శంషాబాద్ ఎయిర్పోర్టులో 18కిలోల బంగారం సీజ్
హైదరాబాద్ : హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ముగ్గురు అంతర్జాతీయ స్మగ్లర్లను కష్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. అక్రమంగా తరలిస్తున్న 18 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముగ్గురు తమిళనాడుకు చెందిన ఆదిమహ్మాద్, జైనుద్దీన్, చొక్కలింగం మురుగనందన్‌లుగా గుర్తించారు.
ఎయిర్‌పోర్ట్ కేంద్రంగా అంతర్జాతీయస్థాయిలో బంగారం స్మగ్లింగ్ జరుగుతుందని సమాచారం రావడంతో.. సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. స్మగ్లర్లు సింగపూర్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్టు కస్టమ్స్ అధికారుల విచారణలో తేలింది. వారి ముగ్గురిని అదుపులోకి తీసుకొని...వారి పాస్‌పోర్ట్‌లను అధికారులు సీజ్ చేశారు.
ఈ ఏడాది శంషాబాద్ విమానాశ్రయంలో మొత్తం 43 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. 13కేసులు నమోదు కాగా, 23మందిని అరెస్ట్ చేశారు. బంగారంపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవలి కాలంలో స్మగ్లర్లు తమ రూట్ మార్చారు. ప్రయాణికులు రూపంలో విమానాశ్రయాల నుంచి వీటిని అక్రమంగా తరలిస్తున్నారు. బంగారం బిస్కెట్లు, కడ్డీలు, ఆభరణాల రూపంలో వాటిని లోదుస్తుల్లోనూ, షూలలో పెట్టుకుని వస్తున్నారు. ఇటీవలి కాలంలో శంషాబాద్ విమానాశ్రం నుంచి కేజీల స్థాయిలో బంగారం పట్టుపడుతోంది.