
Courtesy: IPL Twitter
క్రికెట్ అంటేనే ఫన్నీ గేమ్‌కు పెట్టింది పేరు. ఐపీఎల్ 2022లో భాగంగా సీఎస్‌కే, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ సమయంలో కేఎల్ రాహుల్ తొలి ఓవర్‌లోనే తన షూను పోగొట్టుకున్నాడు. వాస్తవానికి మ్యాచ్ జరుగుతున్న ముంబైలో అధిక వేడిమి కారణంగా కేఎల్ రాహుల్‌కు చెమట విపరీతంగా వచ్చింది. దీంతో పిచ్‌పై పరిగెత్తుతున్న సమయంలో కేఎల్ రాహుల్ షూ పిచ్ మధ్యలో పడిపోయింది. ఇది గమనించినప్పటికి కేఎల్ రాహుల్ తన పరుగు పూర్తి చేశాడు. ఆ తర్వాత బ్రేక్ సమయంలో డికాక్ అతని షూ తీసుకొని వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
KL Rahul 😝 #IPL2022 #CSKvsLSG pic.twitter.com/yYb5BT1mXM
— Amanpreet Singh (@AmanPreet0207) March 31, 2022