dri officials
-
రెచ్చిపోయిన సీఎం రమేష్...ప్రభుత్వ అధికారులపై రౌడీయిజం
-
బ్యాగ్‌ల అడుగున దాచి..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో కొకైన్ పట్టుబడింది. బహిరంగ మార్కెట్లో రూ.50 కోట్ల విలువ చేసే ఐదు కిలోల కొకైన్‌ను డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు శుక్రవారంస్వాధీనం చేసుకున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఓ ప్రయాణికుడి లగేజీ బ్యాగ్‌ల కింద దాచి ఉంచిన కొకైన్‌ను డీఆర్ఐ అధికారులు గుర్తించారు. ఈ మేరకు డీఆర్ఐ అధికారులు శనివారం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. లావోస్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడు లావోస్ నుంచి సింగపూర్ మీదుగా హైదరాబాద్‌కు శుక్రవారం చేరుకున్నాడు. అతడు హైదరాబాద్ నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా, పక్కా సమాచారం మేరకు అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు. సూట్‌కేస్, నాలుగు మహిళా హ్యాండ్ బ్యాగ్‌ల అడుగు భాగంలో దాచి ఉంచిన కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో మొత్తం ఐదు కిలోల కొకైన్ ఉన్నట్టు గుర్తించారు. ఆ ప్రయాణికుడిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ ప్రయాణికుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ డ్రగ్ సిండికేట్‌లోని మరికొందరు ముఠా సభ్యులను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్టు డీఆర్ఐ అధికారులు తెలిపారు. -
శంషాబాద్ ఎయిర్పోర్ట్: విమానంలో సీటుకింద కేజీకిపైగా బంగారం
శంషాబాద్: విమానాశ్రయంలో పకడ్బందీ తనిఖీలు నిర్వహించి బంగారం అక్రమ రవాణాను అడ్డుకుంటున్నా స్మగ్లర్లు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాల్లో విదేశాలనుంచి బంగారాన్ని రవాణా చేస్తూనే ఉన్నారు. మంగళవారం రాత్రి దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఇండిగో ఎయిర్‌లైన్స్ 025 విమానంలో సీటు కింద దాచిన 1,207 గ్రాముల బంగారాన్ని డీఆర్ఐ (డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్), కస్టమ్స్ అధికారులతో కలసి పట్టుకున్నారు. ఈ విమానంలో అక్రమ బంగారం రవాణా జరుగుతున్నట్లు డీఆర్ఐ, కస్టమ్స్ అధికారులకు ముందస్తు సమాచారం అందడంతో వచి్చన ప్రయాణికులను తనిఖీలు చేయగా ఎవరివద్దా బంగారం పట్టుబడలేదు. అయితే విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా సీటుకింద మూడువరుసలుగా ఉన్న ఈ అక్రమబంగారం బయటపడింది. దీని విలువ రూ.59.03లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. బంగారాన్ని సీటు కింద దాచిన ప్రయాణికుల వివరాలను ఆరా తీస్తున్నారు. -
చెన్నైలో గ్యాంగ్.. ఢిల్లీకి హెరాయిన్
-
చెన్నైలో గ్యాంగ్.. ఢిల్లీకి హెరాయిన్
సాక్షి, అమరావతి: హెరాయిన్ సిండికేట్ సూత్రధారుల కేంద్ర స్థానం ఢిల్లీ. చెన్నైలో ఉండే పాత్రధారులు కథ నడిపిస్తుంటారు. అఫ్గానిస్తాన్ నుంచి భారీగా హెరాయిన్ సరఫరా అవుతుండగా.. ఇరాన్ మీదుగా గుజరాత్‌కు దిగుమతి అవుతోంది. ఢిల్లీ, చెన్నై వంటి మెట్రో నగరాల్లో దానిని విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. దేశంలోనే అతి పెద్ద హెరాయిన్ రాకెట్ ఈ దందా నడిపిస్తోంది. కానీ.. ఈ వ్యవహారాలతో ఏ మాత్రం సంబంధం లేని విజయవాడ పేరును వాడుకుంటోంది. వెలుగులోకి విభ్రాంతికర వాస్తవాలు గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో డీఆర్ఐ అధికారులు భారీస్థాయిలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న కేసులో విభ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. డీఆర్ఐ, కేంద్ర, రాష్ట్రాల పోలీసు వ్య వస్థల కళ్లుగప్పి దర్జాగా హెరాయిన్ దందా సాగిం చేందుకు ఈ సిండికేట్ వ్యూహాత్మకంగా యాక్షన్ ప్లాన్‌ను అమలు చేసిందని గుర్తించారు. అఫ్గానిస్తాన్ నుంచి భారీగా హెరాయిన్ దిగుమతి చేసిన ‘అషీ ట్రేడింగ్ కంపెనీ’ విజయవాడ సత్యనారాయణపురంలోని గడియారం వీధిలోని ఓ ఇంటి చిరునామాతో రిజిస్టర్ కావడంతో ఈ కేసు రాష్ట్రంలోనూ సంచలనం సృష్టించింది. కాగా, హెరాయిన్ దందాతో విజయవాడకు ఎలాంటి సంబంధం లేదని.. కేవలం డీఆర్ఐ అధికారులను, పోలీసులను తప్పుదా రి పట్టించేందుకే విజయవాడ చిరునామాను ము ఠా వాడుకుందని వెల్లడైంది. గుజరాత్‌కు చేరిన భా రీ హెరాయిన్‌ను తీసుకెళ్లేందుకు వచ్చిన అఫ్గాన్ జా తీయులు కొందర్ని డీఆర్ఐ అధికారులు అహ్మదా బాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన స మాచారం ఆధారంగా చెన్నైలో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో వెల్లడైన ఆసక్తికర విషయాలు దేశంలో వేళ్లూనుకున్న హెరాయిన్ దందా తీవ్రతకు అద్దం పడుతున్నాయి. అఫ్గాన్ నుంచి.. ఇరాన్ మీదుగా.. దేశంలో హెరాయిన్ సిండికేట్ పక్కా ప్రణాళికతో అఫ్గానిస్తాన్ నుంచి దేశంలోకి భారీగా హెరాయిన్ ను దిగుమతి చేసుకుంటోందని డీఆర్ఐ తనిఖీల్లో వెల్లడైంది. గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో కొన్ని రోజులుగా డీఆర్ఐ అధికారులు జరుపుతున్న విస్తృ త తనిఖీల్లో భారీగా హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.4,500 కోట్లు ఉంటుం దని మొదట భావించగా.. ఆదివారానికి రూ.9 వేల కోట్లుగా తేలింది. సోమవారం తనిఖీలు పూర్తయ్యేసరికి ఆ హెరాయిన్ ధర అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.21 వేల కోట్లు ఉంటుందని లెక్కతేల్చారు. అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌కు చెందిన ‘హాసన్ హుస్సేన్ లిమిటెడ్’ అనే సంస్థ ఈ నెల 13, 14 తేదీల్లో ఈ హెరాయిన్ కన్సైన్మెంట్లను ప్రత్యేక కంటైనర్లలో ప్యాక్ చేసి ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టు నుంచి గుజరాత్‌కు తరలించింది. టాల్కం పౌడర్ పేరిట భారీగా హెరాయిన్ ప్యాకెట్లను నౌకల్లో గుజరాత్‌లోని ముండ్రా పోర్టుకు చేర్చింది. ఢిల్లీలో సూత్రధారులు.. చెన్నైలోపాత్రధారులు సిండికేట్ సూత్రధారులు ఢిల్లీలోనూ, పాత్రధారులు చెన్నైలోనూ ఉంటూ ఈ రాకెట్ నిర్వహిస్తున్నట్లు డీఆర్ఐ అధికారుల విచారణలో తేలింది. గుజరాత్‌కు చేరిన హెరాయిన్‌ను ఢిల్లీ తరలించాలన్నది ఆ సిండికేట్ లక్ష్యం. ఢిల్లీలో తమ గిడ్డంగిలో భద్రపరచి.. ఢిల్లీతోపాటు చండీగఢ్, ముంబై, చెన్నై, బెంగళూరు తదితర మెట్రో నగరాల్లోని విక్రయదారులకు వివిధ మార్గాల్లో తరలించాలన్నది సిండికేట్ వ్యూహమని గుర్తించారు. విజయవాడకు ఎలాంటి సంబంధం లేదు గుజరాత్లో డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌తో విజయవాడకు ఎలాంటి సంబంధం లేదు. చెన్నైకు చెందిన దంపతులు మాచవరం సుధాకర్, గోవిందరాజు వైశాలి డీఆర్ఐ, పోలీసు అధికారుల కళ్లుగప్పేందుకు విజయవాడలోని ఇంటి చిరునామాను వాడుకున్నారు. ఆ చిరునామాతో అషీ ట్రేడింగ్ కంపెనీని రిజిస్ట్రేషన్ మాత్రమే చేయించారు. కానీ ఇక్కడ నుంచి ఆ సంస్థ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు. ఆ దంపతులు ఎన్నో ఏళ్లుగా చెన్నైలోనే నివసిస్తున్నారు. గుజరాత్లో డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న హెరాయిన్‌ను విజయవాడ తరలించడం స్మగ్లర్ల లక్ష్యం కాదని, ఢిల్లీకి తరలించాలన్నదే వారి లక్ష్యమని విచారణలో వెల్లడైంది. ఈ కేసులో డీఆర్ఐ అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. – బి.శ్రీనివాసులు, సీపీ, విజయవాడ బురిడీ కొట్టించేందుకే విజయవాడ చిరునామా హెరాయిన్ సిండికేట్ డీఆర్ఐ, పోలీసు అధికారుల కళ్లు గప్పేందుకే విజయవాడ చిరునామాను వాడుకుంది. ఈ సిండికేట్‌లో పాత్రధారులైన చెన్నైకు చెందిన దంపతులు మాచవరం సుధాకర్, గోవిందరాజు దుర్గాపూర్ణ వైశాలి వ్యూహాత్మకంగా విజయవాడ సత్యనారాయణపురంలోని గడియారం వీధిలోని 23–14–16 డోర్ నంబర్‌తో ‘అషీ ట్రేడింగ్ కంపెనీ’ రిజిస్ట్రేషన్ చేయించారు. ఎగుమతులు, గూడ్స్ సర్వీసులు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారం నిర్వహిస్తామని పేర్కొంటూ దుర్గాపూర్ణ వైశాలి పేరిట గతేడాది ఆగస్టు 10న జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ ఇల్లు దుర్గా పూర్ణ వైశాలి తల్లి తారక పేరున ఉంది. కానీ.. ఈ చిరునామా నుంచి ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించలేదు. కేవలం రికార్డుల్లో చూపించేందుకే ఈ చిరునామాను వాడుకున్నారు. ఎప్పుడైనా డీఆర్ఐ అధికారులు తమ కన్సైన్మెంట్ను గుర్తిస్తే.. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకే ఈ ఎత్తుగడ వేశారు. అషీ ట్రేడింగ్ సంస్థ తన వ్యాపార లావాదేవీల ఇన్వాయిస్ వివరాలను తెలిపే జీఎస్టీ ఆర్–1ను ఫైల్ చేయకపోవడం గమనార్హం. కేవలం చెల్లింపు వివరాలకు సంబంధించిన జీఎస్టీ ఆర్–3బీని మాత్రమే త్రైమాసికంగా ఫైల్ చేస్తోంది. ఇదిలావుంటే.. ఆ సంస్థకు దిగుమతులు చేసుకునేందుకు సంబంధించి విజయవాడ చిరునామాతో ఎలాంటి లైసెన్స్ తీసుకోలేదు. కాబట్టి గుజరాత్ ముంద్రా పోర్టులో దిగుమతి అయిన హెరాయిన్‌తో విజయవాడకు వాస్తవంగా ఎలాంటి సంబంధం లేదని డీఆర్ఐ అధికారుల దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. ఈ సిండికేట్ చెన్నై, ఢిల్లీ తదితర ప్రదేశాల్లో మరో చిరునామాతో దిగుమతుల లైసెన్స్‌ను తీసుకుని దందా సాగిస్తోందా అన్న దిశగా డీఆర్ఐ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. కాగా, దుర్గాపూర్ణ వైశాలి తల్లి పేరిట విజయవాడలో గల ఇంటి ఆవరణలో పార్కింగ్ చేసి ఉన్న స్కూటర్ (ఏపీ 16 బీఎన్2268) గోవిందరాజు విద్యానాథ్, తండ్రి కోటేశ్వరశర్మ పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఉంది. విజయవాడలోని ఆ చిరునామాలో కొంతకాలంగా ఎవరూ ఉండడం లేదు. గుజరాత్లో డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్న అఫ్గాన్ జాతీయులు ఇచ్చిన సమాచారంతో చెన్నైలో ఉంటున్న అషీ ట్రేడింగ్ కంపెనీకి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఢిల్లీ, చెన్నై కేంద్రాలుగా దేశవ్యాప్తంగా వేళ్లూనుకున్న ఈ రాకెట్ దందాపై డీఆర్ఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
అఫ్గాన్ టు గుజరాత్.. వయా విజయవాడ!
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్‌కు విజయవాడ గేట్వేగా మారిందన్న సమాచారం కలకలం సృష్టిస్తోంది. ఏకంగా రూ.9 వేల కోట్ల విలువైన హెరాయిన్ స్మగ్లింగ్‌తో విజయవాడలోని ఓ వ్యాపార సంస్థకు సంబంధాలున్నాయన్న విషయం విస్మయం కలిగిస్తోంది. కేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు గుజరాత్‌లోని ముండ్రా పోర్ట్‌లో స్వాధీనం చేసుకున్న హెరాయిన్ స్మగ్లింగ్ కేసులో తీగ లాగితే విజయవాడలో డొంక కదలింది. టాల్కం పౌడర్ కాదు..హెరాయిన్ అఫ్గానిస్తాన్ నుంచి గుజరాత్‌లోకి హెరాయిన్‌ను స్మగ్లింగ్ చేశారని కేంద్ర డీఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. దాంతో గుజరాత్‌లోని ముండ్రా పోర్టులో తనిఖీలు నిర్వహించగా.. భారీ పరిమాణంలో హెరాయిన్‌ను గుర్తించారు. టాల్కం పౌడర్ పేరుతో ఉన్న భారీ కన్సైన్మెంట్ను తెరచి చూడగా.. అందులో భారీస్థాయిలో హెరాయిన్ ఉండటం విస్మయపరిచింది. కాందహార్‌లోని ‘హాసన్ హుస్సేన్ లిమిటెడ్’ అనే వ్యాపార సంస్థ నుంచి ‘టాల్కం పౌడర్’ పేరుతో ఆ హెరాయిన్‌ను దిగుమతి చేసుకున్నారు. తొలుత ఆ హెరాయిన్ విలువ రూ.2,500 కోట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు. పూర్తిస్థాయిలో తనిఖీలు చేయగా.. దాని విలువ ఏకంగా రూ.9 వేల కోట్లుగా నిర్ధారించారు. ఇంతకీ ఆ హెరాయిన్‌ను ఎవరు దిగుమతి చేశారని దర్యాప్తు చేయగా... విజయవాడలోని లింకులు బయటపడ్డాయి. పోలీసుల అదుపులో నలుగురు విజయవాడలోని అషీ ట్రేడింగ్ కంపెనీ అఫ్గానిస్తాన్ నుంచి హెరాయిన్‌ను దిగుమతి చేసుకుందని కన్సైన్మెంట్ రికార్డుల్లో ఉంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విజయవాడలోని గడియారం వీధిలోని అషీ ట్రేడింగ్ కంపెనీని గుర్తించారు. ఆ కంపెనీ ప్రతినిధులను అదుపులోకి తీసుకుని విచా రణ చేపట్టారు. కాగా, వారు పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. తమది కేవలం ట్రాన్స్పోర్ట్ వ్యాపారం మాత్రమేనని.. గుజరాత్లో డీఆర్ఐ అధికారులు జప్తు చేసిన హెరాయిన్‌తో తమకు సంబంధంలేదని చెప్పినట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాలకు తరలించేందుకే.. ఆ హెరాయిన్‌ను గుజరాత్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు తరలించనున్నారన్నది పోలీసుల విచారణలో ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. కాగా, స్మగ్లింగ్ రాకెట్ అసలు ప్రణాళిక ఏమిటన్న దానిపై పోలీసులు ఇతమిత్థంగా ఇంకా ఓ అంచనాకు రాలేదు. గుజరాత్ నుంచి విజయవాడ తీసుకువచ్చి ఇక్కడ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా చేస్తారా లేక విజయవాడతో సంబంధం లేకుండా నేరుగా గుజరాత్ నుంచి చెన్నై తరలించాలన్నది స్మగ్లర్ల ప్రణాళికా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. అషీ ట్రేడింగ్ కంపెనీ పేరును మాత్రమే స్మగ్లింగ్ రాకెట్ వాడుకుంటోందా అన్న దాంట్లో వాస్తవం ఎంతన్నది అంతుబట్టడం లేదు. ప్రస్తుతానికి అషీ ట్రేడింగ్ కంపెనీకి చెం దిన ప్రతినిధులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సింథటిక్ డ్రగ్స్‌ను ఆన్లైన్ ద్వారా తె ప్పించి విక్రయిస్తున్న ముఠాను గుంటూరు పో లీసులు కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేశారు. అం తలోనే రూ.9వేల కోట్ల హెరాయిన్ స్మగ్లింగ్‌లో విజయవాడ కేంద్ర బిందువుగా ఉందని తెలియడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఈ దందాపై పోలీస్, డీఆర్ఐ ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు జరిపితే తప్ప వాస్తవాలు బయటపడవ ని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశంపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. హెరాయిన్ స్మగ్లింగ్ వ్యవహారంలో విజయవాడ లింకులపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇదే అంశంపై విజయవాడలోని కేంద్ర డీఆర్ఐ డిప్యూటీ డైరెక్టర్ టి.రాజీవ్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. -
ఆరో అంతస్తు నుంచి నోట్ల వర్షం!
కోల్‌కతా : ఓ వైపు డీఆర్ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్) అధికారులు సోదాలు నిర్వహిస్తుండగానే.. మరోవైపు నోట్ల వర్షం కురవడం పశ్చిమబెంగాల్లో కలకలం రేపింది. ఈ ఘటన కోల్‌కతా(సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్)లో చోటుచేసుకుంది. వివరాలు.. బెంటింక్ వీధిలోని హోక్ మర్చంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లావాదేవీల్లో అవకతవకలు జరిగాయన్న సమాచారంతో డీఆర్ఐ అధికారులు సదరు ఆఫీసులో సోదాలు నిర్వహించారు. సరిగ్గా అదే సమయంలో ఆఫీసు బిల్డింగులోని ఆరో అంతస్తు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు నోట్ల కట్టలు కిందపడేశారు. ఈ క్రమంలో రూ. 2000, రూ. 500, రూ. 100 నోట్లు కిందకు పడుతుండటంతో బిల్డింగ్ కింద ఉన్న వారు వాటిని ఏరుకున్నారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ విషయంతో రైడ్ జరిగిన కంపెనీకి సంబంధం ఉందా లేదా అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. #WATCH Bundles of currency notes were thrown from a building at Bentinck Street in Kolkata during a search at office of Hoque Merchantile Pvt Ltd by DRI officials earlier today. pic.twitter.com/m5PLEqzVwS — ANI (@ANI) November 20, 2019 -
శంషాబాద్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. బుధవారం ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేపట్టిన సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్, డీఆర్ఐ అధికారులు 6.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే సౌది ఎయిర్‌లైన్స్ విమానంలో జెడ్డా నుంచి వచ్చిన 14 మందిని అదుపలోకి తీసుకున్నారు. అయితే దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డవారిని పాతబస్తీకి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. అయితే తమను జెడ్డాలోని గోల్డ్ స్మగ్లింగ్ ముఠా సభ్యులు బెదిరించడం వల్లనే ఇలా చేయాల్సి వచ్చిందని నిందితులు పోలీసుల ముందు వారి ఆవేదన వ్యక్తం చేశారు. ‘మేమంతా ఉమ్రా యాత్రకు వెళ్లగా.. అక్కడ గోల్డ్ స్మగ్లింగ్ ముఠా సభ్యులు వేధింపులకు గురిచేశారు. మాకు బంగారం ఇచ్చి.. దానిని హైదరాబాద్‌లో ఇవ్వాల్సిందిగా ఆదేశింశారు. లేకపోతే అక్రమంగా ఉమ్రా యాత్రకు వచ్చారని స్థానిక పోలీసులకు పట్టిస్తామని వాళ్లు బెదిరింపులకు దిగారు. అందుకు భయపడి బంగారాన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చామ’ని నిందితులు పోలీసులకు వివరించారు. మరోవైపు వీరి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 2.17 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. -
అత్యంత హానికారక సిగరెట్లు ధ్వంసం
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న అత్యంత హానికారక సిగరెట్లను అధికారులు గుర్తించి ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు రూ.6.50 కోట్లు ఉంటుందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు పేర్కొన్నారు. వివరాలు... దుబాయ్‌లో తయారైన మోండ్ బ్రాండ్, ఇంగ్లాండ్‌లో తయారైన బెన్సన్ అండ్ హెడ్జెస్ సిగరెట్లు సిటీకి అక్రమంగా రవాణా అవుతున్నాయి. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ముఠాపై డీఆర్ఐ అధికారులు కన్నేశారు. ఈ గ్యాంగ్ సిగరెట్లను సముద్రమార్గంలో కంటైనర్ల ద్వారా ముంబైకి తీసుకువస్తున్నట్లు గుర్తించారు. ఆ కంటెయినర్లలో టేపులు ఉన్నట్లు, దుబాయ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు రికార్డు ల్లో పొందుపరిచినట్లు అనుమానించారు. తాజాగా తిమ్మాపూర్‌లోని ఇన్‌ల్యాండ్ కంటెయినర్ డిపో(ఐసీడీ)కి వచ్చిన ఈ కంటెయినర్లను డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. 15 లక్షల బెన్సన్ అండ్ హెడ్జెస్, 30.3 లక్షల మోండ్ సిగరెట్లను స్వాధీనం చేసుకుని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. వీటిలో కొన్ని నకిలీ సిగరెట్లు కూడా ఉన్నట్లు అధికారులు తేల్చారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సూచన మేరకు రాంకీ సంస్థకు చెందిన దుండిగల్ యూనిట్లో కస్టమ్స్ అధికారులు మంగళవారం ఆ సిగరెట్లను ధ్వంసం చేశారు. పన్ను ఎగ్గొట్టడానికే... ఆరోగ్యానికి హానికరమైన, స్థానిక వ్యాపారులకు నష్టం కలిగించే ఈ సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం(కస్టమ్స్ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవుండే ఈ సిగరెట్లలో ఒక్కో దానికీ ఒక్కో రకమైన పన్ను ఉంటుంది. రూ.10 ఖరీదైన సిగరెట్‌ను దిగుమతి చేసుకుంటే దానిపై పన్ను రూ.15 ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. ఈ పన్నును ఎగ్గొట్టడానికే నగరానికి చెందిన ముఠా భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతోందని డీఆర్ఐ దర్యాప్తులో తేలింది. సిటీలో ఉన్న హోల్‌సేల్ వ్యాపారులతో సంబంధాలు పెట్టుకుని వీటిని మార్కెట్లోకి తరలిస్తున్నారు. ఇతర దేశాల్లో తయారవుతున్న ఈ సిగరెట్లలో ఏ తరహా పొగాకు వాడుతున్నారనేది స్పష్టంగా తెలియదు. ఆ పొగాకు ఇక్కడి పరిస్థితులకు ఎంత అనుకూలమో చెప్పలేమని అధికారులు అంటున్నారు. నిబంధనల ప్రకారం దిగుమతి అయ్యే సిగరెట్లను ఆయా పోర్టులు, విమానాశ్రయాల్లో ఉండే కస్టమ్స్ హెల్త్ ఆఫీసర్లు పరీక్షించి ధ్రువీకరిస్తారని, అక్రమ రవాణాలో ఆ అవకాశం లేకుండానే విపణిలోకి వెళ్లిపోతున్నాయని అంటున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలు లేని ఈ సిగరెట్లు ఆరోగ్యానికి ఎనలేని హాని చేస్తాయని హెచ్చరిస్తున్నారు. -
ఏ మాత్రం డౌట్ రాకుండా..
జీన్స్ ప్యాంట్స్‌లో మాంద్రాక్స్ మాత్రలు - కువైట్‌కు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం - ఎయిర్‌కార్గోలో గుర్తించిన డీఆర్ఐ అధికారులు సాక్షి, హైదరాబాద్: నిషేధిత మాదకద్రవ్యమైన మాంద్రాక్స్ (మెథక్యులోన్)ను మాత్రల రూపంలో కువైట్‌కు పంపేందుకు చేసిన ప్రయత్నాన్ని డీఆర్ఐ అధికారులు అడ్డుకున్నారు. శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయం ఎయిర్‌కార్గోలో తనిఖీలు చేసిన బృందాలు రూ.9.2 లక్షల విలువైన 2,300 మాంద్రాక్స్ మాత్రలను స్వాధీనం చేసుకున్నాయి. జీన్స్ ప్యాంట్లకు నడుము భాగంలో ఉండే పట్టీలో ఈ మాత్రల్ని నేర్పుగా పార్శిల్ చేసిన స్మగ్లర్లు కొరియర్ ద్వారా పంపే ప్రయత్నం చేశారు. దీన్ని పంపిన వ్యక్తి చిరునామా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలోని కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన మహ్మద్ రఫీ.. మాంద్రాక్స్ మాత్రల్ని ఆరు జీన్స్ ప్యాంట్లలో పార్శిల్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు ఎయిర్‌కార్గోలో తనిఖీ చేశారు. ప్రతి మాత్ర పైనా ‘225’అనే కోడ్ నంబర్ రాసి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పార్శిల్‌ను పంపింది రఫీనేనా? లేక ఎవరైనా బోగస్ చిరుమానా వినియోగించారా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. -
ఆకస్మిక దాడులు.. 6.5 కోట్ల నగదు పట్టివేత
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీగా హవాలా సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని చాందినీ చౌక్ ప్రాంతంలో డీఆర్ఐ అధికారులు ఆదివారం రాత్రి దాడులు నిర్వహించి పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు వారి వద్ద నుంచి రూ.6.5 కోట్ల నగదుతో పాటు 21 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు.. హవాలా నిర్వహించి మోసాలకు పాల్పడుతున్న స్థావరాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు ఓ అధికారి తెలిపారు. హవాలా గ్యాంగులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. -
వేల కోట్ల హవాలా రాకెట్ గుట్టురట్టు
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఓ భారీ హవాలా స్కాం గుట్టును రట్టు చేసింది. సామాన్యుల పత్రాలను దొంగిలించి భారీమొత్తాన్ని దేశం నుంచి బయటకు పంపేస్తున్న వైనాన్ని బయటపెట్టింది. ఈ స్కాం దాదాపు రూ. 2వేల కోట్లకు పైగా ఉంటుందని, ఇందులో నాలుగు జాతీయ బ్యాంకులు, ఒక ప్రైవేటు బ్యాంకు పాత్ర కూడా ఉందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. గత సంవత్సరం అక్టోబర్ నుంచి 2016 మార్చి వరకు దక్షిణ ముంబైలోని ఆయా బ్యాంకు శాఖల్లో జరిగిందని చెప్పారు. చాలా స్కాముల్లో జరిగినట్లే ఇక్కడ కూడా ఇందులో పేర్లున్నవాళ్లకు అసలు దీంతో ఏమాత్రం సంబంధం లేకపోగా.. అసలు ఇలా జరిగిందని కూడా తెలియదు. ఉదాహరణకు సినిమాహాల్లో పనిచేసే ఒక కార్మికుడి పేరుతో ఖాతా తెరిచి.. దాన్నుంచి విదేశాల్లో ఉన్న వేరే ఖాతాకు రూ. 400 కోట్లు పంపారు. అలాగే గొవాండీ రైల్వే స్టేషన్లో పనిచేసే ఒక స్వీపర్, ఒక టికెట్ కలెక్టర్, ఘట్కోపర్ వద్ద పానీపూరీలు అమ్ముకునే వ్యక్తి.. వీళ్ల పేర్లతో ఖాతాలు తెరిచి రూ. 400-600 కోట్ల వరకు విదేశీ ఖాతాలకు పంపారు. బోగస్ కంపెనీ ఆఫీసులు నెలకొల్పి, ఈ లావాదేవీలు పూర్తికాగానే వాటిని మూసేస్తున్నారని.. నల్లధనాన్ని పన్నుల బాధ లేని విదేశాలకు పంపడమే వీళ్ల ఉద్దేశమని డీఆర్ఐ అధికారి ఒకరు వివరించారు. ఈ స్కాం మొత్తం ఒక కంపెనీ ద్వారానే జరిగిందని, దాని అడ్రస్ మస్జిడ్ బందర్ ప్రాంతంలో ఉన్నట్లు చూపించారని, ఆగ్నేయాసియా దేశాల నుంచి సరుకులు దిగుమతి చేసుకున్నట్లు చెప్పారని అన్నారు. ప్రాథమిక విచారణ ప్రకారం మొత్తం స్కాం విలువ రూ. 2,232 కోట్లని తెలిపారు. ఇంత మొత్తం విలువగల ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి ఈ డబ్బు పంపినట్లు చూపించినా.. వాస్తవానికి వాటి అసలు ఖరీదు రూ. 25 కోట్లు మాత్రమేనన్నారు. ఇంత పెద్ద పెద్ద లావాదేవీలు జరుగుతున్నా వాటిని బ్యాంకు అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. బంగారం, వజ్రాలను దేశంలోకి స్మగ్లింగ్ చేసుకుని, దానికి సంబంధించిన మొత్తాలను గల్ఫ్, ఆగ్నేయాసియా దేశాలకు హవాలా ద్వారా పంపుతారని కూడా ఆయన వివరించారు. -
హౌరా ఎక్స్‌ప్రెస్‌లో బంగారం స్మగ్లింగ్.. అరెస్ట్
హైదరాబాద్: చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో సోమవారం డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హౌరా ఎక్స్‌ప్రెస్‌లో దంపతుల నుంచి 10 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మయన్మార్ నుంచి కోల్‌కతా మీదుగా బంగారాన్ని చెన్నైకు దంపతులు తీసుకవచ్చారు. హౌరా ఎక్స్‌ప్రెస్‌లో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారంటూ అందిన పక్కా సమాచారంతో డీఆర్ఐ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బంగారం స్మగ్లింగ్ చేసిన మరియ సెల్వరాజ్ అనే దంపతులను అరెస్ట్ చేశారు.