బిహార్:ఉమ్మడి పౌరస్మృతిపై ప్రస్తుతం దేశంలో చర్చ నడుస్తోంది. ఈ అంశంలో లా కమిషన్ కూడా ఇప్పటికే వివిధ మత సంస్థల అభిప్రాయాలను కోరింది. ఈ నేపథ్యంలో యునిఫామ్ సివిల్ కోడ్‌పై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తప్పించుకున్నారు.'ఎండలు బాగా కొడుతున్నాయ్.. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం'..అంటూ సింపుల్‌గా దాటవేశారు.
దేశంలో బీజేపీకి ప్రత్యామ్యాయంగా ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని నితీష్ నేతృత్వంలో ప్రముఖ నేతలు జూన్ 23న సమావేశం కానున్నారు. మూడో కూటమి ఏర్పాటుకు సంబంధించిన అంశాలను అందులో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో యూనిఫామ్ సివిల్ కోడ్‌పై తన అభిప్రాయాన్ని నితీష్ కుమార్ చెప్పకుండా దాటవేశారు.
కేంద్ర న్యాయ శాఖ సిఫారసుల మేరకు 22వ లా కమిషన్ యూనిఫామ్ సివిల్ కోడ్‌ను పరిశీలిస్తోంది. జూన్ 14న ఈ మేరకు ప్రముఖ మత సంస్థల అభిప్రాయాన్ని కూడా కమిషన్ కోరింది. అయితే బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే యూనిఫామ్ సివిల్ కోడ్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది.
21వ లా కమిషన్ ఇచ్చిన సిఫారసుల మేరకు యూనిఫామ్ సివిల్ కోడ్ దేశానికి ఇప్పుడే అవసరం లేదని పేర్కొన్నట్లు కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ తెలిపారు. రాజకీయ అవసరాలకు అనుగుణంగా దేశ అవసరాలు ఉండవని అన్నారు.
ఇదీ చదవండి:నితీష్ కుమార్ సర్కార్‌కు ఎదురుదెబ్బ ..మద్దతు ఉపసంహరించుకున్న జితన్ మాంఝీ పార్టీ
Comments
Please login to add a commentAdd a comment