Perth
-
దుకాణమంతా దోచేయండి
పెర్త్: ఆషాడం సేల్. సగం ధరకే పట్టుచీర. బట్టల దుకాణాల్లో తరచూ కనిపించే ప్రకటన ఇది. ఇక జనరిక్ మందుల దుకాణాల్లో 70 శాతం, 80 శాతం డిస్కౌంట్ బోర్డులను అక్కడక్కడ చూస్తూనే ఉంటాం. కానీ ఏకంగా 100 శాతం డిస్కౌంట్. అంటే ఉచితంగా పట్టుకెళ్లండి అనే షాప్ మీరు ఎక్కడా చూసి ఉండరు. అలాంటి దుస్తుల దుకాణం కొద్దిసేపు తెరచి ఉంచితే మరు నిమిషంలో సరుకంతా మటుమాయమైన ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. పెర్త్ నగరంలో స్ట్రీట్‌ఎక్స్ అనే దుస్తుల షోరూమ్ ఉంది. దాని యజమాని డేనియల్ బ్రాడ్షాకు కొత్త ఆలోచన వచ్చింది. ‘‘టీ–షర్ట్‌లను షాప్‌లో సిద్ధంగా ఉంచుతా. దోచేయండి’’అని యువతకు మీడియాలో ఒక ప్రకటన ఇచ్చారు. అంతే ఇక. టీ–షర్ట్‌లను పట్టుకెళ్లేందుకు యువత పోటెత్తింది. గురువారం ఉదయం దుకాణం షట్టర్ పైకెత్తగానే యువతీయువకులు పరుగుపరుగున లోపలికి దూరేసి దొరికింది పట్టుకెళ్లారు. ఎగబడి కలబడి టీ–షర్ట్‌లను ఎగరేసుకుపోయారు. తొక్కిసలాటలో దెబ్బలు తగులుతాయని ముందు జాగ్రత్తగా ఒక యువకుడు హెల్మెట్, మోకాళ్లు, మోచేతులకు ప్యాడ్లు ధరించిమరీ జనంలోకి దూకాడు. తోపులాటలో చిన్నపాటి గీసుకుపోవడం లాంటి దెబ్బలు తప్ప చెప్పుకోదగ్గ, ఆస్పత్రిలో చేరేంత స్థాయి గాయాలు ఎవరికీ కాలేదు. గతంలో సైతం షాప్ యజమాని ఒక భారీ ట్రక్కు నిండా దుస్తులు ఇలాగే ఉచితంగా దోచేసే ఆఫర్ ఇచ్చాడని అక్కడికొచి్చన ఒకావిడ చెప్పింది. గురువారం దుకాణంలో దాదాపు 400 టీ–షర్ట్‌లను అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా
పెర్త్ టెస్ట్‌లో టీమిండియా చారిత్రక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్.. ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఫలితంగా ఐదు మ్యాచ్ బోర్డర్ గవాస్కర్ సిరీస్‌ను భారత్ గెలుపుతో ప్రారంభించింది.ఆప్టస్ స్టేడియంలో ఆసీస్‌ను ఓడించిన తొలి జట్టుపెర్త్లోని ఆప్టస్ స్టేడియంలో భారత్.. ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. ఈ స్టేడియంలో ఆసీస్‌ను మట్టికరిపించిన తొలి జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది. ఈ వేదికపై ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌లు ఆడగా.. ఇదే తొలి పరాజయం. ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియాను ఓడించిన తొలి కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా రికార్డుల్లోకెక్కాడు.నంబర్ వన్‌గా టీమిండియాపెర్త్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై గెలుపుతో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. టీమిండియా టాప్ ప్లేస్‌కు చేరడంతో అప్పటివరకు టాప్‌లో ఉన్న ఆస్ట్రేలియా రెండో స్థానానికి దిగజారింది.నాలుగులో మూడింట విజయాలు..ఆస్ట్రేలియా గడ్డపై భారత్ గత నాలుగు టెస్ట్‌ల్లో మూడింట విజయాలు సాధించింది. గత బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భారత్ చివరి మూడు టెస్ట్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది.భారీ విజయంపెర్త్ టెస్ట్‌లో భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా SENA దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) భారత్‌కు ఇది భారీ విజయం. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా బుమ్రాఈ మ్యాచ్ మొత్తంలో ఎనిమిది వికెట్లు తీసిన బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 150 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో నితీశ్ కుమార్ రెడ్డి (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్ 4, స్టార్క్, కమిన్స్, మార్ష్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 104 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బుమ్రా (5/30), సిరాజ్ (2/20), హర్షిత్ రాణా (3/48) కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 487 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ (161), విరాట్ కోహ్లి (100 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. రాహుల్ 77 అర్ద సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో లయోన్ 2 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, హాజిల్‌వుడ్, కమిన్స్, మార్ష్ తలో వికెట్ తీసుకున్నారు.534 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 238 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్ (89) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ తలో మూడు.. సుందర్ రెండు.. హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు. -
Ind vs Aus: పెర్త్ టెస్టు.. తొలిరోజు హైలైట్స్ (ఫొటోలు)
-
Aus vs Eng: యాషెస్ సిరీస్ షెడ్యూల్ విడుదల.. 43 ఏళ్ల తర్వాత ఇలా!
ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తాజా ఎడిషన్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) బుధవారం షెడ్యూల్‌ను ప్రకటించింది. పెర్త్ వేదికగా వచ్చే ఏడాది నవంబరు 21 నుంచి ఇరుజట్ల మధ్య టెస్టులు మొదలవుతాయని తెలిపింది. అదే విధంగా.. పింక్ బాల్‌తో జరిగే రెండో టెస్టుకు ఐకానిక్ గాబా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుందని పేర్కొంది.ఇక ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టుకు అడిలైడ్ ఓవల్ మైదానం, బాక్సింగ్ డే మ్యాచ్‌కు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ), ఆఖరి టెస్టుకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికలుగా ఉంటాయని సీఏ తెలిపింది. కాగా యాషెస్ సిరీస్‌లో తొలి టెస్టుకు పెర్త్ ఆతిథ్యం ఇవ్వనుండటం 43 ఏళ్లలో ఇదే తొలిసారి.ఇంగ్లండ్లోడ్రాఇంగ్లండ్ వేదికగా జరిగిన గత యాషెస్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ గెలవగా.. మూడో టెస్టులో ఫలితం తేలలేదు. నాలుగు, ఐదో టెస్టుల్లో ఇంగ్లండ్ గెలిచింది. ఇక ఈ ప్రతిష్టాత్మక తాజా సిరీస్ కంగారూ గడ్డపై జరుగనుంది.ఆసీస్ గడ్డపై గెలుపునకై తహతహఇదిలా ఉంటే.. 2010 నుంచి ఇప్పటి వరకు ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఒక్కసారి కూడా గెలవలేదు. 2010లో 3-1తో ఓడిన ఇంగ్లిష్ జట్టు.. ఆ తర్వాత ఇప్పటి వరకు మూడుసార్లు ఆసీస్ పర్యటనకు వెళ్లింది. ఆడిన 15 టెస్టుల్లో 13 ఓడి.. రెండు డ్రా చేసుకుంది.ఇక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2021-2023 గెలిచిన ఆస్ట్రేలియా తదుపరి స్వదేశంలో టీమిండియాతో ఐదు టెస్టులు ఆడనుంది. ఈసారి కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగే ఈ మ్యాచ్‌లు ఆసీస్‌కు కీలకం.ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- యాషెస్ సిరీస్-2025- 26 షెడ్యూల్👉మొదటి టెస్టు- పెర్త్ స్టేడియం, నవంబరు 21-25, 2025👉రెండో టెస్టు- ది గాబా(డే, నైట్ పింక్‌బాల్ మ్యాచ్)- డిసెంబరు 4-8, 2025👉మూడో టెస్టు- అడిలైడ్ ఓవల్, డిసెంబరు 17- 21, 2025👉నాలుగో టెస్టు- ఎంసీజీ, డిసెంబరు 26- 30, 2025👉ఐదో టెస్టు- ఎస్సీజీ, జనవరి 4-8, 2026.చదవండి: అతడి స్థానంలో ఆడితే ఏంటి?; శతక ధీరుడిపై బాబర్ ఆజం పోస్ట్ వైరల్ -
విమానంలో నగ్నంగా పరుగెత్తిన ప్రయాణికుడు
పెర్త్: ఆస్ట్రేలియాలోని ఓ విమానంలో ఒక ప్రయాణికుడు నగ్నంగా పరుగులు తీశాడు. అంతటితో ఆగకుండా సిబ్బందిని కిందకు తోసేసి బీభత్సం సృష్టించాడు. ఈ ఘటన వర్జిన్ ఆస్ట్రేలియా విమానంలో జరిగింది. ఆస్ట్రేలియాలోని పెర్త్ నుంచి మెల్బోర్న్కు వీఏ 696 విమానం సోమవారం(మే27) రాత్రి బయలుదేరింది. పెర్త్‌లో విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ ప్రయాణికుడు వింతగా ప్రవర్తించాడు. దుస్తులను తొలగించి నగ్నంగా విమానంలో అటూ, ఇటూ పరిగెత్తాడు. అడ్డుకున్న సిబ్బందిని తోసేశాడు. అతడి చేష్టలతో తోటి ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో పైలట్ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. విమాన సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఎయిర్‌పోర్టుకు చేరుకుని నగ్నంగా పరుగులు తీసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. -
పాక్ బౌలర్లకు చుక్కలు.. టెస్టులో వార్నర్ టీ20 ఇన్నింగ్స్! చెత్త ఫీల్డింగ్‌తో
Australia vs Pakistan, 1st Test: పాకిస్తాన్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు శుభారంభం లభించింది. పెర్త్ వేదికగా గురువారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు ఫీల్డింగ్‌కు దిగిన పాక్‌కు.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా ఆరంభం నుంచే చుక్కలు చూపించారు. ముఖ్యంగా వార్నర్ ఆది నుంచే దూకుడుగా ఆడుతూ.. పాకిస్తాన్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ క్రమంలో 41 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు.. ఖవాజా మాత్రం ఆచితూచి ఆడుతూ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నాడు. Twin boundaries in the first! Shaheen has his tail up despite an expensive first over #AUSvPAK pic.twitter.com/oixensArZG — cricket.com.au (@cricketcomau) December 14, 2023 షఫీక్ ఆ క్యాచ్ జారవిడవడంతో పాక్ అరంగేట్ర పేసర్ ఆమిర్ జమాల్ బౌలింగ్‌లో లైఫ్‌ను సద్వినియోగం చేసుకుంటూ.. వార్నర్‌తో కలిసి మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పే దిశగా పయనిస్తున్నాడు. కాగా పదహారో ఓవర్ ఆరంభంలో ఆమిర్ వేసిన బంతిని పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు ఉస్మాన్ ఖవాజా. ఈ క్రమంలో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేవగా అబ్దుల్లా షఫీక్ క్యాచ్ పట్టినట్టే పట్టి జారవిడిచాడు. దీంతో ఊపిరి పీల్చుకున్న ఖవాజా.. మరోసారి తప్పిదం పునరావృతం చేయలేదు. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఆట భోజన విరామ సమయానికి ఆస్ట్రేలియా 25 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 117 పరుగులు చేసింది పటిష్ట స్థితిలో నిలిచింది. WTF bcci installed a chip in the ball 😤#AUSvsPAK pic.twitter.com/xoNuaUK3s9 — 𝙕𝙀𝙀𝙈𝙊™ (@Broken_ICTIAN) December 14, 2023 వార్నర్ టీ20 తరహా ఇన్నింగ్స్.. పాక్ బౌలర్లకు చుక్కలే లంచ్ బ్రేక్ సమయానికి డేవిడ్ వార్నర్ టీ20 తరహా ఇన్నింగ్స్‌తో 67 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 72 పరుగులు సాధించగా.. ఉస్మాన్ ఖవాజా 84 బంతుల్లో 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. మరోవైపు.. పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది సహా ఇతర బౌలర్లు కనీసం ఒక్క వికెట్ అయినా పడగొట్టాలని విఫలయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఖవాజా ఇచ్చిన సిట్టర్‌ను డ్రాప్ చేసిన అబ్దుల్లా షఫీక్‌పై ఇప్పటికే ట్రోలింగ్ మొదలైంది. ఖవాజా క్యాచ్‌ను అతడు జారవిడిచిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఆస్ట్రేలియాలో పాకిస్తాన్‌కు టెస్టుల్లో చెత్త రికార్డు ఉందన్న విషయం తెలిసిందే. 1995లో కంగారూ గడ్డపై చివరి సారిగా టెస్టు మ్యాచ్ నెగ్గిన పాక్.. ఇంతవరకు ఒక్కసారి కూడా సిరీస్ గెలవలేదు. చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. విధ్వంసకర ఓపెనర్‌పై వేటు! తిలక్‌కు బై బై? Tired of the conventional, David Warner's 12th boundary of the first session was nothing short of inventive! 😯#AUSvPAK @nrmainsurance #PlayOfTheDay pic.twitter.com/8ih9vnjhUj — cricket.com.au (@cricketcomau) December 14, 2023 -
రూ.6 కోట్ల కారు.. పార్కింగ్ చేయమని ఇస్తే నాశనం చేశారు..
కాన్బెర్రా: రెండు లాంబోర్గిని కార్లు. వీటి విలువ రూ.12 కోట్లు. ఓ లగ్జరీ హోటల్‌కు వెళ్లిన కోటీశ్వరుడు ఈ కార్లను తీసుకెళ్లాడు. అయితే పార్కింగ్ చేయమని చెప్పి ఈ కార్ల కీస్‌ను హోటల్ సిబ్బందికి ఇచ్చాడు. ఇంత ఖరీదైన కారు ఎక్కానని ఆనందంలోనే, లేక డ్రైవింగ్ సరిగ్గా రాకనో తెలియదు గానీ.. హోటల్ సిబ్బంది ఈ కారును ప్రమాదానికి గురి చేశాడు. అదుపుతప్పి గోడను ఢీకొట్టాడు. అంతేకాదు ముందున్న మరో లాంబోర్గినిని కూడా ఢీకొట్టాడు. దీంతో ఓనర్ కంగుతిన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Craig Jones (@craigjonesbjj) ఆస్ట్రేలియాలో ఈ ఘటన జరిగింది. ఈ కార్ల యజమాని పేరు లారెన్స్ ఎస్కలాంటే. పెర్త్‌లోని లగ్జరీ హోటల్ క్రౌన్ టవర్స్‌కు అతను వెళ్లినప్పుడు ఇలా జరిగింది. చదవండి: చికెన్, మటన్ కాదు.. పెళ్లిలో పనీర్ పెట్టలేదని రచ్చ రచ్చ.. వీడియో వైరల్.. -
కోహ్లి రూం వీడియో లీక్.. ఇది వాళ్ల పనే! స్పందించిన హోటల్ యాజమాన్యం
Virat Kohli- #AnushkaSharma: టీ20 ప్రపంచకప్-2022 నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి హోటల్ రూం వీడియో లీక్ ఘటన క్రీడా వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఓ వ్యక్తి ఏకంగా కోహ్లి గదిలోకి వెళ్లి కెమెరాతో చిత్రీకరించి అతడి గోప్యతకు భంగం కలిగించిన తీరు చర్చకు దారి తీసింది. ఆటగాళ్ల భద్రతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించిందంటూ హోటల్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై కోహ్లి, అతడి సతీమణి అనుష్క శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సైతం తాను ఈ ఘటనతో షాక్‌కు గురైనట్లు పేర్కొన్నాడు. ఇక కోహ్లి సోదరుడు వికాస్.. ‘‘ఇది అనైతికం. నాకు తెలిసి ఇది హోటల్ స్టాఫ్ పనే అయి ఉంటుంది. అయినా అతిథులకు కనీస భద్రత కల్పించలేని మేనేజ్మెంట్ ఎందుకు?’’అంటూ సదరు హోటల్ తీరును తప్పుబట్టాడు. స్పందించి యాజమాన్యం ఈ నేపథ్యంలో కోహ్లి బస చేసిన క్రౌన్ రిసార్ట్స్ యాజమాన్యం స్పందించింది. విరాట్ కోహ్లికి క్షమాపణలు తెలిపింది. ఈ మేరకు.. ‘‘అతిథుల భద్రత, గోప్యతే మాకు అత్యంత ప్రాధాన్యమైనది. ఈ ఘటన మమ్మల్ని నిరాశకు లోనుచేసింది. మా గెస్టుకు మేము బేషరతుగా క్షమాపణలు తెలుపుతున్నాం. ఈ ఘటనపై విచారణకు పూర్తి సహకారం అందిస్తాం’’ అని సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న వ్యక్తిని సస్పెండ్ చేసినట్లు తెలిపింది. దర్యాప్తులో భాగంగా భారత క్రికెట్ జట్టు, అంతర్జాతీయ క్రికెట్ మండలికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పునరుద్ఘాటించింది. వీడియోను వెంటనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించినట్లు పేర్కొంది. కాగా సూపర్-12లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ నేపథ్యంలో భారత జట్టు పెర్త్ హోటల్లో బస చేసిన సంగతి తెలిసిందే. చదవండి: రాహుల్‌ను తీసేసి.. అతడితో ఓపెనింగ్ చేయిస్తే బెటర్! మ్యాచ్ విన్నర్‌ను పక్కన పెట్టడం ఏంటి? T20 WC 2022: ఇదేమి బెంగళూరు వికెట్ కాదు.. దినేశ్ కార్తిక్‌పై సెహ్వాగ్ సెటైర్లు! ఇప్పటికైనా View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
కోహ్లి హోటల్ రూమ్ వీడియో లీక్.. విరాట్ సీరియస్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి ఆస్ట్రేలియాలో చేదు అనుభవం ఎదురైంది. టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లి భారత జట్టుతో కలిసి పెర్త్‌లోని ఓ హోటల్లో బస చేశాడు. అయితే విరాట్ ఉంటున్న హోటల్ రూమ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో లీకైంది. కోహ్లి లేని సమయంలో ఓ అగంతకుడు గదిలోకి చొరబడి వీడియోను రికార్డు చేశాడు. ఈ వీడియాలో కోహ్లి వ్యక్తిగత వస్తువులు, న్యూట్రీషన్ పౌడర్ బాక్స్ లు, భారత జెర్సీలు కన్పిస్తున్నాయి. కాగా ఫీల్డ్‌లో తన హావభావాలతో అభిమానులను అలరించే కోహ్లి.. తన వ్యక్తిగత విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాడు. తన కూతురు పుట్టి రెండేళ్లు కావస్తున్నా.. ఇప్పటి వరకు తన గారాల పట్టి ఎలా ఉంటుందో బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు. అంత జాగ్రత్తగా ఉండే కోహ్లికి ఇది నిజంగా చేదు అనుభవమే అని చెప్పుకోవాలి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ విషయంపై తాజాగా కోహ్లి స్పందించాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లి షేర్ చేస్తూ.. "అభిమానులు తమ ఆరాధ్య క్రికెటర్లను చూడడానికి, కలవడానికి ఉత్సాహంగా ఉంటారు. ఆ విషయంలో నేను వారిని ఎప్పుడూ అభినందిస్తాను. కానీ ఇక్కడ ఈ వీడియో చాలా భయంకరంగా ఉంది. ఇది నా గోప్యతకు సంబంధించిన విషయం. నేను నా సొంత గదిలోనే ప్రైవసీగా ఉండకలేకపోతే.. ఇంకెక్కడ దొరుకుతుంది? ఈ విధంగా నా ప్రైవసీకి ఇబ్బంది కలిగించే అభిమానాన్ని నేను అస్సలు సహించను. దయచేసి వ్యక్తుల ప్రైవసీని గౌరవించండి. వారిని మీ వినోదం కోసం ఒక వస్తువుగా పరిగిణించవద్దు" అని కోహ్లి పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) చదవండి: T20 WC 2022: ఇదేమి బెంగళూరు వికెట్ కాదు.. దినేశ్ కార్తిక్‌పై సెహ్వాగ్ సెటైర్లు! ఇప్పటికైనా -
దక్షిణాఫ్రికాతో మ్యాచ్.. అశ్విన్ ఔట్! హర్షల్ పటేల్‌కు ఛాన్స్
టీ20 ప్రపంచకప్-2022లో మరో కీలక పోరుకు సమయం అసన్నమైంది. ఆదివారం(ఆక్టోబర్ 30) పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ జట్లు తాడోపేడో తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. దక్షిణాఫ్రికా తమ మునపటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేయగా.. భారత్ నెదర్లాండ్స్‌ను మట్టికరిపించింది. వరుసగా రెండు విజయాలు సాధించిన టీమిండియా నాలుగు పాయింట్లతో ఆగ్ర స్థానంలో ఉంది. అదే విధంగా దక్షిణాఫ్రికా మూడు పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఇరు జట్లు కూడా బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా ఉన్నాయి. టీమిండియా బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లి, సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అదే విధంగా నెదర్లాండ్స్‌తో జరిగిన అఖరి మ్యాచ్‌లో అర్ద సెంచరీ సాధించి కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఇక బౌలింగ్‌లో భువనేశ్వర్, షమీ, అర్ష్‌దీప్ అద్భుతంగా రాణిస్తాన్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అశ్విన్ స్థానంలో అదనపు పేసర్ హర్షల్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక దక్షిణాఫ్రికా విషయానికి వస్తే.. బ్యాటింగ్‌లో డికాక్, రౌసో దుమ్మురేపుతున్నారు. మిడిలార్డర్లో మార్క్రమ్, మిల్లర్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్‌లో నోర్జే, రబాడ వంటి సీనియర్ పేసర్లు ఉన్నారు. పిచ్ వాతావరణం పెర్త్ మైదానం బౌలర్లకు స్వర్గధామం. అయితే బ్యాటర్లు ఒక్క సారి క్రీజులో నిలదొక్కుకుంటే పరుగులు వరద పారించవచ్చు. మ్యాచ్ జరిగే సమయంలో మంచు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. కాగా ఈ మ్యాచ్‌కు పెద్దగా వర్షం ముప్పు పొంచిలేదు. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ బ్యూరో ఆఫ్ మెటియరాలజీ ప్రకారం "పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. స్వల్పంగా (30%) వర్షం కురిసే అవకాశం ఉంది. తుది జట్లు(అంచనా) భారత్ కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ దక్షిణాఫ్రికా క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), రిలీ రోసోవ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ చదవండి: T20 WC 2022: దక్షిణాఫ్రికాతో కీలక పోరు.. పెర్త్‌కు చేరుకున్న టీమిండియా -
T20 WC: ప్రపంచకప్ టోర్నీ.. ప్రాక్టీసు మొదలుపెట్టిన టీమిండియా.. ఫొటో వైరల్
T20 World Cup 2022- Team India Preparations Pic Viral: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ సన్నాహకాల్లో భాగంగా టీమిండియా ప్రాక్టీసు మొదలుపెట్టింది. పెర్త్‌లోని ఐకానిక్ స్టేడియం వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్(డబ్ల్యూఏసీఏ) గ్రౌండ్ వేదికగా ఐసీసీ మెగా ఈవెంట్ సన్నాహకాలు షురూ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఇందుకు సంబంధించిన ఫొటోను భారత క్రికెట్ నియంత్రణ మండలి ట్విటర్లో షేర్ చేసింది. హెల్లో.. డబ్ల్యూఏసీఏ.. ‘‘హెల్లో.. డబ్ల్యూఏసీఏలోకి స్వాగతం.. టీమిండియా తమ మొదటి ట్రెయినింగ్ సెషన్‌కు సిద్ధమైంది’’ అంటూ క్యాప్షన్ జతచేసింది. కాగా అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. Hello and welcome to WACA 🏟 #TeamIndia are here for their first training session. pic.twitter.com/U79rpi9u0d — BCCI (@BCCI) October 7, 2022 హాట్ ఫేవరెట్‌గా బరిలోకి ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు గురువారం ముంబై నుంచి ఆస్ట్రేలియాకు బయల్దేరింది. ఈ సందర్భంగా కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా టీమిండియా ఆటగాళ్లంతా తమకు విష్ చేయడానికి వచ్చిన అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి సంతోషపరిచారు. ఇక టీమిండియాను చీర్ చేస్తూ తీసుకువచ్చిన కేక్‌ను వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ కట్‌చేశాడు. ఇలా కోలాహలం నడుమ ఆస్ట్రేలియాకు పయనమైన భారత జట్టు.. అక్కడికి చేరుకున్న మరుసటి రోజే ప్రాక్టీసు మొదలుపెట్టేసింది. డిఫెండింగ్ చాంపియన్ ఆసీస్‌తో పాటు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న రోహిత్ సేన ట్రోఫీ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. Smiles, laughter and wishes as #TeamIndia left from Mumbai for Australia 📹📸 pic.twitter.com/Re60cUgnZx — BCCI (@BCCI) October 7, 2022 రెండు ప్రాక్టీసు మ్యాచ్‌లు.. మెగా టోర్నీకి ముందు స్వదేశంలో ఆసీస్, దక్షిణాఫ్రికాలోత టీ20 సిరీస్‌లను టీమిండియా 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ ఈవెంట్లో భాగంగా.. అక్టోబరు 10, 13 తేదీల్లో పెర్త్ వేదికగా టీమిండియా వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో రెండు ప్రాక్టీసు మ్యాచ్‌లు ఆడనుంది. ఆ జట్లతో వార్మప్ మ్యాచ్‌లు ఆ తర్వాత ఆసీస్, న్యూజిలాండ్‌తో గబ్బా స్టేడియంలో వార్నప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అక్టోబరు 23న మెల్బోర్న్ గ్రౌండ్ వేదికగా టీమిండియా ఈ ఈవెంట్లో తమ అసలైన ప్రయాణం ఆరంభించనుంది. అతడి స్థానంలో ఎవరో?! కాగా ప్రధాన ఓపెనర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరం కాగా 14 మంది సభ్యులతో టీమిండియా ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఈ నేపథ్యంలో బుమ్రా స్థానాన్ని ఎవరితో భర్తీ చేయనున్నారన్న అంశం క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మహ్మద్ షమీ లేదంటే మహ్మద్ సిరాజ్ లేదా స్టాండ్ బైగా ఉన్న దీపక్ చహర్‌లలో ఎవరో ఒకరు బుమ్రా ప్లేస్‌లో జట్టులోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: Pak Vs Ban 1st T20: చెలరేగిన రిజ్వాన్.. బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ విజయం IND vs SA: 'మీ కంటే బాల్ బాయ్ బెటర్.. అద్భుతమైన క్యాచ్ పట్టాడు' -
‘పింక్ టెస్టు’ బరిలో మహిళలు
ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు తమ 45 ఏళ్ల టెస్టు మ్యాచ్ చరిత్రలో ఇప్పటి వరకు 36 టెస్టులు ఆడింది. జూన్ 16నుంచి ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్ జట్టుకు 37వది అవుతుంది. దీని తర్వాత తొలి సారి మన టీమ్ మిథాలీ రాజ్ నాయకత్వంలో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ఆడటం ఖాయమైంది. సెప్టెంబర్ 30నుంచి పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగే ఏకైక టెస్టును ‘పింక్ బాల్’తో నిర్వహించనున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మహిళల క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసే ప్రయత్నంలో భాగంగా పింక్ బాల్ టెస్టు అవకాశం కల్పించినట్లు బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు. ఆస్ట్రేలియాలో భారత మహిళల జట్టు పర్యటన షెడ్యూల్‌ను ఆసీస్ క్రికెట్ బోర్డు (సీఏ) ఖరారు చేసింది. సెప్టెంబర్ 19, 22, 24 తేదీల్లో వన్డేలు...అక్టోబర్ 7, 9, 11 తేదీల్లో టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ రెండింటి మధ్య ఏకైక టెస్టును నిర్వహిస్తారు. మహిళల క్రికెట్లో గతంలో ఒకే ఒక డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ జరిగింది. 2017లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య సిడ్నీలో జరిగిన ఈ టెస్టు డ్రాగా ముగిసింది. -
ఇంటికి తీసుకెళ్లి కుక్కతో కరిపించాడని..
పెర్త్ : ఆస్ట్రేలియాలోని పెర్త్ ప్రాంతానికి చెందిన జాషువా వాకర్ తన పెంపుడు కుక్క చేసిన పనికి తాను కోర్టు ముందు హాజరవ్వాల్సి వచ్చింది. అంతేకాదు తన ఇంటికి వచ్చిన మహిళపై పెంపుడు కుక్క దాడి చేసినందుకు గానూ బాధితురాలికి నష్ట పరిహారంతో పాటు శిక్షను కూడా అనుభవించాలంటూ తీర్పు ఇచ్చింది. తన కుక్క చేసిన పనికి తాను శిక్షను అనుభవించడం కొంచెం గిల్టీ ఫీలింగ్ కలుగుతుందని జాషువా తెలిపాడు. (చదవండి : ‘నమ్మలేకపోతున్నాం.. ఇది అరుదైన అనుభవం’) ఇక అసలు విషయానికి వస్తే... పెర్త్‌కు చెందిన జాషువా వాకర్‌తో గతేడాది ఒక మహిళతో పరిచయం అయింది. గతేడాది క్రిస్మస్ రోజున సరదాగా కలిసిన ఈ ఇద్దరు హోటల్‌కు వెళ్లి పార్టీ చేసుకున్నారు. జాషువా ఆ తర్వాత ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఇంట్లో నా పెంపుడు కుక్క అయిన టెక్సాస్‌ను కట్టేస్తానని.. అంతవరకు లోపలకు రావొద్దని హెచ్చరించాడు. అయితే ఆ మహిళ అతని మాట వినకుండా టెక్సాస్‌ను నిమురుదామని దగ్గరికి వచ్చింది. ఇంతలో టెక్సాస్ ఆ మహిళ ముఖంపై దాడి చేసి పీక్కుతింది. దీంతో తీవ్రరక్తస్రావంతో మహిళ ముఖంపై పెద్ద హోల్ తయారైంది. వెంటనే ఆసుపత్రికి వెళ్లిన ఆమె ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసిన వైద్యులు 21 కుట్లు వేశారు. అనంతరం సదరు మహిళ జాషువా తో పాటు అతని పెంపుడు కుక్కపై కేసు పెట్టింది. మర్యాదపూర్వకంగా ఇంటికి తీసుకెళ్లి ఇలా కుక్కతో కరిపించడంమేంటని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు తాజాగా కోర్టుకు రావడంతో జాషువా, బాధితురాలు తమ తమ న్యాయవాదులతో హాజరయ్యారు. జాషువా తరపు లాయర్ అలెక్స్ స్మిత్ మాట్లాడుతూ.. జాషువా తన ఇంటికి ఆమెను మర్యాదపూర్వకంగా పిలిచిన మాట నిజమే కాని అతను తన కుక్కతో కరిపించలేదు. నిజానికి దానిని నిమురకుండా దాని మీద పడిపోవడంతోనే అది దాడి చేసిందని తెలిపాడు. అయినా జాషువా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడని పేర్కొన్నాడు. అయితే ఉద్దేశపూర్వకంగానే మహిళను ఇంటికి పిలిపించి కావాలనే టెక్సాస్‌తో కరిపించినట్టు బాధితురాలి తరపు న్యాయవాది టిమ్ హౌలింగ్ తెలిపాడు. జాషువాకు భారీ ఫెనాల్టీ విధించడంతో పాటు శిక్ష ఖరారు చేయాలని పేర్కొన్నాడు. అన్ని వాదనలు విన్న జడ్జి మహిళకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని, జైలుశిక్ష కూడా అనుభవించాలని తీర్పు ఇచ్చాడు. కాగా జాషువా వాకర్‌కు ఎన్ని రోజుల జైలు శిక్ష ఉంటుందనేది తెలియదు.(చదవండి : ‘వాళ్లను ఎంతగానో ప్రేమిస్తున్నా అని చెప్పండి’) -
12 పరుగులకే ఆరు వికెట్లు..
పెర్త్: ఆస్ట్రేలియా దేశవాళీ మ్యాచ్‌లో భాగంగా ద మార్ష్ కప్ వన్డేల్లో టోర్నీలో విక్టోరియా జట్టు పరుగు తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. సోమవారం తస్మానియాతో జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విక్టోరియా బౌలర్లు విజృంభించడంతో ఆ జట్టు ఓటమి అంచుల వరకూ వెళ్లి చిరస్మరణీయమైన గెలుపును నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విక్టోరియా జట్టు 47.5 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. సదర్లాండ్(53) హాఫ్ సెంచరీ సాధించగా, గ్లెన్ మ్యాక్స్ వెల్(34) ఫర్వాలేదనిపించాడు. ఇక మాథ్యూ షాట్(27) సమయోచితంగా ఆడటంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేసింది. అయితే 186 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన తస్మానియా లక్ష్యానికి చేరువగా వచ్చి ఓటమి పాలైంది. 12 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోవడంతో తస్మానియాకు పరాజయం తప్పలేదు. 172 పరుగుల వరకూ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయిన తస్మానియా.. ఆపై మరో 12 పరుగులు మాత్రమే జోడించి మిగతా వికెట్లను కోల్పోయింది. బెన్ మెక్‌డెర్మాట్(78) ఒక్కడే మెరిశాడు. విక్టోరియా బౌలర్లలో ట్రెమైన్,కోలీమ్యాన్లు తలో నాలుగు వికెట్లతో చెలరేగి పోవడంతో తస్మానియా వరుసగా వికెట్లను చేజార్చుకుని ఓటమి చెందింది. ఐదు పరుగులు సాధిస్తే విజయం దక్కించుకునే సమయంలో ఐదు వికెట్లను తస్మానియా చేజార్చుకోవడం ఇక్కడ మరో అంశం. Tasmania needed five runs to win from 11 overs with five wickets in hand and then: WW.11W.W1W 😱🤯#MarshCup | @MarshGlobal pic.twitter.com/vwiAHSKI1o — cricket.com.au (@cricketcomau) September 23, 2019 -
నేటి నుంచి ప్రొఫెషనల్ క్రికెట్ బరిలోకి బాన్‌క్రాఫ్ట్
బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి తొమ్మిది నెలల నిషేధానికి గురైన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ నేటి నుంచి మళ్లీ సీనియర్ ప్రొఫెషనల్ క్రికెట్ బరిలోకి దిగుతున్నాడు. శనివారంతో అతనిపై నిషేధం ముగిసింది. దాంతో బిగ్‌బాష్ టి20 లీగ్ జట్టు పెర్త్ స్కార్చర్స్ తమ 13 మంది సభ్యుల జట్టులోకి బాన్‌క్రాఫ్ట్‌ను ఎంపిక చేసింది. ఆదివారం హోబర్ట్ హరికేన్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతను ఆడే అవకాశం ఉంది. 26 ఏళ్ల బాన్‌క్రాఫ్ట్ ఆస్ట్రేలియా తరఫున 8 టెస్టులు, ఏకైక టి20 మ్యాచ్ ఆడాడు. స్మిత్, వార్నర్‌లపై మార్చి 29 వరకు నిషేధం కొనసాగనుంది. -
సైకిల్‌పై 14 దేశాలు చుట్టేసింది!
సైకిల్‌పై దేశమంతా తిరగడం ఇప్పటిదాకా చాలా మంది చేశారు. మరి దేశాలు తిరిగినవారి గురించి విన్నారా? ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 దేశాలు.. 29వేల కిలోమీటర్లు..! ఈ ఘనత సాధించింది ఏ కండలు తిరిగిన యువకుడో కాదు.. నిండా 20 ఏళ్లు కూడా నిండని ఓ యువతి. అతితక్కువ సమయంలో ఎక్కువ దూరం సైకిల్‌పై ప్రయాణించిన తొలి ఏషియన్‌గా రికార్డు కూడా సాధించింది. వివరాల్లోకెళ్తే.. నాలుగేళ్ల క్రితం సరదాగా సైకిల్‌పై సుదూర ప్రయాణం చేద్దామని నిర్ణయించుకుంది. కానీ అప్పుడు కుదరలేదు.. చివరికి ఈ ఏడాది తన సరదా తీర్చుకునేందుకు సైకిల్‌పై ప్రయాణాన్ని మొదలుపెట్టి, కేవలం 159 రోజుల్లో 14 దేశాలను చుట్టేస్తూ 29 వేల కిలోమీటర్లు పూర్తిచేసింది. ఈ ఘనత సాధించిన తొలి ఏషియన్‌గా నిలిచిన ఆ యువతి వేదాంగి కులకర్ణి. అందరిలా కాకుండా.. పుణేకు చెందిన వేదాంగి.. ఉండేది మాత్రం యూకేలో. అక్కడ బౌర్నెమౌత్ యూనివర్సిటీలో స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేస్తోంది. ఎప్పుడూ సాహసాలు చేయడం.. సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండటం ఆమెకు ఇష్టం. అందుకే 130 రోజుల్లో 29 వేల కిలోమీటర్లు సైకిల్ తొక్కాలని నిర్ణయించుకుంది. అయితే మధ్యలో తలెత్తిన కొన్ని అవాంతరాలవల్ల తన లక్ష్యాన్ని 159 రోజుల్లో పూర్తిచేసింది. ప్రాణాలను లెక్కచేయక.. కెనడాలో ప్రయాణిస్తున్నప్పుడు వేదాంగిని ఓ ఎలుగుబంటి వెంబడించింది. దాని నుంచి ఎలాగోలా తప్పించుకుంది. ఇక స్పెయిన్‌లో దోపిడీ దొంగలు పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ పెట్టి ఉన్నదంతా దోచుకున్నారు. –20 డిగ్రీల చలిని, 37 డిగ్రీల ఎండనూ తట్టుకుంది. ప్రాణాలకు తెగించి తన లక్ష్యాన్ని చేరుకుంది. పెర్త్‌లో ప్రారంభం.. పెర్త్‌లో తన సైకిల్ యాత్రను ప్రారంభించి... ఆస్ట్రేలియా నుంచి బ్రిస్బేన్ ద్వారా న్యూజిలాండ్ వెళ్లింది. అక్కడ కెనడాకు విమానంలో వెళ్లి కెనడాలోని హలీఫాక్స్ నుంచి మళ్లీ సైకిల్ యాత్రను కొనసాగించింది. అక్కడి నుంచి ఐస్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, రష్యా వెళ్లి అక్కడి నుంచి విమానంలో వచ్చి.. ఇండియాలో 4000 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసింది. అలా తన యాత్రను ఇండియాలో ముగించింది. -
పెర్త్ పిచ్‌కు అత్తెసరు మార్కులే!
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టెస్టుకు వేదికైన పెర్త్ పిచ్ యావరేజ్‌గా ఉందని ఐసీసీ మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలే నివేదిక ఇచ్చారు. ఇందులో ఆసీస్ గెలిచి నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసిన సంగతి తెలిసిందే. రిఫరీ రంజన్ మదుగలే పెర్త్ స్టేడియం పిచ్, ఔట్ ఫీల్డ్ ఓ మాదిరిగా ఉందని అత్తెసరు మార్కులు ఇచ్చారు. భారత్ గెలిచిన అడిలైడ్ ఓవల్ పిచ్‌కు రిఫరీ ‘చాలా బాగుంది’ అనే రేటింగ్ ఇచ్చారు. టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన వేదికలకు ఈ ఏడాది నుంచి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రేటింగ్స్‌ను ఇస్తోంది. -
ఆసీస్‌తో రెండో టెస్టు మొదటి రోజు
-
రెండో టెస్టు.. బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
సాక్షి స్పోర్ట్స్: పెర్త్‌లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పెయిన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా మొదటి టెస్టులో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుండగా..భారత్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. గాయాలతో రెండో టెస్టుకు దూరమైన అశ్విన్, రోహిత్ శర్మ స్థానంలో హనుమ విహారి, ఉమేశ్ యాదవ్‌లకు కోహ్లి స్థానం కల్పించారు. మొదటి టెస్టులో భారత్ విజయం సాధించిన సంగతి తెల్సిందే. అదే ఊపులో రెండో టెస్టు గెలిచేందుకు భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. తుది జట్లు భారత్ : కేఎల్ రాహుల్, విజయ్, కోహ్లి(కెప్టెన్), పుజారా, రహానె, హనుమ విహారి, రిషబ్ పంత్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్‌యాదవ్ . ఆస్ట్రేలియా: ఫించ్, హారిస్, ఖవాజా, షాన్ మార్ష్, హ్యాండ్స్కాంబ్, ట్రావిస్ హెడ్, టిమ్ పెయిన్(కెప్టెన్), లైయన్, హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ . -
పంచరత్నాలు
ఒకటా... రెండా...? ఏడు దశాబ్దాల ప్రయాణం! పదకొండు సిరీస్‌ల ప్రస్థానం! నలభై నాలుగు టెస్టుల పరంపర! గెలిచింది మాత్రం ఐదంటే ఐదే! ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియాకు ఎంతటి గడ్డు కాలం సాగిందో చెప్పేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. కాలక్రమంలో వెస్టిండీస్, ఇంగ్లండ్‌లపై వారివారి దేశాల్లోనే సిరీస్‌లు నెగ్గిన భారత్‌కు కంగారూలు మాత్రం ఇంతవరకు కొరుకుడుపడలేదు. ఇందులో తుది ఫలితం సంగతి అటుంచి... ఓ ఐదుసార్లు మాత్రం మన జట్టు విజయాలను ఒడిసిపట్టింది. ఆ పంచ రత్నాలేమిటో చూద్దామా..! సాక్షి క్రీడా విభాగం ఎవరెన్ని చెప్పనీ... ఆస్ట్రేలియా ఎంత బలహీనపడనీ... టీమిండియా ఎంత బలంగా ఉండనీ... కంగారూ దేశంలో ‘టెస్టు సిరీస్ నెగ్గడం’ మనకింకా తీరని కలే! స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పోరాడుతున్నా... అదో అందని ద్రాక్షే! సిరీస్ సంగతి సరే... అసలు తొలి విజయానికే 30 ఏళ్లు పట్టిందంటే ఆసీస్‌తో సమరం ఎంత కఠిన సవాలో తెలుస్తోంది. అంతెందుకు...? ఈ ఆధునిక యుగంలోనూ వారి గడ్డపై టెస్టు నెగ్గి పదేళ్లయిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈసారి విరాట్ కోహ్లి సేన కొంత మెరుగైన ఫలితం సాధించే అవకాశం కనిపిస్తోన్న నేపథ్యంలో, గతంలో రెండేసి వరుస సిరీస్‌లలో టీమిండియా అందుకున్న ఆణిముత్యాల్లాంటి ఓ ఐదు విజయాలివి... పెర్త్‌లో పటాకా... 2008 జనవరి 16–19 అంపైరింగ్ నిర్ణయాలతో వివాదాస్పదమై, అప్పటికే రెండు టెస్టులను కోల్పోయి, మంకీ గేట్ దుమారంతో సంచలనం రేపిన సిరీస్ ఇది. అయితే... ‘ఈ సిరీస్‌లో ఒక్క జట్టే క్రీడా స్ఫూర్తితో ఆడింది’ అన్న ఒకే ఒక్క మాటతో భారత కెప్టెన్ అనిల్ కుంబ్లే ఇచ్చిన పంచ్ ఆస్ట్రేలియన్లు తలొంచుకునేలా చేసింది. అదే సమయంలో కుంబ్లే జట్టులో ఆత్మవిశ్వాసం నింపి సారథిగా విశిష్టతను చాటుకున్నాడు. ఈ క్రమంలో మూడో టెస్టులో ద్రవిడ్ (93), సచిన్ (71) రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 330కి ఆలౌటైంది. ఆర్పీ సింగ్ (4/68) మెరుపులతో పాటు ఇషాంత్, ఇర్ఫాన్ పఠాన్, కుంబ్లే రెండేసి వికెట్లు పడగొట్టడంతో ఆసీస్‌ను 212కే కట్టడి చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్మణ్ (79) స్పెషల్ ఇన్నింగ్స్, సెహ్వాగ్ (43), ఇర్ఫాన్ (46) ఆకట్టుకోవడంతో టీమిండియా 294 పరుగులు చేసింది. 412 పరుగుల ఛేదనలో ఆసీస్‌ను ఇర్ఫాన్ (3/54), ఆర్పీ సింగ్ (2/95) దెబ్బ కొట్టారు. దీంతో ఆ జట్టు 340కే ఆలౌటై లక్ష్యానికి 72 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ సిరీస్‌లో కొత్త కుర్రాడు ఇషాంత్ శర్మ... ఆసీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ రికీ పాంటింగ్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో వార్తల్లో నిలిచాడు. మెల్బోర్న్ మెరుపు 1977 డిసెంబర్ 30– 1978 జనవరి 4 ఆస్ట్రేలియాలో తొలి టెస్టు (1947) ఆడిన 30 ఏళ్లకు... మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా టీమిండియాకు ఓ గెలుపు దక్కింది. వాస్తవానికి ఈ సిరీస్ భారత్‌కు ఓ మరుపురానిదిగా మిగిలిపోయేదే. ‘కెర్రీ ప్యాకర్’ ఉదంతంతో చాపెల్ సోదరులు, డెన్నిస్ లిల్లీ వంటి ఉద్ధండులు దూరమవడంతో కొంత బలహీనపడిన ఆసీస్... ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్టులను అతి కష్టం మీద (16 పరుగులు, 2 వికెట్లు) నెగ్గింది. మూడో దాంట్లో మాత్రం మనదే పైచేయి అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్... ఓపెనర్లు సునీల్ గావస్కర్, చేతన్ చౌహాన్ ఖాతా తెరవకుండా ఔటైనా, మొహిందర్ అమర్నాథ్ (72), గుండప్ప విశ్వనాథ్ (59) అర్ధశతకాలతో కోలుకుంది. వెంగ్‌సర్కార్ (37), వినూ మన్కడ్ (44), సయ్యద్ కిర్మాణీ (29) తలోచేయి వేయడంతో 256 పరుగులకు ఆలౌటైంది. బీఎస్ చంద్రశేఖర్ (6/52) స్పిన్ మాయ, బిషన్‌సింగ్ బేడి (2/71), కర్సన్ ఘావ్రీ (2/37) దెబ్బకు ఆసీస్ 213 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో లిటిల్ మాస్టర్ గావస్కర్ (118) అద్భుత శతకం, విశ్వనాథ్ (54) అర్ధశతకాలకు తోడు అమర్నాథ్ (41) రాణించడంతో భారత్ 343 పరుగులు చేసింది. చంద్రశేఖర్ (6/52) మరోసారి ఆరేయగా... బేడి (4/58) మిగతా వారి పని పట్టాడు. దీంతో 386 పరుగుల ఛేదనలో ప్రత్యర్థి 164కే చాప చుట్టేసింది. టీమిండియా 222 పరుగులతో జయభేరి మోగించింది. సిడ్నీలో సూపర్...: 1978 జనవరి 7–12 మెల్బోర్న్ విజయం ఊపును కొనసాగించిన భారత్ వెంటనే జరిగిన సిడ్నీ టెస్టునూ కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్... చంద్రశేఖర్ (4/30), బేడి (3/49) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 131 పరుగులకే కుప్పకూలింది. విశ్వనాథ్ (79), ఘావ్రీ (64) అర్ధ శతకాలతో పాటు గావస్కర్ (49), చౌహాన్ (42), వెంగ్‌సర్కార్ (48), కిర్మాణీ (42) తోడ్పాటుతో 396/8 వద్ద డిక్లేర్ చేసింది. ఫాలోఆన్‌లో కంగారూలను ఎరాపల్లి ప్రసన్న (4/51) దెబ్బకొట్టాడు. చంద్రశేఖర్, బేడి, ఘావ్రీ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. దీంతో ఆసీస్ 263కే ఆలౌటైంది. భారత్ ఇన్నింగ్స్, 2 పరుగులతో వరుసగా రెండో విజయం సాధించింది. అయితే, ఐదో టెస్టు (ఆడిలైడ్) నాలుగో ఇన్నింగ్స్‌లో 492 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మన జట్టు తీవ్రంగా పోరాడి 445 వద్ద ఆగిపోయింది. 47 పరుగులతో నెగ్గిన ఆసీస్ సిరీస్‌ను 3–2తో కైవసం చేసుకుంది. మళ్లీ మొదటి చోటే...: 1981 ఫిబ్రవరి 7–11 ఈ పర్యటనలో తొలి టెస్టు ఓడి, రెండో టెస్టును ‘డ్రా’ చేసుకున్న టీమిండియా మూడో దాంట్లో విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో సిరీస్ 1–1తో సమమైంది. అయినా, చివరి టెస్టులో భారత్ విజయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోక తప్పదు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మన జట్టు గుండప్ప విశ్వనాథ్ (114) వీరోచిత శతకంతో తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులు చేయగలిగింది. అలెన్ బోర్డర్ (124) శతకం, గ్రెగ్ చాపెల్ (76), వాల్టర్ (78) అర్ధశతకాలతో ఆసీస్ 419 పరుగులు చేసింది. ఓపెనర్లు గావస్కర్ (70), చేతన్ చౌహాన్ (85) ఇచ్చిన శుభారంభాన్ని వెంగ్‌సర్కార్ (41), విశ్వనాథ్ (30), సందీప్ పాటిల్ (36) సద్వినియోగం చేయడంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 324 పరుగులు చేయగలిగింది. 142 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్‌ను కపిల్ దేవ్ (5/28) కుదేలు చేశాడు. దీంతో ఆ జట్టు 83 పరుగులకే ఆలౌటై 59 పరుగుల తేడాతో ఓడింది. లక్ష్మణ్ స్పెషల్ ద్రవిడ్ డబుల్... అడిలైడ్: 2003 డిసెంబర్ 12–16 అటు రికీ పాంటింగ్ (242), ఇటు రాహుల్ ద్రవిడ్ (233) డబుల్ సెంచరీల మోతతో రెండు జట్లు హోరాహోరీగా తలపడిన మ్యాచ్ ఇది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 556 పరుగులకు ఆలౌటైంది. అనిల్ కుంబ్లే (5/154) ఐదు వికెట్లు పడగొట్టాడు. స్కోరు 85/4 ఉన్న దశలో డబుల్ సెంచరీతో ద్రవిడ్, భారీ శతకంతో వీవీఎస్ లక్ష్మణ్ (148) ఐదో వికెట్‌కు 385 పరుగులు జోడించడంతో భారత్ 523 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో అజిత్ అగార్కర్ (6/41) అద్భుత స్పెల్‌తో ప్రధాన బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయడంతో ఆసీస్ 196కే పరిమితమైంది. 229 పరుగుల ఛేదనలో ద్రవిడ్ (72)కు సెహ్వాగ్ (47), సచిన్ (37), లక్ష్మణ్ (32) సహకారం అందించడంతో భారత్ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఈ సిరీస్‌లో మొదటి టెస్టు ‘డ్రా’ కాగా... భారత్ రెండో దాంట్లో గెలిచి 1–0 ఆధిక్యంలో నిలిచింది. ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే, ఆసీస్ మూడో టెస్టును 9 వికెట్లతో గెల్చుకుని సిరీస్‌ను 1–1తో ‘డ్రా’ చేసింది. 1981 తర్వాత 22 ఏళ్లకు ఆస్ట్రేలియాలో భారత్ టెస్టు గెలవడం గమనార్హం. -
వైరల్: మహిళ వేలుకొరికేసిన షార్క్!
పెర్త్ : సముద్రంలో స్నేహితులతో బోటులో విహరిస్తూ ఆస్వాదిస్తున్న ఓ మహిళకు అనుకోకుండా ఓ షాకింగ్ ఘటన ఎదురైంది. పడవ వెనుకాల నిల్చోని సముద్రపు అలలతో ఆడుకుంటుండగా.. ఓ షార్క్ ఆమెపై దాడి చేసింది. అయితే ఆమె, బోటులోని సహచరులు అప్రమత్తంగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కింబెర్లీ సముద్ర తీరంలో గత మే నెలలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే బోటులో ప్రయాణిస్తుండగా ఓ నాలుగు షార్క్‌లు తమ పడవ చుట్టూ చేరాయని, అందులో ఒకటి తనపై దాడి చేసి వేలు కొరికేసిందని బాధితురాలు మెలిస్సా బర్నింగ్ తెలిపింది. షార్క్ పదునైన పళ్లతో కొరకడంతో తన వేలును కోల్పోవాల్సి వచ్చిందని, కిందపడిపోయిన తనను సహచరులు లేపారని చెప్పుకొచ్చింది. ఈ ఘటనలో ఆ షార్క్ తప్పేమి లేదని, తప్పంతా తనదేనని కూడా చెప్పుకొచ్చింది. సముద్రపు జీవులను తాను ప్రేమిస్తానని, వాటికి స్వేచ్చనివ్వాలని కూడా చెప్పింది. అది షార్క్ కాబట్టి బతికి బయపడ్డా కానీ ఏ మొసలో అయితే అంతే సంగతంటూ భయపడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన మొబైల్ ఫుటేజీని ఓ చానల్ ప్రసారం చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. -
వైరల్: మహిళ వేలుకొరికేసిన షార్క్!
-
భయానక దాడి; ప్రపంచ స్థాయి టోర్నీ రద్దు
పెర్త్: రంపంలాంటి పళ్లతో మనుషుల్ని నమిలిమింగే సొర చేపలు(షార్క్‌లు) బీభత్సం సృష్టించాయి. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు సర్ఫర్లపై భయకరంగా దాడిచేశాయి. దీంతో అట్టహాసంగా జరగాల్సిన ప్రపంచ స్థాయి సర్ఫింగ్ పోటీలు అనూహ్యంగా రద్దయ్యాయి. వరల్డ్ సర్ఫ్ లీగ్(డబ్ల్యూఎస్‌ఎల్) ఈ మేరకు బుధవారం ఉదయం అధికారిక ప్రకటన చేసింది. మనిషి నెత్తురు కోసం ఆరాటంగా: ఔత్సాహిక సర్ఫర్లను ప్రోత్సహిస్తూ, సాహసక్రీడను వ్యాప్తి చేయాలన్న ఉద్దేశంతో వరల్ట్ సర్ఫ్ లీగ్ ప్రపంచ స్థాయి టోర్నీలను నిర్వహిస్తుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ‘మార్గరేట్ రివర్ ప్రో’ కు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అక్కడి గ్రేస్ టౌన్ చుట్టుపక్క తీరాల్లో సర్ఫర్లు తమ విన్యాసాలు చేశారు. ఏప్రిల్ 22 వరకు జరుగనున్న ఈ ఈవెంట్ సొర చేపల దాడితో అర్ధాంతరంగా రద్దైపోయింది. సర్ఫింగ్ చేస్తోన్న క్రీడాకారులపై వరుసగా సోమ, మంగళవారాల్లో దాడులు జరిగాయి. మనిషి నెత్తురు కోసం ఆరాటపడే షార్క్‌లు చాకచక్యంగా దాడులు చేస్తాయన్న సంగతి తెలిసిందే. షార్క్‌ల దాడిలో తృటిలో ప్రాణాలను దక్కించుకున్న సర్ఫర్లను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. వెరీ సారీ: ‘‘సాధ్యమైనన్ని రక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ సొర చేపలు దాడిని అడ్డుకోలేకపోయాం. క్రీడాకారుల భద్రత దృష్ట్యా ఈ దఫా పోటీలను రద్దు చేస్తున్నాం. గాయపడ్డ ఇద్దరిలో ఒకరి పరిస్థితి కాస్త విషమంగా ఉంది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. టోర్నీని రద్దు చేయడం బాధాకరమే అయినా, తప్పడంలేదు. క్రీడాకారులందరికీ సారీ.’’ అని డబ్ల్యూఎస్‌ఎల్ అధికారిక ప్రతినిధి సోఫీ మీడియాకు వివరించారు. -
వాటర్ ట్యాప్ తాకగానే.. 240 వోల్ట్స్ షాక్
పెర్త్ : నిత్యం ఉపయోగించే వాటర్ ట్యాప్ (నీళ్ల కొళాయి)ను తాకడం ఆ బాలిక పాలిట శాపంగా మారింది. పెరడులోని మొక్కలకు నీళ్లు పట్టిన అనంతరం వాటర్ ట్యాప్‌ను బంద్ చేసేందుకు ఆమె దానిని ముట్టుకోవడంతో ఏకంగా 240 వోల్ట్స్ పవర్‌తో షాక్ కొట్టింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిన ఆ బాలిక మెదడు దెబ్బతినడంతో తిరిగి మామూలు స్థితికి రాలేని పరిస్థితుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని పెర్త్ పట్టణమైన బెల్డన్లో చోటుచేసుకుంది. డేనిషర్ వుడ్స్ అనే బాలిక తన ఇంటి పెరడులోని మొక్కలకు నీళ్లు పెట్టిన అనంతరం.. వాటర్ ట్యాప్‌ను ఆఫ్ చేయడానికి దాన్ని ముట్టుకోగానే.. షాక్ కొట్టింది. దీంతో డేనిషర్ అక్కడికక్కడే కుప్పకూలింది. అది గమనించిన ఆమె తల్లి లేసీ హ్యారిసన్ ఆస్పత్రికి తరలించగా.. హై ఓల్టేజ్ పవర్ కారణంగా ఆ బాలిక మెదడు పూర్తిగా దెబ్బతిన్నదని వైద్యులు తెలిపారు. 50 ఓల్ట్‌ల కన్నా ఎక్కువ విద్యుత్ శరీరానికి తగిలినపుడు తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వివరించారు. దాదాపు 240 ఓల్ట్‌ల షాక్ తగలటం వల్ల ఆమె మెదడుకు తీవ్రగాయమైందని, ఇక ఎప్పటికీ ఆమె తిరిగి కోలుకునే అవకాశం లేదని తెలిపారు. ప్రాణపాయ స్థితిలో ఆస్పత్రి బెడ్ పై ఉన్న కూతుర్ని చూసి డేనిషర్ తల్లి కంటతడిపెట్టుకుంది. ఎలాగైనా తన కూతురిని బతికించాలని వైద్యులను ప్రాధేయపడింది. ఇదివరకే తనకు చిన్నపాటి కరెంట్ షాక్ తగిలిందని విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కనీసం ఎలాంటి హెచ్చరికలు కూడా చేయలేదని ఆమె తెలిపింది. న్యూట్రల్ కేబుల్ వైర్ తెగిపోయినపుడు ఇంటిలో ఎర్తింగ్ అనుసంధానం చేయబడిన ప్రతి వస్తువుకు కరెంట్ పాస్ అయ్యే అవకాశం ఉంటుందని విద్యుత్ అధికారులు అంటున్నారు. అసలు నీళ్ల కొళాయికి కరెంట్ ఎలా వచ్చింది. అందుకు ఇంటిలోని విద్యుత్ సమస్యలే కారణమా అన్నవిషయాలపై అధికారులు దృష్టి సారించారు. -
సొంత వైద్యం అతన్ని కాపాడింది
పెర్త్ : ఎవరికైనా గుండె పోటు వస్తే ఏం చేస్తాం. దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్తాం. కానీ ఆస్ట్రేలియాలోని ఓ వ్యక్తిని తీసుకెళ్లటానికి పక్కన ఎవరూ లేరు. పోనీ తెగించి ఒక్కడే వెళ్దామనుకున్న ఆస్పత్రి అంత దగ్గర్లో లేదు. అయినా సొంత వైద్యంతో తన ప్రాణాలను తానే కాపాడుకున్నాడు ఆ వ్యక్తి. పెర్త్ నగరానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పట్టణంలో 44 ఏళ్ల వ్యక్తి జీవిస్తున్నాడు. మూడు రోజుల క్రితం హఠాత్తుగా గుండెపోటు సంకేతాలు కనిపించాయి. ఆస్పత్రి అక్కడికి 150 కిలోమీటర్లు దూరంలో ఉంది. సహాయం అందించడానికి దగ్గర్లో ఎవరూ లేరు. అయినా ప్రాణాలపై అతను ఆశ వదలుకోలేదు. నర్సుగా తనకున్న అనుభవాన్ని ఉపయోగించి ప్రాథమిక పరీక్షలు చేసుకున్నాడు. ముందుగా ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ఇకెజీ) అనే పరీక్ష చేసుకున్నాడు. ఆ ఫలితాన్ని అత్యవసర టిలిహెల్త్ ద్వారా ఓ గుండె సంబంధిత వైద్యుడికి మెయిల్ చేశాడు. అవతలి వైద్యుడు అతనికి గుండె పోటు వచ్చిందని నిర్ధారించాడు. దీంతో ఆ వ్యక్తి క్లాట్ డిసాల్వింగ్ అనే చికిత్స చేసుకున్నాడు. దాంతో గుండెనొప్పి తగ్గి అతను ఉపశమనం పొందాడు. ఆ మరుసటిరోజు పెర్త్ లోని ఓ ఆసుపత్రికి వెళ్లి పూర్తి స్థాయిలో వైద్యం అందించుకున్నాడు. -
ఓలా ఆఫర్.. రెండు రైడ్స్ ఉచితం
బెంగుళూరు : క్యాబ్ సేవల సంస్థ ఓలా తన కస్టమర్లకు రెండు రైడ్లు ఉచితంగా ఇస్తున్నట్లు బుధవారం తెలిపింది. కానీ అది మన ఇండియాలో కాదు. ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో ఈ ఉచిత ఆఫర్ వర్తిస్తుంది. ఇటీవలే ఇండియాకు చెందిన ఓలా సంస్థ తన క్యాబ్ సేవలను ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్, సిడ్నీ, పెర్త్ నగరాలలో ప్రారంభించిన సంగతి తెల్సిందే. ట్రయల్‌లో భాగంగా పది డాలర్ల వరకు రెండు సార్లు ఉచితంగా తమ క్యాబ్‌లలో ప్రయాణించవచ్చని తెలిపింది. ప్రయాణికులకు తక్కువ చార్జీలు, డ్రైవర్లకు అధిక లాభంతో నాణ్యమైన ప్రయాణ అనుభవాన్ని కలిగించడమే తమ సంస్థ లక్ష్యమని ఓలా ప్రకటించింది. తమ సర్వీస్‌ను అభివృద్ధి పరుచుకోవడానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని కస్టమర్లను కోరింది. సిడ్నీ, మెల్బోర్న్, పెర్త్ నగరాల్లోని ప్రైవేటు అద్దె వాహనాల యజమానులు కంపెనీ వెబ్సైట్ drive.olacabs.comలో రిజిస్టర్ చేసుకోవచ్చునని తెలిపింది. -
నెలల బుడ్డోడి విన్యాసం.. వైరల్ వీడియో
సిడ్నీ : ఓ తల్లి తన నెలల బుజ్జాయి ఈత కొలనులో చేసిన అద్భుత విన్యాసాన్ని ఫేస్ బుక్‌లో షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. పెర్త్‌కు చెందిన రోక్షాన్నే టర్నర్ కు సంతానం తొమ్మిది నెలల బాబు మ్యాక్స్. తన బాబుకు స్మిమ్మింగ్ నేర్పించాలని భావించిన టర్నర్ స్మిమ్మింగ్ పూల్ కు మ్యాక్స్ ను తీసుకెళ్లింది. ఈత నేర్పించే ట్రైనర్ డైరాకు చిన్నారి మ్యాక్స్ కు శిక్షణ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో ఇటీవల స్మిమ్మింగ్ కు తల్లితో కలిసి వెళ్లాడు మ్యాక్స్. పుల్లో పడేసిన తర్వాత సొంతంగా వెల్లకిలా ఎలా మారాలో, నీటిపై ఎలా తేలియాడాలో ట్రైనర్ డైరా నేర్పించారు. ట్రైనర్ రెండు చేతులతో మ్యాక్స్‌ను కొలనులో వేయగా తన కుమారుడు చేసిన విన్యాసాన్ని వీడియో తీసి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. పేరెంట్స్ అందరూ ఈ వీడియో చూడాలంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
నెలల బుడ్డోడి విన్యాసం.. వైరల్ వీడియో
-
పెర్త్ క్షతగాత్రుల పరిస్థితి విషమం
ఆస్ట్రేలియూ వెళ్లేందుకు ప్రియదర్శిని తల్లిదండ్రులకు తత్కాల్ పాస్‌పోర్టు వరంగల్ క్రైం: ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. అక్కడ గాయపడిన ప్రియదర్శిని తల్లిదండ్రులు గురువారం వరంగల్ నగర పోలీస్ కమిషనర్‌ను కలిశారు. తమ కూతురు అల్లుడిని చూడడానికి ఆస్ట్రేలియూ వెళ్లేందుకు పాస్‌పోర్టు కోసం విన్నవించారు. వారికి తత్కాల్ పాస్‌పోర్ట్ అందేలా వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఏర్పాట్లు చేశారు. పాస్‌పోర్ట్ కోసం ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా ఆస్ట్రేలియాలోని తన మిత్రులకు కమిషనర్ ఫొన్‌చేసి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని కోరారు. ఆస్ట్రేలియా దేశంలోని పెర్త్ నగరంలో 6వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన అరవింద్‌కుమార్ సామల, భీమవరానికి చెందిన శేషగిరి మేడవరపు అనే ఇద్దరు విద్యార్థులు మరణించారు. వారితోపాటు అదే కారులో ప్రయాణిస్తున్న హన్మకొండకు చెందిన బానియార్ కమలాకర్, కవిత దంపతుల కుమార్తె - అల్లుడు ప్రియదర్శిని, నిశాంత్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరూ ప్రస్తుతం పెర్త్‌లోని రాయల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, తమ కుమార్తె, అల్లుడిని చూడడానికి ఆస్ట్రేలియా వెళ్లేందుకు కావాల్సిన పాస్‌పోర్ట్ కమలాకర్, కవిత దంపతులకు లేకపోవడంతో వారు గురువారం పోలీస్ కమిషనర్‌ను కలిసి జరిగిన సంఘటన చెప్పారు. స్పందించిన పోలీస్ కమిషనర్ వారికి తత్కాల్ పాస్‌పోర్ట్ లభించేలా చర్యలు చేపట్టారు. వీరికి పాస్‌పోర్ట్ కార్యాలయంలో సహకారం అందించేందుకు ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేశారు. అలాగే, క్షతగాత్రులకు అవసరమైన చికిత్స చేసేం దుకు ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల కార్యాలయం అధికారులతో పోలీస్ కమిషనర్ మాట్లాడి క్షతగాత్రుల వివరాలను తెలియపరిచారు. వారికి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలను అందజేయూల్సిందిగా పెర్త్, మెల్బోర్న్లోని తన మిత్రులకు, డాక్టర్లకు ఫోన్‌చేసి కోరారు. గాయపడిన నిశాంత్, ప్రియదర్శినిల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసిందని, కారును ఆస్ట్రేలియూకు చెందిన యువతి నడుపుతున్నదని, ఆమె కూడా ప్రమాదంలో మృతి చెందినట్టు తెలిసిందని ప్రియదర్శిని తండ్రి కమలాకర్, తల్లి కవిత తెలిపారు. -
జట్టు గౌరవం కాపాడు...
విరాట్ కోహ్లికి బీసీసీఐ మందలింపు పెర్త్: జర్నలిస్టుతో గొడవ పెట్టుకున్న స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి ఉదంతంపై బీసీసీఐ స్పందిం చింది. ఇలాంటి విషయాల్లో తలదూర్చకుండా జట్టు గౌరవాన్ని కాపాడాలని విరాట్‌ను మందలించింది. హిందుస్థాన్ టైమ్స్ (హెచ్‌టీ) విలేఖరిని కోహ్లి దుర్భాషలాడడంతో అతడు ఐసీసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో వివాదానికి చెక్ పెట్టేందుకు బోర్డు రంగంలోకి దిగింది. ‘ఎల్లవేళలా జట్టు గౌరవాన్ని కాపాడేలా ప్రవర్తించాలని వివాదానికి కేంద్ర బిందువైన క్రికెటర్‌కు చెప్పాం. భవిష్యత్‌లోనూ ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడాలని సూచించాం’ అని కోహ్లి పేరు ప్రస్తావన లేకుండానే బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంతటిలో ఈ అంశాన్ని వదిలేసి ప్రపంచకప్‌లో భారత్ ప్రస్థానంపై దృష్టి పెట్టాల్సిందిగా మీడియాకు విజ్ఞప్తి చేశారు. అటు హెచ్‌టీ కూడా ఈ గొడవను ఇక్కడితో ముగిద్దామని నిర్ణయించుకుంది. -
‘పాత కోహ్లి’ బయటికొచ్చాడు!
జర్నలిస్ట్‌పై నోరు పారేసుకున్న బ్యాట్స్‌మన్ పెర్త్: వివాదాలతో విరాట్ కోహ్లిది సుదీర్ఘ అనుబంధం. మైదానంలో అద్భుతమైన ఆటగాడిగా రికార్డులు కొల్లగొట్టినా... అదే స్థాయిలో తిట్ల వర్షం కురిపించడంలో కూడా అతనికి అతనే సాటి! నేను మారానంటూ కొన్నాళ్లుగా నోరును అదుపులో ఉంచుకుంటున్న కోహ్లి ఇప్పుడు మరోసారి అదు పు తప్పాడు. మంగళవా రం ఇక్కడ ప్రాక్టీస్ అనంతరం భారత్‌కు చెందిన ఒక మీడియా ప్రతినిధిని తీవ్ర పదజాలంతో దూషిం చాడు. డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళుతూ కోహ్లి, ఆ జర్నలిస్ట్‌పై బూతు పురాణం లంకించుకున్నాడు. కొద్ది క్షణాల పాటు అసలేం జరిగిందో కూడా ఇతర భార త జట్టు సభ్యులకు, మీడియా ప్రతినిధులతో పాటు సదరు రిపోర్టర్‌కు కూడా అర్థం కాలేదు. తనకూ, అనుష్కశర్మకు మధ్య సంబంధం గురించి ఇటీవల ఆ జర్నలిస్ట్ రాసిన ఒక కథనం కోహ్లికి ఆగ్రహం తెప్పించిందని ఆ తర్వాత తెలిసింది. అయితే ఈ విషయంలో కూడా కోహ్లి పొరపడ్డాడు. వాస్తవానికి ఆ కథనం రాసింది కోహ్లి తిట్టిన జర్నలిస్ట్ కాదు. మరొకరు రాసిన వార్త గురించి అతను ఈ రిపోర్టర్‌పై విరుచుకు పడ్డాడు. దాంతో కొద్ది సేపటి తర్వాత తనకు తెలిసిన మరో విలేకరి ద్వారా కోహ్లి క్షమాపణ సం దేశం పంపించాడు! అనంతరం టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి, కోహ్లిని మందలించినట్లు తెలిసింది. భవిష్యత్తు లో కెప్టెన్‌గా ఉండాల్సిన వ్యక్తి తన ఆగ్రహావేశాలు ని యంత్రించుకోవాలని శాస్త్రి చెప్పినట్లు సమాచారం. -
పెర్త్ (వాకా)
ప్రపంచంలోని ఫాస్టెస్ట్ పిచ్ లలో ఒకటిగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ (వాకా) మైదానానికి గుర్తింపు ఉంది. 1893లో అధికారికంగా ఈ స్టేడియాన్ని ప్రారంభిస్తే 1894లో టర్ఫ్ వికెట్‌పై తొలి మ్యాచ్ ఆడారు. పెర్త్ సామాజిక, సంస్కృతికి నిలయంగా ఈ స్టేడియం ఉంటుంది. అథ్లెటిక్స్, ఏఎఫ్ఎల్, బేస్‌బాల్, సాకర్, రగ్బీ లీగ్స్లకు ఆతిథ్యమిస్తున్నా... ఎక్కువగా క్రికెట్‌తోనే ప్రాచుర్యంలోకి వచ్చింది. మైదానంలో ఉన్న వాకా మ్యూజియంలో క్రికెట్ చరిత్రకు సంబంధించిన ఎన్నో గుర్తులు కనిపిస్తుంటాయి. రవాణవ్యవస్థలో ఇబ్బందులు ఉండటం వల్ల ఆసీస్ ప్రధాన క్రికెట్‌తో ఇది ఎక్కువగా అనుసంధానం కాలేకపోయింది. ఇప్పటికీ ఇక్కడికి వెళ్లాంటే షెడ్యూల్ ప్రకారం ఉన్న విమానాల్లోనే వెళ్లాల్సి వస్తుంది. 1970-71లో వేసిన పిచ్‌పైనే రెండు మూడేళ్లు క్రికెట్ ఆడారు. కానీ తర్వాతి రోజుల్లో దాన్ని తొలగించి కొత్త వికెట్‌ను రూపొందించారు. స్వాన్ నదిపై నుంచి వచ్చే వేడి గాలుల వల్ల మధ్యాహ్నం విపరీతమైన ఉక్కపోత ఉంటుంది. 2002లో మైదానం పునర్నిర్మాణంలో భాగం గా సీటింగ్ కెపాసిటీని తగ్గించారు. ఆట ఆడే ప్రాంతాన్ని కూడా కుదించారు. మైదానంలో చిన్న చిన్న స్టాండ్లు, ప్లేయర్స్ పెవిలియన్‌ను ఏర్పాటు చేశారు. కానీ మైదానానికి రెండు వైపుల ఎక్కువ భాగం పచ్చికతో ఏర్పాటు చేసిన నేలపైనే కూర్చొని మ్యాచ్‌ను తిలకిస్తారు. దీంతో స్టేడియం సామర్థ్యం 22 వేలకు పడిపోయింది. పెద్ద మ్యాచ్‌లకు తాత్కాలిక సీట్లను ఏర్పాటు చేసి సామర్థ్యాన్ని 24,500కు పెంచుతారు. పెర్త్‌లో పచ్చని పొదలు, స్థానికంగా లభించే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వైన్, సముద్రపు గాలులు ఆహ్లాదాన్ని కల్గిస్తాయి. భారత్ ఫిబ్రవరి 28న యూఏఈతో, మార్చి 6న వెస్టిండీస్‌తో ఇక్కడ ఆడుతుంది. -
చెన్నైని సెమీస్‌కు చేర్చిన పెర్త్
కీలక మ్యాచ్‌లో ఓడిన లాహోర్ బెంగళూరు: చాంపియన్స్ లీగ్‌లో పెర్త్, లాహోర్ల మధ్య గ్రూప్ ‘ఎ’ ఆఖరి లీగ్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో లాహోర్ కనీసం 46 పరుగుల తేడాతో పెర్త్‌ను ఓడిస్తే సెమీస్‌కు చేరుతుంది. ఒకవేళ పెర్త్ గెలిచినా లేక లాహోర్ 46 కంటే తక్కువ పరుగుల తేడాతో నెగ్గినా... చెన్నై సెమీస్‌కు వెళుతుంది. ఈ నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం నాటకీయంగా మ్యాచ్ సాగింది. తొలుత లాహోర్ కేవలం 124 పరుగులే చేసింది. లక్ష్య ఛేదనలో పెర్త్ తడబడి 40 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. 78 పరుగులకు పెర్త్‌ను నియంత్రిస్తే లాహోర్ సెమీస్‌కు చేరుతుంది. ఈ స్థితిలో పెర్త్ కెప్టెన్ మిషెల్ మార్ష్ (38 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో పెర్త్‌ను మూడు వికెట్ల తేడాతో గెలిపించాడు. ఫలితంగా చెన్నై ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా సెమీస్‌కు చేరింది. ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో పెర్త్ ఫీల్డింగ్ ఎంచుకోగా... లాహోర్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. సాద్ నసీమ్ (55 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించాడు. 11 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన లాహోర్‌ను నసీమ్, ఉమర్ అక్మల్ (19 బంతుల్లో 26; 4 ఫోర్లు) కలిసి ఆదుకున్నారు. పెర్త్ బౌలర్లలో పారిస్ 3, మిషెల్ మార్ష్ 2 వికెట్లు తీసుకున్నారు. పెర్త్ జట్టు 19 ఓవర్లలో ఏడు వికెట్లకు 130 పరుగులు చేసి నెగ్గింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మార్ష్‌తో పాటు బ్రాడ్ హాగ్ (19 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతంగా ఆడాడు. హఫీజ్, ఇక్బాల్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంతో చెన్నై సెమీస్‌కు చేరింది. -
ఎం హెచ్ 370 - మళ్లీ సిగ్నల్స్... మరో ఆశ... మళ్లీ వెతుకులాట
మలేషియా విమానం కోసం జరుగుతున్న అన్వేషణ కీలక దశకు చేరుకున్నట్టేనని అధికారులు నమ్మబలుకుతున్నారు. మొదట చైనా నౌక, ఆ తరువాత అస్ట్రేలియన్ నౌకలు నీటి లోపలి నుంచి సిగ్నల్స్ అందుకున్నాయి. ఈ సిగ్నల్స్ మలేషియన్ విమానం ఎం హెచ్ 370 మునిగినట్టుగా భావిస్తున్న ప్రదేశం నుంచే అందడంతో అన్వేషణలో నిమగ్నమైన సిబ్బంది ఆశలు చిగురించాయి. ఆస్ట్రేలియా కు చెందిన నౌకకు రెండు సార్లు సముద్రం లోతుల్లోనుంచి సిగ్నల్స్ అభించాయి. 'ఈ సిగ్నల్స్ బ్లాక్ బాక్సునుంచి వెలువడే సిగ్నల్స్ మాదిరిగానే ఉన్నాయి. విమానం లేదా విమాన శకలాలు త్వరలోనే లభించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మనం సరైన చోటే వెతుకుతున్నాం,' అన్వేషణలో ఉన్న వివిధ దేశాల ఉమ్మడి సమన్వయ సంస్థ హెడ్ అంగుస్ హౌస్టన్ చెప్పారు. ఆస్ట్రేలియన్ నౌకకు అండర్ వాటర్ సిగ్నల్స్ ను గుర్తించే పింగర్ లొకేటర్ అనే ఉపకరణం ఉంది. ఇది బ్లాక్ బాక్సు నుంచి వచ్చే సిగ్నల్స్ ను గుర్తించగలుగుతుంది. సరిగ్గా విమానం మునిగిపోయిందని భావిస్తున్న చోటే తేలియాడుతున్న పలు శకలాలు, వస్తువులు కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మరో వైపు బ్లాక్ బాక్స్ కోసం సముద్రం అట్టడుగున స్పెషలిస్టు డ్రైవర్లు వెతుకుతున్నారు. మంగళవారంతో విమానం కుప్పకూలి నెల రోజులైంది. దీంతో ఏ క్షణానైనా బ్లాక్ బాక్సు నుంచి సిగ్నల్స్ ఆగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్టే శనివారం ఆస్ట్రేలియన్ నౌకకు అందిన తొలి సిగ్నల్ 2 గంటల 20 నిమిషాల పాటు ఉండగా, మంగళవారం అందిన సిగ్నల్స్ అయిదున్నర నిమిషాలు, ఏడు నిమిషాలు మాత్రమే ఉన్నాయి. 239 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్న మలేషియన్ విమానం ఎం హెచ్ 370 గత మార్చి 8 న హిందూమహాసముద్రంలో కుప్పకూలిపోయింది. దాని కోసం 15 విమానాలు, 14 నౌకలు 75,, 4237 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో, ఆస్ట్రేలియన్ నగరం పెర్తకి 2261 కి.మీ దూరంలో అన్వేషణ కొనసాగుతోంది. -
సముద్రంలో బ్లాక్ బాక్స్ సిగ్నళ్లు!
నిమిషంన్నరపాటు విన్న చైనా నౌక సిబ్బంది మలేసియా విమానం కోసం కొనసాగుతున్న అన్వేషణ పెర్త్(ఆస్ట్రేలియా): మలేసియా బోయింగ్ విమానం కోసం సాగుతున్న అన్వేషణ శనివారం కీలక మలుపు తిరిగింది. దక్షిణ హిందూ మహాసముద్రంలో గాలిస్తున్న ఓ చైనా నౌకలోని బ్లాక్‌బాక్స్ డిటెక్టర్‌కు పల్స్ సిగ్నళ్లు అందాయి. వీటి పౌనఃపున్య తీవ్రతను సెకనుకు 37.5 కిలోహెర్ట్జగా గుర్తించారు. అయితే ఇవి గల్లంతైన విమానంలోని బ్లాక్స్‌బాక్స్ నుంచి వచ్చాయో లేక, మరో వస్తువు నుంచి వచ్చాయో నిర్ధారించాల్సి ఉందని అధికార వార్తాసంస్థ ‘జినువా’ తెలిపింది. 25 డిగ్రీల దక్షిణ అక్షాంశం, 101 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద హైజున్01 నౌకలోని ముగ్గురు సిబ్బందికి ఉన్నట్టుండి నిమిషంన్నరపాటు సిగ్నళ్లు వినిపించాయి. అయితే వీటిని రికార్డు చేయలేకపోయారు. నౌక సిబ్బందికి వినిపించిన సిగ్నళ్లు బ్లాక్బాక్స్కే ప్రత్యేకం కాదని, అవి ఇతర వస్తువుల నుంచి కూడా వెలువడి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. గత నెల 8న గల్లంతైన బోయింగ్‌లోని బ్లాక్‌బాక్స్ బ్యాటరీల జీవితం కాలం మరో మూడు రోజుల్లో ముగియనుండడంతో దాని కోసం గాలింపును ముమ్మరం చేశారు. పల్స్ సిగ్నల్స్ అందడంతో బ్లాక్‌బాక్స్‌ను గుర్తించే పరికరాలను రంగంలోకి దించనున్నారు. బ్లాక్‌బాక్స్ సిగ్నల్‌ను బ్లాక్బాక్స్కు మూడు మైళ్ల వ్యాసార్ధంలోని పరిధిలో అందుకోవచ్చు. విమాన శకలాల కోసం పెర్త్‌కు వాయవ్యంగా 1,700 కి.మీ దూరంలో పలు దేశాల విమానాలు గాలిస్తుండడం తెలిసిందే. శనివారం ఇదే ప్రాంతంలో తేలియాడుతున్న వస్తువులను చైనా విమానం గుర్తించింది. -
మలేషియా విమానం: కొత్త ఆధారాలు లభ్యం
దక్షిణ హిందూ మహాసముద్రంలో కుప్పకూలిన మలేషియా విమానం ఎం హెచ్ 370 విషయంలో ఆస్ట్రేలియా అధికారులకు కొత్త ఆధారాలు లభించాయి. వీటి ఆధారంగా ఇప్పుడు అన్వేషణ కొనసాగిస్తున్న ప్రాంతం కన్నా 680 మైళ్ల దూరంలో విమాన శకలాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. దీంతో సెర్చ్ టీమ్ లు అక్కడికి తరలి వెళ్తున్నాయి. శుక్రవారం నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్ కి 1250 మైళ్ల దూరంలో 123.200 చ. మైళ్ల ప్రాంతంలో అన్వేషణ జరుగుతుంది. గురువారం భారీ వర్షాలు, మేఘాల వల్ల విమానాలు బయలుదేరలేకపోయాయి. ముందు ఏమి ఉందో తెలియనంత దట్టంగా వానపడటంతో పడవలకు కూడా ఇబ్బంది కలిగింది. అదృష్ట వశాత్తూ శుక్రవారం నుంచి వాతావరణం మెరుగుపడటంతో అన్వేషణ వేగం పుంజుకుంది. అయితే తాజాగా లభించిన వివరాల ప్రకారం మలేషియా విమానం ఊహించిన దానికన్నా వేగంగా ప్రయాణించింది. దీని వల్ల ఇంధనం అనుకున్న దాని కన్నా ముందే అయిపోయి ఉండవచ్చు.ఫలితంగా విమానం కుప్పకూలిందని ఇప్పటి వరకూ భావిస్తున్న ప్రదేశం కన్నా చాలా ముందే నీటిలో పడిపోయి ఉండవచ్చు. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి బీజింగ్ కి 239 మంది ప్రయాణికులను తీసుకెళ్తున్న ఎం హెచ్ 370 మార్చి 8 న కుప్పకూలిపోయింది. ఈ విమానం హిందూ మహాసముద్ర జలాల్లో కుప్పకూలిందని భావిస్తున్నారు. గత 20 రోజులుగా దీని శకలాల కోసం అన్వేషణ సాగుతోంది. -
ఎట్టకేలకు గెలిచారు
పెర్త్: గతేడాది నవంబర్‌లో ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనను ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఐదు యాషెస్ టెస్టులు, నాలుగు వన్డేలు ఆడింది. యాషెస్‌ను 0-5తో కోల్పోగా, ఐదు వన్డేల సిరీస్‌లోనూ వరుసగా మూడు వన్డేల్లో ఓడింది. 8 ఓటముల అనంతరం ఎట్టకేలకు కుక్ సేన విజయం రుచి చూసింది. బెన్ స్టోక్స్ (84 బంతుల్లో 70; 6 ఫోర్లు; 1 సిక్స్), (4/38) ఆల్‌రౌండ్ షోతో... శుక్రవారం వాకా మైదానంలో జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ 57 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఓడించింది. మొదట ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 316 పరుగులు చేసింది. బెల్ (52 బంతుల్లో 55; 9 ఫోర్లు), బట్లర్ (43 బంతుల్లో 71; 6 ఫోర్లు; 4 సిక్స్‌లు) రాణించారు. ఫాల్క్‌నర్‌కు 4 వికెట్లు దక్కాయి. ఆస్ట్రేలియా 47.4 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఆరోన్ ఫించ్ (111 బంతుల్లో 108; 8 ఫోర్లు; 4 సిక్స్) సెంచరీ చేయగా మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. -
ఫించ్ సెంచరీ చేసినా ఆసీస్ ఓటమి
పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో వరుస పరాజయాలతో కుదేలయిన కుక్ సేనకు ఎట్టకేలకు ఒక విజయం దక్కింది. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ 57 పరుగులతో గెలుపొందింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 316 పరుగులు చేసింది. బెల్ 55, స్టోక్స్ 70, బుట్లర్ 71, మోర్గాన్ 33, కుక్ 44 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో ఫాల్కనర్ 4 వికెట్లు నేలకూల్చాడు. 317 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47.4 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటయింది. ఫించ్ ఒక్కడే(108) సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. మిగతా ఆటగాళ్లు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 4, బ్రెస్నన్ 3, బ్రాడ్ 2 వికెట్లు తీశారు. బొపారా ఒక వికెట్ దక్కించుకున్నాడు. స్టోక్స్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కించుకున్నాడు. ఐదు వన్డేల ఈ సిరీస్ ను ఆసీస్ ఇప్పటికే గెల్చుకుంది. -
ఇంగ్లండ్‌దే ‘యాషెస్’ టెస్టు
పెర్త్: యాషెస్‌లో 0-5తో ఆసీస్ చేతి లో చిత్తుగా ఓడిన తర్వాత ఇప్పు డు మళ్లీ ఇంగ్లండ్ విజయానికి అవకాశం ఎక్కడుందని ఆశ్చర్యపోతున్నారా! ఇంగ్లండ్ యాషెస్ టెస్టు నెగ్గడం నిజ మే... అయితే అది మహిళా క్రికెట్లో జరిగింది. తమ పురుషుల జట్టుకు సాధ్యం కాని చోట ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ ఏకైక టెస్టు నెగ్గింది. సోమవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 61 పరుగులతో ఆస్ట్రేలియాను ఓడిం చింది. పర్యటనలో మిగిలిన 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌ల ఫలితాల అనంతరం పాయింట్లను పరిగణనలోకి తీసుకొని యాషెస్ విజేతను తేలుస్తారు. -
ఫ్రాన్స్ తొలిసారి...
పెర్త్: హాప్‌మన్ కప్‌ను ఫ్రాన్స్ కైవసం చేసుకుంది. ఈ మిక్స్డ్ టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను ఫ్రాన్స్ సాధించడం ఇదే తొలిసారి. ఇక్కడి పెర్త్ ఎరెనాలో జరిగిన టైటిల్ పోరులో ఫ్రాన్స్ 2-1తో పోలండ్పై విజయం సాధించింది. జో విల్ఫ్రెడ్ సోంగా తొలుత సింగిల్స్, తర్వాత కార్నెట్తో కలిసి మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌ల్లో గెలుపొందడంతో జట్టు నెగ్గింది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ పదో ర్యాంకర్ సోంగా 6-3, 3-6, 6-3తో గ్రెగొర్జ్ ప్యాన్ఫిల్పై నెగ్గడంతో ఫ్రాన్స్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత మహిళల సింగిల్స్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) 6-3, 6-7 (9/7), 6-2తో అలైజ్ కార్నెట్‌పై గెలిచి 1-1తో స్కోరును సమం చేసింది. ఈ దశలో మిక్స్డ్ డబుల్స్‌లో కార్నెట్తో కలిసి బరిలోకి దిగిన సోంగా 6-0, 6-2తో రద్వాన్‌స్కా-ప్యాన్ఫిల్ జోడిని కంగుతినిపించాడు. కేవలం 47 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించాడు. సోంగా చక్కని ఆటతీరుతో త్వరలో ఆరంభమయ్యే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌కు ముందు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు. -
సాధించారోచ్..!
పెర్త్: ఎప్పుడో 2009లో ఇంగ్లండ్‌కు ‘యాషెస్’ను కోల్పోయిన ఆస్ట్రేలియా... ఆ తర్వాత మరో రెండుసార్లు విశ్వప్రయత్నాలు చేసినా... తిరిగి విజయాన్ని దక్కించుకోలేకపోయింది. తాజాగా నాలుగు నెలల క్రితం ఇంగ్లండ్‌లో ఘోరమైన ఆటతీరుతో పరాభవాన్ని మూటగట్టుకున్న ఆస్ట్రేలియా... ఎట్టకేలకు జూలు విదిల్చింది. తొలి మూడు టెస్టుల్లోనే ఘన విజయాలు సాధించి... ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు టెస్టులు మిగిలుండగానే 3-0తో సాధించింది. దీంతో కేవలం నాలుగు నెలల్లోనే కుక్‌సేన మీద ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. మంగళవారం వాకాలో ముగిసిన మూడో టెస్టులోనూ ఆసీస్ 150 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై నెగ్గింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0 ఆధిక్యంలో నిలిచింది. 504 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 251/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్... రెండో ఇన్నింగ్స్‌లో 103.2 ఓవర్లలో 353 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ స్టోక్స్ (195 బంతుల్లో 120; 18 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో చెలరేగినా, ప్రయర్ (26) విఫలమయ్యాడు. వీరిద్దరి మధ్య ఆరో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. నిలకడగా ఆడుతున్న ఈ జోడిని జాన్సన్ విడగొట్టడంతో వికెట్లపతనం మొదలైంది. తర్వాత వచ్చిన బ్రెస్నన్ (12) క్రీజులో కుదురుకునేందుకు ప్రాధాన్యమివ్వడంతో 332/6 స్కోరుతో ఇంగ్లండ్ లంచ్‌కు వెళ్లింది. అయితే లంచ్ తర్వాత సెంచరీ పూర్తి చేసిన స్టోక్స్‌ను లియోన్ దెబ్బతీశాడు. బంతిని స్వీప్ చేయబోయి హాడిన్ చేతికి చిక్కాడు. దీంతో బ్రెస్నన్, స్టోక్స్‌ల మధ్య ఏడో వికెట్‌కు నెలకొన్న 40 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. స్వాన్ (4), బ్రెస్నన్, అండర్సన్ (2) వెంటవెంటనే అవుట్ కావడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. జాన్సన్ 4, లియోన్ 3 వికెట్లు పడగొట్టారు. స్టీవ్ స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు ఈనెల 26 నుంచి మెల్బోర్న్లో జరుగుతుంది. 3 తొలి మూడు టెస్టుల్లో గెలిచి యాషెస్‌ను దక్కించుకోవడం ఆస్ట్రేలియాకు ఇది మూడోసారి. 32 ప్రస్తుత విజయంతో కలిపి ఆసీస్ ఇప్పటి వరకు 32 సార్లు యాషెస్‌ను గెలుచుకుంది. 68 యాషెస్ సిరీస్‌ల్లో ఇంగ్లండ్ 31సార్లు గెలవగా, ఐదుసార్లు సిరీస్ డ్రా అయ్యింది. -
ఆసీస్ అదే జోరు
పెర్త్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన కంగారూలు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో దుమ్మురేపారు. డేవిడ్ వార్నర్ (140 బంతుల్లో 112; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 70 ఓవర్లలో 3 వికెట్లకు 235 పరుగులు చేసింది. వాట్సన్ (29), స్మిత్ (5) క్రీజులో ఉన్నారు. రోజర్స్ (54), వార్నర్‌లు తొలి వికెట్‌కు 157 పరుగులు జోడించారు. రెండుసార్లు స్టంపౌట్ ప్రమాదం నుంచి బయటపడ్డ వార్నర్ కెరీర్లో రెండో సెంచరీ నమోదు చేశాడు. క్లార్క్ (23) విఫలమయ్యాడు. బ్రెస్నన్, స్టోక్స్, స్వాన్ తలా ఓ వికెట్ తీశారు. ప్రస్తుతం ఆసీస్ 369 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు 180/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 134 పరుగుల ఆధిక్యం లభించింది. కంగారూల పేస్ ధాటికి కుక్‌సేన మిడిలార్డర్ ఘోరంగా విఫలమైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ఇయాన్ బెల్ (15), స్టోక్స్ (18), బ్రెస్నన్ (21), స్వాన్ (19 నాటౌట్) పోరాడి విఫలమయ్యారు. 61 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చివరి ఆరు వికెట్లను చేజార్చుకుంది. హారిస్, సిడిల్ చెరో మూడు వికెట్లు తీయగా, జాన్సన్‌కు 2 వికెట్లు దక్కాయి. బ్రాడ్‌కు గాయం! ఇప్పటికే యాషెస్‌లో తడబడుతున్న ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పేసర్ స్టువర్ట్ బ్రాడ్ గాయంతో పెవిలియన్‌కు పరిమితమయ్యాడు. మూడో రోజు ఆటలో జాన్సన్ వేసిన పదునైన యార్కర్... బ్రాడ్ కుడి పాదానికి బలంగా తాకింది. దీంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో అతను బౌలింగ్‌కు దిగలేదు. ఇన్నింగ్స్ విరామంలో కాసేపు నెట్స్‌లో గడిపిన బ్రాడ్‌కు స్కానింగ్ నిర్వహించారు. స్కానింగ్ ఫలితాలు వచ్చాక సోమవారం అతనిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది. -
మళ్లీ అదే తడబాటు
పెర్త్: వరుసగా రెండు పరాజయాలతో కుదేలైన ఇంగ్లండ్ జట్టు మూడో టెస్టులోనూ ఇబ్బందిని ఎదుర్కొంటోంది. సిరీస్‌లో ఇప్పటిదాకా రాణించని కెప్టెన్ కుక్ (153 బంతుల్లో 72; 10 ఫోర్లు) రాణించినా... పెద్దగా ఫలితం కనిపించడం లేదు. రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 68 ఓవర్లలో నాలుగు వికెట్లకు 180 పరుగులు చేసింది. ఓపెనర్ కార్బెర్రీ (76 బంతుల్లో 43; 8 ఫోర్లు; 1 సిక్స్) మాత్రమే ఆకట్టుకున్నాడు. పదునైన బంతులతో గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో పర్యాటక జట్టును బెంబేలెత్తించిన పేసర్ మిచెల్ జాన్సన్‌కు వికెట్లేమీ దక్కకపోయినా... హారిస్, వాట్సన్, సిడిల్, లియోన్ తలా ఓ వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో బెల్ (9 బ్యాటింగ్), స్టోక్స్ (43 బంతుల్లో 14 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఉన్నారు. ఇన్నింగ్స్ ఆరంభంలో కుక్, కార్బెర్రీ నిలకడగా ఆడడంతో తొలి వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. ఆ తర్వాత ఆసీస్ బౌలర్లు కట్టడి చేయడంతో 146 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆసీస్‌కన్నా ఇంగ్లండ్ 205 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 326/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్ మరో 59 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. స్మిత్ 111 పరుగులు చేశాడు. మరోసారి డీఆర్ఎస్ గొడవ అంపైర్ నిర్ణయ పునస్సమీక్షా పద్దతి (డీఆర్ఎస్) మరోసారి వివాదాస్పదమైంది. రెండో రోజు ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షేన్ వాట్సన్ బౌలింగ్‌లో కీపర్ హాడిన్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీన్ని అంపైర్ మరైస్ ఎరాస్మస్ అవుట్‌గా ప్రకటించారు. అయితే రూట్ మాత్రం బంతి తన బ్యాట్‌కు తగల్లేదనే కారణంతో రివ్యూకు వెళ్లాడు. మూడో అంపైర్ టోనీ హిల్ పలు పర్యాయాలు వీడియో క్లిప్స్ పరిశీలించినా స్పష్టత ఏర్పడలేదు. అటు హాట్స్పాట్లోనూ బ్యాట్‌కు బంతి తగిలినట్టు కనిపించలేదు. ఆడియో ఫుటేజిలో బ్యాట్ పక్క నుంచి బంతి వెళ్లిన అనంతరం శబ్దం వినిపించింది. దీంతో ఏదీ సరైన రీతిలో తేలకపోవడంతో థర్డ్ అంపైర్ హిల్ కూడా రూట్ అవుట్‌ను ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే వదిలేశారు. -
స్టీవ్ స్మిత్ అజేయ సెంచరీ
పెర్త్: సిరీస్‌లో నిలబడాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు బౌలర్లు శుభారంభం అందించినా... ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ (191 బంతుల్లో 103 బ్యాటింగ్; 13 ఫోర్లు; 2 సిక్స్) అజేయ శతకంతో వారి జోరుకు బ్రేకు వేశాడు. 143 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో స్మిత్ తన అసమాన ఆటతీరుతో జట్టును ఆదుకున్నాడు. ఫలితంగా శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లకు 326 పరుగులు సాధించింది. డేవిడ్ వార్నర్ (77 బంతుల్లో 60; 8 ఫోర్లు; 1 సిక్స్), హాడిన్ (100 బంతుల్లో 55; 5 ఫోర్లు; 2 సిక్స్) అర్ధసెంచరీలతో తమ వంతు సహకారాన్ని అందించారు. స్టువర్ట్ బ్రాడ్, స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ చెరో రెండు వికెట్లు తీయగా స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం స్మిత్‌తో పాటు మిచెల్ జాన్సన్ (60 బంతుల్లో 39 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. -
క్లార్క్, కుక్ ‘శతకాలు’
పెర్త్: యాషెస్ సిరీస్ మూడో టెస్టులో అరుదైన రికార్డు నమోదు కానుంది. ‘వాకా’ మైదానంలో శుక్రవారంనుంచి జరిగే ఈ టెస్టుతో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కెప్టెన్లు వ్యక్తిగత ఘనతను అందుకోనున్నారు. మైకేల్ క్లార్క్, అలిస్టర్ కుక్‌లకు తమ కెరీర్లో ఇది వందో టెస్టు కావడం విశేషం. ఒకే మ్యాచ్‌తో ఇరు జట్ల కెప్టెన్లు 100 టెస్టుల మైలురాయిని అందుకోవడం టెస్టు చరిత్రలో ఇదే మొదటి సారి. 2004లో (భారత్‌పై) తొలి టెస్టు ఆడిన క్లార్క్ 52.58 సగటుతో 99 టెస్టుల్లో 7940 పరుగులు చేశాడు. 2006లో (భారత్‌పై) మొదటి టెస్టు ఆడిన కుక్, 47.20 సగటుతో 99 టెస్టుల్లో 7883 పరుగులు సాధించాడు. తొలి టెస్టు ఆడిన నాటినుంచి వేగంగా 100 టెస్టుల మైలురాయిని అందుకున్న (7 సంవత్సరాల 9 నెలలు) ఆటగాడిగా కూడా కుక్ రికార్డు సృష్టించనున్నాడు. గతంలో ఒకేసారి 2000లో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆథర్టన్, స్టివార్ట్ ఒకే టెస్టులో 100వ టెస్టు మైలురాయిని చేరారు. 2006లో ఒకే టెస్టులో ముగ్గురు ఆటగాళ్లు (కలిస్, పొలాక్, స్టీఫెన్ ఫ్లెమింగ్) ఈ ఘనత సాధించడం విశేషం. -
మస్త్ మస్త్ ముంబై
చివరి మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవడంతో పాటు రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుంటేనే ముంబై ఇండియన్స్ సెమీస్‌కు చేరుతుంది. ఇలాంటి స్థితిలో చాంపియన్స లీగ్‌లో రోహిత్ సేన మ్యాజిక్ చేసింది. 14.2 ఓవర్లలో 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తే నాకౌట్‌కు చేరే అవకాశం. ఈ దశలో రోహిత్, స్మిత్ విశ్వరూపం చూపించారు. పెర్త బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సంచలన ఇన్నింగ్స ఆడారు. ఫలితంగా కేవలం 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ముంబై ఇండియన్స దర్జాగా సెమీస్‌కు చేరింది. న్యూఢిల్లీ: ఇప్పటికే చాంపియన్స లీగ్‌ను మరో ఐపీఎల్ అంటున్నారు. ఆ పేరుకు తగ్గట్లే ఈసారి మూడు ఐపీఎల్ జట్లు సెమీస్‌కు చేరాయి. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పెర్తపై సంచలన విజయం సాధించిన ముంబై...ఒటాగో వోల్ట్సను రన్‌రేట్‌లో వెనక్కు నెట్టి.... చెన్నైన, రాజస్థాన్ల సరసన సెమీస్‌కు చేరింది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం జరిగిన ఎ గ్రూప్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ముంబై 6 వికెట్ల తేడాతో పెర్త్ స్కార్చర్సను చిత్తు చేసింది.‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రోహిత్ శర్మ (24 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సలు), డ్వేన్ స్మిత్ (25 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్సలు) భారీ షాట్లతో హోరెత్తించారు. ఫలితంగా ముంబై 13.2 ఓవర్లలోనే 4 వికెట్లకు 152 పరుగులు చేసి విజయాన్నందుకుంది. అంతకు ముందు స్కార్చర్స 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. వైట్మన్ (32 బంతుల్లో 51 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సలు) అర్ధ సెంచరీ చేయగా, ఎగర్ (40 బంతుల్లో 35; 6 ఫోర్లు), కార్టరైట్ (20 బంతుల్లో 28; 4 ఫోర్లు) రాణించారు. కట్టడి చేసిన కౌల్టర్... పెర్త్ ఓపెనర్లు ఎగర్, కటిచ్ (13) కలిసి తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించినా ధాటిగా ఆడటంలో విఫలమయ్యారు. ఓజా ఒకే ఓవర్లో వీరిద్దరిని అవుట్ చేసి స్కార్చర్సను దెబ్బ తీశాడు. అయితే కార్టరైట్, వైట్మన్ కలిసి జట్టు ఇన్నింగ్‌సను నడిపించారు. చక్కటి బౌలింగ్‌లో ప్రత్యర్థిని కట్టడి చేసిన కౌల్టర్, వరుస బంతుల్లో రెండు వికెట్లు తీయడంతో పెర్త ఇన్నింగ్స తడబడింది. వైట్మన్ మాత్రం తన ధాటిని కొనసాగిస్తూ 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సచిన్ డకౌట్...విజయానికి 14.2 ఓవర్లలోనే 150 పరుగులు చేయాల్సిన ముంబై ఇండియన్‌సకు డ్వేన్ స్మిత్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. మరో వైపు సచిన్ టెండూల్కర్ (0) మాత్రం మరోసారి నిరాశపర్చాడు. బెహ్రన్‌డార్‌ఫ బౌలింగ్‌లో వైట్మన్ అద్భుత క్యాచ్ పట్టడంతో అతను నిష్కమించాడు. మ్యాక్సవెల్ (10) కూడా తొందరానే వెనుదిరిగినా స్మిత్ తన జోరును కొనసాగించాడు. స్మిత్ వెనుదిరగడంతో ముంబై ఇబ్బందుల్లో పడినట్లు అనిపించింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ టి20ల్లో తన అద్భుత రికార్డును కొనసాగిస్తూ చెలరేగాడు. పొలార్డ (18 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స) అండగా నిలవడంతో భారీ సిక్సర్లతో జట్టును విజయానికి చేరువగా తెచ్చాడు. రాయుడు (4 బంతుల్లో 14 నాటౌట్; 2 సిక్సలు) వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే ముంబై సెమీస్‌కు చేరింది. స్కోరు వివరాలు: పెర్త స్కార్చర్స ఇన్నింగ్స: ఎగర్ (బి) ఓజా 35; కటిచ్ (బి) ఓజా 13; కార్టరైట్ (బి) కౌల్టర్ 28; వైట్మన్ (నాటౌట్) 51; టర్నర్ (ఎల్బీ) (బి) కౌల్టర్ 0; నార్త (సి) పొలార్డ (బి) కౌల్టర్ 3; ట్రిఫిట్ (బి) రిషిధావన్ 1; బెహ్రన్‌డార్‌ఫ (నాటౌట్) 1; ఎక్సట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1-55; 2-56; 3-114; 4-114; 5-130; 6-143. బౌలింగ్: హర్భజన్ 4-0-31-0; కౌల్టర్ 4-0-19-3; రిషిధావన్ 4-0-30-1; పొలార్డ 3-0-26-0; మ్యాక్సవెల్ 3-0-14-0; ఓజా 2-0-17-2. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స: స్మిత్ (సి) బెహ్రన్‌డార్‌ఫ (బి) హాగ్ 48; సచిన్ (సి) వైట్మన్ (బి) బెహ్రన్‌డార్‌ఫ 0; మ్యాక్సవెల్ (సి) హాగ్ (బి) బెహ్రన్‌డార్‌ఫ 10; రోహిత్ శర్మ (నాటౌట్) 51; పొలార్డ (బి) హాగ్ 23; రాయుడు (నాటౌట్) 14; ఎక్సట్రాలు 6; మొత్తం (13.2 ఓవర్లలో 4 వికెట్లకు) 152. వికెట్ల పతనం: 1-16; 2-34; 3-72; 4-137. బౌలింగ్: బీర్ 4-0-34-0; బెహ్రన్‌డార్‌ఫ 3-0-31-2; పారిస్ 2-0-36-0; హాగ్ 3-0-26-2; ఎగర్ 1.2-0-23-0. 2