
అత్యాచారం చేసి.. ఆటోలో నుంచి తోసేసి..
పశ్చిమబెంగాల్లో ఓ వివాహితపై సామూహిక అత్యాచారం చేసి, ఆమెను ఆటో లోంచి కిందకు తోసేశారు. కోల్కతా శివారు ప్రాంతం ఆక్రాలో ఓ వివాహిత భర్త నుంచి విడిపోయి తల్లి దగ్గర ఉంటుంది. ఆమెకు షఫిక్ అనే వ్యక్తితో సన్నిహిత సంబంధముంది. షఫిక్ ఆమెకు ఫోన్ చేసి పిలిపించుకుని నెంబర్ ప్లేట్ లేని ఆటోలో తీసుకెళ్లాడు. అతని వెంట మరో నలుగురు ఉన్నారు.
ఆమెకు మద్యం ఇచ్చి మత్తులోకి వెళ్లిన తర్వాత ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆటోలో నుంచి బయటకు తోసేశారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని గమనించిన స్థానికులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం కోల్కతా లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఆరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు.