కాలికి ధరించిన బూట్లలో బంగారాన్ని దాచుకుని అక్రమ రవాణాకు యత్నించిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
శంషాబాద్: కాలికి ధరించిన బూట్లలో బంగారాన్ని దాచుకుని అక్రమ రవాణాకు యత్నించిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
సోమవారం ఉదయం దోహా నుంచి వచ్చిన ఖతార్ ఎయిర లైన్స్ విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు రెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తి పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడిగా గుర్తించిన కస్టమ్స్ అధికారులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.