
చెన్నై: తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి గూగుల్ మ్యాప్స్ యాప్ కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను వెళ్లని ప్రదేశాలకు వెళ్లినట్లు చూపించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వివరాలు.. మయిలదుత్తురాయిలోని లాల్‌బహదూర్ నగర్‌కు చెందిన ఆర్ చంద్ర శేఖరన్ అనే వ్యక్తి ప్రతి రోజు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే తన భార్య చేతికి ఫోన్ ఇచ్చేవాడు. ఆమె గూగుల్ మ్యాప్స్‌లోని ‘యువర్ టైమ్‌లైన్’ సెక్షన్‌లోకి వెళ్లి అతడు రోజంతా ఎక్కడ తిరిగింది చెక్ చేసేది. ఈ క్రమంలో ఓ రోజు గూగుల్ మ్యాప్స్ టైమ్‌లైన్‌లో అతడు సందర్శించిన ప్రదేశాలకు బదులు వేరే ప్రాంతాలను చూపించింది. దాంతో భార్యాభర్తల మధ్య గొడవ ప్రారంభమయ్యింది.
విసుగు చెందిన చంద్రశేఖరన్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘మే 20 గూగుల్ మ్యాప్ టైమ్‌లైన్‌లో చూపించిన ప్రాంతాలకు నేను ఇంతవరకు వెళ్లలేదు. ఇలాంటి తప్పుడు సమాచారం వల్ల మా కాపురంలో గొడవలు మొదలయ్యాయి. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment