బీహార్ విద్యాశాఖ లీలలు తరచూ బయటపడుతుంటాయి. రాష్ట్ర విద్యాశాఖ అడిషనల్ సెక్రటరీ కెకె పాఠక్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బీహార్ విద్యావ్యవస్థలో మార్పురావడం లేదు. దీనికి ఉదాహరణగా ఛప్రా జిల్లా పాఠశాల నిలిచింది.
ఈ పాఠశాలలో బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్ నిర్వహించబోయే 11వ, 9వ తరగతుల వార్షిక పరీక్షల ప్రశ్న పత్రాల బండిల్స్ బహిరంగంగా విసిరివేశారు. వీటిని పంపిణీ చేసేందుకు విద్యాశాఖలో ఏ ఉద్యోగి బాధ్యత తీసుకోలేదు. జిల్లాలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తమ పాఠశాల కోడ్ ప్రకారం ప్రశ్నపత్రాలు తీసుకువెళ్లేందుకు ఈ పాఠశాలకు వచ్చి, టెర్రస్ అంతా కలియ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు 9,11 తరగతుల వార్షిక పరీక్షలను మార్చి 13 నుంచి నిర్వహించనుంది. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను జిల్లాలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు తమ పాఠశాల కోడ్ ప్రకారం ప్రశ్నపత్రాలను వెదికేందుకు గత మూడు రోజులుగా ఇక్కడే తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారు. పరీక్ష తేదీ సమీపించినా కొన్ని పాఠశాలలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు సంబంధిత ఉపాధ్యాయులకు ఇంకా చేరనేలేదు.
మీడియాకు అందిన అందిన సమాచారం ప్రకారం 11వ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 13 నుంచి, 9వ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలో తూర్పు చంపారన్‌లో కూడా విద్యాశాఖాధికారుల ఇటువంటి నిర్లక్ష్యం కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment