గూగుల్ మ్యాప్స్‌లో ఏఐ.. ఎలా పనిచేస్తుందంటే..? | Top 5 AI Powered Google Maps And Details | Sakshi
Sakshi News home page

గూగుల్ మ్యాప్స్‌లో ఏఐ.. ఎలా పనిచేస్తుందంటే..?

Published Thu, Jul 4 2024 1:54 PM | Last Updated on Thu, Jul 4 2024 2:59 PM

Top 5 AI Powered Google Maps And Details

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో న్యావిగేషన్ చాలా సులభమైపోయింది. ఇది (న్యావిగేషన్) కేవలం స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే కాకుండా బైకులు, కార్లలో కూడా అందుబాటులోకి వచ్చేసింది. దీంతో కొత్త ప్రాంతాలకులు వెళ్లాలన్నా గూగుల్ మ్యాప్ ఆన్ చేసి ఎంచక్కా వెళ్లిపోతున్నారు. దీనికి ఏఐ తోడైతే.. యూజర్ మరింత గొప్ప అనుభూతిని పొందవచ్చు. ఈ కథనంలో ఏఐ బేస్డ్ గూగుల్ మ్యాప్స్ గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.

మరింత వివరంగా సెర్చ్‌ చేసేలా..
సాధారణంగా గూగుల్ మ్యాప్ అనగానే ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి దారి చూపిస్తుందని తెలుసు. కానీ కొత్త ఏఐ ఆధారిత కన్వర్జేషనల్‌ సెర్చ్ ద్వారా మరింత వివరణాత్మకమైన శోధన సాధ్యమవుతుంది. మనం వెళ్లాల్సిన ప్రాంత్రాలను టెక్ట్స్‌, వాయిస్‌ రూపంలో అందిస్తే ఏఐ సహాయంతో లోకేషన్‌ను చూపిస్తుంది. పిల్లలకు ఇష్టమైన ప్రదేశాలు ఎక్కడున్నాయి, సమీపంలోని క్రీడా ప్రదేశాలు ఏవి అనే వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇందులో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు.

3డీ వ్యూ
ఈ రకమైన గూగుల్ మ్యాప్ సాయంతో 3డీ నమూనాలతో ఏదైనా స్థానాన్ని (ప్లేస్) కనుక్కోవచ్చు. ఇందులో లైవ్ ట్రాకింగ్, వాతావరణ అప్డేట్స్, ట్రాఫిక్ వంటి వాటిని తెలుసుకోవచ్చు. కొత్త ప్రదేశాలకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ 3డీ వ్యూ అనేది చాలా ఉపయోగపడుతుంది.

లైవ్ వ్యూ
గూగుల్ మ్యాప్ లైవ్ వ్యూ ఫీచర్ ద్వారా ఏటీఎమ్, రెస్టారెంట్‌లు, పార్కులు, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ వంటివి కూడా కనుగొనవచ్చు. కెమెరా ఆన్ చేసిన తరువాత సమీపంలో ఉన్న ఈ స్థలాలను తెలుసుకోవచ్చు. అంతే కాకుండా అవి ఎంతసేపు అందుబాటులో ఉంటాయి (పని గంటలు), రేటింగ్ ఏంటి అనే వివరాలు కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు.

ఫోటోల ద్వారా సెర్చ్
ఇప్పటి వరకు గూగుల్ మ్యాప్ ద్వారా ప్రదేశాలను సెర్చ్ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు సెర్చ్ విత్ ఫోటోస్ ద్వారా ప్రదేశాలను తెలుసుకోవచ్చు. ఇందులో మీరు ఎక్కువ ఫోటోలను ఉపయోగించి ప్రదేశాలను కనుగొనవచ్చు. అయితే ఒక ల్యాండ్‌మార్క్ కనుక్కోవడానికి ఈ ఫీచర్ చాలా మంచి అనుభవాన్ని ఇస్తుంది.

మ్యాప్స్‌లో లెన్స్ ఉపయోగించడం
సమీపంలోని ఏటీఎమ్, రెస్టారెంట్‌లు, కాఫీ షాపులు, స్టోర్‌ల వద్ద మీ కెమెరాను చూపడం ద్వారా లొకేషన్ గురించి వివరణాత్మక సమాచారాన్ని కనుగొనవచ్చు. ఈ ఫీచర్ కొత్త ప్రాంతాలను అన్వేషించడానికి.. వాటి గురించి తెలుసుకోవడానికి చాలా ఉపయోకరంగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement