
‘పాత కోహ్లి’ బయటికొచ్చాడు!
జర్నలిస్ట్‌పై నోరు పారేసుకున్న బ్యాట్స్‌మన్
పెర్త్: వివాదాలతో విరాట్ కోహ్లిది సుదీర్ఘ అనుబంధం. మైదానంలో అద్భుతమైన ఆటగాడిగా రికార్డులు కొల్లగొట్టినా... అదే స్థాయిలో తిట్ల వర్షం కురిపించడంలో కూడా అతనికి అతనే సాటి! నేను మారానంటూ కొన్నాళ్లుగా నోరును అదుపులో ఉంచుకుంటున్న కోహ్లి ఇప్పుడు మరోసారి అదు పు తప్పాడు. మంగళవా రం ఇక్కడ ప్రాక్టీస్ అనంతరం భారత్‌కు చెందిన ఒక మీడియా ప్రతినిధిని తీవ్ర పదజాలంతో దూషిం చాడు. డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళుతూ కోహ్లి, ఆ జర్నలిస్ట్‌పై బూతు పురాణం లంకించుకున్నాడు. కొద్ది క్షణాల పాటు అసలేం జరిగిందో కూడా ఇతర భార త జట్టు సభ్యులకు, మీడియా ప్రతినిధులతో పాటు సదరు రిపోర్టర్‌కు కూడా అర్థం కాలేదు. తనకూ, అనుష్కశర్మకు మధ్య సంబంధం గురించి ఇటీవల ఆ జర్నలిస్ట్ రాసిన ఒక కథనం కోహ్లికి ఆగ్రహం తెప్పించిందని ఆ తర్వాత తెలిసింది.
అయితే ఈ విషయంలో కూడా కోహ్లి పొరపడ్డాడు. వాస్తవానికి ఆ కథనం రాసింది కోహ్లి తిట్టిన జర్నలిస్ట్ కాదు. మరొకరు రాసిన వార్త గురించి అతను ఈ రిపోర్టర్‌పై విరుచుకు పడ్డాడు. దాంతో కొద్ది సేపటి తర్వాత తనకు తెలిసిన మరో విలేకరి ద్వారా కోహ్లి క్షమాపణ సం దేశం పంపించాడు! అనంతరం టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి, కోహ్లిని మందలించినట్లు తెలిసింది. భవిష్యత్తు లో కెప్టెన్‌గా ఉండాల్సిన వ్యక్తి తన ఆగ్రహావేశాలు ని యంత్రించుకోవాలని శాస్త్రి చెప్పినట్లు సమాచారం.