Shoe
-
మీరు కొత్త యూనిట్ పెడితే మాకేంటి?
సాక్షి, టాస్క్ పోర్సు: ‘మీరు కొత్త యూనిట్లు పెడితే మాకేంటి ఉపయోగం...? స్థానికంగా ఉన్న మా నేతలకు ఏమిటి ప్రయోజనం..?’ అంటూ తిరుపతి జిల్లాకు చెందిన అధికార కూటమి ప్రజాప్రతినిధి ఒకరు ప్రముఖ కంపెనీ ప్రతినిధులను నిలదీయడంతో వారు కంగుతిన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ముత్యాలపాడు పంచాయతీలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అపెక్స్ బూట్ల పరిశ్రమ ఏర్పాటు చేశారు. సుమారు 1,800 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఈ కంపెనీ సూళ్లూరుపేటలోని అపాచీకి అనుబంధంగా ఉంది. కంపెనీ పనితీరు బాగుండటంతో యాజమాన్యం అక్కడే రెండవ యూనిట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రెండేళ్ల కిందట ‘తుడా’ వద్ద అనుమతులు తీసుకుని పనులు చేపట్టింది. పనులన్నీ పూర్తి చేసుకుని శుక్రవారం కొత్త యూనిట్‌ను ప్రారంభించేందుకు కంపెనీ ప్రతినిధులు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ ప్రజాప్రతినిధి... పరిశ్రమ యాజమాన్యం నుంచి తనుకు ఎలాంటి పిలుపు రాలేదని ఆగ్రహించారు. ఆ పంచాయతీ సర్పంచ్‌తోపాటు స్థానిక అధికార పార్టీ నాయకులను కంపెనీ వద్దకు పంపి నానాయాగీ చేయించారు. పంచాయతీ అనుమతులు లేకుండా పరిశ్రమను ఎలా ప్రారంభిస్తారని వాగ్వాదానికి దిగారు. అలాగే పరిశ్రమలో పనిచేసే వారిని బయటకు వెళ్లాలని రచ్చరచ్చ చేశారు. దీంతో కంపెనీ హెచ్ఆర్ శరవణ్ వారికి నచ్చ చెప్పి తమకు తుడా అనుమతులు ఉన్నాయని, ఒక రోజు సమయం ఇస్తే వాటిని తీసుకువచ్చి పంచాయతీకి అందిస్తామని చెప్పారు. ఆ తర్వాత యూనిట్‌ను ప్రారంభించుకున్నారు. మీరు పని చేసుకుంటూ వెళితే స్థానిక నాయకుల పరిస్థితి ఏమిటి? అనంతరం అపెక్స్ బూట్ల కంపెనీ ప్రతినిధులు స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధి వెళ్లి సర్పంచ్, స్థానిక నాయకులు చేసిన గొడవ గురించి వివరించారు. దీంతో ఆ ప్రజాప్రతినిధి స్పందిస్తూ... ‘కంపెనీ పెట్టి మీరు పనులు చేసుకుంటూ పోతే స్థానికంగా ఉండే నాయకుల పరిస్థితి ఏమిటీ..?’ అని ఎదురు ప్రశ్న వేయడంతో కంపెనీ ప్రతినిధులు అవాక్కయ్యారు. విదేశాలకు చెందిన కంపెనీ కావడంతో తాము ఏమి చేయగలమని వారు చెప్పడంతో సదరు ప్రజాప్రతినిధి గట్టిగానే స్పందించినట్లు తెలిసింది. -
వందేళ్ల క్రితం ఎవరెస్ట్‌పై గల్లంతు
లండన్: ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే క్రమంలో జాడ తెలియకుండా పోయిన బ్రిటిష్ పర్వతారోహకుడి ఆనవాళ్లు తాజాగా వందేళ్లకు బయటపడ్డాయి. నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ బృందంలోని పర్వతారోహకులకు 1924లో కనిపించకుండా పోయిన ఇద్దరిలో ఎ.సి.ఇర్విన్(22) పాదం, బూటు, ఆయన పేరున్న ఎంబ్రాయిడరీ సాక్స్ దొరికాయి. ఇది తెలిసి ఇర్విన్ సోదరుని కుమార్తె ఆనందం వ్యక్తం చేశారు. దీంతోపాటు, ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే కంటే 29 ఏళ్ల ముందే ఎవరెస్ట్ అధిరోహించేందుకు వెళ్లిన ఈ ఇద్దరూ తమ ప్రయత్నంలో విజయం సాధించారా లేదా అన్న అనుమానాలకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ బృందం ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనా ఆదీనంలోని ఎవరెస్ట్ ఉత్తర ప్రాంతంలో రొంగ్బుక్ గ్లేసియర్ వద్ద చిత్రీకరణ చేపట్టింది. ఈ బృందానికి ఆస్కార్ విజేత కూడా ప్రముఖ జిమ్మీ చిన్ నాయకత్వం వహిస్తున్నారు. అక్కడ వారికి 1933 నాటి ఆక్సిజన్ సిలిండర్ ఒకటి లభ్యమైంది. ఇర్విన్‌కు సంబంధించిన వస్తువు కూడా ఒకటి దొరికింది. దీంతో, చాలా రోజులు అక్కడే అన్వేషణ జరిపారు. ఫలితంగా వారికి ఓ కాలున్న బూట్ దొరికింది. అందులోని సాక్ ఎంబ్రాయిడరీపై ‘ఎ.సి.ఇర్విన్’అనే పేరుంది. ఈ బూటును 1924 జూన్‌లో జార్జి మల్లోరీతో కలిసి ఎవరెస్ట్ అధిరోహించేందుకు వచ్చి అదృశ్యమైన బ్రిటిష్ దేశస్తుడు ఏసీ శాండీ ఇర్విన్దేనని తేల్చారు. 1999లో మల్లోరీ మృతదేహం పర్వతారోహకుల కంటబడగా, ఇర్విన్ ఆనవాళ్లు ఇప్పటికీ దొరకలేదు. అయితే, ఈయన వెంట తెచ్చుకున్న కెమెరా కోసం పలువురు గతంలో తీవ్రంగా గాలించారు. అందులోని ఫొటోల ఆధారంగా ఈ ఇద్దరు సాహసికుల ప్రయత్నం ఏమేరకు ఫలించిందన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని వారి ఆశ. తాజాగా దొరికిన ఆధారంతో ఇర్విన్ మృతదేహం వంటి ఆనవాళ్లు అదే ప్రాంతంలో దొరకవచ్చన్న అంచనాలు పెరిగిపోయాయి. -
కాలు జారిన మోడల్.. షూ కంపెనీదే తప్పంటోంది!
లండన్‌కు చెందిన ఒక మోడల్ ఊహకందని రీతిలో ప్రమాదం బారినపడింది. దీంతో ఆమె జీవితాంతం హీల్స్ ధరించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఆ మోడల్ సదరు షూ కంపెనీపై £ 100,000 (సుమారు ఒక కోటి రూపాయలు) నష్టపరిహారం కోసం కేసు వేసింది. ఆ షూ కంపెనీకి చెందిన హీల్స్ ధరించడం కారణంగానే తాను ప్రమాదం బారినపడినట్లు ఆ మోడల్ తెలిపింది. న్యూస్ సైట్ ది మిర్రర్ నివేదిక ప్రకారం 31 ఏళ్ల క్లో మికెల్‌బరో 2018లో మిలన్లోని డిజైనర్ బేస్‌లో ప్రకటనల షూట్లో పాల్గొంది. వాక్‌వేపై నడుచుకుంటూ వెళ్తుండగా కాలు స్లిప్ అయి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆ మోడల్ కాలి మడమ విరిగింది. తీవ్రమైన నొప్పి, కాలు వాపుతో ఆమె చాలా రోజులు మంచం మీదనే రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అలాగే ఆమెకు హీల్స్ ధరించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో క్లో ఆ షూ కంపెనీ నుంచి పరిహారం పొందేందుకు కోర్టును ఆశ్రయించింది. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇకపై తాను ఎవరికీ డాన్స్ నేర్పించలేనని, తానూ డ్యాన్స్ చేయలేనని, పరిగెత్తలేనని కోర్టు ముందు మొరపెట్టుకుంది. అయితే స్టెల్లా మాక్కార్ట్నీ లిమిటెడ్ షూ కంపెనీ ఆమె వాదనను ఖండించింది. కంపెనీ తరపు న్యాయవాది మైఖేల్ పాట్రిక్ తెలిపిన వివరాల ప్రకారం ఆమెకు నడక మార్గంలో ప్రమాదం జరిగింది. ఆమె తన బరువును నియంత్రించుకోలేక పడిపోయింది. కాగా కేసు కోర్టు విచారణలో ఉంది. ఇది కూడా చదవండి: ఆ గ్రామం కేన్సర్ నిలయంగా ఎందుకు మారింది? -
ఐఫోన్ నుంచి కాళ్లకి వేసుకునే షూ వరకు అప్‌గ్రేడ్..ఇదేమైనా వ్యాధా?
ఇటీవల యువత గాడ్జెట్ల వ్యామోహం ఓ రేంజ్లో ఉంది. మార్కెట్లోకి ఏ కొత్త ఫీచర్ వచ్చినా క్షణం కూడా ఆగరు. రిలీజ్ చేస్తున్న డేట్ ఇవ్వంగానే కొనేసేందుకు రెడీ. ఇంట్లో తల్లింద్రండ్రుల వద్ద డబ్బు ఉందా లేదా అనేది మేటర్ కాదు. ఆరు నూరైనా..కేవలం ఆ కొత్త ఫీచర్ మనం వద్ద ఉండాల్సిందే అన్నంతగా ఉన్నారు యువత. ఇది అసలు మంచిదేనా?..ఒకవేళ్ల అలా కొత్త టెక్నాలజీ కొత్త ఫ్యాషన్‌కి అప్‌గ్రేడ్ కాకపోతే ఏదో పెద్ద నష్టం జరిగనట్టు లేదా భయానక అవమానం జరిగిన రేంజ్లో యువత ఇచ్చే బిల్డప్ మాములుగా ఉండదు. ఏంటిదీ? దీని వల్ల ఏం వస్తుంది? ఎవరికీ లాభం? నిజానికి యువత ముఖ్యంగా కాలేజ్‌కి వెళ్లే టీనేజ్‌ల దగ్గర నుంచి ఉద్యోగాలు చేస్తున్న పెద్దవాళ్ల వరకు అందరికి అప్‌గ్రేడ్ అనే జబ్బు పట్టుకుంది. మార్కెట్లోకి వచ్చే కొత్త ఫీచర్ లేదా టెక్నాలజీకి అప్‌గ్రేడ్ అయిపోవాల్సిందే!. లేదంటే ఓర్నీ..! ఎక్కడ ఉన్నవురా? అంటూ ఎగతాళి. పైగా నిన్న మొన్నటి టెక్నాలజీని కూడా తాతాల కాలం నాటిది అంటూ తేలిగ్గా తీసిపడేస్తాం. ఇలా ధరించే దుస్తులు దగ్గర నుంచి కాలికి వేసుకునే చెప్పుల వరకు మార్కెట్లోకి వచ్చే ప్రతీ కొత్త బ్రాండ్లతో అప్‌గ్రేడ్ అవ్వడం నాగరికత లేక ఓ గొప్ప ట్రెండ్‌గా ఫీలవుతున్నారా? అంటే..ఇక్కడ ఇలా అప్‌గ్రేడ్ పేరుతో మార్కెట్లోకి వచ్చే ప్రతిది కొంటున్న యువతకు కూడా ఇలా ఎందుకు అనేది వారికే స్పష్టత లేదు. కానీ ఓ ఆందోళనకరమైన విషవృక్షంలా మనుషుల్లో ఈ విధానం విజృంభిస్తుంది. మన పక్కోడు ఆ కొత్త టెక్నాలజీకి వెళ్లపోయినంత మాత్రనా వాడు ఏదో సాధించినట్లు కాదు. ముందు మనం దేన్ని ఎంతవరకు కొనాలి. దేనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి అనే ధోరణిని మర్చిపోయేలా మాయాజాలం సృష్టిస్తున్నాయి ఈ కార్పొరేట్ కంపెనీలు. ఉదహారణకి ఐఫోన్ పరంగా చూస్తే 4జీ నుంచి 5జీ అప్‌గ్రేడ్ అవ్వాలని నీ వద్ద ఉన్న ఫోర్జీ ఫోన్‌ని వదిలేసి కొత్తదానికి వెళ్లాల్సినంత పనిలేదు. మహా అయితే వీడియో లేదా స్టోరేజ్‌కి సంబంధించి కాస్త బెటర్ ఫీచర్ ఉండొచ్చు. దానికోసం ఇలా వేలవేలకు వేలు దుబారా చేయడం సరియైనది కాదు. ఇక్కడ ఉన్న చిన్న లాజిక్‌ని మర్చిపోతున్నాం. మనం ఓ ఫోన్ లేదా ఏ వస్తువైన కొనుక్కుంటున్నాం. దానికి కంపెనీ ఇన్ని ఏళ్లు అని వ్యారెంటీ ఇచ్చేది. మనం కొనుక్కుని వెళ్లిపోతే వాడివద్దకు మళ్లా కస్టమర్లు రారు. వాళ్ల బ్రాండ్‌ని మర్చిపోతారు. నిరంతరం కస్టమర్లతో టచ్‌లో ఉండేలా తన బ్రాండ్‌ని ప్రమోట్ చేసుకునే దృష్ట్యా కంపెనీలు చేసే ఇంద్రజాలం ఇది. దీన్ని గమనించక మన జేబులు గుల్లచేసుకుంటూ అప్‌గ్రేడ్ అంటూ మార్కెట్లోకి వచ్చే ప్రతి కొత్త బ్రాండ్‌ని కొనేస్తున్నాం. అప్పటి వరకు మనతో ఉన్న వాటిని పక్కన పడేస్తున్నాం. కొందరి యువతలో ఇదొక మానసిక రుగ్మతలా తయారయ్యిందని మానసిక నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు కొత్త టెక్నాలజీకి చెందిన వస్తువు లేదా మార్కెట్లోకి వచ్చిన ట్రెండీ ఫ్యాషన్ తన వద్ద లేనంత మాత్రన ఆత్మనూన్యతకు గురయ్యిపోతున్నారు. మనుషులకు వారి భావాలకు వాల్యూ ఇవ్వండి. నిజానికి అదేమీ స్టాటస్ కాదు. అది అందరూ గమనించాలి. తల్లిదండ్రులు ఇలాంటి ధోరణి గల పిల్లలను గమనించి కౌన్సిలింగ్ ఇప్పించడం లేదా మీరే చొరవ తీసుకుని ఫ్రెండ్లీగా మాట్లాడి సరైన గాఢీలో పెట్టాలి లేదంటే ఆ మోజులో జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయి. ఎందుకంటే ప్రతీది కొనేయ్యలేం. అలాగే ప్రతి అప్‌గ్రేడ్‌ని ప్రతిసారి అందుకోవడం సర్వత్రా సాధ్యం కాదు. ముందు యువత సానుకూల దృక్పథంతో ఈ వస్తువు లేదా దుస్తులు కొనడం వల్ల ఎవరికీ లాభం, దీన్ని ఎందుకు మార్కెట్లో సొమ్ము చేసుకునేలా ఎందుకు ప్రచారం చేస్తారు అనే దానిపై దృష్టిపెట్టండి. మీ పరిజ్ఞానం ఇలాంటి చిన్న చితక వస్తువులకు బానిసైపోకూడదు. ఏదైనా మనకు ఉపయోగపడేది, మన స్థాయికి, ఉన్న పరిస్థితులకు అనుగుణమైనవి మన వద్ద ఉంటే చాలు. ఈ పిచ్చి విధానం మీ ఉనికిని, మీ వైఖరిని కోల్పోయేలా చేస్తుంది. నువ్వు కొత్త టెక్నాలజీకి అడాప్ట్ అవ్వడం కాదు. టెక్నాలజీనే నువ్వు సృష్టించగలిగే దిశగా నాలెడ్జ్‌ని పెంచుకునేలా అడుగులు వేస్తే మీ భవిష్యత్తు బంగారు పూలబాట అవుతుందని అంటున్నారు మానసికి నిపుణులు. (చదవండి: తినదగిన ప్లేట్లు! ఔను! భోజనం చేసి పారేయకుండా..) -
నాయకునిపై 'షూ' విసిరిన యువకుడు..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ సమావేశంలో ఓ వ్యక్తి షూని విసరడం కలకలం రేపింది. కార్యకర్తలను అద్దేశించి మాట్లాడతుండగా స్వామి ప్రసాద్ మౌర్యపై.. ఓ వ్యక్తి షూని విసిరాడు. దీంతో అక్కడే ఉన్న మిగిలిన కార్యకర్తలు అతన్ని పట్టుకుని చితకబాదారు. నిందితుడు నాయకునిపై షూ విసరడానికి గల కారణాలు తెలియదు. లక్నోలో ఈ రోజు ఎస్పీ సమావేశం నిర్వహించింది. పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా సమావేశానికి వచ్చి ప్రసంగించాల్సి ఉంది. అంతకు ముందు ఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్య సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇంతలో కార్యకర్తల గుంపు నుంచి ఓ షూ శరవేగంగా మౌర్య వైపు దూసుకొచ్చింది. క్షణాల్లో దాన్నుంచి మౌర్య తప్పించుకున్నారు. అయితే.. షూ విసిరిన వ్యక్తిని పట్టుకున్న ఇతర కార్యకర్తలు అతన్ని చితక్కొట్టారు. VIDEO | A man dressed up as an advocate hurls shoe at Samajwadi Party leader Swami Prasad Maurya in Lucknow. The attacker was later roughed up by Maurya's supporters. More details are awaited. pic.twitter.com/OQCU5G3xVE — Press Trust of India (@PTI_News) August 21, 2023 సమావేశానికి అఖిలేష్ యాదవ్ రాక ముందే ఈ ఘటన జరిగింది. ఇది బీజేపీ నేతల పనేనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో మౌర్య ప్రధాన ఓబీసీ నాయకుడు. 2022లో బీజేపీ నుంచి బయటకు వచ్చి ఎస్పీలో చేరారు. ఇటీవల రామచరిత మానస్‌పైన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదీ చదవండి: చంద్రయాన్-3పై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు -
‘షూ’లో నక్కిన నాగు పాము.. తస్మాత్ జాగ్రత్త!
బెంగళూరు: పని మీద వెళ్తున్నప్పుడు గమనించకుండానే చెప్పులు, షూ ధరిస్తుంటారు చాలా మంది. అయితే, వాటిల్లో విష పురుగులు ఉంటే ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. ఎంత అర్జెంట్ పని ఉన్నా ఓసారి చూసి ధరించటం మంచింది. ఓ సారి ఈ సంఘటన చూడండి. షూలో భారీ నాగు పాము నక్కింది. దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా పడగ విప్పి బుసలు కొడుతోంది. కర్ణాటకలోని మైసూర్లో జరిగిన ఈ సంఘటన వీడియోను ట్విటర్లో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి రోజూ మాదిరిగానే షూ ధరించేందుకు వెళ్లగా అందులో నాగు పాము కనిపించి షాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేశాడు. అక్కడికి చేరుకున్న ఆ వ్యక్తి పామును షూ నుంచి తీసేందుకు ప్రయత్నించాడు. దాంతో కోపంతో ఊగిపోయిన ఆ పాము పడగ విప్పి బుసలు కొట్టింది. ఈ సంఘటన ప్రతి ఒక్కరికి హెచ్చరికగానే చెప్పాలి. షూ ధరిస్తున్నప్పుడు కచ్చితంగా దానిని పరిశీలించిన తర్వాత వేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. Shocking video of cobra #snake in Mysore, Karnataka hiding inside the shoe. #ViralVideo #Cobra #Rescued #Shoes #Karnataka pic.twitter.com/rJmVN5W1ne — Bharathirajan (@bharathircc) October 10, 2022 ఇదీ చదవండి: 10 ఏళ్ల వయసులో జైలుకు.. 53 ఏళ్లప్పుడు నిర్దోషిగా విడుదల -
కేఎల్ రాహుల్ ఎంత పని జరిగే.. వీడియో వైరల్
క్రికెట్ అంటేనే ఫన్నీ గేమ్‌కు పెట్టింది పేరు. ఐపీఎల్ 2022లో భాగంగా సీఎస్కే, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ సమయంలో కేఎల్ రాహుల్ తొలి ఓవర్లోనే తన షూను పోగొట్టుకున్నాడు. వాస్తవానికి మ్యాచ్ జరుగుతున్న ముంబైలో అధిక వేడిమి కారణంగా కేఎల్ రాహుల్‌కు చెమట విపరీతంగా వచ్చింది. దీంతో పిచ్‌పై పరిగెత్తుతున్న సమయంలో కేఎల్ రాహుల్ షూ పిచ్ మధ్యలో పడిపోయింది. ఇది గమనించినప్పటికి కేఎల్ రాహుల్ తన పరుగు పూర్తి చేశాడు. ఆ తర్వాత బ్రేక్ సమయంలో డికాక్ అతని షూ తీసుకొని వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. KL Rahul 😝 #IPL2022 #CSKvsLSG pic.twitter.com/yYb5BT1mXM — Amanpreet Singh (@AmanPreet0207) March 31, 2022 -
వేలానికి మారడోనా ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ జెర్సీ
లండన్: దివంగత అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మారడోనా కెరీర్లో ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ ఎంత ప్రసిద్ధికెక్కిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1986 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మారడోనా చేసిన ఈ గోల్ ఫుట్‌బాల్ ప్రపంచంలో మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ గోల్ మాత్రమే కాకుండా ఆ మ్యాచ్‌లో మారడోనా ధరించిన జెర్సీ, షూ పట్ల అందరికీ ప్రత్యేక ఆసక్తి. ఇప్పుడు ఆ జెర్సీ వేలానికి రానుంది. ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ స్టీవ్ హోడ్జ్ దగ్గరున్న జెర్సీని వేలంలో 20 లక్షల డాలర్లకు (రూ. 14.79 కోట్లు) విక్రయించనున్నట్లు అమెరికా క్రీడా వస్తువుల సేకరణ నిపుణుడు డేవిడ్ అమర్మన్ తెలిపాడు. ‘హ్యాండ్ ఆఫ్ గాడ్ జెర్సీకి విలువ కట్టడం చాలా కష్టం. కానీ దాని యజమాని వేలంలో 20 లక్షల డాలర్లు ఆశిస్తున్నారు. ధర ఎక్కువే. కానీ అధిక సంపద ఉన్న వ్యక్తి ఆ జెర్సీని ఎందుకు వద్దనుకుంటారు. ఇది అమ్ముడయ్యే అవకాశం ఉంది’ అని డేవిడ్ అన్నారు. మారడోనా మరణానంతరం ఈ జెర్సీని ప్రస్తుతం మాంచెస్టర్‌లోని ఇంగ్లండ్ జాతీయ ఫుట్‌బాల్ మ్యూజియంలో ప్రజల సందర్శన కోసం ఉంచారు. -
'షూ' ఛాలెంజ్.. ట్రై చేశారా?
-
'షూ' ఛాలెంజ్.. ట్రై చేశారా?
లాక్డౌన్ కారణంగా సినీ ప్రముఖులు జిమ్‌లకు వెళ్లలేని పరిస్థితి. అయితేనేం? ఇంట్లో ఉంటూ కూడా వర్కవుట్స్ చేయవచ్చు అని నిరూపిస్తున్నారు. దీని కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఫిట్నెస్ మంత్రాన్ని పాటిస్తున్నారు. ఆ మధ్య రకుల్‌ప్రీత్‌సింగ్ టీషర్ట్ ఛాలెంజ్ విసరగా, తాజాగా షూ ఛాలెంజ్ ట్రెండ్ అవుతోంది. నటి బిపాషా బసు ఈ ఛాలెంజ్‌ని పూర్తిచేసింది. దీని ప్రకారం.. ఒక కాలిపై షూని ఉంచి అది పడిపోకుండా వర్కవుట్ చేయాలి. డీన్ పాండే విసిరిన ఈ ఛాలెంజ్‌ను ఎంతో ఈజీగా పూర్తిచేసేసింది బిపాసా. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ. "హేహే..నేను కూడా ట్రాక్‌లో ఉన్నాను, షూ ఛాలెంజ్" అంటూ క్యాప్షన్ జోడించారు. టాలీవుడ్‌లోనూ ఛాలెంజ్‌ల హవా నడుస్తోంది. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ప్రారంభించిన 'బి ద రియల్ మ్యాన్' ఛాలెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సామాన్యుల్లాగా ఇంటి పనులు చేస్తూ అభిమానుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ ఛాలెంజ్‌ను పూర్తిచేశారు. లాక్‌ఢౌన్ అయిపోయే లోపు ఇంకెన్ని కొత్త ఛాలెంజ్‌లు పుట్టుకొస్తాయో చూడాలి మరి. -
ఎమ్మెల్యేను షూతో చితక్కొట్టిన బీజేపీ ఎంపీ
లక్నో : ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు...తాము ఎక్కడ ఉన్నామో, ఏం చేస్తున్నామో అనే ఇంగిత జ్ఞానం మర్చిపోయారు. శిలా ఫలకంపై పేరు లేదంటూ జరిగిన వాగ్వివాదం కాస్త.. బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే బహిరంగంగా చెప్పులతో పరస్పరం కొట్టుకునేంతవరకూ వెళ్లింది. ఉత్తరప్రదేశ్ సంత్ కబీర్ నగర్ కలెక్టరేట్లో జరిగిన ఈ తతంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.... బుధవారం సంత్ కబీర్ నగర్ జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశానికి బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠీ, ఎమ్మెల్యే రాకేష్ సింగ్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా స్థానికంగా రోడ్డు నిర్మాణం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకంపై తన పేరు ఎందుకు లేదంటూ ఎంపీ శరద్ త్రిపాఠీ స్థానిక ఎమ్మెల్యే అయిన రాకేష్ సింగ్‌ను ప్రశ్నించారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య కొద్దిపాటి వాగ్వివాదం చోటుచేసుకుంది. అది కాస్తా తీవ్రస్థాయికి చేరడంతో ఇద్దరు ప్రజా ప్రతినిధులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ నేపథ్యంలో సహనం కోల్పోయిన ఎంపీ శరద్ త్రిపాఠీ.. కాలికి ఉన్న షూ తీసి ఎమ్మెల్యేను చితక్కొట్టాడు. దీంతో ఎమ్మెల్యే రాకేష్ సింగ్ కూడా ఎంపీపై చేయి చేసుకున్నాడు. అయితే వారికి సర్ధిచెప్పేందుకు అక్కడున్న పార్టీ నేతలు, అధికారులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి, ఇద్దరు నేతలను శాంతింప చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ వ్యవహారం మొత్తం యూపీ మంత్రి అశుతోష్ టండన్ సమక్షంలోనే జరగడం గమనార్హం. మరోవైపు ఎంపీ శదర్ త్రిపాఠీపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే అనుచరులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనపై రాష్ట్ర బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. -
శిలా ఫలకంపై పేరు లేదని.. షూతో కొట్టుకున్నారు!
-
‘షూ’లో పాము.. 9వేల మైళ్ల జర్నీ
ఎడిన్బర్గ్: విహార యాత్ర ముగించుకుని ఇంటికి చేరుకున్న ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ఇంటికి చేరుకున్న మోయిరా బాక్సాల్ అనే మహిళ.. తన సూట్‌కేసులోని ఓ ‘షూ’ లో దాగిన పామును చూసి షాక్‌కు గరయింది. స్నేక్స్ ఆన్ ప్లేన్ చిత్రంలో మాదిరి.. ఆ పాము విమానంలో దాదాపు 9 వేల మైళ్ల దూరం ప్రయాణించింది. మోయిరా, క్వీన్స్లాండ్ నుంచి గ్లాస్గో వరకు ప్రయాణించే అంతసేపు పాము షూలోనే నక్కి ఉండటంతో దాని చర్మపు పై పోర ఉడిపోయింది. వెంటనే ఈ విషయాన్ని మోయిరా జంతు సంరక్షణ సంస్థకు తెలియపరిచింది. వెంటనే రంగంలోకి దిగిన వారు ఆ పామును షూ నుంచి జాగ్రత్తగా బయటకు తీశారు. అయితే పాము విషపూరితమైన కాదని వారు చెప్పారు. గతంలో కూడా పాములు విమానంలో నక్కి ప్రయాణించిన ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. -
జపాన్ ప్రధానికి తీవ్ర అవమానం
టెల్అవీవ్, ఇజ్రాయెల్ : ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న జపాన్ ప్రధాని షింబో అబేకు తీవ్ర అవమానం జరిగింది. ఇజ్రాయెల్ ప్రధాని కుటుంబంతో కలసి విందుకు హాజరైన అబేకు చెఫ్ బూటులో ఆహార పదార్థాలను ఉంచి సర్వ్ చేయడం వివాదాస్పదంగా మారింది. నెతన్యాహు అత్యంత ఇష్టపడే చెఫ్ మోషే సెర్గీ ఈ విందుకు వంటకాలను తయారు చేశారు. అబేకు డిసర్ట్‌తో పాటు ఓ బూటులో చాకెట్లను ఉంచి సర్వ్ చేయడంపై జపాన్ దౌత్యవేత్తలు భగ్గమన్నారు. బూటుతో ఆహారాన్ని అందించడాన్ని జపాన్‌లో తీవ్రంగా, ఘోర అవమానంగా భావిస్తారని చెప్పారు. ఘటనపై చెఫ్ సెర్గీ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అది నిజమైన షూ కాదని, మెటల్‌తో తయారు చేసిన వస్తువని వెల్లడించారు. కాగా, భోజన వడ్డన సమయంలో సెర్గీ వివాదాల్లో ఇరుక్కోవడం ఇది తొలిసారేమీ కాదు. గతేడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్, నెతన్యాహూల ముఖచిత్రాలు కలిగిన బౌల్స్‌లో సెర్గీ డిసర్ట్స్‌ను సర్వ్ చేశారు. -
'రాహుల్ గాంధీకి చేదు అనుభవం'
-
రాహుల్ గాంధీకి చేదు అనుభవం.
-
రాహుల్ గాంధీకి చేదు అనుభవం
సీతాపూర్ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సోమవారం చేదు అనుభవం ఎదురైంది. ఉత్తర ప్రదేశ్ సీతాపూర్‌లో రోడ్ షో నిర్వహిస్తున్న రాహుల్ గాంధీపై ఓ ఆగంతకుడు చెప్పు విసిరాడు. ఓపెన్ టాప్ జీపుపై ర్యాలీగా వెళుతున్న ఆయనపై దుండగుడు షూ విసరగా, అది కాస్త రాహుల్ తలకు తగిలింది. కాగా ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ జరిపారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం మళ్లీ రాహుల్ గాంధీ తన రోడ్ షోను కొనసాగించారు. కాగా షూ విసిరిన వ్యక్తి జర్నలిస్ట్ అనూప్ మిశ్రాగా పోలీసులు గుర్తించారు. కాగా వచ్చే ఏడాది జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాహుల్ గాంధీ రాష్ట్రవ్యాప్తంగా కిసాన్ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. -
షూ విసిరిన వ్యక్తికి 14 రోజుల కస్టడీ
న్యూ ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై షూ విసిరిన వ్యక్తికి ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ తీర్పునిచ్చింది. గతవారం ఢిల్లీలో ట్రాఫిక్ యాజమాన్య నిర్వహణలో భాగంగా సరిబేసి సంఖ్యల పద్ధతి అమలుపై కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి ఆయనపై చెప్పు విసిరిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై సదరు నిందితుడు బెయిల్ కోరగా నిరాకరించిన కోర్టు రెండువారాలపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. నిందితుడు వేద ప్రకాష్ బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అభిలాష్ మల్హోత్రా తోసిపుచ్చారు. ప్రజలు ఇటువంటి చర్యలకు పాల్పడటం సరికాదని, ఇందుకు ప్రతిబంధకంగా శిక్షను అనుభవించాలని తీర్పునిచ్చారు. సరి బేసి సంఖ్య పథకం కోసం ఢిల్లీలో నకిలీ సీఎన్జీ స్టిక్కర్లు పంపిణీ చేశారని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కార్యకర్త వేద్ ప్రకాష్... కేజ్రీవాల్ పైకి షూ విసిరాడు. అయితే అది ఆయనకు తగలకుండా తృటిలో తప్పింది. సీఎన్జీతో నడుస్తున్న కార్లకు పథకంనుంచి మినహాయింపు ఇచ్చారని, అటువంటి 'స్కామ్' వీడియో ఆధారాలు తనవద్ద ఉన్నాయని, అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోపోవడంతోనే తనకు కేజ్రీవాల్ పై కోపం వచ్చి..షూ విసిరానని నిందితుడు చెప్తున్నాడు. ఒకరోజు కస్టడీ ముగిసిన అనంతరం నిందితుడ్ని కోర్టుకు హాజరు పరచడంతో.. నిందితుడి బెయిల్ పిటిషన్ ను కోర్టు పరిశీలించింది. ఇతరుల మధ్య అభిప్రాయ బేధాలు ఉండొచ్చని, ప్రజలు ఎన్నుకున్నముఖ్యమంత్రిని, రాజ్యాంగాధికారాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందన్న కోర్టు... ఇటువంటి చర్యలతో అసంతృప్తిని వ్యక్త పరచడం సరికాదని అభిప్రాయ పడింది. -
భారత్ బ్యాట్స్ ఉమన్ షూ లేస్ కట్టిన పాక్ క్రికెటర్!
భారత్- పాక్ మధ్య క్రికెట్ అంటే దాదాపు యుద్ధం స్థాయిలో సాగుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. మొన్న ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్‌తో పాక్ కెప్టెన్ షాహిద్ అఫ్రీదీ సరదాగా నవ్వుతూ మాట్లాడటం చూస్తుంటే ఉద్రిక్తతలు చాలావరకు తగ్గినట్లే అనిపించింది. మహిళల క్రికెట్లోనూ ఇలాంటి సంఘటనే ఒకటి కెమెరాకు చిక్కింది. ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో శనివారం జరిగిన భారత్, పాక్ మహిళల టి20 క్రికెట్ మ్యాచ్ సందర్భంలో పాకిస్తానీ క్రికెట్ జట్టుకు చెందిన ఆనం ఆమిన్.. ఇండియన్ బ్యాట్స్ ఉమన్ హర్‌ప్రీత్ కౌర్ షూ లేసును కట్టడం అందర్నీ ఆకట్టుకుంది. ఆ మ్యాచ్‌లో ఇండియా జట్టు పాకిస్తాన్ చేతిలో కేవలం రెండు పరుగుల తేడాతో పరాజయం పాలయ్యింది. అయితేనేం భారత్ క్రికెటర్‌కు షూ లేస్ కడుతూ ఆమిన్ స్పందించిన తీరు అందరి హృదయాలను గెలుచుకుంది. క్రికెట్ అభిమానుల్లో స్ఫూర్తిని రగిల్చింది. కెమెరాకు చిక్కిన ఈ చిత్రం.. భారత్, పాకిస్తాన్ దేశాల్లోని అభిమానుల ప్రశంసలను అందుకుంటోంది. -
అంధులకు దారిచూపే పాదరక్షలు!
భలేబుర్ర ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముప్పయి కోట్ల మంది అంధులు ఉన్నారు. వెంట ఎవరూ లేకుండా ఎక్కడికైనా వెళ్లాలంటే ఎంతో కష్టపడుతున్నారు. అది చూసిన ఇద్దరు యువకులు... అందరిలాగే అంధులు కూడా తేలికగా ఎక్కడికి కావాలన్నా వెళ్లిపోగలిగేలా చేస్తే బాగుండనుకున్నారు. అనుకున్నదే తడవుగా ప్రయోగాలు చేశారు. చివరకు అంధులకు దారిచూపే పాదరక్షలకు రూపకల్పన చేశారు. ఢిల్లీకి చెందిన విద్యార్థులు అనిరుధ్ శర్మ, క్రిస్పియన్ లారెన్స్ రూపొందించిన ఈ పాదరక్షలకు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి ప్రశంసలు లభించాయి. యంత్రాలపై నిరంతరం ప్రయోగాలు సాగించే అనిరుధ్శర్మ ఒకసారి కుతూహలం కొద్దీ ఒక మిత్రుడి షూస్‌లో వైబ్రేటర్ ఉంచి చూశాడు. అప్పుడు మెదిలింది అతడిలో ఆలోచన. వైబ్రేటర్‌తో పనిచేసే పాదరక్షలు అంధులకు బాగా ఉపయోగపడగలవని అనుకున్నాడు. తోటి మిత్రుడు లారెన్స్‌తో కలసి ఈ ప్రయోగాన్ని కొనసాగించి, ఎట్టకేలకు అంధులకు దారిచూపే పాదరక్షలను రూపొందించాడు. వీటికి ‘లే చల్’ అని పేరు పెట్టాడు. సాదాసీదా షూస్లాగానే కనిపిస్తాయి ఇవి. వాటిలో ఒక వైబ్రేటింగ్ యూనిట్, ఒక చిప్, రీచార్జబుల్ బ్యాటరీ ఉంటాయి. బ్యాటరీని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బయటకు తీసి, తిరిగి రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ పాదరక్షలు ధరించిన వారిని నిర్ణీత గమ్యానికి సురక్షితంగా చేరుస్తాయి. దారిలో వచ్చే అడ్డంకులను గుర్తించి, ఎటువైపు మళ్లితే క్షేమమో, ఎక్కడెక్కడ మలుపులు తిరగాలో వైబ్రేటర్ ద్వారా సంకేతాలు ఇస్తాయి ఈ బూట్లు. -
మద్యం వద్దన్నారని సీఎం పైకి షూ విసిరాడు
పట్నా: బిహార్ సీఎం నితీష్ కుమార్‌పైకి గురువారం ఓ వ్యక్తి షూ విసిరాడు. పట్నాలోని భక్తియార్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నితీష్ కుమార్ ఏప్రిల్ 1 నుంచి బిహార్‌లో మద్యనిషేధం అమలు చేయనున్నట్టు పునరుద్ఘాటించారు. దీన్ని వ్యతిరేకిస్తున్న ఓ వ్యక్తి నితీష్ పైకి షూ విసిరాడు. ఆ షూ కొంచెం పక్కగా పడింది. షూ విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల హామీల్లో భాగంగా విడతలవారీగా మద్యనిషేధం విధించనున్నట్టు ఇదివరకే నితీష్ తెలిపిన విషయం తెలిసిందే. ముందుగా నాటు సారాపై నిషేధం విధించి, రెండో విడతలో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్)పై కూడా పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తామని చెప్పారు. -
బూట్ల కోసం ఆశపడి అడ్డంగా బుక్కైన పోలీసులు
ఆగ్రా పట్టణం.. మిట్టమధ్యాహ్నం.. రద్దీగా ఉన్న ఓ షూ షోరూమ్‌లోకి చేతులకు సంకెళ్లతో ఓ వ్యక్తి ప్రవేశించాడు. అతడి వెనుకే సాయుధులైన 12 మంది పోలీసులూ వచ్చారు. దర్జాగా సోఫాలో కూర్చున్న ఆ సంకెళ్ల వ్యక్తి.. పోలీసులందరికీ ఖరీదైన షూ చూపించమని సేల్స్బాయ్ని ఆదేశించాడు. షోరూమ్ ఓనర్‌కు ఇదంతా వింతగా అనిపించింది. సంకెళ్లతో ఉన్న ఖైదీ.. పోలీసులకు బూట్లు కొనివ్వమేమిటనే ఆశ్యర్యంలోనే తనకు పరిచయమున్న మీడియా మిత్రులకు ఫోన్ చేశాడు. చేతిలో కెమెరాలతో ఒక్కో విలేకరి అక్కడికి చేరుకోవడాన్ని గమనించిన పోలీసులు మెల్లగా అక్కడినుంచి జారుకున్నారు. తర్వాత తెలిసిన సంగతేమంటే పోలీసులకు బూట్లు ఇప్పించిన ఆ నిందితుడు సాదాసీదా నేరస్తుడుకాదు.. కరడుగట్టిన దొంగ, హంతకుడు. పేరు మనోజ్ బక్కర్ వాలా. ఇతడిపై 10 రాష్ట్రాల్లో దాదాపు 300 వందలకుపైగా కేసులున్నాయి. ఖరీదైన కార్లు దొంగిలిస్తూ విలాసాలకు అలవాటుపడ్డ బక్కర్ వాలా.. 2010లో తన గర్ల్ ఫ్రెండ్ భర్త కుటుంబాన్ని అతి దారుణంగా చంపేశాడు. 2012లో అరెస్టయిన తర్వాత మూడు సార్లు జైలు నుంచి పరారయ్యాడు. అలాంటి నేరస్తుడి నుంచి బూట్లు తీసుకోవడం ఒక తప్పైతే, విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం శిక్షార్హం. అందుకే మొత్తానికి మొత్తం 12 మంది పోలీసుల్ని సస్పెండ్ చేస్తున్నట్లు ఢిల్లీ, ఆగ్రా ఎస్పీలు ప్రకటించారు. ఢిల్లీలోని తీహార్ జైలులో ఉంటోన్న మనోజ్ బక్కర్వాలాను ఓ కేసు విచారణ నిమిత్తం శుక్రవారం ఆగ్రా కోర్టుకు తీసుకెళ్లారు. ఢిల్లీకి చెందిన ఆరుగురు సాయుధ పోలీసులు, ఆగ్రాకు చెందిన మరో ఆరుగురు పోలీసులను మనోజ్‌కు గార్డులుగా నియమితులయ్యారు. ఉదయం 11:30కు విచారణ పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఈ తతంగం చోటుచేసుకుంది. -
బూట్లలో బంగారం తరలిస్తూ..
శంషాబాద్: కాలికి ధరించిన బూట్లలో బంగారాన్ని దాచుకుని అక్రమ రవాణాకు యత్నించిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం దోహా నుంచి వచ్చిన ఖతార్ ఎయిర లైన్స్ విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు రెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తి పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడిగా గుర్తించిన కస్టమ్స్ అధికారులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బూట్లు కావాలా.. లక్ష కట్టు!
జైపూర్: బూట్ల కోసం లక్ష రూపాయలా అని ఆశ్చర్యపోకండి. అలాగని ఇదేదో విదేశాల్లో జరిగిన వేలం పాటేమో అనే సందేహమూ వద్దు. అక్షరాలా మన దేశంలోనే జరిగింది. అసలు విషయానికొస్తే రాజస్థాన్‌లోని పాలీ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన రైతు తన మేనకోడలికి రెండో పెళ్లి నిశ్చయించాడు. ఈ గ్రామంలో ఓ వింత ఆచారం ఉంది. పంచాయతీ పెద్దలకు తెలియకుండా వివాహ నిర్ణయాలు తీసుకోకూడదు. అలా చేస్తే పెద్దలు వచ్చి బూట్లను ఎత్తుకెళ్తారు. ఈ రైతు విషయంలోనూ అదే జరిగింది. గ్రామ నియమాల ప్రకారం బూట్లను పంచాయతీ పెద్దలు ఎత్తుకెళ్లారంటే.. వారు కుల బహిష్కరణకు గురయ్యారని అర్థం. దీంతో బహిష్కరణను తప్పించుకోవడానికి, తన బూట్లను తాను దక్కించుకోవడానికి ఆ రైతు రూ.లక్ష జరిమానా కట్టాలని తీర్పునిచ్చింది ఆ పంచాయతీ. -
పంజాబ్ సీఎంపై బూటు విసిరిన యువకుడు
లుథియానా: పంజాబ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్పైకి ఓ నిరుద్యోగ యువకుడు బూటు విసిరాడు. బాదల్ ఈ దుశ్చర్య నుంచి తప్పించుకున్నారు. బూటు సీఎంకు దూరంగా పడింది. పోలీసులు వెంటనే యువకుడి అదపులోకి తీసుకున్నారు.