యాషెస్‌లో 0-5తో ఆసీస్ చేతి లో చిత్తుగా ఓడిన తర్వాత ఇప్పు డు మళ్లీ ఇంగ్లండ్ విజయానికి అవకాశం ఎక్కడుందని ఆశ్చర్యపోతున్నారా!
పెర్త్: యాషెస్‌లో 0-5తో ఆసీస్ చేతి లో చిత్తుగా ఓడిన తర్వాత ఇప్పు డు మళ్లీ ఇంగ్లండ్ విజయానికి అవకాశం ఎక్కడుందని ఆశ్చర్యపోతున్నారా! ఇంగ్లండ్ యాషెస్ టెస్టు నెగ్గడం నిజ మే... అయితే అది మహిళా క్రికెట్‌లో జరిగింది.
తమ పురుషుల జట్టుకు సాధ్యం కాని చోట ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ ఏకైక టెస్టు నెగ్గింది. సోమవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 61 పరుగులతో ఆస్ట్రేలియాను ఓడిం చింది. పర్యటనలో మిగిలిన 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌ల ఫలితాల అనంతరం పాయింట్లను పరిగణనలోకి తీసుకొని యాషెస్ విజేతను తేలుస్తారు.