బూట్లు కావాలా.. లక్ష కట్టు! | shoe cost is one lakh rupees in rajasthan | Sakshi
Sakshi News home page

బూట్లు కావాలా.. లక్ష కట్టు!

Published Thu, Jul 16 2015 8:20 AM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM

బూట్లు కావాలా.. లక్ష కట్టు!

బూట్లు కావాలా.. లక్ష కట్టు!

జైపూర్: బూట్ల కోసం లక్ష రూపాయలా అని ఆశ్చర్యపోకండి. అలాగని ఇదేదో విదేశాల్లో జరిగిన వేలం పాటేమో అనే సందేహమూ వద్దు. అక్షరాలా మన దేశంలోనే జరిగింది. అసలు విషయానికొస్తే రాజస్థాన్‌లోని పాలీ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన రైతు తన మేనకోడలికి రెండో పెళ్లి నిశ్చయించాడు. ఈ గ్రామంలో ఓ వింత ఆచారం ఉంది. పంచాయతీ పెద్దలకు తెలియకుండా వివాహ నిర్ణయాలు తీసుకోకూడదు.

అలా చేస్తే పెద్దలు వచ్చి బూట్లను ఎత్తుకెళ్తారు. ఈ రైతు విషయంలోనూ అదే జరిగింది. గ్రామ నియమాల ప్రకారం బూట్లను పంచాయతీ పెద్దలు ఎత్తుకెళ్లారంటే.. వారు కుల బహిష్కరణకు గురయ్యారని అర్థం. దీంతో బహిష్కరణను తప్పించుకోవడానికి, తన బూట్లను తాను దక్కించుకోవడానికి ఆ రైతు రూ.లక్ష జరిమానా కట్టాలని తీర్పునిచ్చింది ఆ పంచాయతీ.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement