మద్యం వద్దన్నారని సీఎం పైకి షూ విసిరాడు | Shoe thrown at Nitish Kumar to protest liquor ban | Sakshi
Sakshi News home page

మద్యం వద్దన్నారని సీఎం పైకి షూ విసిరాడు

Published Thu, Jan 28 2016 4:55 PM | Last Updated on Thu, Jul 18 2019 2:26 PM

మద్యం వద్దన్నారని సీఎం పైకి షూ విసిరాడు - Sakshi

మద్యం వద్దన్నారని సీఎం పైకి షూ విసిరాడు

పట్నా: బిహార్ సీఎం నితీష్ కుమార్పైకి గురువారం ఓ వ్యక్తి షూ విసిరాడు. పట్నాలోని భక్తియార్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నితీష్ కుమార్ ఏప్రిల్ 1 నుంచి బిహార్లో మద్యనిషేధం అమలు చేయనున్నట్టు పునరుద్ఘాటించారు. దీన్ని వ్యతిరేకిస్తున్న ఓ వ్యక్తి నితీష్ పైకి షూ విసిరాడు. ఆ షూ కొంచెం పక్కగా పడింది. షూ విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల హామీల్లో భాగంగా విడతలవారీగా మద్యనిషేధం విధించనున్నట్టు ఇదివరకే నితీష్ తెలిపిన విషయం తెలిసిందే. ముందుగా నాటు సారాపై నిషేధం విధించి, రెండో విడతలో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్)పై కూడా పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement