మహిళపై దాడిచేస్తున్న షార్క్
పెర్త్ : సముద్రంలో స్నేహితులతో బోటులో విహరిస్తూ ఆస్వాదిస్తున్న ఓ మహిళకు అనుకోకుండా ఓ షాకింగ్ ఘటన ఎదురైంది. పడవ వెనుకాల నిల్చోని సముద్రపు అలలతో ఆడుకుంటుండగా.. ఓ షార్క్ ఆమెపై దాడి చేసింది. అయితే ఆమె, బోటులోని సహచరులు అప్రమత్తంగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కింబెర్లీ సముద్ర తీరంలో గత మే నెలలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే బోటులో ప్రయాణిస్తుండగా ఓ నాలుగు షార్క్‌లు తమ పడవ చుట్టూ చేరాయని, అందులో ఒకటి తనపై దాడి చేసి వేలు కొరికేసిందని బాధితురాలు మెలిస్సా బర్నింగ్ తెలిపింది.
షార్క్ పదునైన పళ్లతో కొరకడంతో తన వేలును కోల్పోవాల్సి వచ్చిందని, కిందపడిపోయిన తనను సహచరులు లేపారని చెప్పుకొచ్చింది. ఈ ఘటనలో ఆ షార్క్ తప్పేమి లేదని, తప్పంతా తనదేనని కూడా చెప్పుకొచ్చింది. సముద్రపు జీవులను తాను ప్రేమిస్తానని, వాటికి స్వేచ్చనివ్వాలని కూడా చెప్పింది. అది షార్క్ కాబట్టి బతికి బయపడ్డా కానీ ఏ మొసలో అయితే అంతే సంగతంటూ భయపడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన మొబైల్ ఫుటేజీని ఓ చానల్ ప్రసారం చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment