
ఆకస్మిక దాడులు.. 6.5 కోట్ల నగదు పట్టివేత
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీగా హవాలా సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని చాందినీ చౌక్ ప్రాంతంలో డీఆర్ఐ అధికారులు ఆదివారం రాత్రి దాడులు నిర్వహించి పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు వారి వద్ద నుంచి రూ.6.5 కోట్ల నగదుతో పాటు 21 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
తమకు అందిన సమాచారం మేరకు.. హవాలా నిర్వహించి మోసాలకు పాల్పడుతున్న స్థావరాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు ఓ అధికారి తెలిపారు. హవాలా గ్యాంగులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.