లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ సమావేశంలో ఓ వ్యక్తి షూని విసరడం కలకలం రేపింది. కార్యకర్తలను అద్దేశించి మాట్లాడతుండగా స్వామి ప్రసాద్ మౌర్యపై.. ఓ వ్యక్తి షూని విసిరాడు. దీంతో అక్కడే ఉన్న మిగిలిన కార్యకర్తలు అతన్ని పట్టుకుని చితకబాదారు. నిందితుడు నాయకునిపై షూ విసరడానికి గల కారణాలు తెలియదు.
లక్నోలో ఈ రోజు ఎస్పీ సమావేశం నిర్వహించింది. పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా సమావేశానికి వచ్చి ప్రసంగించాల్సి ఉంది. అంతకు ముందు ఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్య సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇంతలో కార్యకర్తల గుంపు నుంచి ఓ షూ శరవేగంగా మౌర్య వైపు దూసుకొచ్చింది. క్షణాల్లో దాన్నుంచి మౌర్య తప్పించుకున్నారు. అయితే.. షూ విసిరిన వ్యక్తిని పట్టుకున్న ఇతర కార్యకర్తలు అతన్ని చితక్కొట్టారు.
VIDEO | A man dressed up as an advocate hurls shoe at Samajwadi Party leader Swami Prasad Maurya in Lucknow. The attacker was later roughed up by Maurya's supporters. More details are awaited. pic.twitter.com/OQCU5G3xVE
— Press Trust of India (@PTI_News) August 21, 2023
సమావేశానికి అఖిలేష్ యాదవ్ రాక ముందే ఈ ఘటన జరిగింది. ఇది బీజేపీ నేతల పనేనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో మౌర్య ప్రధాన ఓబీసీ నాయకుడు. 2022లో బీజేపీ నుంచి బయటకు వచ్చి ఎస్పీలో చేరారు. ఇటీవల రామచరిత మానస్‌పైన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి: చంద్రయాన్-3పై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment