పెర్త్ : ఆస్ట్రేలియాలోని పెర్త్ ప్రాంతానికి చెందిన జాషువా వాకర్ తన పెంపుడు కుక్క చేసిన పనికి తాను కోర్టు ముందు హాజరవ్వాల్సి వచ్చింది. అంతేకాదు తన ఇంటికి వచ్చిన మహిళపై పెంపుడు కుక్క దాడి చేసినందుకు గానూ బాధితురాలికి నష్ట పరిహారంతో పాటు శిక్షను కూడా అనుభవించాలంటూ తీర్పు ఇచ్చింది. తన కుక్క చేసిన పనికి తాను శిక్షను అనుభవించడం కొంచెం గిల్టీ ఫీలింగ్ కలుగుతుందని జాషువా తెలిపాడు. (చదవండి : ‘నమ్మలేకపోతున్నాం.. ఇది అరుదైన అనుభవం’)
ఇక అసలు విషయానికి వస్తే... పెర్త్‌కు చెందిన జాషువా వాకర్‌తో గతేడాది ఒక మహిళతో పరిచయం అయింది. గతేడాది క్రిస్‌మస్ రోజున సరదాగా కలిసిన ఈ ఇద్దరు హోటల్‌కు వెళ్లి పార్టీ చేసుకున్నారు. జాషువా ఆ తర్వాత ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఇంట్లో నా పెంపుడు కుక్క అయిన టెక్సాస్‌ను కట్టేస్తానని.. అంతవరకు లోపలకు రావొద్దని హెచ్చరించాడు. అయితే ఆ మహిళ అతని మాట వినకుండా టెక్సాస్‌ను నిమురుదామని దగ్గరికి వచ్చింది. ఇంతలో టెక్సాస్ ఆ మహిళ ముఖంపై దాడి చేసి పీక్కుతింది. దీంతో తీవ్రరక్తస్రావంతో మహిళ ముఖంపై పెద్ద హోల్ తయారైంది. వెంటనే ఆసుపత్రికి వెళ్లిన ఆమె ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసిన వైద్యులు 21 కుట్లు వేశారు. అనంతరం సదరు మహిళ జాషువా తో పాటు అతని పెంపుడు కుక్కపై కేసు పెట్టింది.
మర్యాదపూర్వకంగా ఇంటికి తీసుకెళ్లి ఇలా కుక్కతో కరిపించడంమేంటని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు తాజాగా కోర్టుకు రావడంతో జాషువా, బాధితురాలు తమ తమ న్యాయవాదులతో హాజరయ్యారు. జాషువా తరపు లాయర్ అలెక్స్ స్మిత్ మాట్లాడుతూ.. జాషువా తన ఇంటికి ఆమెను మర్యాదపూర్వకంగా పిలిచిన మాట నిజమే కాని అతను తన కుక్కతో కరిపించలేదు. నిజానికి దానిని నిమురకుండా దాని మీద పడిపోవడంతోనే అది దాడి చేసిందని తెలిపాడు. అయినా జాషువా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడని పేర్కొన్నాడు. అయితే ఉద్దేశపూర్వకంగానే మహిళను ఇంటికి పిలిపించి కావాలనే టెక్సాస్‌తో కరిపించినట్టు బాధితురాలి తరపు న్యాయవాది టిమ్ హౌలింగ్ తెలిపాడు. జాషువాకు భారీ ఫెనాల్టీ విధించడంతో పాటు శిక్ష ఖరారు చేయాలని పేర్కొన్నాడు. అన్ని వాదనలు విన్న జడ్జి మహిళకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని, జైలుశిక్ష కూడా అనుభవించాలని తీర్పు ఇచ్చాడు. కాగా జాషువా వాకర్‌కు ఎన్ని రోజుల జైలు శిక్ష ఉంటుందనేది తెలియదు.(చదవండి : ‘వాళ్లను ఎంతగానో ప్రేమిస్తున్నా అని చెప్పండి’)
Comments
Please login to add a commentAdd a comment