
విమానం సీటు కింద దాచిన బంగారం
శంషాబాద్: విమానాశ్రయంలో పకడ్బందీ తనిఖీలు నిర్వహించి బంగారం అక్రమ రవాణాను అడ్డుకుంటున్నా స్మగ్లర్‌లు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాల్లో విదేశాలనుంచి బంగారాన్ని రవాణా చేస్తూనే ఉన్నారు. మంగళవారం రాత్రి దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఇండిగో ఎయిర్‌లైన్స్ 025 విమానంలో సీటు కింద దాచిన 1,207 గ్రాముల బంగారాన్ని డీఆర్‌ఐ (డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్), కస్టమ్స్ అధికారులతో కలసి పట్టుకున్నారు.
ఈ విమానంలో అక్రమ బంగారం రవాణా జరుగుతున్నట్లు డీఆర్‌ఐ, కస్టమ్స్ అధికారులకు ముందస్తు సమాచారం అందడంతో వచి్చన ప్రయాణికులను తనిఖీలు చేయగా ఎవరివద్దా బంగారం పట్టుబడలేదు. అయితే విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా సీటుకింద మూడువరుసలుగా ఉన్న ఈ అక్రమబంగారం బయటపడింది. దీని విలువ రూ.59.03లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. బంగారాన్ని సీటు కింద దాచిన ప్రయాణికుల వివరాలను ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment