Ranya Rao : రన్యారావు కేసులో భారీ ట్విస్ట్ | Shocking Twist Revealed In Kannada Actress Ranya Rao Case, More Details Inside | Sakshi
Sakshi News home page

Ranya Rao : రన్యారావు కేసులో భారీ ట్విస్ట్

Published Tue, Mar 11 2025 8:44 PM | Last Updated on Wed, Mar 12 2025 8:49 AM

big twist on Actress Ranya Rao case

బెంగళూరు : కన్నడ నటి రన్యారావు కేసులో భారీ ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఆమెపై డీఆర్‌ఐ అధికారులకు ఆమె భర్తే జతిన్‌ హుక్కేరి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పెళ్లైన రెండు నెలల నుంచి తరచు విదేశాలకు వెళ్తోంది. ఆమె విదేశీ టూర్లతో నిత్యం గొడవలు జరిగేవి.

ఈ క్రమంలో తన భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో తన భర్త రన్యారావు డీఆర్‌ఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రన్యారావు కదలికలపై నిఘా పెట్టిన డీఆర్‌ఐ అధికారులు.. ఆమె బంగారం స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్‌ చేశారు. 
 

15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్‌కు వెళ్లడం
కన్నడ హీరోయిన్‌ రన్యారావు (Ranya Rao) బంగారం అక్రమరవాణా కేసులో కటకటాలపాలైంది. 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్‌కు వెళ్లడం, అదికూడా ప్రతిసారి సేమ్‌ డ్రెస్‌ ధరించడంతో అధికారులకు అనుమానమొచ్చింది. సోమవారం (మార్చి 3న) ఆమెను బెంగళూరు ఎయిర్‌పోర్టులో తనిఖీ చేయగా 14 కిలోలకు పైగా బంగారంతో అడ్డంగా దొరికిపోయింది. దీంతో ఆమెను అరెస్టు చేసిన అధికారులు జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు.  ఇకపోతే రన్యా రావు తండ్రి  కర్ణాటక డీజీపీ డాక్టర్‌ కే.రామచంద్రారావు 

పెళ్లయ్యాక మళ్లీ కలిసిందే లేదన్న డీజీపీ
ఇప్పటికే ఈ విషయంపై డీజీపీ స్పందిస్తూ రన్యాకు నాలుగు నెలలకిందటే పెళ్లి జరిగిందని, అప్పటినుంచి తనను కలవలేదని పేర్కొన్నారు. కూతురు, అల్లుడు చేసే పనుల గురించి తనకెటువంటి విషయాలు తెలియదన్నాడు. ఈ క్రమంలో రన్యా భర్త ఎవరన్న వివరాలు బయటకు వచ్చాయి. రన్యా భర్త పేరు జతిన్‌ హుక్కేరి. ఈయన ఆర్కిటెక్ట్‌. బెంగళూరులో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ పట్టా పొందాడు. తర్వాత లండన్‌లో డిస్‌రప్టివ్‌ మార్కెట్‌ ఇన్నొవేషన్‌ కోర్సు చదివాడు. 

తండ్రి డీజీపీ, భర్త ఆర్కిటెక్ట్‌
మొదట్లో బెంగళూరులోని పలు రెస్టారెంట్లకు డిజైనర్‌గా పని చేశాడు. లండన్‌లోనూ ఆర్కిటెక్ట్‌గా సేవలందించాడు. WDA & DECODE LLC సంస్థను స్థాపించడంతోపాటు దానికి క్రియేటివ్‌ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. క్రాఫ్ట్‌ కోడ్‌ కంపెనీకి ఫౌండర్‌ కూడా ఇతడే! రన్యారావును పెళ్లి చేసుకున్నాక తనతో కలిసి పలుమార్లు దుబాయ్‌ ట్రిప్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎయిర్‌పోర్టులో బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ రన్యా దొరికిపోగా.. ఆమె ఇంటిని సైతం తనిఖీ చేశారు. ఈ సోదాలో రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సినిమా
రన్యా రావు.. కిశోర్‌ నమిత్‌ కపూర్‌ యాక్టింగ్‌ స్కూల్‌లో నటనపై శిక్షణ తీసుకుంది. మాణిక్య అనే కన్నడ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఇది ప్రభాస్‌ మిర్చి మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. పటాస్‌ కన్నడ రీమేక్‌ పటాకిలో హీరోయిన్‌గా నటించింది. తమిళంలో వాఘా మూవీ చేసింది. ఎనిమిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement