సాక్షి, హైదరాబాద్: విత్తనోత్పత్తికి సాంకేతికతను విరివిగా వియోగించుకోవాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి అన్నారు. జీపీఎస్, డ్రోన్, జియో ట్యాగింగ్, బార్ కోడెడ్ సాంకేతికతను ఉపయోగించి విత్తనోత్పత్తి చేయడం ద్వారా మార్కెట్‌లో కల్తీ విత్తనాలకు అడ్డుకట్ట వేయొచ్చని పేర్కొన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారి రైతులు లాభపడాలంటే విత్తనాల ఎంపిక కీలకమన్నారు. రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన ‘ఇండో–జర్మన్ ప్రాజెక్టు ప్లానింగ్’ వర్క్ షాపులో ఆయన ప్రసంగించారు. ఇప్పటికే విత్తనోత్పత్తి, విత్తన ధ్రువీకరణలో తెలంగాణ మోడల్‌గా నిలిచిందని, దేశానికి కావాల్సిన విత్తనాల్లో 60 శాతం రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్నా యని తెలిపారు. 400 విత్తన కంపెనీలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉండటంతో విత్తన ప్రాసెసింగ్, నిల్వ పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. దేశాల మధ్య విత్తన ఎగుమతి, వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రమోషన్ కౌన్సిల్‌ను ఏర్పా టు చేయాలని వివరించారు. యూరోపియన్ దేశాలకు కూడా విత్తన ఎగుమతులను ప్రోత్సహించవచ్చన్నారు. మార్కెట్‌లో కల్తీ విత్తనాలు సరఫరా చేస్తున్నవారిపై విత్తన చట్టం ప్రకారం తక్కు వ జరిమానా, శిక్షలు పడుతున్నాయని, విత్తన చట్టం లో మార్పులు చేయాలని అభి ప్రాయపడ్డారు. రాజేం ద్రనగర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇస్టా విత్తనపరీక్ష ల్యాబ్ త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కోటేశ్వర్ రావు, ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ సౌమిని సుంకర, జర్మన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
రైతు బీమా కింద రూ.338 కోట్లు అందజేత..
రైతు బీమా కింద ఇప్పటివరకు రూ.338.75 కోట్లు జమ చేసినట్లు పార్థసారథి పేర్కొన్నారు. రైతుల నామినీల బ్యాంకు ఖాతాకు 10 రోజుల్లోపే పరిహారం జమ చేస్తున్న ఎల్‌ఐసీ అధికారులను ఆయన అభినందించారు. బుధవారం సచివాలయంలో ఎల్‌ఐసీ అధికారులతో రైతు బీమా పథకంపై పార్థసారథి సమీక్షించారు. ఇప్పటివరకు 6,775 మంది రైతులు మృతి చెందగా, వారి నామినీలకు డబ్బు జమ చేసినట్లు పేర్కొన్నారు.
జీపీఎస్ టెక్నాలజీతో విత్తనోత్పత్తి
Published Thu, Feb 7 2019 2:19 AM | Last Updated on Thu, Feb 7 2019 2:19 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment