ఆధునిక కాలంలో టెక్నాలజీ వేగంగా పరుగులు పెడుతోంది. కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే చేతిలో స్మార్ట్‌ఫోన్ లేదా జిపిఎస్ నావిగేషన్‌కి సపోర్ట్ చేసే ఏదైనా పరికరం ఉండే చాలు. అయితే ఈ టెక్నాలజీ కొన్ని సార్లు ప్రమాదంలోకి నెట్టి వేస్తుంది. అలాంటి సంఘటన ఇటీవల ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, ఇటీవల వెల్లడైన ఒక వీడియో హవాయిలోని హోనోకోహౌ హార్బర్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక కారు ఏకంగా సముద్రపు నీటిలోకి దూసుకెళ్లడం, అందులో ఒక మహిళ ఉండటం చూడవచ్చు. అయితే చివరికి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, కానీ కారు నీటిలోకి వెళ్లడం వల్ల అందులో ఏదైనా సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.
ఇందులో కనిపించే కారుని డ్రైవ్ చేస్తున్న మహిళ జిపిఎస్ నమ్ముకుని కారుని డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే అక్కడ సమీపంలో ఉన్న కొంత మంది ఈ సంఘటన గమనించి ఆమెను రక్షించారు. కాబట్టి ఎవరికీ ఎటువంటి హాని జరగకుండా ప్రాణాలతో బయటపడగలిగారు. ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటి సారి కాదు.
(ఇదీ చదవండి: రూ. 2.5 కోట్ల ఉద్యోగం వద్దనుకున్నాడు.. ఇప్పుడు కోట్లలో టర్నోవర్ - ఎవరీ కన్హయ శర్మ?)
గతంలో ఒక వ్యక్తి జిపిఎస్ నమ్ముకుని అడవిలో చిక్కుకుని నానా అగచాట్లు పడ్డాడు. ఇంకో సంఘటనలో కొంత మంది ప్రాణాలే కోల్పోయారు. కావున జిపిఎస్ అన్ని వేళలా గమ్యాన్ని చేరుస్తాయని నమ్ముకోకూడదు, కావున కొత్త ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మీకు అందుబాటులో ఉన్న వ్యక్తుల సలహాలు కూడా తీసుకోవడం మంచిది. ఆలా కాకుండా సొంత తెలివితేటలు నమ్ముకుంటే అనుకోని ప్రమాదాలను ఆహ్వానించినవారవుతారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment