Virat Kohli Shared Angry Note On Video Being Leaked Of His Hotel Room - Sakshi
Sakshi News home page

Virat Kohli: కోహ్లి హోటల్ రూమ్‌ వీడియో లీక్‌.. విరాట్‌ సీరియస్‌

Published Mon, Oct 31 2022 12:28 PM | Last Updated on Mon, Oct 31 2022 2:01 PM

Virat Kohli On Leaked Video Of His Hotel Room - Sakshi

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లికి ఆస్ట్రేలియాలో చేదు అనుభవం ఎదురైంది. టీ20 ప్రపంచకప్‌-2022లో భాగంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు విరాట్‌ కోహ్లి భారత జట్టుతో కలిసి పెర్త్‌లోని ఓ హోటల్‌లో బస చేశాడు. అయితే విరాట్‌ ఉంటున్న హోటల్ రూమ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో లీకైంది.

కోహ్లి లేని సమయంలో ఓ అగంతకుడు గదిలోకి చొరబడి వీడియోను రికార్డు చేశాడు. ఈ వీడియాలో కోహ్లి వ్యక్తిగత వస్తువులు, న్యూట్రీషన్  పౌడర్ బాక్స్ లు,  భారత జెర్సీలు కన్పిస్తున్నాయి. కాగా ఫీల్డ్‌లో తన హావభావాలతో అభిమానులను అలరించే కోహ్లి.. తన వ్యక్తిగత విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాడు.

తన కూతురు పుట్టి రెండేళ్లు కావస్తున్నా.. ఇప్పటి వరకు తన గారాల పట్టి ఎలా ఉంటుందో బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు. అంత జాగ్రత్తగా ఉండే కోహ్లికి ఇది నిజంగా చేదు అనుభవమే అని చెప్పుకోవాలి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఈ విషయంపై తాజాగా కోహ్లి స్పందించాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లి షేర్‌ చేస్తూ.. "అభిమానులు తమ ఆరాధ్య క్రికెటర్లను చూడడానికి, కలవడానికి ఉత్సాహంగా ఉంటారు. ఆ విషయంలో నేను వారిని ఎప్పుడూ అభినందిస్తాను. కానీ ఇక్కడ ఈ వీడియో చాలా భయంకరంగా ఉంది. ఇది నా గోప్యతకు సంబంధించిన విషయం.

నేను నా సొంత గదిలోనే ప్రైవసీగా ఉండకలేకపోతే.. ఇంకెక్కడ దొరుకుతుంది? ఈ విధంగా నా ప్రైవసీకి ఇబ్బంది కలిగించే అభిమానాన్ని నేను అస్సలు సహించను. దయచేసి వ్యక్తుల  ప్రైవసీని గౌరవించండి.  వారిని మీ వినోదం కోసం ఒక వస్తువుగా పరిగిణించవద్దు" అని కోహ్లి పేర్కొన్నాడు.


చదవండి: T20 WC 2022: ఇదేమి బెంగళూరు వికెట్‌ కాదు.. దినేశ్‌ కార్తిక్‌పై సెహ్వాగ్‌ సెటైర్లు! ఇప్పటికైనా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement