అంతర్జాతీయ స్మగ్లర్ల అరెస్ట్, 3కిలోల బంగారం సీజ్ | Gold smugglers arrested at Shamshabad airport, 3kg gold seized | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ స్మగ్లర్ల అరెస్ట్, 3కిలోల బంగారం సీజ్

Published Tue, Oct 22 2013 9:10 AM | Last Updated on Thu, Aug 2 2018 4:08 PM

Gold smugglers arrested at Shamshabad airport, 3kg gold seized

హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు మూడు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.ఇందుకు సంబంధించి కర్ణాటకకు చెందిన ఓ మహిళ సహా అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ దంపతుల వద్ద నుంచి రెండు కిలోలు, సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి కిలో బంగారాన్ని సీజ్ చేశారు.

ఈ ముఠా  గత కొంతకాలంగా బ్యాంకాక్, మలేషియా,సింగపూర్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ ముఠా సుమారు 16 సార్లు చెన్నై విమానాశ్రయంలో దిగినట్లు అధికారులు గుర్తించారు. దాంతో స్మగ్లర్లను ప్రశ్నించేందుకు చెన్నై నుంచి కస్టమ్స్ అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. మరోవైపు నకిలీ పాస్పోర్టుతో ప్రయాణిస్తూ ఓ ప్రయాణికుడు పట్టుబడ్డాడు. మస్కట్ నుంచి వచ్చిన కేరళకు చెందిన  ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement