ణువర్ధన్ రెడ్డి, బీఎన్ రాజేశ్వర్ పాల్గొన్నారు. -
గూగుల్ మ్యాప్స్ ప్రామాణికం కావు
- భారత సర్వేయర్ అడిషనల్ జనరల్ వీపీ శ్రీవాస్తవ సాక్షి, న్యూఢిల్లీ : గూగుల్ మ్యాప్‌లు ప్రామాణికం కాదని, వాటిని ప్రభుత్వం తయారు చేయలేదని భారత సర్వేయర్ అడిషనల్ జనరల్ వీపీ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. భారత సర్వేవిభాగం తయారుచేసిన మ్యాప్‌లనే నేటికీ సదుపాయాల కల్పన కోసం వినియోగిస్తున్నామని చెప్పారు. శనివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చాలామంది చిన్న చిన్న వాటికోసమే గూగుల్ మ్యాప్‌లను చూస్తున్నారని, భారత సర్వేవిభాగం తయారుచేసే మ్యాప్‌లు అన్నింటికీ ఉపయోగపడుతాయని చెప్పారు. సర్వే విభాగానికి చెందిన నైసర్గిక స్వరూపాలను తెలిపే మ్యాప్‌లు కచ్చితత్వాన్ని కలిగి ఉంటాయని, కొత్త రైలు మార్గాలు, కాల్వల పనులు చేపట్టేందుకు ఇవి ఉపయోగపడుతాయన్నారు. భారత రాజ్యాంగం మొదటి కాపీని, మొదటి తపాలా స్టాంపునకు సర్వే ఆఫ్ ఇండియా ప్రత్యేక గౌరవం కల్పించిందని కేంద్రమంత్రి మనోజ్ సిన్హా అన్నారు. సరైనవిధంగా సర్వే, మ్యాప్‌లను చేపట్టాకే ఏ అభివృద్ధి పనులైనా చేపట్టాలని పేర్కొన్నారు. -
ఈ యాప్ ఎస్సై పరీక్ష కేంద్రానికి దారి చూపుతుంది
‘ఫైండ్ మి@యాప్’ను ఆవిష్కరించిన డీజీపీ అనురాగ్ శర్మ సాక్షి, హైదరాబాద్: ఎస్సై పరీక్షలు రాసే అభ్యర్థులకు పరీక్ష కేంద్రం వివరాలు, అక్కడికి చేరుకోవడానికి సులువైన దారి తెలుసుకునేందుకు ‘ఫైండ్ మి@యాప్’ ఉపయోగపడుతుందని డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. జేఎన్టీయూహెచ్ సహకారంతో టీహబ్ స్టార్టప్‌లోని యాప్ స్పేస్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూపొందించిన ఈ యాప్‌ను డీజీపీ కార్యాలయంలో అనురాగ్‌శర్మ బుధవారం ఆవిష్కరించారు. ఐ ఫోన్‌తో పాటుగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ఈ యాప్ లభ్యమవుతుందని, ఈ ఫోన్లు లేనివారు ‘వే టు ఎస్ఎంఎస్’ ద్వారా వివరాలు పొందవచ్చని తెలిపారు. దీనికోసం 9222273310కు హాల్‌టికెట్, రిజిస్ట్రేషన్ నంబర్లు ఎస్ఎంఎస్ చేయాలన్నారు. ఎస్సై పరీక్షల కోసం ఏర్పాటుచేసిన 350 కేంద్రాల్లో 310కేంద్రాల వివరాలు గూగుల్ మ్యాప్‌లోనూ అందుబాటులో ఉంటాయన్నారు. ఒకరిబదులు మరొకరు పరీక్ష రాస్తే క్రిమినల్ చర్యలతో పాటు శిక్ష కూడా తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు.. ఈ నెల 17న జరిగే ఎస్సై పరీక్షకు అభ్యర్థులను గంట ముందుగానే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని, అయితే నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించరని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ డాక్టర్ పూర్ణచంద్రరావు తెలిపారు. అభ్యర్థులను ఎలక్ట్రానిక్ వస్తువులతో పరీక్ష హాల్లోకి అనుమతించరని, చేతి గడియారం కూడా తీసుకురావద్దని సూచించారు. కేవలం బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్, హాల్‌టికెట్, పూర్తిచేసిన ఆన్లైన్ అప్లికేషన్, పాస్‌పోర్టు ఫొటో, అభ్యర్థి ఐడీ ప్రూఫ్ తెలిపే ఆధార్, పాన్‌కార్డ్, డ్రైవింగ్ లెసైన్స్ మాత్రమే అనుమతిస్తారని చెప్పారు. కార్యక్రమంలో అదనపు డీజీపీ సుదీప్ లక్టాకియా, ఐజీ నవీన్ చంద్, జేఎన్టీయూ కో ఆర్డినేటర్ ఫ్రొఫెసర్ ఎన్వీ రమణరావు, మొబైల్ యాప్ ఎండీ రాజీవ్ పాల్గొన్నారు. -
'యాంటి నేషనల్' వివాదంలో గూగుల్
న్యూఢిల్లీ : సెర్చ్ఇంజిన్ దిగ్గజం గూగుల్ యాంటీ నేషనల్ వివాదంలో చిక్కుకుంది. ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి తన గూగుల్ మ్యాప్ అప్లికేషన్ లో 'యాంటీ నేషనల్' ట్యాగ్ జోడించి చిక్కుల్లో పడింది. ప్రపంచంలో అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ లో ఇలాంటి తప్పిదం చోటు చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఒకవైపు జెఎన్ యూ విద్యార్థులందరినీ దేశ ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వామపక్ష పార్టీలు ఆరోపిస్తోంటే గూగుల్ మ్యాప్ వ్యవహారం చర్చకు దారి తీసింది. గూగుల్ మ్యాప్ అప్లికేషన్ లో యాంటి నేషనల్ ట్యాగ్ తో సెర్చ్ చేసినపుడు జెఎన్ యూ, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ రెండూ ప్రముఖంగా కనిపించడం గమనార్హం. అయితే ఇది కంప్యూటర్ నెటవర్క్ తప్పిదమని, కావాలని చేసింది కాదని సైబర్ లా నిపుణుడు పవన్ దుగ్గల్ అభిప్రాయపడ్డారు. కాగా ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరికి నిరసిస్తూ ఫిబ్రవరి 9న వర్సీటీలో ర్యాలీ వివాదానికి దారి తీసింది. ఈ సందర్భంగా విద్యార్థి నేత కన్హయ్య కుమార్ తదితరులపై కేసులు, బెయిల్ నేపథ్యంలో వర్సిటీలో పరిస్థితులు కాస్తంత కుదుటపడుతున్న తరుణంలో గూగుల్ మ్యాపుల్లో జేఎన్‌యూ వర్సిటీకి యాంటి నేషనల్ ట్యాగులు కనిపించడం పలువురిని ఆశ్చర్యానికి లోను చేసింది. దీనిపై గూగుల్ ఎలా స్పందించనుందో వేచి చూడాలి. -
చల్.. చల్.. లే చల్..
మనకు తెలియని కొత్త ప్రదేశానికి వెళ్లాలి.. సెల్ఫోన్లో జీపీఎస్ ఆధారంగా రూటు కనుక్కుని వెళ్లిపోతాం. జీపీఎస్ లేకుంటే.. అందరినీ రూటు అడిగి.. పోతాం. ఇకపై ఈ రెండింటి అవసరం లేదు. ఇకపై మీ షూయే మీకు రూటు చూపెడుతుంది. చిత్రంలోని బూట్లు అలాంటివే. పేరు లే చల్(అంటే తీసుకెళ్లు అని అర్థం). ఇలాంటి హైటెక్ షూల సృష్టికర్తలు విదేశీయులు కారు.. మనోళ్లే. అదీ ఓ హైదరాబాదీ కంపెనీ వీటిని తయారుచేయడం విశేషం. చిత్రంలోని క్రిస్పియన్ లారెన్స్, అనిరుధ్ శర్మలు 2011లో హైదరాబాద్‌లో డ్యూసీర్ టెక్నాలజీస్‌ను స్థాపించారు. బ్లూటూత్‌తో లింక్ అయిఉండే ఈ షూలు.. లేచల్ యాప్ ఆధారంగా పనిచేస్తాయి. ఈ యాప్‌ను మనం డౌన్లోడ్ చేసుకుంటే.. ఇందులో అడ్రస్ లోడ్ చేస్తే.. గూగుల్ మ్యాప్‌ల ఆధారంగా అడ్రస్‌ను కనిపెడుతుంది. మనం నడుస్తున్నప్పుడు ఒకవేళ కుడి వైపునకు తిరగాలంటే.. కుడి కాలికి వేసుకున్న షూ వైబ్రేట్ అవుతుంది. అదే ఎడమ వైపునకు తిరగాలంటే.. ఎడమ కాలి షూ వైబ్రేట్ అవుతుందన్నమాట. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్లయిన లారెన్స్, శర్మలు తొలుత వీటిని అంధుల కోసం రూపొందించారట. ఈ షూలు దారిని కనుక్కోవడానికి ఉపయోగపడటంతోపాటు వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్లుగానూ పనిచేస్తాయి. అంటే.. మనం ఎంత దూరం నడిచాం.. ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయి వంటి వివరాలను తెలుపుతాయన్నమాట. ప్రస్తుతం ఈ కంపెనీ ప్రీ ఆర్డర్లను తీసుకుంటోంది. సెప్టెంబర్‌లో దీని ఆవిష్కరణ అనంతరం ప్రపంచవ్యాప్తంగా వీటిని సరఫరా చేసేందుకు సిద్ధమవుతోంది. వీటి ధర రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకూ ఉండొచ్చు. -
ఇసుకాసురులు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నక్కవాగులో దొంగలు పడ్డారు...ఇష్టానుసారం తవ్వేసుకుంటున్నారు. ఈ ఇసుక మాఫియా దెబ్బకు నక్కవాగు రూపమే మారిపోయింది. పటాన్చెరు మండలం కంజెర్ల నుంచి మొదలు కొని సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ఖాన్ పేట వరకు చొరబడిన అక్రమార్కులు వాగును తోడేశారు. దాదాపు 10 కిలోమీటర్ల మేరకు వాగును పూర్తిగా ధ్వంసం చేశారు. అంతటితో ఆగక వాగుకు ఇరువైపులా ఉన్న ప్రైవేటు భూముల్లో ఇసుక మేటలు ఉన్నంత వరకు కొనుగోలు చేసి ఇసుకను తోడేస్తున్నారు. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ అక్రమ తవ్వకాలతో నక్కవాగు నామరూపాలు లేకుండా పోయింది. గూగుల్ చిత్రంలో పరిశీలిస్తే 10 ఏళ్ల కిందట గలగల సెలయేటీ నీళ్లతో పారిన నక్కవాగుకు ఇప్పుడు మాఫియా చేతిలో పడి ఉనికే కోల్పోయింది. ఈ వాగులో ఇసుక మొత్తం తోడేసిన అక్రమార్కులు తాజాగా వాగు గర్భంలోని మట్టిని తోడి...అదే వాగు నీళ్లతో ఫీల్టర్ చేసి ఇసుకను తీసి అమ్ముతున్నారు. అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న ఈ వ్యవహారం అంతా రెవిన్యూ అధికారులు, పోలీసుల అండతోనే సాగుతోంది. రోజుకు కనీసం 1000 ట్రాక్టర్ల ఇసుక సంగారెడ్డి పోలీసు స్టేషన్ ముందు నుంచి కలెక్టరేట్ మీదుగా హైదరాబాద్‌కు వెళ్లిపోతోంది. ఏ ఒక్క అధికారి కూడా ఇసుక లారీలను ఆపేందుకు ప్రయత్నించడం లేదు. ఇసుక ‘రవ్వలు’ కంట్లో పడతాయని సారోళ్లంతా కళ్లు మూసుకుంటున్నారు. కళ్లు తెరిచే సరికి కాసుల గలగలలు కనిపిస్తున్నాయి. అందుకే ఇసుక దందా మూడుపువ్వులు ఆరు కాయలుగా నిరాటంకంగా సాగుతోంది. గ్రామ పంచాయతీల పేర నకిలీ వే బిల్లులు కొందరు వ్యక్తులు అక్రమ ఇసుక దందాను తమకు ఆదాయంగా మలుచుకుంటున్నారు. ఇసుక రవాణా అడ్డుకోవాల్సిందిగా పోయి నకిలీ వే బిల్లులు ముద్రించి ప్రతి ఇసుక వాహనం నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామాల అభివృద్ధి పనుల పేరిట ఇసుక ఫిల్టర్ యాజమాన్యాలకు కొన్ని పంచాయతీలను వేలం వేసి మరీ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో మండలంలోని ఎనిమిది గ్రామాల పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమ తవ్వకాల కారణంగా భూగర్భ జలమట్టాలు తగ్గుముఖం పట్టడంతోపాటు భవిష్యత్‌లో పర్యావరణం దెబ్బతినే ప్రమాదం కనిపిస్తున్నా, అక్రమ తవ్వకాలు మాత్రం ఆగటం లేదు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అడ్డుకోవాల్సిన మైనింగ్, రెవెన్యూ అధికారులు మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వే బిల్లులు లేకుండా ఇసుక అక్రమ రవాణ సాగుతున్నా, అధికారులు పట్టించుకోవటంలేదు. జిల్లా కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులు ఉండే సంగారెడ్డి ప్రాంతంలోనే అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయవచ్చు. వందల అడుగల మేర గుంతలు నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వేస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు కొందరు అక్రమార్కులు. కాసులకు కక్కుర్తి పడిన అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ఇసుక ఫిల్టర్ల నిర్వాహణ నిరాటంకంగా కొనసాగుతుంది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలోనే నక్కవాగుకు ఇరువైపుల వెలిసిన ఇసుక ఫిల్టర్లు రాత్రింబవళ్లు నడుస్తున్నాయి. మండలంలోని ఆరుట్ల, చిద్రుప్ప, బేగంపేట్, ఎర్దనూర్, బ్యాతోల్, గౌడిచర్ల, ఇస్మాయిల్ఖాన్పేట్తో పాటు హత్నూర మండలం గుండ్లమాచ్నుర్ శివారులో కూడా ఇసుక ఫిల్టర్లు నిర్వహిస్తున్నారు. వాగు చుట్టూ సుమారు 100 వరకు ఇసుక ఫిల్టర్లు రాత్రీపగలు తేడా లేకుండా నడుపుతూ నిర్వాహకులు లక్షలాది రూపాయలు ఆర్జిస్తూ ప్రభుత్వ నిబంధనలన్నింటిని పక్కన పెడుతున్నారు. ఇసుక తవ్వకాల కారణంగా ఆయా గ్రామ శివారులోని భూముల్లో వందల అడుగల మేర పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. దీంతో ఈ గుంతలు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. గుట్టలుగా ఇసుక డంపింగ్‌లు రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇసుకాసురులు పెద్ద మొత్తంలో ఇసుక నిల్వ చేస్తున్నారు. ఫిల్టర్లు నిర్వహిస్తున్న ప్రాంతాలకు సమీపంలో గుట్టల మాదిరాగా వేలాది టన్నుల ఇసుకను పోగు చేస్తున్నారు. ప్రొక్లయిన్లతో తవ్విన మట్టిని నక్కవాగు నీటితో కడిగి ఫిల్టర్ చేస్తున్నారు. తయారైన ఇసుకను లారీలు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ప్రతీ రోజు వందలాది లారీలు ఫిల్టర్ ఇసుకను హైదరాబాద్, జహీరాబాద్, పటాన్ చెరు, సంగారెడ్డి, సదాశివపేట తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఫిల్టర్ల ద్వారా తయారైన ఇసుక విలువ లక్షల్లో ఉంటోంది. సులువుగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో చాలా మంది అక్రమార్కులు అధికారులకు మస్కా కొట్టి చీకటి వ్యాపారాన్ని దర్జాగా కొనసాగిస్తున్నారు. ఇదంతా బహిరంగాగనే కనిపిస్తున్నా రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇసుక తవ్వకాల వల్ల ఇస్మాయిల్ఖాన్ చుట్టు పక్కల గ్రామాల్లో భూగర్బ జలాలు తగ్గుముఖం పడుతున్నాయి. అలాగే నక్కవాగు రూపు కోల్పోతుంది. వాగు పరివాహక ప్రాంతంలో వ్యవసాయం చేయలేని పరిస్థితి నెలకొంటోంది.