భార్య అనుష్క, కూతురు వామికతో కోహ్లి (Photo Credit: Virat Kohli Instagram)
Virat Kohli- #AnushkaSharma: టీ20 ప్రపంచకప్-2022 నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి హోటల్ రూం వీడియో లీక్ ఘటన క్రీడా వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఓ వ్యక్తి ఏకంగా కోహ్లి గదిలోకి వెళ్లి కెమెరాతో చిత్రీకరించి అతడి గోప్యతకు భంగం కలిగించిన తీరు చర్చకు దారి తీసింది. ఆటగాళ్ల భద్రతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించిందంటూ హోటల్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే ఈ విషయంపై కోహ్లి, అతడి సతీమణి అనుష్క శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సైతం తాను ఈ ఘటనతో షాక్‌కు గురైనట్లు పేర్కొన్నాడు. ఇక కోహ్లి సోదరుడు వికాస్.. ‘‘ఇది అనైతికం. నాకు తెలిసి ఇది హోటల్ స్టాఫ్ పనే అయి ఉంటుంది. అయినా అతిథులకు కనీస భద్రత కల్పించలేని మేనేజ్‌మెంట్ ఎందుకు?’’అంటూ సదరు హోటల్ తీరును తప్పుబట్టాడు.
స్పందించి యాజమాన్యం
ఈ నేపథ్యంలో కోహ్లి బస చేసిన క్రౌన్ రిసార్ట్స్ యాజమాన్యం స్పందించింది. విరాట్ కోహ్లికి క్షమాపణలు తెలిపింది. ఈ మేరకు.. ‘‘అతిథుల భద్రత, గోప్యతే మాకు అత్యంత ప్రాధాన్యమైనది. ఈ ఘటన మమ్మల్ని నిరాశకు లోనుచేసింది.
మా గెస్టుకు మేము బేషరతుగా క్షమాపణలు తెలుపుతున్నాం. ఈ ఘటనపై విచారణకు పూర్తి సహకారం అందిస్తాం’’ అని సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న వ్యక్తిని సస్పెండ్ చేసినట్లు తెలిపింది.
దర్యాప్తులో భాగంగా భారత క్రికెట్ జట్టు, అంతర్జాతీయ క్రికెట్ మండలికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పునరుద్ఘాటించింది. వీడియోను వెంటనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించినట్లు పేర్కొంది. కాగా సూపర్-12లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ నేపథ్యంలో భారత జట్టు పెర్త్ హోటల్‌లో బస చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: రాహుల్‌ను తీసేసి.. అతడితో ఓపెనింగ్ చేయిస్తే బెటర్! మ్యాచ్ విన్నర్‌ను పక్కన పెట్టడం ఏంటి?
T20 WC 2022: ఇదేమి బెంగళూరు వికెట్ కాదు.. దినేశ్ కార్తిక్‌పై సెహ్వాగ్ సెటైర్లు! ఇప్పటికైనా
Comments
Please login to add a commentAdd a comment