శాన్ ఫ్రాన్సిస్కో: ఆన్‌లైన్ క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్‌కు గూగుల్‌మాప్స్ ద్వారా అనూహ్య పరిణామం ఎదురైంది. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకునే సదుపాయాన్ని రద్దు చేసింది. ఎలాంటి ముందస్తు హెచ్చరిక, కారణం చెప్పకుండానే ఉబెర్ రైడ్ బుకింగ్ సేవలను తొలగించింది. డైరెక్ట్‌గా గూగుల్ మ్యాప్ ద్వారా క్యాబ్‌ను బుక్ చేసుకోలేరని సోమవారం గూగుల్ ప్రకటించినట్టు తెలుస్తోంది. గూగుల్ తన హెల్ప్‌లైన్ పేజీలో ఈ మేరకు సూచించిందని ఆండ్రాయిడ్ పోలీస్ నివేదించింది. అయితే ఉబెర్ యాప్‌లో రూటు చూడడం, రైడ్ రిక్వెస్ట్ లాంటివి చేసుకోవచ్చని తెలిపింది. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఉబెర్ క్యాబ్‌ను బుక్ చేసుకునే సదుపాయాన్ని గత ఏడాది జనవరిలో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఉబెర్ అఫీషియల్ యాప్‌తో సంబంధం లేకుండా.. నేరుగా గూగుల్ మ్యాప్స్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కస్టమర్లకు అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై అటు గూగుల్ కానీ, ఇటు ఉబెర్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment