
వ్యక్తిగత జీవితం గురించి అడగొద్దు: కోహ్లి
అనుష్క శర్మ, తాను విడిపోయామా, మళ్లీ కలిసామా వంటి అంశాల గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని... వ్
అనుష్క శర్మ, తాను విడిపోయామా, మళ్లీ కలిసామా వంటి అంశాల గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని... వ్యక్తిగత విషయాలపై తాను వ్యాఖ్యానించనని భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అన్నాడు.
సోమవారం జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా ఈ ప్రశ్న అడిగిన ఓ మహిళా జర్నలిస్ట్‌ను నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉందంటూ కోహ్లి ఎదురు ప్రశ్నించాడు. ఎంతటి వీరాభిమానులైనా తాను చేసే ప్రతీదీ తెలుసుకోవాల్సిన అవసరం లేదని కోహ్లి స్పష్టం చేశాడు.