thrown
-
బహిరంగంగా ప్రశ్నాపత్రాలు.. నేటి నుంచి వార్షిక పరీక్షలు!
బీహార్ విద్యాశాఖ లీలలు తరచూ బయటపడుతుంటాయి. రాష్ట్ర విద్యాశాఖ అడిషనల్ సెక్రటరీ కెకె పాఠక్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బీహార్ విద్యావ్యవస్థలో మార్పురావడం లేదు. దీనికి ఉదాహరణగా ఛప్రా జిల్లా పాఠశాల నిలిచింది. ఈ పాఠశాలలో బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్ నిర్వహించబోయే 11వ, 9వ తరగతుల వార్షిక పరీక్షల ప్రశ్న పత్రాల బండిల్స్ బహిరంగంగా విసిరివేశారు. వీటిని పంపిణీ చేసేందుకు విద్యాశాఖలో ఏ ఉద్యోగి బాధ్యత తీసుకోలేదు. జిల్లాలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తమ పాఠశాల కోడ్ ప్రకారం ప్రశ్నపత్రాలు తీసుకువెళ్లేందుకు ఈ పాఠశాలకు వచ్చి, టెర్రస్ అంతా కలియ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు 9,11 తరగతుల వార్షిక పరీక్షలను మార్చి 13 నుంచి నిర్వహించనుంది. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను జిల్లాలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు తమ పాఠశాల కోడ్ ప్రకారం ప్రశ్నపత్రాలను వెదికేందుకు గత మూడు రోజులుగా ఇక్కడే తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారు. పరీక్ష తేదీ సమీపించినా కొన్ని పాఠశాలలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు సంబంధిత ఉపాధ్యాయులకు ఇంకా చేరనేలేదు. మీడియాకు అందిన అందిన సమాచారం ప్రకారం 11వ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 13 నుంచి, 9వ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలో తూర్పు చంపారన్‌లో కూడా విద్యాశాఖాధికారుల ఇటువంటి నిర్లక్ష్యం కనిపించింది. -
జనరల్ టిక్కెట్‌తో ఏసీ కోచ్‌లోకి మహిళ.. ప్రతాపం చూపిన టీటీఈ!
నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిక్ష విధించాలి.. కానీ శిక్ష పేరుతో ఒక్కోసారి అధికారులు చెలరేగిపోతుంటారు. ఇటువంటి ఉదంతమొకటి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓ మహిళ జనరల్ టిక్కెట్‌తో రైలులోని ఏసీ కోచ్ ఎక్కేసింది. ఈ విషయాన్ని గమనించిన టీటీఈ ఆమెపై తన ప్రతాపం చూపాడు. ఈ ఘటన ఢిల్లీ ఎన్సీఆర్ లోని ఫరీదాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. జనరల్ టిక్కెట్‌తో ఒక మహిళ జీలం ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ బోగీలోకి ఎక్కేసింది. దీనిని గమనించిన అదే రైలులోని టీటీఈ ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైలులో నుంచి తోసివేశాడు. దీంతో ఆమె రైలు- ప్లాట్‌ఫారమ్ మధ్య చిక్కుకుపోయింది. ఆ మహిళ ఆర్తనాదాలు విన్న పోలీసులు అతి కష్టం మీద ఆమెను కాపాడగలిగారు. బాధితురాలికి తల, చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను ఝాన్సీలో ఒక వివాహానికి హాజరు కావాల్సి ఉందని, అయితే తను స్టేషన్‌కు చేరుకునే సమయానికి, రైలు నెమ్మదిగా కదులుతున్నదని, దీంతో కనిపించిన బోగీలో వెంటనే ఎక్కేశానని తెలిపింది. ఈ విషయాన్ని టీటీఈకి చెప్పినా పట్టించుకోలేదని, తగిన జరిమానా చెల్లిస్తానని తాను చెప్పినా వినకుండా రైలు నుంచి తోసివేశారని ఆమె ఆరోపించింది. కాగా ఈ ఉదంతపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
నాయకునిపై 'షూ' విసిరిన యువకుడు..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ సమావేశంలో ఓ వ్యక్తి షూని విసరడం కలకలం రేపింది. కార్యకర్తలను అద్దేశించి మాట్లాడతుండగా స్వామి ప్రసాద్ మౌర్యపై.. ఓ వ్యక్తి షూని విసిరాడు. దీంతో అక్కడే ఉన్న మిగిలిన కార్యకర్తలు అతన్ని పట్టుకుని చితకబాదారు. నిందితుడు నాయకునిపై షూ విసరడానికి గల కారణాలు తెలియదు. లక్నోలో ఈ రోజు ఎస్పీ సమావేశం నిర్వహించింది. పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా సమావేశానికి వచ్చి ప్రసంగించాల్సి ఉంది. అంతకు ముందు ఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్య సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇంతలో కార్యకర్తల గుంపు నుంచి ఓ షూ శరవేగంగా మౌర్య వైపు దూసుకొచ్చింది. క్షణాల్లో దాన్నుంచి మౌర్య తప్పించుకున్నారు. అయితే.. షూ విసిరిన వ్యక్తిని పట్టుకున్న ఇతర కార్యకర్తలు అతన్ని చితక్కొట్టారు. VIDEO | A man dressed up as an advocate hurls shoe at Samajwadi Party leader Swami Prasad Maurya in Lucknow. The attacker was later roughed up by Maurya's supporters. More details are awaited. pic.twitter.com/OQCU5G3xVE — Press Trust of India (@PTI_News) August 21, 2023 సమావేశానికి అఖిలేష్ యాదవ్ రాక ముందే ఈ ఘటన జరిగింది. ఇది బీజేపీ నేతల పనేనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో మౌర్య ప్రధాన ఓబీసీ నాయకుడు. 2022లో బీజేపీ నుంచి బయటకు వచ్చి ఎస్పీలో చేరారు. ఇటీవల రామచరిత మానస్‌పైన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదీ చదవండి: చంద్రయాన్-3పై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు -
బీజేపీ ఎమ్మెల్యేను అసెంబ్లీ నుంచి లాక్కెళ్తున్న దృశ్యాలు వైరల్
అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేని బయటకు లాక్కెళ్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు ప్రతిపక్ష నేతతో ఇలానేనా వ్యహిరించేది అంటూ అరవడం కూడా వీడియోలో వినవచ్చు. వివరాల్లోకెళ్తే.. బిహార్‌లోని బీజేపీ ఎమ్మెల్యే జిబేష్ కుమార్‌ను అసెంబ్లీ నుంచి కొందరూ మార్షల్స్ బయటకు లాక్కెళ్తున్నారు. బిహార్ షరీఫ్ పట్టణంలో శ్రీరామ నవమి వేడుకల్లో చెలరేగిన అల్లర్లను అరికట్టడంలో మహాఘట్ బంధన్ సర్కార్ అడ్డుకట్టవేయడంలో విఫలమైందని బీజేపీ తీవ్రంగా ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అయితే బీజీపీ, ఆర్ఎస్ఎస్ ప్రమేయం వల్ల ఈ ఘర్షణలు తలెత్తాయని బిహార్ ప్రభుత్వం ఆరోపించడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఆదివారం నవాడా జిల్లాలో జరిగిన ర్యాలీలో అమిత్ షా అక్కడ బీజీపీ అధికారంలోకి వస్తే ఇలాంటి అల్లర్లను తలకిందులుగా ఉరితీస్తా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను బిహార్ అధికార యంత్రాంగం ఖండించింది. బిహార్ షరీఫ్ పట్టణంలో జరిగిన అల్లర్లులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని దర్యాప్తు సాగుతోందని వెల్లడించింది ప్రభుత్వం. అందుకోసం అదనపు పారామిలటరీ బలగాలను కూడా పంపాలని హోం శాఖ నిర్ణయించినట్లు కూడా బిహార్ ప్రభుత్వ పేర్కొంది ఐతే బిజేపీ నేత జిబేష్ కుమార్ స్పీకర్‌ని అవమానించడంతో ఆయనపై ప్రభుత్వం ఇలా చర్యలు తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కుమార్ సర్వజీత్ పేర్కొన్నారు. ఈ రోజు ప్రతిపక్షాలకు చెందిన కొందరూ వ్యక్తులు స్పీకర్‌ని దారుణంగా అవమానించారని అన్నారు. ఇది అసెంబ్లీలో స్పీకర్‌కు జరిగిన అతిపెద్ద అవమానమని మీడియాతో సర్వజీత్ చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అల్లర్లు లేకుండా ప్రశాంతంగా ఉందని తెలిపారు. కాగా, బిహార్ సీఎం నితీష్ కుమార్ బిహార్‌లోని ససారం, షరీఫ్లలో శ్రీ రామనవమి ఉత్సావాల్లో తొలిసారిగా మతపరమైన ఉద్రిక్తతలు చొటు చేసుకున్నాయని, అది అనుకోకుండా జరిగింది కాదని అనుమానం వ్యక్తం చేశారు. #WATCH | Ruckus in Bihar Assembly over recent incidents of violence in Nalanda & Rohtas. pic.twitter.com/Rq3VgCbO16 — ANI (@ANI) April 5, 2023 (చదవండి: మరోసారి భారీగా కేసులు.. నాలుగువేలకుపైనే! గడిచిన 5 నెలల్లో ఇదే తొలిసారి) -
భార్య మీదకు విసిరిన రాయి తగిలి బిడ్డ మృతి
సాక్షి, చెన్నై: భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవలో భార్యపై విసిరిన రాయి ఆమె చేతిలో ఉన్న బిడ్డకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు.. తేని జిల్లా దేవదాన పట్టికి చెందిన నాగరాజు (23). ఇతను తన బంధువైన నవీన (20)ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. నవీన గర్భం దాల్చిన సమయంలో కట్నం తెమ్మని ఆమెను వేధించేవాడు. దీంతో ఆమె రాయప్పన్‌పట్టిలో ఉన్న తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో నెల రోజులకు క్రితం నవీనకు మగబిడ్డ పుట్టాడు. కోపంతో ఉన్న నాగరాజు భార్య బిడ్డను చూడడానికి అత్త ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్యతో గొడవ పడ్డాడు. ఆగ్రహంతో ఊగిపోతూ.. అక్కడ ఉన్న రాయిని తీసుకుని నవీనపై విసిరాడు. ఆ రాయి ఆమె చేతిలో ఉన్న బిడ్డకు బలంగా తగిలింది. దీంతో తీవ్రంగా గాయపడిన బిడ్డ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నాగరాజును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
మతి తప్పిన జ్వెరెవ్.. టోర్నీ నుంచి గెంటేసిన నిర్వాహకులు
అకాపుల్కో (మెక్సికో): ప్రపంచ మూడో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) హద్దు మీరాడు. మెక్సికో ఓపెన్ టెన్నిస్ టోర్నీలో జ్వెరెవ్ తన రాకెట్‌తో అంపైర్‌ను దాదాపు కొట్టినంత పని చేశాడు. దాంతో జ్వెరెవ్ నిర్వాకంపై టోర్నీ నిర్వాహకులు క్రమశిక్షణ చర్య తీసుకున్నారు. టోర్నీలో అతను సింగిల్స్ మ్యాచ్ ఆడాల్సిన పనిలేదంటూ ఇంటికి పంపించేశారు. వివరాల్లోకి వెళితే... మంగళవారం రాత్రి జరిగిన డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో జ్వెరెవ్ –మార్సెలో మెలో (బ్రెజిల్) జోడీ 2–6, 6–4, 6–10తో గ్లాస్‌పూల్ (బ్రిటన్)–హారి హెలియోవారా (ఫిన్లాండ్) జంట చేతిలో ఓడింది. మ్యాచ్ సందర్భంగా అంపైర్ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన జ్వెరెవ్ తుది ఫలితం తర్వాత తన రాకెట్‌తో ఏకంగా చైర్ అంపైర్ కుర్చీకేసి బాదాడు. అంపైర్ తన కాళ్లను దగ్గరకు తీసుకోకపోతే కచ్చితంగా గాయమయ్యేది. ‘క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన జ్వెరెవ్‌ను టోర్నీ నుంచి తప్పించాం’ అని అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ తెలిపింది. మరోవైపు తన హద్దుమీరిన ప్రవర్తనపై జ్వెరెవ్ బుధవారం స్పందించాడు. చైర్ అంపైర్‌తోపాటు టోర్నీ నిర్వాహకులకు క్షమాపణలు చెప్పాడు. Alexander Zverev has been THROWN OUT of the Mexican Open for attacking the umpire's chair at the end of his doubles match 😮😮😮 pic.twitter.com/CWhQ1r6kwj — Amazon Prime Video Sport (@primevideosport) February 23, 2022 -
షాకింగ్ వీడియో: మైనర్ బాలికపై దారుణం.. రెండో అంతస్తు పైనుంచి
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు కుటుంబంపై విచక్షణ రహితంగా దాడి చేశారు. అంతేగాక 17 ఏళ్ల మైనర్ బాలికను రెండో అంతస్తు నుంచి అత్యంత పాశవికంగా కిందకు తోసేశారు. ఈ షాకింగ్ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. తీవ్ర గాయాలైన బాలికనను ఆసుపత్రిలో చేర్పించగా ప్రస్తుతం ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. మధురలో సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటన బాధితురాలి సోదరుడు దినేష్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. బాలిక సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం. కొంతమంది యువకులు ఏడాది కాలంగా మా చెల్లిని వేధిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మా నాన్నకు ఫోన్ కాల్ వచ్చింది. కొద్దిగా మాట్లేడే పని ఉందని చెప్పడంతో.. తాము మధురలో నివాస్తున్నామని నాన్న సమాధానం చెప్పాడు. కొంత సమయం తరువాత ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి మా ఇంట్లోకి చొరబడి.. నాపై అమ్మా, నాన్నపై దాడి చేశారు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు గదిలో ఉన్న మా చెల్లిని బలవంతంగా రెండో అంతస్తు మీదకు తీసుకెళ్లి బాల్కనీ నుంచి కిందకు తోసేశారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారని వెల్లడించాడు. ఇంటి ముందు ఉన్న సీసీటీవీ ఫుటేజీలో బాలిక ఒక్కసారిగా పై నుంచి కింద పడటం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె పడిపోవడంతో స్థానికంగా ఉన్న జనాలు పరుగెత్తుకొచ్చి సాయం చేసేందుకు ప్రయత్నించారు. తీవ్ర గాయాలైన బాలికను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. వెన్నుముక, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని మధుర రూరల్ ఎస్పీ శిరీష్ చంద్ర తెలిపారు. A 17-year-old girl #thrown down from the terrace of her second floor house in #Mathura by 3 youths who had been harassing her for the past one year. The victim in the hospital with fractured spinal cord. @mathurapolice @Uppolice @adgzoneagra pic.twitter.com/gtJTjClEbq — Anuja Jaiswal (@AnujaJaiswalTOI) June 23, 2021 -
కన్నతల్లే కఠినాత్మురాలై..
నిడదవోలు రూరల్: పసికందును కన్నతల్లే మురుగు డ్రెయిన్‌లో పడవేసిన విషాదఘటన నిడదవోలు మండలం కాటకోటేశ్వరంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం కాటకోటేశ్వరం గ్రామానికి చెందిన 18 ఏళ్ల ఓ యువతి ఈ ఘాతుకానికి పాల్పడింది. పెళ్లి కాకుండానే గర్భిణి అయిన ఈ యువతి గురువారం అర్ధరాత్రి ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆ పసికందు గర్భంలోనే మృతిచెందడంతో డ్రెయిన్‌లో పడవేసినట్లు తెలిసింది. స్థానికులు శుక్రవారం ఉదయం మురుగు డ్రెయిన్‌లో ఉన్న శిశువును చూసి పంచాయతీ, పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక ఆరోగ్య, అంగన్వాడీ సిబ్బంది ఇంటింటా సర్వే చేసి అనారోగ్యంతో ఉన్న ఆ యువతిని గుర్తించి నిలదీయడంతో జరిగిన విషయం చెప్పింది. తాడిమళ్ల పీహెచ్సీ వైద్యాధికారి సుధీర్‌కుమార్ పర్యవేక్షణలో నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి యువతికి వైద్యపరీక్షలు చేశారు. యువతి సమాచారం మేరకు సమిశ్రగూడెం ఎస్సై టీవీ సురేష్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పనులకు వెళ్లి పరిచయం పెంచుకుని.. యువతితో పాటు ఆమె తండ్రి ఇద్దరూ కలిసి ఈ ఏడాది జనవరిలో జంగారెడ్డిగూడెం మండలంలో పొగాకు నారుమడుల పనికి వెళ్లారు. వారికి బంధువైన చాగల్లు మండలం ఊనగట్ల గ్రామానికి చెందిన యువకుడితో ఈమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకోవడంతో గర్భం దాల్చినట్లు పోలీసులు చెబుతున్నారు. తనకు గర్భం వచ్చిందని తెలియదని ఆ యువతి చెప్పినట్లు తెలుస్తోంది. -
స్నేహితురాలు సరదాగా చేసిన పనికి..
-
స్నేహితురాలే జలపాతంలో తోసేసింది..
వాషింగ్టన్ : విహార యాత్రలో స్నేహితురాలు చేసిన పని ఓ యువతిని ఆస్పత్రి పాలు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. 16 ఏళ్ల యువతి మంగళవారం స్నేహితులతో కలిసి వాషింగ్టన్ యాక్టోల్‌లోని మౌల్టన్ జలపాతాన్ని సందర్శించడానికి వెళ్లారు. జలపాతం పైనున్న బ్రిడ్జి అంచున నిలుచున్న ఆమె జలపాతం అందాలను చూస్తుండగా.. వెనకాల నిల్చున్న స్నేహితురాలు ఒక్కరు ఆ యువతిని బలంగా తోసివేశారు. దీంతో ఆమె ఒక్కసారిగా 60 అడుగుల పై నుంచి నీటిలో పడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా ప్రస్తుతం మారింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు 5 ప్రక్కటెముకలు విరగడంతోపాటు, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఆమె తల్లి మాట్లాడుతూ.. ‘నా కూతురు కొలుకోవడానికి చాలా సమయం పడుతోంది. ఈ చర్యకు పాల్పడ్డ అమ్మాయి తను చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసుకోవాలి. ఆ అమ్మాయి నా కూతురిని చంపాలని చూసింద’ని తెలిపారు. గతంలో కూడా ఈ జలపాతంలో దూకి ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో సిబ్బంది అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. జలపాతంలో దూకడం ప్రమాదకరమని.. కింద రాళ్లతో పాటు, లోతు కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. -
గ్యాంగ్‌రేప్ చేసి, రైల్లోంచి తోసేసారు
పాట్నా: బిహార్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలిక(14) పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ మైనర్ల ముఠా అనంతరం ఆమెను కదులుతున్న రైల్లోంచి తోసేసిన వైనం కలకలం రేపింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను కియుల్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం కనుగొన్నారు. తీవ్ర గ్రాయాలతో బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. లఖిసరై జిల్లాలోని లఖోచాక్ గ్రామానికి చెందిన బాధితురాలు పదవ తరగతి చదువుతోంది. గురువారం రాత్రి బహిర్భూమికి వెళ్లిన ఈ బాలికను సుమారు 6-7 మంది మైనర్లు అపహరించుకుపోయి అఘాయిత్యానికి పాల్పడ్డారు. వీరి అకృత్యంతో ఆమె అపస్మారక స్థితిలో జారుకుంది. దీంతో ఆమెను అక్కడినుంచి వన్సిపుర్ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి రైలు ఎక్కారు. రైలు కియుల్ జంక్షన్ సమీపిస్తుండగా బాలిక స్పృహలోకి రావడాన్ని గమనించిన దుర్మార్గులు వెంటనే ఆమెను కదులుతున్న రైల్లోంచి బయటికి విసిరేసారు. బాలికను గుర్తించిన స్థానికులు దగ్గరలో ఉన్న వైద్య కేంద్రానికి తీసుకువెళ్లారు. పరిస్థితి మరింత క్షీణించటంతో, పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (పిఎంఎచ్)కి తరలించారు. భారీ రక్తస్రావం , పెల్విస్ ఎముకల్లో ఐదుఫ్రాక్చర్లతో అమ్మాయి పరిస్థితి విషమంగా ఉందని వైద్యుల బృందం వెల్లడించింది. తనపై లైంగికదాడి జరిగిందని, తిరిగా స్పృహలోకి తిరిగి వచ్చేసరికి రైలులో ఉన్నానని బాధితురాలు తెలిపింది. ఆ దుర్మార్గుల్లో ఇద్దర్ని తమ పొరుగువారు వారేనని, వాళ్లే తనను కదిలే రైలులోనుంచి తోసేసారని పోలీసులకు వివరించింది. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై దర్యాప్తు చేసేందుకు లఖిసరై డిఎస్పి పంకజ్ కుమార్ నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. -
ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు
కోలకత్తా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. డీమానిటైజేషన్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మమతను జుట్టు పట్టి ఈడ్చి పారేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ దుమారం రాజేశారు. పశ్చిమ్ మెద్నిపూర్ జిల్లా జార్గ్రామ్ లో ఆదివారం జరిగిన పార్టీ యువజన విభాగం సమావేశంలో మాట్లాడుతూ ఘోష్ బెనర్జీ ఇలా నోరు పారేసుకున్నారు. పెద్దనోట్ల రద్దుతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వేల కోట్ల రూపాయల నష్ట పోయారని, అందుకే ఆమెకు మతి భ్రమించిందని దిలీప్ వ్యాఖ్యానించారు. డిల్లీలో ఆమె ఆందోళన (డ్రామా) చేస్తున్నపుడు జుట్టు పట్టి లాగి విసిరి పారేసి ఉండవచ్చు.. అక్కుడన్న పోలీసులు తమ వాళ్లే...కానీ తాము అలా చేయలేదంటూ దిలీప్ చెప్పుకొచ్చారు. నోట్ల రద్దుతో పిచ్చి పట్టిన మమత ఢిల్లీ, పట్నా చుట్టూ చక్కర్లు కొడుతోందన్నారు. ఢిల్లీ, రాష్ట్ర సెక్రటేరియట్ ఆందోళనలు ఇందులో భాగమే అన్నారు. ఆమె చివరకు గంగలో దూకుతుందని తాము భావించామన్నారు. తృణమూల్ తప్పులను పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారనీ, ఇకపై మమతా దశ్చర్యలను తాము క్షమించమని ఘోష్ హెచ్చరించారు. కాగా ఘోష్ వ్యాఖ్యలపై టీఎంసీ తీవ్రంగా స్పందించింది. బెనర్జీ వ్యతిరేక పోరాటంలో విఫలమైన బీజీపీ ఇలాంటి వ్యక్తిగత దూషణలకు, బెదింరింపులకు పాల్పడుతోందని విమర్శించింది. ప్రమాదకరమైన బెదిరింపులు, తప్పుడు వ్యక్తిగత ప్రకటనలతో విషం చిమ్ముతూ బీజేపీ దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనమని ఎదురు దాడి చేసింది. లక్షలాది సామాన్య జనానికి అండగా నిలిచిన మమతకు ఎదురు నిలవలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని టీఎంసీ విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించింది. -
కాంగ్రెస్ సంబరానికి పావురాలు ఆహుతి
-
అత్యాచారం చేసి.. ఆటోలో నుంచి తోసేసి..
పశ్చిమబెంగాల్లో ఓ వివాహితపై సామూహిక అత్యాచారం చేసి, ఆమెను ఆటో లోంచి కిందకు తోసేశారు. కోల్‌కతా శివారు ప్రాంతం ఆక్రాలో ఓ వివాహిత భర్త నుంచి విడిపోయి తల్లి దగ్గర ఉంటుంది. ఆమెకు షఫిక్ అనే వ్యక్తితో సన్నిహిత సంబంధముంది. షఫిక్ ఆమెకు ఫోన్ చేసి పిలిపించుకుని నెంబర్ ప్లేట్ లేని ఆటోలో తీసుకెళ్లాడు. అతని వెంట మరో నలుగురు ఉన్నారు. ఆమెకు మద్యం ఇచ్చి మత్తులోకి వెళ్లిన తర్వాత ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆటోలో నుంచి బయటకు తోసేశారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని గమనించిన స్థానికులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం కోల్‌కతా లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఆరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
రోడ్డుపై రచ్చబండ దరఖాస్తులు
-
చిరంజీవిపై సమైక్యవాదుల రాళ్లదాడి