Ashes Test
-
చివరి క్షణంలో ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చిన వర్షం..
-
యాషెస్ సిరీస్: ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ మూడో టెస్ట్ తొలి రోజు హైలైట్స్ (ఫోటోలు)
-
‘ఈతరం బ్రాడ్‌మన్’ స్టీవ్ స్మిత్.. అరుదైన మైలురాయిని చేరుకోనున్న ఆసీస్ బ్యాటర్
2010 జూలై... లార్డ్స్ మైదానంలో ఆ్రస్టేలియా, పాకిస్తాన్ మధ్య తొలి టెస్టు మ్యాచ్. దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ రిటైరై అప్పటికి మూడేళ్లవుతోంది. అతని స్థానాన్ని భర్తీ చేసే స్పిన్నర్ల వేట కొనసాగిస్తున్న ఆ్రస్టేలియా వేర్వేరు కొత్త ఆటగాళ్లతో ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో 21 ఏళ్ల లెగ్‌స్పిన్నర్ స్టీవెన్ స్మిత్‌కు అవకాశం కల్పించింది. బౌలింగ్‌లో 3 వికెట్లు తీసిన అతను... బ్యాటింగ్ 8వ, 9వ స్థానాల్లో బరిలోకి దిగి 1, 12 పరుగులు మాత్రమే చేశాడు. అయితే తర్వాతి రోజుల్లో అతను బౌలింగ్‌ను పక్కన పెట్టి అద్భుతమైన బ్యాటర్‌గా ఎదుగుతాడని ఎవరూ ఊహించలేకపోయారు. టెస్టు క్రికెట్లో ఘనమైన రికార్డులతో ఇప్పటికే ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడిగా నిలిచిన స్మిత్ నేడు కెరీర్లో 100వ టెస్టు బరిలోకి దిగనుండటం విశేషం. కెరీర్లో తొలి ఐదు టెస్టుల్లో రెండు అర్ధ సెంచరీలు సాధించినా... ఆ్రస్టేలియా టీమ్ మేనేజ్మెంట్ స్మిత్‌ను బ్యాటర్‌గా గుర్తించలేదు. బౌలింగ్‌లోనూ మూడు వికెట్లే తీయడంతో సహజంగానే జట్టులో స్థానం పోయింది. మళ్లీ టీమ్‌లోకి రావడానికి అతనికి రెండేళ్లు పట్టింది. ‘హోంవర్క్గేట్’ కారణంగా సీనియర్లపై వేటు పడటంతో అదృష్టవశాత్తూ మొహాలిలో భారత్‌తో జరిగిన టెస్టులో అతనికి అవకాశం దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేసిన స్మిత్ బ్యాటింగ్ విలువేమిటో అందరికీ అర్థమైంది. కెరీర్లో తొలి మూడు సెంచరీలు ఇంగ్లండ్‌పైనే నమోదు చేసిన స్మిత్... స్టెయిన్, మోర్కెల్, ఫిలాండర్‌ల పదునైన పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొని సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాపై సాధించిన శతకం అతని స్థానాన్ని సుస్థిరం చేసింది. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్లు అత్యుత్తమ ప్రదర్శనలతో దూసుకుపోయి స్మిత్ టెస్టుల్లో శిఖరానికి చేరుకున్నాడు. కెరీర్లో ఒకదశలో అత్యుత్తమంగా 64.81 సగటును అందుకున్న స్మిత్... డాన్ బ్రాడ్‌మన్ తర్వాత రెండో స్థానంలో నిలిచి ‘ఆధునిక బ్రాడ్‌మన్’ అనిపించుకున్నాడు. పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రపంచంలోనే అన్ని వేదికల్లోనూ పరుగులు సాధించగలడం స్మిత్ సాధించిన ఘనత. ఎదురులేని ప్రదర్శనలతో... 2014–2018 మధ్య కాలం స్మిత్ కెరీర్లో అత్యుత్తమం. ఈ సమయంలో ఎన్నో అసాధారణ రికార్డులను అతను తన ఖాతాలో వేసుకున్నాడు. 79 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 75.81 సగటుతో 5004 పరుగులు నమోదు చేశాడు. 2015 యాషెస్ సిరీస్‌లో 508 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన అతను ఈ సిరీస్ ముగియగానే పూర్తి స్థాయి కెపె్టన్‌గా బాధ్యతలు చేపట్టాడు. భారత గడ్డపై జరిగిన బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో 3 సెంచరీలు సహా 499 పరుగులతో అతనే అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సిరీస్‌లో కఠినమైన పుణే పిచ్‌పై ప్రతికూల పరిస్థితులను అధిగమించి రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్ చేసిన శతకం టెస్టు క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటి. కొద్ది రోజులకే కెప్టెన్‌గా సొంతగడ్డపై 4–0తో యాషెస్ సిరీస్‌ను గెలిపించడంతోపాటు 687 పరుగులతో టాపర్‌గా నిలిచాడు. వరుసగా నాలుగేళ్లు వేయికి పైగా పరుగులు చేసి తన స్థాయి ఏమిటో అతను చూపించాడు. 2014లో తొలిసారి 50 బ్యాటింగ్ సగటును స్మిత్ అందుకోగా, ఇప్పటి వరకూ అది అంతకంటే తగ్గకపోవడం అతని నిలకడను చూపిస్తోంది. టాంపరింగ్ వివాదాన్ని దాటి... తెలివితేటలు, వ్యూహ చతురత, సాంకేతికాంశాలపై పట్టు స్మిత్‌ను విజయవంతమైన కెపె్టన్‌గా నిలిపాయి. అయితే ఇదే తెలివి కాస్త ‘అతి’గా మారడంతో 2018 ఆరంభంలో దక్షిణాఫ్రికాతో టెస్టులో బాల్ టాంపరింగ్‌కు పాల్పడి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఏడాది పాటు నిషేధం కూడా పడింది. అయితే సంవత్సరం తర్వాత తిరిగొచ్చాక అతను తనలోని పాత స్మిత్‌ను మళ్లీ చూపించాడు. 2019 యాషెస్‌లో 4 టెస్టుల్లోనే ఏకంగా 774 పరుగులతో సత్తా చాటాడు. తర్వాత కొన్నాళ్లపాటు తడబాటు కనిపించినా... గత ఏడాది గాలే టెస్టులో 145 పరుగులతో ఫామ్‌లోకి వచ్చిన అతను ఇప్పటికీ అదే జోరును కొనసాగిస్తున్నాడు. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో, లార్డ్స్ టెస్టులోనూ శతకాలు బాది మరిన్ని రికార్డులపై స్మిత్ గురి పెట్టాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో 99 టెస్టులు ముగిసేసరికి అత్యుత్తమ సగటు (59.56)తో నిలిచిన ఆటగాడైన స్మిత్ 32 సెంచరీలు, 37 అర్ధ సెంచరీలతో 9113 పరుగులు సాధించాడు. నేటి నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మూడో ‘యాషెస్’ టెస్టు లీడ్స్‌లో జరగనుంది. హెడింగ్లీ మైదానంలో జరిగే ఈ పోరు కోసం ఇంగ్లండ్ ఇప్పటికే తుది జట్టును ప్రకటించింది. గత మ్యాచ్ ఆడిన పోప్, అండర్సన్, టంగ్ స్థానాల్లో వోక్స్, అలీ, వుడ్‌లను ఎంపిక చేశారు. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన ఆ్రస్టేలియా 2–0తో ఆధిక్యంలో ఉంది. మధ్యాహ్నం గం. 3:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను ‘సోనీ నెట్వర్క్’లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. - సాక్షి క్రీడా విభాగం -
భార్య ఆట చూద్దామని వస్తే నిరాశే మిగిలింది
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పురుషుల క్రికెట్లో తొలి టెస్టు ముగిసింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఇరుజట్లు లార్డ్స్ వేదికగా జూన్ 28 నుంచి రెండో టెస్టుకు సిద్దమవుతున్నాయి. తాజాగా గురువారం నాటింగ్హమ్ వేదికగా ఆస్ట్రేలియా వుమెన్స్, ఇంగ్లండ్ వుమెన్స్ మధ్య యాషెస్ ఏకైక టెస్టు ప్రారంభమైంది. మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వుమెన్స్ తొలిరోజు ఆధిక్యం కనబరిచింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 85 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. అనాబెల్ సదర్లాండ్ 39 పరుగులు, అలానా కింగ్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఎలీస్ పెర్రీ 99 పరుగులు చేసి ఒక్క పరుగుతో సెంచరీ చేజార్చుకోగా.. తాహిలా మెక్‌గ్రాత్ 61 పరుగులు, అష్ష్లే గార్డనర్ 40 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎసెల్‌స్టోన్ మూడు వికెట్లు, లారెన్ ఫైలర్ రెండు వికెట్లు పడగొట్టింది. కాగా ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్, వుమెన్ క్రికెటర్ అలీసా హేలీలు భార్యభర్తలన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టుకు మిచెల్ స్టార్క్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే రెండో టెస్టులో బరిలోకి దిగే అవకాశం ఉంది. మ్యాచ్‌కు ఐదురోజులు సమయం ఉండడంతో స్టార్క్ తన భార్య ఆట చూడడం కోసం స్టేడియం దగ్గర క్యూలైన్లో నిల్చొని వెళ్లడం ఆసక్తి కలిగించింది. భార్య ఆటను ఎంజాయ్ చేయాలని భావించిన మిచెల్ స్టార్క్‌కు నిరాశే మిగిలింది. మ్యాచ్‌లో అలీసా హేలీ డకౌట్‌గా వెనుదిరిగింది. ఆమె ఔటైన తర్వాత స్టార్క్ ఇచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది. Mitchell Starc is here of course, waiting in an already crowded queue to get into Trent Bridge for the opening day of the #WAshes Test with Alyssa Healy captaining for the first time pic.twitter.com/wf6g7hUuut — Bharat Sundaresan (@beastieboy07) June 22, 2023 చదవండి: సస్పెన్షన్ వేటు.. బౌలర్‌కు షాకిచ్చిన ఐసీసీ ఐదు బంతుల్లో 5 సిక్సర్లు బాదిన ఆర్సీబీ స్టార్ -
తొలిటెస్టు ఆసీస్‌దే.. ఇంగ్లండ్‌పై రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం (ఫొటోలు)
-
ఇదేమి యార్కర్రా బాబు.. దెబ్బకు బ్యాటర్ మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జరగుతున్న యాషెస్ తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆఖరి రోజు ఆస్ట్రేలియా విజయానికి 174 పరుగులు అవసరమవ్వగా.. ఇంగ్లండ్ తమ గెలుపు 7 వికెట్ల దూరంలో నిలిచింది. క్రీజులో ఉస్మాన్ ఖ్వాజా(34), స్కాట్ బోలాండ్(13) నాటౌట్‌గా ఉన్నారు. ఇక అంతకుముందు ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 273 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యంతో కలిపి ఇంగ్లండ్ ఆసీస్ ముందు 281 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కమ్మిన్స్ సూపర్ యార్కర్ ఇక ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. నాలుగు వికెట్లు సాధించి ఇంగ్లండ్ బజ్‌బాల్‌కు అడ్డుకట్ట వేశాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ ఓలీ పోప్‌ను అద్భుతమైన యార్కర్‌తో కమ్మిన్స్ బోల్తా కొట్టించాడు. 139 కిమీ వేగంతో వేసిన యార్కర్‌కు పోప్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. దీంతో 14 పరుగులు చేసిన ఓలీ పోప్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: CWC Qualifiers2023: ఐర్లాండ్‌కు బిగ్ షాకిచ్చిన ఒమన్.. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో బోణీ The perfect yorker 😍 Pat Cummins at his sizzling best ♨#SonySportsNetwork #TheAshes #ENGvAUS #RivalsForever pic.twitter.com/E6EIHQBI2u — Sony Sports Network (@SonySportsNetwk) June 19, 2023 -
డ్రాగా ముగిసిన ఏకైక యాషెస్ టెస్ట్
England Vs Australia Womens Ashes Test Ends In Draw: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన ఏకైక యాషెస్ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆసీస్ నిర్ధేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆఖరి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు మాత్రమే చేసి, లక్ష్యానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అంతకుముందు టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌ను 337/9 వద్ద డిక్లేర్ చేసింది. లాన్నింగ్స్(93),హేన్స్(86), తహ్లియా మెక్‌గ్రాత్(52), గార్డ్నర్(56) అర్ధ శతకాలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రంట్ 5, సీవర్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం హీథర్(168*) సెంచరీతో అదరగొట్టడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌటైంది. 40 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మహిళల జట్టు 216/7 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి, ప్రత్యర్ధి ముందు 257 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో ఇంగ్లండ్ బ్యాటర్లు నతాలీ సీవర్(58), హీధర్ నైట్(48), లారెన్ హిల్(33), టమ్మీ బ్యూమౌంట్(36), సోఫియా డంక్లీ(45) రాణించినప్పటికీ.. ఆసీస్ బౌలర్లు సదర్‌ల్యాండ్(3), అలానా కింగ్(2) ధాటికి ఇంగ్లండ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఫలితంగా ఏకైక యాషెస్ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. చదవండి: మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. స్టార్ క్రికెటర్ రొమాంటిక్ మూమెంట్ -
ఆసీస్‌దే యాషెస్
మాంచెస్టర్: క్రీజులో దిగిన ప్రతి బ్యాట్స్‌మన్ ప్రతిఘటించినా యాషెస్ నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. ఆదివారం ఇక్కడ ముగిసిన ఈ మ్యాచ్‌లో 383 పరుగుల భారీ లక్ష్యానికి గాను ఓవర్‌నైట్ స్కోరు 18/2తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య జట్టు 197 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఇంగ్లండ్ ఏమీ అంత తేలిగ్గా తలొంచలేదు. ప్రత్యర్థి పేసర్ల ధాటిని తట్టుకుంటూ ఆ జట్టు గట్టి పోరాటమే చేసింది. ఈ క్రమంలో ఓపెనర్ జాన్ డెన్లీ (123 బంతుల్లో 53; 6 ఫోర్లు), జేసన్ రాయ్ (67 బంతుల్లో 31) ఓవర్లను కరిగిస్తూ వచ్చారు. కానీ, రాయ్, మూడో టెస్టు హీరో బెన్ స్టోక్స్ (1)లను ఔట్ చేసిన కమిన్స్ (4/43) ఆసీస్‌కు పట్టు చిక్కేలా చేశాడు. తర్వాత డెన్లీ, బెయిర్ స్టో (61 బంతుల్లో 25), బట్లర్ (111 బంతుల్లో 34) జట్టును గట్టెక్కించేందుకు యత్నించారు. టీ విరామం తర్వాత బట్లర్, ఆర్చర్ (1) వెనుదిరిగినా లోయరార్డర్లో ఓవర్టన్ (105 బంతుల్లో 21), లీచ్ (51 బంతుల్లో 12) మరింత పట్టుదలగా ఆడి 14 ఓవర్ల పాటు నిలిచారు. ఈ దశలో మ్యాచ్ ‘డ్రా’ అయ్యేలా కనిపించింది. లీచ్‌ను పార్ట్‌టైమర్ లబషేన్, ఓవర్టన్ను హాజల్‌వుడ్ పెవిలియన్ చేర్చి ఆసీస్‌ను గెలిపించారు. డబుల్ సెంచరీతో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన స్టీవ్ స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 2–1 ఆధిక్యంలో ఉంది. గత సిరీస్‌ను ఆ జట్టే గెల్చుకోవడంతో గురువారం నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్టులో ఓడినా గణాంకాలు 2–2తో సమం అవుతాయి. తద్వారా ట్రోఫీ కంగారూల వద్దనే ఉంటుంది. -
ఇంగ్లండ్ ఇక కష్టమే..!
మాంచెస్టర్: కళ్లెదుట 383 పరుగుల భారీ లక్ష్యం... నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్... భీకరంగా బంతులేస్తున్న ప్రత్యర్థి పేసర్లు... ప్రస్తుతం స్కోరు 18/2..! కమిన్స్ (2/8) నిప్పులు చెరగడంతో ఫామ్‌లో ఉన్న ఓపెనర్ బర్న్స్ (0)తో పాటు కీలకమైన కెప్టెన్ జో రూట్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. చేతిలో ఉన్న 8 వికెట్లతో ఇంకా 365 పరుగులు చేయాల్సి ఉంది. ఇదీ యాషెస్ నాలుగో టెస్టులో ఇంగ్లండ్ పరిస్థితి. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌ను ఆస్ట్రేలియా 186/6 వద్ద డిక్లేర్ చేసింది. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (92 బంతుల్లో 82; 11 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. వేడ్ (76 బంతుల్లో 34; 2 ఫోర్లు) సహకరించాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ను కమిన్స్ బెంబేలెత్తించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ మూడు, నాలుగు బంతులకు బర్న్స్, రూట్లను బలిగొన్నాడు. అత్యద్భుతం అనదగ్గ బంతితో రూట్ వికెట్లను అతడు గిరాటేసిన వైనం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 200/5తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 301 పరుగులకు ఆలౌటైంది. స్టార్క్ (3/80) ధాటికి స్టోక్స్ (26), బెయిర్ స్టో (17) త్వరగానే ఔటయ్యారు. బట్లర్ (65 బంతుల్లో 41; 7 ఫోర్లు) పోరాటంతో ఫాలో ఆన్ తప్పించాడు. 196 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆస్ట్రేలియా 44 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ స్థితిలో స్మిత్ మళ్లీ అడ్డుగోడలా నిలిచాడు. సునాయాసంగా బౌండరీలు సాధిస్తూ స్కోరును పెంచుకుంటూ పోయాడు. వేడ్‌తో కలిసి ఐదో వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. -
బెయిల్స్ తీసేసి ఆడించారు..
మాంచెస్టర్: యాషెస్ నాలుగో టెస్టుకు వరుణుడు అడ్డుగా నిలిచాడు. బుధవారం ఇక్కడ ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా–ఇంగ్లండ్ పరస్పరం పైచేయికి యత్నిస్తున్న సమయంలో పలుసార్లు అంతరాయం కలిగించాడు. దీంతో 44 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా... ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు వార్నర్ (0), హారిస్ (13) వికెట్లను త్వరగానే కోల్పోయింది. బ్రాడ్ (2/35) ఇన్నింగ్స్ నాలుగో బంతికే వార్నర్‌ను ఔట్ చేశాడు. అయితే, వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ లబషేన్ (128 బంతుల్లో 67; 10 ఫోర్లు); స్టీవ్ స్మిత్ (60 బ్యాటింగ్; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. ప్రస్తుతం స్మిత్‌కు తోడుగా హెడ్ (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. బెయిల్స్ తీసేసి... తొలి రోజు ఈ మ్యాచ్‌లో అరుదైన దృశ్యం కనిపించింది. తీవ్రంగా గాలి వీయడంతో పలుమార్లు బెయిల్స్ కింద పడ్డాయి. దాంతో అంపైర్లు ధర్మసేన, ఎరాస్మస్ ఇన్నింగ్స్ 32వ ఓవర్లో బెయిల్స్‌ను తొలగించి ఆటను కొనసాగించారు. ఇలా ఆడించడంపై ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, బౌలర్ బ్రాడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
బూమ్ బూమ్ బ్లాస్ట్!
‘ప్రపంచంలో ఎవరు వేగంగా పరుగెత్తగలరో చూద్దాం అంటూ చిరుత, శునకాల మధ్య పందెంకు రంగం సిద్ధమైంది... పోటీ ప్రారంభమైనా చిరుత మాత్రం ఒక్క అడుగు కదపకుండా తన స్థానంలోనే ఉండిపోయింది. దాంతో ప్రేక్షకులు ఏమైందంటూ నిర్వాహకులను అడిగారు. ‘అందరికంటే అత్యుత్తమమని నిరూపించుకునే ప్రయత్నం చేయడం కూడా కొన్నిసార్లు పరువు తక్కువగా భావించాలి’... సరిగ్గా వారం క్రితం జస్ప్రీత్ బుమ్రా ఈ ట్వీట్ చేశాడు. బుమ్రా ఆంతర్యం ఏమిటో స్పష్టంగా అంతు పట్టకపోయినా... కొత్తగా దూసుకొచ్చిన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను ఆకాశానికెత్తడం, అతడితో తనను పోలుస్తుండటంపైనే ఈ ట్వీట్ అని క్రికెట్ ప్రపంచం అర్థాన్ని అన్వయించుకుంది. ఈ ట్వీట్‌తో ‘బుల్స్ ఐ’ ఇమోజీ కూడా జత చేసిన బుమ్రా ఆదివారం సరిగ్గా లక్ష్యాన్ని ఛేదించాడు. భారత అభిమానులతో సహా అంతా యాషెస్ ఉత్కంఠను అనుభవిస్తున్న సమయంలో తన సత్తా చూపిస్తూ అత్యద్భుత బౌలింగ్ ప్రదర్శనతో రికార్డులు తిరగరాశాడు. నార్త్ సౌండ్: దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్... ఈ నాలుగు దేశాల్లోనే బుమ్రా టెస్టులు ఆడాడు. కానీ నాటి ఇమ్రాన్ ఖాన్ నుంచి నేటి రవిచంద్రన్ అశ్విన్ వరకు ఆసియా దిగ్గజ బౌలర్లు ఎవరికీ సాధ్యం కాని ఘనతను అతను అందుకున్నాడు. ఈ నాలుగు దేశాల్లోనూ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన రికార్డును బుమ్రా నెలకొల్పాడు. ఇవన్నీ తన తొలి పర్యటనలే కావడం విశేషం. దీనిని అందుకునేందుకు అతనికి 11 టెస్టులే సరిపోయాయి. వెస్టిండీస్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్ అతని విలువేమిటో మరోసారి చూపించింది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 75 పరుగుల ఆధిక్యం మాత్రమే కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో విజయం కోసం భారత్ నిర్దేశించిన 419 పరుగుల భారీ లక్ష్యం కష్టసాధ్యమే అయినా... సొంతగడ్డపై కొంతయినా పోరాడగలదని అంతా భావించారు. కానీ మరీ ఘోరంగా ఒక సెషన్ లోపు కేవలం 26.5 ఓవర్లు మాత్రమే ఆడి 100 పరుగులకే జట్టు కుప్పకూలింది. ఇదంతా బుమ్రా చలవే! టెస్టుల్లో తొలిసారి బుమ్రాను ఎదుర్కొన్న విండీస్ బ్యాట్స్‌మెన్‌కు అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే కథ ముగిసిపోయింది. బుమ్రా ‘మ్యాజిక్ బంతులు’ తమను దెబ్బ తీశాయంటూ ప్రత్యర్థి కెప్టెన్ హోల్డర్ వాపోయాడు. అవుట్ స్వింగర్లతో... బంతి విసిరేందుకు తీసుకునే రనప్ చిన్నదే కావచ్చు... స్పీడ్‌గన్‌లో లెక్క కడితే బంతి వేగం సాధారణంగానే కనిపించవచ్చు. కానీ బుమ్రా వేసే బంతులు అంకెలకు మించి ప్రమాదకరమైనవి. ఒకనాటి అసలు సిసలు ఫాస్ట్ బౌలర్ల ఆలోచనా ధోరణి అతనిలో కనిపిస్తుంది. తాజా టెస్టులో అతను తన బౌలింగ్ దూకుడును చూపించాడు. చాలా మంది తరహాలో ఆఫ్ స్టంప్ బయటకు వేస్తూ కీపర్ లేదా స్లిప్ వైపు క్యాచ్ వచ్చే అవకాశం సృష్టించే ప్రయత్నం చేయలేదు. పూర్తిగా ఆఫ్ స్టంప్స్ లక్ష్యంగానే బంతులు విసిరాడు. అతని ఐదు వికెట్లలో నాలుగు క్లీన్‌బౌల్డ్‌లు ఉన్నాయంటేనే ఇది అర్థమవుతుంది. ముఖ్యంగా గతంలో పెద్దగా వాడని ‘అవుట్ స్వింగర్’ను బుమ్రా ప్రయోగించాడు. వరల్డ్ కప్ తర్వాత ఈ సిరీస్‌కు ముందు లభించిన విరామంలో అతను దీనిపై ప్రత్యేక సాధన చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ప్రసారకర్త ‘సోనీ’ అంకెల ప్రకారం కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు బుమ్రా వేసిన ప్రతీ పది బంతుల్లో ఏడు అవుట్ స్వింగర్లే ఉన్నాయి! వెన్నునొప్పితో తొలి ఇన్నింగ్స్‌లో పూర్తి వేగంతో బౌలింగ్ చేయలేకపోయిన జస్ప్రీత్... రెండో ఇన్నింగ్స్‌లో స్వింగ్‌కు కొంత అనుకూలంగా కనిపించిన వాతావరణాన్ని పూర్తిగా వాడుకున్నాడు. 8–4–7–5 బుమ్రా వేసిన 48 బంతులు విండీస్ బ్యాట్స్‌మెన్ పాలిట బుల్లెట్లలా మారాయి. అతని తొలి ఓవర్ మూడో బంతిని వెంటాడి బ్రాత్‌వైట్ ఔట్ కావడంతో విండీస్ తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా తర్వాతి ఓవర్లో దూసుకొచ్చిన బంతి క్యాంప్‌బెల్ స్టంప్స్‌ను పడగొట్టింది. మరుసటి ఓవర్లో స్లిప్‌లో కోహ్లి క్యాచ్ వదిలేయకపోతే మరో వికెట్ అప్పుడే దక్కేది. కానీ అతని నాలుగో ఓవర్లో హైలైట్ బంతి వచ్చింది. అద్భుతమైన స్వింగ్‌కు బ్రేవో ఆఫ్ స్టంప్ ఎగిరి ‘బండి చక్రం’లా గిరగిరా తిరిగింది! తొలి ఐదు ఓవర్లలో విండీస్ బ్యాట్స్‌మెన్ చచ్చీ చెడి ఏడు సింగిల్స్ తీయగలిగారు. కానీ కథ అంతటితో ముగియలేదు. బుమ్రా ఆరో ఓవర్ తొలి బంతికి హోప్ స్టంప్ బద్దలైంది. ఎంతో కొంత పోరాడగలడని భావించిన హోల్డర్‌కు కూడా బుమ్రా బంతి అర్థం కాలేదు. ఫలితం మరో సారి ఆఫ్‌స్టంప్‌పై ఎర్రబంతి దాడి! ఇక విరామం అంటూ కోహ్లి 8 ఓవర్ల స్పెల్ తర్వాత ఆపడంతో ఈ తుఫాన్ ఆగింది. మరో అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా ఫాస్ట్ బౌలర్ల గడ్డపై తొలి టెస్టును సంతృప్తిగా ముగించాడు. 5/7ఇన్నింగ్స్‌లో కనీసం ఐదు వికెట్లు పడగొట్టిన సందర్భంలో అతి తక్కువ పరుగులు ఇచ్చిన భారత్ బౌలర్‌గా బుమ్రా గుర్తింపు పొందాడు. 1990లో వెంకటపతిరాజు 12 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. 4 బుమ్రా ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ఇది నాలుగోసారి కాగా నాలుగు వేర్వేరు జట్లపైనే సాధించాడు. గతంలో ఇన్స్వింగర్లు ఎక్కువగా వేసేవాడిని. అయితే అనుభవం వస్తున్న కొద్దీ అవుట్ స్వింగర్లు కూడా బాగా వేయగలననే విశ్వాసం పెరిగింది. తాజా ప్రదర్శనతో చాలా సంతోషంగా ఉంది. అయితే ఇలాంటి బంతుల కోసం చాలా కష్టపడ్డాను. ఇంకా నేర్చుకోవాలనే తపనతో ఉన్నాను. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉండటంతో ఏదైనా భిన్నంగా ప్రయత్నించాలని మా పేసర్లు అందరం భావించాం. స్వింగ్‌కు పరిస్థితి కొంత అనుకూలంగా ఉందనిపించడంతో అలా ప్రయత్నించాం –జస్ప్రీత్ బుమ్రా, భారత బౌలర్ -
ఆర్చర్ ఆరేశాడు
హెడింగ్లీ: నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ (6/45) విజృంభించడంతో యాషెస్ మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 52.1 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. గురువారం ఇక్కడ ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్... ఆర్చర్‌కు తోడు బ్రాడ్ (2/32) దెబ్బకు 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (94 బంతుల్లో 61; 7 ఫోర్లు), మార్నస్ లబషేన్ (129 బంతుల్లో 74; 10 ఫోర్లు) మూడో వికెట్‌కు 111 పరుగులు జోడించి ఆదుకున్నారు. వార్నర్‌ను ఔట్ చేసిన ఆర్చర్.. ప్రత్యర్థి ఇన్నింగ్స్ పతనానికి బాటలు వేశాడు. లబషేన్ పోరాడుతున్నా మిగతావారు నిలకవపోవడంతో కంగారూ జట్టు 43 పరుగుల వ్యవధిలోనే 8 వికెట్లు కోల్పోయింది. ఆర్చర్ కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శనను నమోదు చేశాడు. వర్షం కారణంగా బుధవారం పూర్తిస్థాయి ఆట సాగలేదు. -
స్మిత్ లేని ఆస్ట్రేలియా
లీడ్స్: తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలతో ఆస్ట్రేలియా జట్టును గెలిపించిన మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. అయితే జోఫ్రా ఆర్చర్ దెబ్బ అతడిని ఆటకు దూరం చేసింది. గాయం నుంచి కోలుకోకపోవడంతో మూడో టెస్టు నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఫామ్‌లో లేని మిగిలిన ఆటగాళ్లను చుట్టేసి సిరీస్ సమం చేయాలని ఇంగ్లండ్ ఆశపడుతోంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి మూడో యాషెస్ టెస్టుకు రంగం సిద్ధమైంది. మరోవైపు ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ బ్యాటింగ్ పూర్తిగా గతి తప్పడం జట్టును ఇబ్బందుల్లో పడేస్తోంది. ఇక బౌలింగ్‌లో గత మ్యాచ్‌లో భీకరమైన వేగంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించిన ఆర్చర్ ఈసారి అదే తరహాలో చెలరేగిపోతే ఆసీస్‌కు కష్టాలు తప్పవు. -
అక్తర్ వ్యాఖ్యలపై యువీ చురక
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తన హుందాతనం చాటేందుకు చేసిన వ్యాఖ్యలకు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ చురకలతో సమాధానమిచ్చాడు. యాషెస్ రెండో టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌన్సర్లతో బెంబేలెత్తించాడు. క్రీజులో ఉన్న స్మిత్‌ను అతని బౌన్సర్లు రెండు సార్లు బలంగా గాయపరిచాయి. దీనిపై షోయబ్ మాట్లాడుతూ ‘బౌన్సర్లు ఆటలో భాగమే. కానీ అదే బౌన్సర్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు బలంగా తాకితే... ఏమైనా గాయమైందో లేదో అతన్ని చూడాలి. కానీ ఆర్చర్ మాత్రం కనీస విజ్ఞత లేకుండా తన మానాన తను వెళ్లిపోవడం ఏం బాగోలేదు’ అని ఇంగ్లండ్ పేసర్‌ను తప్పుబట్టాడు. దీనిపై యువరాజ్ స్పందిస్తూ ‘నిజమే అక్తర్... నువ్వయితే అలా తడిమి చూసేవాడివి. కానీ అప్పుడక్కడ నీ మాటలెలా ఉంటాయంటే... అయ్యో పాపం దెబ్బతగిలిందా అన్నట్లు కాకుండా కాస్కో మళ్లీ వేస్తా అన్నట్లు ఉంటాయి’ అని దెప్పిపొడిచాడు. రెండో టెస్టులో ఆర్చర్ దెబ్బకు స్మిత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేకపోయాడు. అయితే టెస్టు క్రికెట్ చరిత్రలోనే కొత్తగా చేర్చిన నిబంధన వల్ల సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగా లబ్‌షేన్ వచ్చి టెస్టులో ఆసీస్‌ను ఓడిపోకుండా కాపాడాడు. దీంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. -
ఇంగ్లండ్ లక్ష్యం 398
బర్మింగ్‌హామ్: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్మిత్ (142; 14 ఫోర్లు), వేడ్ (110; 17 ఫోర్లు) శతక్కొట్టడంతో ఇంగ్లండ్ ముందు 398 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్‌నైట్ స్కోరు 124/3తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను 112 ఓవర్లలో 487/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తొలుత స్మిత్, ట్రావిస్ హెడ్ (51) నాలుగో వికెట్‌కు 130 పరుగులు జోడించారు. తర్వాత ఐదో వికెట్‌కు వేడ్, స్మిత్ జోడీ 126 పరుగులు జతచేసింది. స్మిత్ యాషెస్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసిన ఐదో ఆసీస్ బ్యాట్స్‌మన్‌గా ఘనతకెక్కాడు. గతంలో బార్డ్స్లే, మోరిస్, స్టీవ్ వా, హేడెన్ ఇలా రెండు సెంచరీలు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 3, మొయిన్ అలీ 2 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ ఆట నిలిచే సమయానికి 7 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 13 పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్ (7 బ్యాటింగ్), రాయ్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చివరి రోజు ఇంగ్లండ్ నెగ్గాలంటే మరో 385 పరుగులు చేయాలి. -
ఆసీస్‌దే అడిలైడ్ టెస్టు
అడిలైడ్: ఇంగ్లండ్ పోరాటం... కెప్టెన్ రూట్ పట్టుదలతో ఉత్కంఠ రేపిన యాషెస్ సిరీస్‌లోని రెండో టెస్టు ఫలితం చివరకు ఆస్ట్రేలియా వైపే మొగ్గింది. పేసర్లు మిచెల్ స్టార్క్ (5/88), హాజల్‌వుడ్ (2/49) ధాటికి పర్యాటక జట్టు అయిదో రోజు 57 పరుగులు మాత్రమే చేయగలిగింది. 354 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్ 120 పరుగులతో ‘యాషెస్ తొలి డే నైట్’ టెస్టును గెలుచుకుని సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 176/4తో బుధవారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ను హాజల్‌వుడ్ దెబ్బ తీశాడు. రూట్ (67; 9 ఫోర్లు), వోక్స్ (5)లను ఓవర్‌నైట్ స్కోర్ వద్దే అవుట్ చేశాడు. మొయిన్ అలీ (2) విఫలమయ్యాడు. ఓవైపు బెయిర్ స్టో (36; 5 ఫోర్లు) నిల్చున్నా... ఓవర్టన్ (7), బ్రాడ్ (8)లను స్టార్క్ వెనక్కి పంపాడు. చివరికి అతడి బౌలింగ్‌లోనే బెయిర్‌స్టో అవుటయ్యాడు. మూడో టెస్టు ఈనెల 14 నుంచి పెర్త్‌లో జరుగుతుంది. -
సారథి నిలబెట్టాడు
బ్రిస్బేన్: టెయిలెండర్ల సహకారంతో ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్ (326 బంతుల్లో 141 నాటౌట్; 14 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కీలక తరుణంలో చిరస్మరణీయ శతకంతో ఆసీస్ జట్టును ఆదుకున్నాడు. స్మిత్ అద్వితీయ సెంచరీ కారణంగా ఒకదశలో 7 వికెట్లకు 209 పరుగులతో ఇబ్బందుల్లో పడిన ఆస్ట్రేలియా చివరకు 328 పరుగులు సాధించి ఆలౌటైంది. 26 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో యాషెస్ సిరీస్‌లో తొలి టెస్టు రసవత్తరంగా మారింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 165/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా షాన్ మార్‡్ష (51; 8 ఫోర్లు) వికెట్‌ను తొందరగానే కోల్పోయింది. ఆ తర్వాత టిమ్ పైన్ (13; 2 ఫోర్లు), స్టార్క్ (6) కూడా తక్కువ స్కోరుకే అవుటవ్వడంతో ఆసీస్ ఇన్నింగ్స్ తడబడింది. ఈ దశలో బౌలర్ కమిన్స్ (120 బంతుల్లో 42; 5 ఫోర్లు, ఒక సిక్స్) కెప్టెన్ స్మిత్‌కు అండగా నిలబడ్డాడు. మరోవైపు స్మిత్ కూడా ఏకాగ్రతతో ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఈ క్రమంలో స్మిత్ 261 బంతుల్లో టెస్టుల్లో తన 21వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వోక్స్ బౌలింగ్‌లో కమిన్స్ అవుటవ్వడంతో ఎనిమిదో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం హాజల్‌వుడ్ (6), లయన్ (9) సహకారంతో స్మిత్ ఆసీస్ స్కోరును 300 పరుగులు దాటించడంతోపాటు 26 పరుగుల ఆధిక్యాన్ని అందించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్‌కు మూడు, అండర్సన్, మొయిన్ అలీలకు రెండేసి వికెట్లు లభించాయి. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను హాజల్‌వుడ్ ఆరంభంలోనే దెబ్బతీశాడు. అనుభవజ్ఞుడైన కుక్ (7), జేమ్స్ విన్స్ (2)లను వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం స్టోన్‌మన్ (19 బ్యాటింగ్), జో రూట్ (5) క్రీజులో ఉన్నారు. -
తొలి దెబ్బ ఎవరిదో?
బ్రిస్బేన్: అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో ఇద్దరు మేటి క్రికెటర్లయిన స్టీవ్ స్మిత్, జో రూట్ సారథ్యంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ప్రతిష్టాత్మక ‘యాషెస్’ పోరుకు సిద్ధమయ్యాయి. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లో గురువారం తొలి టెస్టు ఆరంభం కానుంది. 2015లో ఇంగ్లండ్ గడ్డపై యాషెస్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా ఈసారి సొంతగడ్డపై దానిని సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో పేస్, బౌన్స్‌కు అనుకూలించే ‘గబ్బా’ పిచ్‌పై కంగారూల పేస్ త్రయం మిచెల్ స్టార్క్, హాజల్‌వుడ్, కమిన్స్‌పైనే కెప్టెన్ స్మిత్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అటు ఇంగ్లండ్ కూడా అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్‌లు ఆసీస్ భరతం పడతారని భావిస్తోంది. బ్రిస్బేన్‌లో ఆతిథ్య జట్టుకున్న రికార్డును తిరగరాయాలని వ్యూహాలు రూపొందిస్తోంది. అటు ఇద్దరు.. ఇటు ఇద్దరు! కెప్టెన్ జో రూట్, మాజీ కెప్టెన్ కుక్, మొయిన్ అలీలే ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు బలం. అందుకే వీరిని లక్ష్యంగా చేసుకునే స్టార్క్ నేతృత్వంలోని ఆసీస్ పేస్ త్రయం దూకుడును ప్రదర్శించనుంది. ‘రూట్, కుక్లపైనే దృష్టి పెట్టాం. వీరిని తొందరగా అవుట్ చేస్తే ఆ తర్వాత ఇంగ్లండ్ పనిపట్టడం పెద్ద కష్టమేం కాదు’ అని స్టార్క్ పేర్కొన్నాడు. అటు ఇంగ్లండ్ కూడా కెప్టెన్ స్మిత్, డేవిడ్ వార్నర్‌ల పైనే ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. అటు, కీలకమైన మ్యాచ్‌కు ముందు గాయాలు ఆస్ట్రేలియాను కలవరపెడుతున్నాయి. వార్నర్, షాన్ మార్‡్షలు ఇంకా చికిత్స పొందుతుండటం స్మిత్‌కు ఇబ్బందిగా మారింది. కుక్ అనుభవం కలిసొచ్చేనా? ఇప్పటివరకు నాలుగు యాషెస్‌లు ఆడిన అనుభవమున్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కుక్పైనే ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. ఓపెనింగ్‌లో కుక్ కుదురుకుంటే మిడిలార్డర్లో రూట్, డేవిడ్ మలాన్, మొయిన్ అలీలు బ్యాటింగ్ ఆర్డర్‌కు స్థిరత్వం ఇవ్వగలరు. అండర్సన్, బ్రాడ్, వోక్స్‌ల త్రయం గబ్బా వికెట్ బౌన్స్‌ను తమకు అనుకూలంగా మార్చుకుంటుందని ఇంగ్లిష్ జట్టు భావిస్తోంది. జట్లు: ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), వార్నర్, బాన్‌క్రాఫ్ట్, ఖాజా, హ్యాండ్స్కోంబ్, షాన్ మార్‡్ష, పైన్, స్టార్క్, కమిన్స్, లయన్, హాజల్‌వుడ్. ఇంగ్లండ్: జో రూట్ (కెప్టెన్), కుక్, స్టోన్మాన్, విన్స్, మలాన్, అలీ, బెయిర్‌స్టో, వోక్స్, బ్రాడ్, అండర్సన్, జేక్ బాల్. బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాకు గొప్ప రికార్డుంది. 1988 నుంచి ఇక్కడ ఆడిన ఏ టెస్టులోనూ ఆసీస్ ఓడిపోలేదు. అటు ఇంగ్లండ్ కూడా 31 ఏళ్లుగా ఈ మైదానంలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. 1986 తర్వాత ఇక్కడ ఆడిన 28 టెస్టుల్లో 21 నెగ్గిన ఆసీస్... 7 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. -
కలలు కంటే సరిపోదు...
1920... సిడ్నీ క్రికెట్ గ్రౌండ్.. యాషెస్ టెస్టు మ్యాచ్.... 12 ఏళ్ల కుర్రాడు ఆ మ్యాచ్ చూస్తున్నాడు. మ్యాచ్ ముగిశాక అతడి తండ్రి వచ్చి ‘ఎలా ఉంది మ్యాచ్’ అని అడిగారు. ‘నాకేం సంతృప్తి లేదు. నేను ఆడితేనే నాకు తృప్తి’ అని ఆ బుడత జవాబిచ్చాడు. వెంటనే తండ్రి నవ్వారు... ‘కలలు కంటే సరిపోదు. కష్టపడాలి’ అని చెప్పారు. కట్ చేస్తే... ఆ కుర్రాడు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడు బ్రాడ్‌మన్. ఒక్కసారిగా బ్రాడ్‌మన్ గొప్ప క్రికెటర్ కాలేదు. 12 ఏళ్ల వయసులో అందరికంటే భిన్నంగా ప్రాక్టీస్ చేసేవారు. గోల్ఫ్ బంతిని వాటర్ ట్యాంక్‌కేసి కొట్టేవారు. అది తిరిగి వేగంగా వచ్చే క్రమంలో వివిధ రకాల షాట్లు ఆడేవారు. బౌలర్ సాయం లేకుండా, కోచ్ అండ లేకుండా తనకు తానే ప్రాక్టీస్ చేసేవారు. ఈ శిక్షణ తన కెరీర్లో చాలా ఉపయోగపడింది. తొలిసారి క్రికెట్ ఆడే అవకాశం మాత్రం బ్రాడ్‌మన్‌కు గమ్మత్తుగా వచ్చింది. 12 ఏళ్లప్పుడు తన అంకుల్ కెప్టెన్‌గా ఉన్న బోరల్ జట్టుకు బ్రాడ్‌మన్ స్కోరర్‌గా పనిచేశాడు. ఒక ఆటగాడు తక్కువ కావడంతో ఆ జట్టులోకి వచ్చాడు. అరంగేట్రంలోనే 37, 29 స్కోర్లతో నాటౌట్‌గా నిలిచాడు. తదనంతరం అదే జట్టులో ఉంటూ డబుల్, ట్రిపుల్ సెంచరీలతో విరుచుకుపడడంతో జాతీయ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 1928లో తొలిసారి ఆస్ట్రేలియా తరఫున ఆడాడు. బ్రాడ్‌మన్ ఆడినంత కాలం ఆసీస్ అజేయశక్తి. తన సంచలన బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌కు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన ‘బాడీలైన్’ బౌలింగ్‌ను కూడా ఇంగ్లండ్ ఆచరణలోకి తెచ్చింది బ్రాడ్‌మన్ జోరును ఆపడానికే. 99.96 సగటుతో కెరీర్‌ను ముగించిన బ్రాడ్‌మన్ రికార్డును భవిష్యత్‌లోనూ ఎవరూ అందుకోలేరనడం అతిశయోక్తి కాదు. -
ఇంగ్లండ్‌దే ‘యాషెస్’ టెస్టు
పెర్త్: యాషెస్‌లో 0-5తో ఆసీస్ చేతి లో చిత్తుగా ఓడిన తర్వాత ఇప్పు డు మళ్లీ ఇంగ్లండ్ విజయానికి అవకాశం ఎక్కడుందని ఆశ్చర్యపోతున్నారా! ఇంగ్లండ్ యాషెస్ టెస్టు నెగ్గడం నిజ మే... అయితే అది మహిళా క్రికెట్లో జరిగింది. తమ పురుషుల జట్టుకు సాధ్యం కాని చోట ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ ఏకైక టెస్టు నెగ్గింది. సోమవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 61 పరుగులతో ఆస్ట్రేలియాను ఓడిం చింది. పర్యటనలో మిగిలిన 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌ల ఫలితాల అనంతరం పాయింట్లను పరిగణనలోకి తీసుకొని యాషెస్ విజేతను తేలుస్తారు. -
ఆదుకున్న స్మిత్, హాడిన్
సిడ్నీ: ఇంగ్లండ్‌తో శుక్రవారం ప్రారంభమైన యాషెస్ ఐదో టెస్టులో ఆస్ట్రేలియా తడబడినా పుంజుకుంది. ఇంగ్లిష్ బౌలర్ బెన్ స్టోక్స్ (6/99) బౌలింగ్‌లో చెలరేగినా.... స్టీవెన్ స్మిత్ (154 బంతుల్లో 115; 17 ఫోర్లు, 1 సిక్సర్), బ్రాడ్ హాడిన్ (90 బంతుల్లో 75; 13 ఫోర్లు) నిలకడగా ఆడి ఆసీస్‌ను ఆదుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 76 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది. కుక్ (7 బ్యాటింగ్), అండర్సన్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కార్‌బెరీ (0) విఫలమయ్యాడు. ఒక్క వికెట్ జాన్సన్‌కు దక్కింది. కుక్‌సేన ఇంకా 318 పరుగులు వెనుకబడి ఉంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో... కుక్ తొలిసారి టాస్ (ఈ సిరీస్‌లో) గెలిచి కంగారులకు బ్యాటింగ్ అప్పగించాడు. వాట్సన్ (43) ఫర్వాలేదనిపించినా... రోజర్స్ (11), వార్నర్ (16), క్లార్క్ (10), బెయిలీ (1) పూర్తిగా నిరాశపర్చారు. దీంతో ఆసీస్ 97 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్మిత్, హాడిన్‌లు నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 128 పరుగులు జోడించారు. ఈ క్రమంలో స్మిత్ కెరీర్లో మూడో సెంచరీ సాధించాడు. తొలి టెస్టు ఆడుతున్న లెగ్ స్పిన్నర్ స్కాట్ బోర్త్విక్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్, ఫోర్‌తో శతకాన్ని పూర్తి చేశాడు. హాడిన్ అవుటైన తర్వాత హారిస్ (22) కాసేపు పోరాడాడు. మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో ఆసీస్ ఓ మోస్తరు స్కోరుకు పరిమితమైంది. బ్రాడ్ 2, అండర్సన్, బోర్త్విక్ చెరో వికెట్ తీశారు. యాషెస్ సిరీస్‌లో ఐదు టెస్టుల్లోనూ తొలి ఇన్నింగ్స్‌లో కనీసం అర్ధసెంచరీ చేసిన మూడో క్రికెటర్‌గా హాడిన్ రికార్డులకెక్కాడు. -
బాబోయ్... నేనాడలేను
సిడ్నీ: యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయిన ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులో కీలక బ్యాట్స్‌మన్ జొనాథన్ ట్రాట్ సిరీస్ నుంచి వైదొలిగాడు. తీవ్ర ఒత్తిడి కారణంగా తిరిగి స్వదేశానికి వెళుతున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా ధ్రువీకరించింది. ‘క్రికెట్ నుంచి ట్రాట్ కొంత విరామం తీసుకుంటున్నాడు. అయితే ఇది ఎంతకాలమనేది చెప్పలేం. దీని గురించి పూర్తి విషయాలు అతను వెల్లడించలేదు. ప్రస్తుతం అతను ఉన్న స్థితిలో ఆట ఆడలేడు. కాబట్టి మిగతా సిరీస్‌కు అందుబాటులో ఉండడు’ అని ఈసీబీ వెల్లడించింది. క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకుంటున్న తాను ఇక కోలుకోవడంపై దృష్టిపెట్టనున్నట్లు ట్రాట్ తెలిపాడు. 2006-07లో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ట్రెస్కోథిక్ కూడా ఇలాగే ఒత్తిడి వల్ల కొన్నాళ్లపాటు ఆటకు దూరమయ్యాడు. నిరాశలో ఉన్న ట్రాట్‌కు అందరూ మద్దతు ఇవ్వాలని ట్రెస్కోథిక్ ట్వీట్ చేశాడు. -
డ్రా ముగిసిన యాషెస్ మూడో టెస్టు
మాంచెస్టర్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆసీస్- ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. 332 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ ఆటను కొనసాగిస్తున్న సమయంలో వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. ఆట నిలిచి పోయే సమయానికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 32 పరుగుల చేసింది. చకచకా వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను కంగుతినిపించాలనుకున్న ఆసీస్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. ఆట నిలిచే సమయానికి బెల్(1), రూట్(13) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా 332 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచుంది. తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగుల భారీ ఆధిక్యం... వికెట్లు కోల్పోయినా, వేగంగా పరుగులు సాధించి అసాధ్యమైన లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచాలని ఆస్ట్రేలియా భావించింది. అందుకు అనుగుణంగానే రెండో ఇన్నింగ్స్‌లో 36 ఓవర్లలోనే 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఓవరాల్‌గా ఆసీస్ ఆధిక్యం 331 పరుగులకు చేరింది. -
ఇంగ్లండ్ విజయలక్ష్యం 332
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో ఆస్ట్రేలియా 332 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగుల భారీ ఆధిక్యం... వికెట్లు కోల్పోయినా, వేగంగా పరుగులు సాధించి అసాధ్యమైన లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచాలని ఆస్ట్రేలియా భావించింది. అందుకు అనుగుణంగానే రెండో ఇన్నింగ్స్‌లో 36 ఓవర్లలోనే 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఓవరాల్‌గా ఆసీస్ ఆధిక్యం 331 పరుగులకు చేరింది. దీంతో భారీ పరుగుల ఆధిక్యంతో చివరిరోజు బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ పోరాడుతోంది. అనుకున్నట్లే ఆసీస్ సోమవారం తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ ఆదిలోనే తడబడింది. ప్రస్తుతం రెండు వికెట్లు కోల్పోయి 19 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.