T20 World Cup 2022- Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి ఆట పట్ల ఉన్న అంకితభావం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తండ్రి ఆకస్మిక మరణం తాలుకు బాధను దిగమింగుకుని మరీ మ్యాచ్‌ను కొనసాగించిన ప్రొఫెషనలిజం అతడిది. పద్దెమినిదేళ్ల వయసులోనే ఇంతటి పరిణతి కనబరిచిన ఈ రన్‌మెషీన్.. టీమిండియా కెప్టెన్‌గా, బ్యాటర్‌గా జట్టుకు పలు చిరస్మరణీయ విజయాలు అందించాడు.
గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్‌లేమితో ఇబ్బంది పడిన కోహ్లి.. ఆసియా కప్-2022లో అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో అంతర్జాతీయ కెరీర్‌లో 71వ సెంచరీ నమోదు చేసి పూర్వవైభవం పొందాడు. ఇక ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్-2022లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇందుకోసం ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డ మీద ప్రాక్టీసులో తలమునకలైపోయాడు. గత ప్రపంచకప్ తాలుకు చేదు అనుభవాలు మరిపించేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నీ టైమ్ అయిపోయింది.. వెళ్లవయ్యా కోహ్లి!
ఇందులో.. సీరియస్‌గా ప్రాక్టీసు చేస్తున్న కోహ్లిని కోచింగ్ స్టాఫ్ ఒకరు.. నెట్‌సెషన్‌లో మీ టైమ్ అయిపోయింది వెళ్లవచ్చని చెప్పారు. ఇందుకు స్పందించిన కోహ్లి.. ‘‘హుడా వచ్చిన తర్వాతే నేను వెళ్తా..’’ అని అన్నట్లు వినిపించింది. అలా తదుపరి దీపక్ హుడా వచ్చిన తర్వాతే విరాట్ నెట్స్ నుంచి నిష్క్రమించాడు.
ఇక ఈ వీడియోపై స్పందించిన కింగ్ కోహ్లి అభిమానులు.. ‘‘అదీ మరి మా కోహ్లి అంటే! ఆట పట్ల తన అంకితభావం గురించి ఎంత చెప్పినా తక్కువే! లవ్ యూ భాయ్’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రపంచకప్-2021లో భారత సారథిగా బరిలోకి దిగిన కోహ్లి.. ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడబోతున్నాడు.
అక్టోబరు 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో బ్యాట్ ఝులిపించేందుకు సిద్ధమవుతున్నాడు. దాయాదితో అసలైన పోరుకంటే ముందు అక్టోబరు 17,19 తేదీల్లో వరుసగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది టీమిండియా.
చదవండి: T20 world cup 2022: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. పంత్‌కు నో ఛాన్స్! కార్తీక్ వైపే మొగ్గు
T20 WC 2022: నాకు ఎవరితోనూ విభేదాలు లేవు! అయినా తను ఇప్పుడు కెప్టెన్ కదా!
Another video of Kohli practicing at the WACA. What makes him so great is he just alters one of two aspects to improve his game. #Kohli #T20WorldCup #CricketTwitter pic.twitter.com/V45oWCpBiT
— Gav Joshi (@Gampa_cricket) October 13, 2022
Comments
Please login to add a commentAdd a comment